గాయపడ్డ విద్యార్థి
హైదరాబాద్, జీడిమెట్ల: ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. బోర్డు వైపు చూడడంలేదన్న కారణంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయురాలు చేయిచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన మేరకు.. చింతల్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి కుమారుడు రత్నవర్దన్‌రెడ్డి(6) ఏన్‌ఆర్‌ఐ టాలెంట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. గురువారం రత్నవర్ధన్ బోర్డు వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాడన్న నెపంతో టీచర్ సునీత రత్నవర్దన్ చేతులపై కొట్టింది.
సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన తల్లి చూసేసరికి విద్యార్థి చేతులపై వాతలు ఉన్నాయి. టీచర్ సునీతను అడగగా క్లాసులో బోర్డు వైపు చూడటంలేదని సమాధానం చెప్పింది. దీంతో విషయంపై బాలుడి తండ్రి ప్రశాంత్ రెడ్డి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీచర్‌పైవెంటనే చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment