jeedimetla
-
డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని..
జీడిమెట్ల: డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడం , ఈ విషయమై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల టీఎస్ఎస్ఐసీ కాలనీలో నివాసం ఉంటున్న చందు భార్య లావణ్య(35) స్థానికంగా టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమెకు శివరాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. లావణ్యతో స్నేహంగా ఉండే శివరాం తన వ్యాపార నిమిత్తం రూ.5లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె తన నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చింది. నెలలు గడుస్తున్నా శివరాం డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చందు శుక్రవారం శివరాంను ఇంటికి పిలిచి డబ్బుల విషయమై నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో లావణ్య శివరాంకు ఫోన్‌చేసి నువ్వు డబ్బులు ఇవ్వనందునే తమ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని నీ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన శివరాం, చందు ఇంటికి వెళ్లి చూడగా లావణ్య చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఇద్దరూ కలిసి ఆమెను కిందికి దింపి సమీపంలోని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్లపై ఏరులై పారిన నెత్తురు
-
హైదరాబాద్ జీడిమెట్లలో ఆరని మంటలు
-
ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
జీడిమెట్ల: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. ఓ భవనం కుప్పకూలింది. అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఫేజ్–5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు.పరిశ్రమ గ్రౌండ్ ఫ్లోర్ సహా మరో రెండు ఫ్లోర్లు ఉండగా ఆపైన పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు ఉండగా.. మంగళవారం జనరల్ షిఫ్ట్‌లో దాదాపు 200 మంది ఉన్నారు. మధ్యాహ్నం పరిశ్రమ మూడో అంతస్తులోని రేకుల షెడ్డులో కొంతమంది కారి్మకులు ఆర్పీ (రీప్రాసెసింగ్) మెషీన్ వద్ద పనులు చేస్తున్నారు. 12.30 గంటల ప్రాంతంలో రేకుల షెడ్డులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కార్మికులు బతుకు జీవుడా అంటూ కిందకు పరుగులు తీశారు. శ్రమించిన 50 మంది ఫైర్ సిబ్బంది.. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో భారీగా మంటలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్‌రెడ్డి ఉన్నతాధికారులకు వివరించడంతో 8 వాహనాలు పరిశ్రమ వద్దకు చేరుకున్నాయి. దాదాపు అయిదు ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చిన 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మూడో అంతస్తులోకి నీటిని చిమ్మడం కష్టంగా మారడంతో బ్రాంటోసై్కలిఫ్ట్ను తెప్పించారు. మంటలు అర్ధరాత్రి వరకు కూడా అదుపులోకి రాలేదు. పైనుంచి కింది అంతస్తు వరకు వ్యాపించిన మంటలు.. పరిశ్రమ విశాలంగా ఉండటంతో పాటు లోపల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బ్యాగులు నిల్వ ఉన్నాయి. పైన ఆర్పీ యంత్రం వద్ద అంటుకున్న మంటలు ఒక్కో అంతస్తు నుంచి నేరుగా కింది అంతస్తు వరకు వ్యాపించాయి. పరిశ్రమ భవనం మంటల తాకిడికి రెండో అంతస్తు గోడలు కూలిపోయాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో ఘటనా స్థలికి బాలానగర్ ఏసీసీ హన్మంతరావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లే‹Ù, ఎస్ఐలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. -
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 0ట్యాంకర్లతో నీటి సరఫరా చేశారు. నాలుగున్నర గంటలకు పైగా భవనం మంటల్లోనే ఉంది. ఏడు ఫైర్‌ఇంజిన్లు, 40 వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. -
Twin Brothers: కలిసే తనువు చాలించి..
జీడిమెట్ల: ఇద్దరు అన్నదమ్ములు కవలలుగా జన్మించి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు కవలలకు ముద్దుగా రాము, లక్ష్మణ్ అని పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఎదిగి..బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చి దొరికిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో అన్నను కాపాడేందుకు తమ్ముడు ప్రయతి్నంచి ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడికి చేరారు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగింది. జీడిమెట్ల డీఐ కనకయ్య, ఎస్సై హరీష్ తెల్పన వివరాల ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామానికి చెందిన రాము(32), లక్ష్మణ్(32) కవలలు. వీరు ఉపాధి కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లి, అన్నారం గ్రామంలో ఉంటూ వివిధ పనులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సాధు నారాయణరావు అనే ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా వీరిద్దరూ జీడిమెట్ల ఏస్వీ కో ఆపరేటివ్ సొసైటీలో 3 సంవత్సరాలుగా మూతపడి ఉన్న సాబూరి ఫార్మా పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాము, లక్ష్మణ్‌తో పాటు పాండుబస్తీకి చెందిన సురేందర్‌రెడ్డి పరిశ్రమలో ఉన్న వ్యాక్యూమ్ ట్యాంక్ గోడపై నిలబడి ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో వీరికి తాగేందుకు చాయ్ రావడంతో లక్ష్మణ్, సురేందర్‌రెడ్డి గోడపై నుండి కిందకు దిగారు. గోడ దిగే క్రమంలో రాము ప్రమాదవశాత్తు వ్యాక్యూమ్ ట్యాంకులో పడిపోయాడు. పరిశ్రమ మూడు సంవత్సరాలుగా మూసి ఉన్నకారణంగా ట్యాంకులో రసాయనాలతో కూడిన నీరు 6 ఫీట్ల మేర ఉంది. రాము ట్యాంకులో పడటాన్ని గమనించిన లక్ష్మణ్ వెంటనే ట్యాంకు గోడ ఎక్కి ఓ కర్ర సాయంతో వెతకగా రాము అసస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అన్నను బయటకు తీసేందుకు లక్ష్మణ్ సైతం ట్యాంకులోకి దిగి అతను కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో సురేందర్‌రెడ్డి ట్యాంకులోకి దిగి అపస్మారకస్థితిలో ఉన్న రాము, లక్ష్మణ్‌లను బయటకు తీశాడు. ఇద్దరిని వెంటనే షాపూర్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారని డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు. సురేందర్‌రెడ్డి సైతం అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నారు. రాము, లక్ష్మణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.మృతులను భార్యాభర్తలు వెంకటేష్, వర్షిణి, వారి పిల్లలు విహంత్, రిషికాంత్లుగా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. -
వాటర్ ట్యాంకుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
జీడిమెట్ల: మద్యం మత్తులో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పార్వతీపురంనకు చెందిన బావిరి రాము (53)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లో ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. 15 రోజుల క్రితం కూడా రాము మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో స్థానిక ఎల్లమ్మ పోచమ్మ గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి కిందికి దూకి మృతి చెందాడు. మృతుడి కుమారుడు జైకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాము వాటర్ ట్యాంక్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీసులకు సమాచారం అందినా స్పందించలేదా? రాము ట్యాంక్‌పైకి ఎక్కడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదనే వదంతులు ఉన్నాయి. ఈ విషయమై ఇన్స్పెక్టర్ మల్లేశ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. రాము ట్యాంక్‌పైకి ఎక్కి నిమిషాల్లోనే దూకి మృతి చెందాడని, ఈ విషయమై తమకు, డయల్ 100కు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని తెలిపారు. -
జీడిమెట్లలో కారు బీభత్సం.. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. కారును డ్రైవ్ చేస్తోన్న మహేష్ గౌడ్ అతివేగం, మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డును ఢీకొట్టాడు.కారులో మొత్తం ఆరుగురు విద్యార్థులే కాగా, ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన ఐదుగురు యువకులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతి చెందిన గోపి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జీడిమెట్లలో రాజీవ్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. -
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో కారు బీభత్సం
-
జీడిమెట్ల న్యూ ఎల్బీనగర్ లో దారుణం
-
హైదరాబాద్ జీడిమెట్ల పరిధి షాపూర్ లో బస్సులో మంటలు
-
ఇంట్లో ఉంటున్న కూతురిపై పలుమార్లు తండ్రి లైంగికదాడి
-
జీడిమెట్లలో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో చెప్పాపెట్టకుండా ఇద్దరు బాలికలు వెళ్లిపోయిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.పవన్ చెప్పిన వివరాల ప్రకారం.. చింతల్ ద్వారకానగర్‌కు చెందిన శ్రీనివాస్, విజయ్ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. శ్రీనివాస్ కుమార్తె దీక్షిత 9వ తరగతి, విజయ్ కుమార్తె పూజ పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ.. పొరుగు ఇళ్లలో ఉండటంతో స్నేహితులయ్యారు. పూజ రెండు రోజుల క్రితం వినాయక మండపం వద్దకు వెళ్లడంతో తల్లిదండ్రులు మందలించారు. మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు యూనిఫాం వేసుకుంది. పాలు తాగుతుండగా అవి మీద పడటంతో డ్రెస్ మార్చుకుంది. పక్కింట్లో ఉండే దీక్షిత బయట నుంచి గడియపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరూ ప్రణాళిక ప్రకారమే 8 గంటల కంటే ముందే ఇళ్లలోంచి వెళ్లిపోయారు. దీక్షిత బాత్రూంకు గడియ పెట్టడం, పూజ డ్రెస్ మార్చుకోవడంపై అనుమానం వచి్చన ఇరువురి తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో జీడిమెట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఇద్దరు బాలికలు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కి వరంగల్ వెళ్లినట్లు గుర్తించారు. వరంగల్ నుంచి ఆంధ్రాకు గాని చెన్నైకి గాని వెళ్లే అవకాశం ఉందని, ఓ బాలిక బంధువు సంగారెడ్డికి చెందిన యువకుడికి పూర్తి విషయాలు తెలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు యువకుడిని ప్రశ్నించేందుకు జీడిమెట్ల ఠాణాకు తీసుకువచ్చినట్లు సమాచారం. -
హైదరాబాద్: డమ్మీ బాంబుతో బ్యాంకులో హల్చల్
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల షాపూర్‌నగర్ ఆదర్శ్ బ్యాంక్ దగ్గర గురువారం డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. బాడీ మొత్తానికి బాంబు తరహా సెటప్ చేసుకుని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. మామూలుగా బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి.. హఠాత్తుగా తాను మానవబాంబునని, తన దగ్గర బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకును పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది భయపడ్డారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు అలర్ట్ వెళ్లింది. హుటాహుటిన సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. అది డమ్మీ బాంబుగా తేల్చారు. సదరు వ్యక్తిని జీడిమెట్లకే చెందిన శివాజీగా గుర్తించారు. అతను ఎందుకు అలా చేశాడన్నదానిపై తేల్చేందుకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. -
Hyderabad: వివాహేతర సంబంధం: భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
హైదరాబాద్: వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భార్య బంధువులపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం వల్లభాయ్నగర్కు చెందిన విజయ్‌కుమార్‌కు మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగికి చెందిన స్వప్నతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా విజయ్‌కుమార్ మూడేళ్లుగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. అప్పటి నుంచి భార్యను సైతం దూరం పెడుతూ విడాకులు ఇవ్వాల్సిందిగా వేధిస్తూ వస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇంటి రావడంలేదు, కుటుంబ సభ్యులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు. శనివారం రాత్రి సదరు మహిళతో విజయ్‌కుమార్ ఉన్నట్లు తెలుసుకున్న స్వప్న, ఆమె అక్కలు శ్యామల, మంజుల, బాబాయి శ్రీనివాస్ అక్కడికి వెళ్లారు. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీయగా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య స్వప్నను కొడుతున్న విజయ్‌కుమార్‌ను అడ్డుకున్న శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేయగా అతని మెడభాగం, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం బాధిత మహిళ స్వప్న జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో పురాతన భవనం కుప్పకూలింది. చెరుకుపల్లి కాలనీలో ఓ పురాతన బిల్డింగ్‌కు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్క సారిగా కూలిపోయింది. పక్క నున్న 3 భవనాలపై శిథిలాలు పడటంతో పక్క బిల్డింగ్ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పక్క బిల్డింగ్‌లో ఇద్దరు గాయపడ్డారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా.. -
లవ్ ఫెయిల్.. ప్రేమించిన యువతి కావాలని రెండేళ్లుగా..
సాక్షి, హైదరాబాద్: అప్పట్లో అతడి వయస్సు 17 సంవత్సరాలు. మైనర్ వయస్సులోనే ఓ మైనర్ (బాలిక)ను ప్రేమించాడు. బాలిక దక్కలేదని రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంటిపై మూడు రోజుల క్రితం బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ న్యూఎన్ఎల్బీ నగర్‌కు చెందిన జగన్కుమార్కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు కాగా ఒక అబ్బాయి మణికళ్యాణ్(19). మణికళ్యాణ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదివే క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వారి సొంతప్రాంతం కర్ణాటకకు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి మణికళ్యాణ్ మద్యానికి బానిసయ్యాడు. రాత్రిపూట మద్యం సేవించి ఇంటికొచ్చి ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవపడేవాడు. ఈనెల 13వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన మణికళ్యాణ్ రాత్రి 12గంటల సమయంలో బిల్డింగ్‌పై నుంచి కిందకు దుకాడు. తీవ్ర గాయాల అవ్వడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మణికళ్యాణ్ను ఓప్రైవేట్ అస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మణికళ్యాణ్ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
-
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. -
అయ్యో పాపం.. పసికందును రేకుల ఇంటిపై వదిలివేత
సాక్షి, హైదరాబాద్: కన్నబిడ్డను చూసి నోరులేని మూగజీవి సైతం మురిసిపోతుంది. తనివితీరా బిడ్డను చూసుకుని పురిటి నొప్పులను సైతం మరిచిపోతుంది. ప్రపంచంలో తెంచుకోలేనిది పేగు బంధం అంటారు. అలాంటిది ఓ తల్లి తన కన్నబిడ్డ పేగు సైతం ఎండకముందే ఆ బంధాన్ని తెంచేసుకుంది. తల్లి చనుబాల రుచిని సైతం ఎరగని చిన్నారిని ఓ రేకుల ఇంటిపై ఉంచి వెళ్లిపోయారు. స్థానికులు చూసి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జీడిమెట్ల డివిజన్ డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఓ ఇంటిపై ఉన్న యువకుడు.. కింద నుంచి చిన్నారి ఏడుస్తున్న శబ్దాలను విన్నాడు. కిందకు చూడగా ఓ రేకుల ఇంటిపై పసికందు కనిపించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో చిన్నారిని రేకుల ఇంటి నుంచి కిందకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పసికందుకు షాపూర్‌నగర్‌లో ప్రథమ చికిత్స అందించి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. చదవండి: Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు.. -
వ్యక్తి దారుణ హత్య.. మృతదేహాన్ని మూటగట్టి ఇంటి ముందు పడేసి..
సాక్షి, హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అంతమొందించిన దుండుగలే మృతదేహాన్ని గోనె సంచీలో మూటగట్టి ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం, వెలిమెల గ్రామానికి చెందిన సురేష్ (28) 2016లో రేణుకను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కొన్నేళ్ల నుంచి సంజయ్‌గాం«దీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి ఆరేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు ఆడ పిల్లలున్నారు. సురేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా రేణుక ఇంటి వద్దనే ఉంటోంది. ఆదివారం భర్త సురేష్‌ను ఆహారం తీసుకురమ్మని రేణుక బయటకు పంపింది. అర్ధరాత్రి అయినా సురేష్ ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ సైతం ఇంట్లో వదిలి వెళ్లినట్లు గుర్తించారు. సోమవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు గోనె సంచీలో మృతదేహం ఉన్నట్లు ఇంటి యజమాని గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూడగా సురేష్ రక్తపు మడుగులో ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. భార్యే హత్య చేయించిందా..! మృతుడు సురేష్ హత్య వెనుక భార్య హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కొంత మంది వ్యక్తులతో కలిసి రేణుక పథకం ప్రకారం హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో జీడిమెట్ల పోలీసులు రేణుకను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు..
జీడిమెట్ల: పెళ్లిలో పెట్టిపోతలకంటే కీలక పాత్ర పోషించేది పెళ్లి విందు. ఆ విందులో వధువు తరఫున వారు మాంసం పెట్టలేదన్న కోపంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ నెల 30న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన అబ్బాయికి కుత్బుల్లాపూర్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. 28వ తేదీ తెల్లవారుజామున 3గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. బంధువులంతా షాపూర్‌నగర్‌లోని ఓ కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబీకులు ఏర్పాటు చేసిన విందులో అందరూ భోజనం చేస్తున్నారు. చివరిబంతిలో పెళ్లి కొడుకు మిత్రులు కూర్చున్నారు. వారికి వెజ్ ఐటమ్స్ వడ్డించారు. దీంతో కొంతమంది లేచి ‘మాంసాహారం లేదా’అని అడిగారు. లేదని వధువు కుటుంబీకులు చెప్పడంతో.. విందులో మాంసం పెట్టకపోవడమేమిటని వరుడి స్నేహితులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. అలా తిండి దగ్గర మొదలైన గొడవ ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. కాస్త నెమ్మదించాక విషయం పోలీసుల వరకూ వెళ్లింది. జీడిమెట్ల సీఐ పవన్.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో నవంబర్ 30(రేపు)న పెళ్లి జరిపించేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నారు. చదవండి: ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం -
ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్
సాక్షి, హైదరాబాద్ (జీడిమెట్ల): పెళ్లయిన వ్యక్తి వేరే యువతిని ప్రేమించగా ఆమె అతడి ప్రేమను తిరస్కరించడంతో ఎలుకల మందు సేవించి చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్‌రెడ్డి వివరాల ప్రకారం.. చింతల్ చంద్రానగర్‌కు చెందిన మలిన్(28), మమత భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మలిన్ బాలానగర్‌లోని ఓ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే పరిశ్రమలో పనిచేసే ఓ యువతిని మలిన్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతి ముందు వ్యక్తపరచగా ఆమె తిరస్కరించింది. దీంతో మలిన్ ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎలుకల మందు సేవించి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో మలిన్ భార్య మమత చికిత్స నిమిత్తం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం మలిన్‌ను గురువారం వైద్యులు డిశ్చార్జి చేశారు. అదేరోజు మలిన్‌కు చాతిలో నొప్పి రావడంతో మమత అతడిని మళ్లీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగానే మలిన్ మృతిచెందాడు. మలిన్ భార్య మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన) -
సాంబార్ లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావనడంతో..
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీలోకి సాంబార్ అడిగినందుకు ఓ కస్టమర్‌పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడిచేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ రంగాభుజంగా సినిమా థియేటర్‌కు ఎదరుగా ఉన్న గోకుల్ టిఫిన్ సెంటర్‌కు సోమవారం ఉదయం ఉపేందర్‌రెడ్డి అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి టిఫిన్ చేసేందుకు వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. అనంతరం ఇడ్లీలోకి సాంబార్ కావాలని హోటల్ సిబ్బందిని కోరగా వారు లేదంటూ సమాధానం చెప్పడంతో సాంబారు లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావంటూ ఉపేందర్‌రెడ్డి సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ విషయంలో ఉపేందర్‌రెడ్డి, హోటల్ సిబ్బందికి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో హోటల్ పనిచేస్తున్న కాలీదాస్ అనే వ్యక్తి పూరిచేసే కర్రతో దాడిచేసి ఇద్దరిని గాయపరిచాడు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఉపేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్‌ట్యాక్స్ రద్దు -
Hyderabad: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళా ఆర్గనైజర్లతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. ఎస్సై గౌతమ్ వివరాల ప్రకారం.. చింతల్ వాణీనగర్‌లో సరిత(39), పార్వతి(27)అనే ఇద్దరు మహిళలు ఓ గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహితురాళ్లతో పాటు విటుడు బోయిన్‌పల్లికి చెందిన బండి రాజేందర్(34)లను అదుపులోకి తీసుకుని జీడిమెట్ల పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) -
బయోటెక్ కంపెనీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
-
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి.. అతి కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్(జీడిమెట్ల): అనుమానమే పెనుభూతమైంది.. కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. తన ముగ్గురు పిల్లల సాక్షిగా భర్త భార్యను అతికిరాతకంగా కొన్ని గంటల పాటు హింసించి కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవేందర్‌నగర్ బతుకమ్మబండలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. బతుకమ్మబండలో నివాసముండే కర్ణి మమత(38), బాలకృష్ణ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కాగా బాలకృష్ణ ఇద్దరు కుమారులతో కలిసి ఏసీ సర్వీసింగ్ పనులు చేస్తుండగా మమత ఇంట్లోనే ఉంటుంది. గతేడాది కాలంగా భార్యాభర్తలిద్దరికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మమతపై అనుమానంతో ఉన్న బాలకృష్ణ గురువారం ఉదయం నుంచే ఆమెను ఇంట్లో బంధించి మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి కొట్టడం మొదలుపెట్టాడు. ఆమెను కొన్ని గంటల పాటు విపరీతంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక మమత శుక్రవారం ఉదయం మృతిచెందింది. స్థానికుల జోక్యంతో భర్త కట్టుకథ అట్టర్ ఫ్లాప్.. మమత మృతిచెందిన విషయం ఆమె ఇద్దరు కుమారులతో పాటు కుమార్తెకు సైతం తెలుసు. కాగా వారు ఇంటి తలుపులు గేట్లు మూసుకుని మృతదేహంతో ఇంట్లోనే ఉన్నారు. అనంతరం అందరూ కలిసి శుక్రవారం ఉదయం ఇంటి మొత్తాన్ని కడిగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మృతదేహాన్ని తరలించేందుకు ప్లాన్ వేసుకుని ఇంటి వద్దకు అంబులెన్స్‌ను పిలిపించారు. మమత మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి మారుస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు మమతకు ఏమైంది? ఒంటిపై దెబ్బలు ఏంటి అని ఆమె భర్త బాలకృష్ణను నిలదీశారు. మమత నిన్నటి నుంచి కనిపించలేదని, ఆమె అపస్మారక స్థితిలో బయట దొరికితే తీసుకువచ్చానని బాలకృష్ణ కట్టుకథ అల్లబోయాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు బాలకృష్ణను నిలవరించి పోలీసులకు సమాచారం అందించారు. చదవండి👉🏼 (మార్కాపురం: ఆ భయంతోనే యువతి ఆత్మహత్యాయత్నం) రంగంలోకి దిగి చర్యలు తీసుకున్న పోలీసులు.. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున జీడిమెట్ల సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మద్, సతీష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి మమత ఒంటిపై తీవ్రమైన దెబ్బలను గుర్తించారు. ఆమె భర్తే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు బాలకృష్ణతో పాటు కుమారులు లక్ష్మణ్, శంకర్లను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మేమే శిక్షిస్తామంటూ పోలీసులతో స్థానికుల వాగ్వాదం.. ఇళ్ల మధ్యే ఉన్న నరరూప రాక్షసుడిని తామే శిక్షిస్తామని స్థానికులు కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కలుగచేసుకున్న ఎస్సై సతీష్‌రెడ్డి స్థానికులను సముదాయించి శిక్షపడేలా మేము చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు బాలకృష్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
జీడిమెట్ల.. వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అట్టి గృహంపై దాడి చేసి నిర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు. చదవండి: ఢిల్లీలో దారుణం.. ఇంటి ముందే బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు -
కాపు కాసి కడ తేర్చారు..
జీడిమెట్ల: తన అక్కతో తరచు గొడవ పడుతున్నాడనే నెపంతో బావమరుదులు బావతో పాటు అతని సోదరుడిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి హత్య చేశారు. గురువారం రాత్రి జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో చోటు చేసుకున్న సంఘటన స్థానికులను భయాందోళను గురిచేసింది. ►జీడిమెట్ల ఇన్స్పెక్టర్ కె.బాలరాజు వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన మోక వెంకటేష్(32) ఏడేళ్ల క్రితం ఉప్పల్ చిలకానగర్‌కు చెందిన తనకంటే పెద్దదైన రేఖ(40)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప(4), బాబు(2) ఉన్నారు. వెంకటేష్ పెయింటర్‌గా పని చేస్తుండగా రేఖ ఇంటి వద్దనే ఉంటుంది. కాగా వీరిద్దరి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ►గురువారం ఉదయం వెంకటేష్ రేఖల మధ్య గొడవ జరిగింది. ఆమెపై చేయి చేసుకుని సుభాష్‌నగర్‌లోనే ఉండే తల్లి వద్దకు వెళ్లాడు. తన భర్త వెంకటేష్ గొడవపడి తనను కొట్టాడని రేఖ చిలుకానగర్‌లో ఉండే తన తమ్ముళ్లకు చెప్పింది. ►దీంతో బావ వెంకటేష్‌పై కోపంతో రగిలిపోయిన రేఖ సోదరులు వినయ్(25), మధు(22)లు రాత్రి సుభాష్‌నగర్‌కు వచ్చి వెంకటేష్ కోసం కాపు కాస్తున్నారు. అదే సమయంలో వెంకటేష్ తన సొంత సోదరుడైన పోతురాజు(25), తన చెల్లెలి భర్త కృష్ణ(25)లతో కలిసి మద్యం తాగి రాత్రి 10గంటలకు ఇంటికి వస్తున్నాడు. వీరు ముగ్గురు సుభాష్‌నగర్ పోచమ్మ గుడి వద్దకు చేరుకోగానే వినయ్ వారిస్తూ ఒక్కసారిగా దాడికి దిగాడు. ►తన వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటేష్ కడుపులో పొడుస్తుండగా అతని తమ్ముడు మధు వెంకటేష్‌ను పట్టుకున్నాడు. తన అన్న వెంకటేష్‌ను పొడుస్తుండగా అడ్డుగా వెళ్లిన వెంకటేష్ సోదరుడు పోతురాజును సైతం వినయ్ విచక్షణ రహితంగా పొడిచాడు. అక్కడే ఉన్న వెంకటేష్ బావ కృష్ణను సైతం పొడవడానికి ప్రయత్నించగా వెంకటేష్ సోదరి అనిత తన భర్తను చంపవద్దని ప్రాధేయపడింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన పోతురాజు అక్కడికి అక్కడే మృతిచెందగా వెంకటేష్ అస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల అదుపులో నిందితులు.. ఘటనాస్థలికి వెళ్లిన జీడిమెట్ల సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మద్, గౌతమ్‌లు పంచనామా నిర్వహించి వినయ్, మధు, రేఖలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పోతురాజుపై 32కేసులు.. హత్య కాబడ్డ వెంకటేష్ సోదరుడు మృతుడు పోతురాజుపై వివిధ పోలీస్స్టేషన్లలో 32కేసులు ఉన్నాయి. ఇతను తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ జైలు నుంచి వచ్చి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఇంటి ఆడపడుచు పసుపుకుంకాలతో సంతోషంగా ఉండాలని ఏ అన్నదమ్ములైన కోరుకుంటారు. కానీ వీరి విషయంలో అది రివర్స్‌గా ఉంది. అక్కను కొట్టాడనే కోపంతో రగిలిపోయిన బావమర్దులిద్దరూ కలసి సొంత బావ ఉసురుతీశారు. అంతేకాకుండా అడ్డుకోవడానికి వచ్చిన బావ తమ్ముడిని సైతం కడ తేర్చారు. బంధాలు, బాంధవ్యాలు మరచి సొంతవాళ్లను చంపుకుంటున్న నేటి సమాజంలో మానవత్వం చచ్చిపోతున్నదనడానికి ఈ ఘటనే నిదర్శనం. -
హైదరాబాద్: పెళ్లై నాలుగు నెలలు గడవకముందే..
సాక్షి, జీడిమెట్ల: పెళ్లై నాలుగు నెలలు కూడా అవ్వలేదు.. కొత్త జంట కొత్త ఆశలతో నగరానికి వచ్చారు. కానీ వీరి దాంపత్యాన్ని ఓర్వలేని మృత్యువు ప్రైవేట్ ట్రావెల్స్ రూపంలో వచ్చి నూతన పెళ్లి కొడుకుని కబళించింది. ఈ హృదయవిదారక సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ.కె.బాలరాజు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన రామచందర్‌రావు కుమారుడు దుర్గ సత్యవరప్రసాద్ ఐటీఐ చేశాడు. హైదరాబాద్ జీడిమెట్లలోని కలోరమ ప్రింటర్స్‌లో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.కాగా వరప్రసాద్‌కు గత నెలల క్రితం వారి సొంత ప్రాంతం పరిధిలోని ద్రాక్షాయనితో వివాహం జరిగింది. భార్య ద్రాక్షాయనితో కలిసి సొంత ఊరికి వెళ్లిన వరప్రసాద్ మంగళవారం ఉదయం నగరానికి చేరుకున్నాడు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి వచ్చాడు. షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయం ముందు రోడ్డు దాటుతున్నాడు. చదవండి: కన్న తల్లిపై కర్కశత్వం.. పెనంతో కొట్టి చంపిన కూతురు ఈ క్రమంలో గాజులరామారం నుంచి షాపూర్‌నగర్ వైపు వస్తున్న నేషనల్ ట్రావెల్స్ బస్సు(టీఎస్09యూబీ1994) రోడ్డు దాటుతున్న వరప్రసాద్‌ను ఢీకొట్టగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలైన వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు వరప్రసాద్ భార్య ద్రాక్షాయని ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంకా వీడని జీడిమెట్ల బాలిక డెత్ మిస్టరీ
-
బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది?
సాక్షి, జీడిమెట్ల: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అను మానాస్పదంగా ఓ బాలిక మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది సీఐ కె.బాలరాజు, బాలిక బంధువుల వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన బచ్చన్సింగ్, పూర్ణంకౌర్ దంపతులకు ఐదుగురు పిల్లలు వీరిలో నలుగురు కుమార్తెలు కాగా ఒక్క కుమారుడు. వీరి పెద్దకుమార్తె(17) ఆరో తరగతి వరకు చదువుకుంది. అనంతరం చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. బచ్చన్సింగ్ కుటుంబం నాలుగు నెలల క్రితం గాజులరామారంలో ఉండేవారు. ఇటీవలే సుభాష్‌నగర్‌కు వచ్చా రు. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్న బాలిక ఒక్కతే ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన అరగంట అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యు లు ఆమె ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికారు. అయినప్పటికీ ఆమె జాడ తెలియకపోవడంతో రా త్రి ఒంటి గంటకు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిడ్నాప్ అయినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాత్రి 2:30 గంటలకు జీడిమెట్ల పోలీసులకు పైప్‌లైన్ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ వద్ద బాలిక మృతదేహం పడి ఉందని అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్రిత్ పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీ సులు బాలిక తల్లిదండ్రులను ఘటనా స్థలికి పిలిపించి వాకబు చేయగా వారి కూతురేనని తెలిపారు. బాలిక చున్నీ అపార్ట్మెంట్ 5వ ఫ్లోర్లో లభించగా ఆమె 5వ అంతస్తు నుంచి కిందకు దూకిందెమో.. అన్నట్లుగా పోలీసులు పోలీసులు వ్య క్తం చేశారు. బాలిక తలపై లోతు గాయం అవ్వడంతో పాటు నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. చదవండి: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీమూకలు పోస్టుమార్డమ్ రిపోర్టులో ఆత్మహత్యే.. బాలిక పోస్టుమార్డమ్ నివేదికలో మాత్రం హత్య చే యబడ్డ ఆనవాళ్లు లేనట్లుగా పోలీసులు తెలిపారు. బాలిక తానంతట తానే అపార్ట్‌మెంట్‌పై నుంచి దూ కిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది? సోమవారం రాత్రి బాలికను కుటుంబ సభ్యులెవ రూ బయటకు పంపకపోవడంతో బాలిక ఒక్కతే ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన నాలుగు గంటలకే శవ మై కనిపించింది. అంతే కాకుండా తన ఇంటికి దూరంగా ఉన్న అపార్ట్మెంట్ వద్దకు వచ్చినా.. చీకటిగా ఉండే 5వ అంతస్థుకు ఒక్కతే ఎలా వెళ్లగలిగింది? ఒకవేళ వెళ్లినా అపార్ట్‌మెంట్‌పైన రేలింగ్ చాలా ఎత్తులో ఉన్న ందున బాలిక అంత సులభంగా ఎలా ఎక్కగలదు? అనే సందేహాన్ని బాలిక బంధువులు వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రేమికుల దినోత్సవం రోజే ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరో ఆరు నెలల్లో పెళ్లి చేయాలనుకున్నాం.. బాలికకు 18 సంవత్సరాలు నిండకపోవడంతో పెళ్లి చేయలేదు. మరో ఆరు నెలల్లో 18 ఏళ్లు రాగానే పెళ్లి చేయాలని అనుకున్నామని బాలిక తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ఇంతలోనే బాలిక మృతి చెందడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో ఓ బాలిక అనుమానాస్పద మృతి చెందిండం కలకలం రేపుతోంది. సుభాష్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక సోమవారం రాత్రి ఇంట్లో నుంచి ఆదృశ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం తెల్లవారుజామున బాలిక మృతుహదేహం లభ్యమమైంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రక్తపు మడుగుల్లో బాలిక మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. అనుమానితులను, భవన నిర్మాణ కార్మికులు, స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
Hyderabad: ఫాస్ట్‌ఫుడ్ లేదన్నాడని.. కత్తితో తెగబడ్డాడు
సాక్షి, హైదరాబాద్(జీడిమెట్ల): దూకాణం మూసే సమయంలో ఫాస్ట్‌ఫుడ్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్ లాస్ట్‌బస్టాప్ ప్రాంతంలో బిద్యాధర్(32) ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దుకాణాన్ని మూసివేస్తుండగా పక్కనే ఉండే పాన్‌షాప్ నిర్వాహకుడు యాసిన్ ఫాస్ట్‌ఫుడ్ కావాలని వచ్చాడు. అయితే చాలా ఆలస్యమైంది, దుకాణం మూసివేస్తున్నాం, ఇప్పుడు ఇవ్వలేనని బిద్యాధర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి వెళ్లిపోయిన యాసిన్ 10 నిమిషాల తరువాత తన వెంట కత్తిని తెచ్చుకుని బిద్యాధర్ మెడ, ఛాతిపై పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బిద్యాధర్ బిగ్గరగా అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూడగా అప్పటికే యాసిన్ పరారయ్యాడు. క్షతగాత్రుడిని షాపూర్‌నగర్‌లోని మెడ్విజన్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Chicken Sales: అయ్య బాబోయ్.. రికార్డు స్థాయిలో చికెన్ లాగించేశారు) -
చావు తెలివంటే ఇదే.. ట్రిపుల్ రైడింగ్.. హెల్మెట్ లేదు.. మూతికి ఉండాల్సిన మాస్కేమో!
సాక్షి, జీడిమెట్ల : పోలీస్ చలానాల నుంచి తప్పించుకోవాలంటే మూతికి ఉండాల్సిన మాస్క్‌ను బండికి పెట్టుకోవాలి. అప్పుడే ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్లలో ఇష్టం వచ్చినట్లు వెళ్లొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొంతమంది యువకులు ఇలా బైక్ నంబర్ ప్లేట్‌ను మాస్క్‌తో మూసేసి పోలీసుల కెమెరాలకు చిక్కకుండా తిరుతున్నారు. ఇలాంటి వారు ఏదైనా ప్రమాదం చేసి తప్పించుకుంటే దొరకడం కష్టంగా మారుతుంది. ఇటువంటి వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ఇది ప్రమాదమేనని ప్రజలు అంటున్నారు. చింతల్లో నంబర్ ప్లేట్‌కు మాస్కు పెట్టి యువకులు ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో వెళ్తున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి మరోసారి రెక్కలు విప్పేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. ఇంకోవైపు రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలబారినపడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువకులు తమకేం కాదులే అన్న విపరీత ధోరణితో అటు వైరస్‌ను , ఇటు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. చదవండి: నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు.. హైదరాబాద్ నగరంలో గతంలో దర్శనమిచ్చిన ‘మాస్కు’ నెంబర్ ప్లేట్లు.. -
నాడు ప్రేమించిన యువతిపై దాడి.. నేడు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
సాక్షి, జీడిమెట్ల: మనస్తాపంతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు, యువకుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఐడీఏ జీడిమెట్లలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌కు చెందిన బయోరా శ్యామ్సింగ్, సరస్వతి దంపతుల కుమారుడు ప్రేమ్ సింగ్(22) జేఎన్టీయూ దగ్గరలో ఉన్న ఎంఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా ప్రేమ్‌సింగ్ సోదరిని ధన్వాడకు ఇచ్చి వివాహం చేశారు. గత కొన్ని రోజుల క్రితం సోదరి ఇంటిలో విందుకు వెళ్లిన ప్రేమ్‌సింగ్ సోదరి ఇంటి పక్కన ఉండే యువతిని చూసి ప్రేమలో పడ్డాడు. చదవండి: Gachibowli: ప్రేమోన్మాది ఘాతుకం: యువతి గొంతు కోసిన యువకుడు యువతిపై దాడి చేసిన ప్రేమ్‌సింగ్ సదరు యువతి ఫోన్ నెంబర్ తీసుకుని ప్రపోజ్ చేయగా ఆమె తిరస్కరించింది. దీంతో సైకోలా మారిన ప్రేమ్‌సింగ్ సదరు యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడికి పాల్పడగా ఆమె కుంటుంబ సభ్యులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ప్రేమ్‌సింగ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి ప్రేమ్ సింగ్ ఎక్కువ సేపు తన బెడ్రూంలోనే గడుపుతున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. ఆమె ఏం చేసిందంటే ఈ నెల 27వ తేదీ శనివారం తన బెడ్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. కుమారుడు రెండు రోజులైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రేమ్‌సింగ్ తల్లి 29వ తేదీన తలుపు తట్టింది. ఎంతకూ తీయకపోవడంతో అనుమానం వచ్చి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు విరగొట్టి చూడగా ప్రేమ్‌సింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఇష్టమైన కోర్సులో చేర్పించలేదని.. మనస్తాపం చెంది...
సాక్షి, జీడిమెట్ల: ఇంటర్లో తనకిష్టమైన కోర్సులో చేర్పించలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌కు చెందిన రమేశ్‌కుమార్ కుమారుడు సుమీత్‌కుమార్(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే తాను సీఈసీలో చేర్చాలని కోరితే కుటుంబ సభ్యులు ఎంపీసీలో చేర్పించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుమీత్‌కుమార్ ఈ నెల 22న ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షాపూర్‌నగర్ నుంచి గాజులరామారం వరకు సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు సుమీత్‌కుమార్ గాజులరామారంలోని చింతల్ చెరువు వద్ద తచ్చాడుతూ కనిపించాడు. దీంతో చెరువు దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులతో విద్యార్థిని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. చదవండి: తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో? యువతి అదృశ్యం జగద్గిరిగుట్ట:ఉద్యోగానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌చంద్రబోస్‌నగర్ దర్గా సమీపంలో ఉండే శంకరరావు, శాంతాబాయ్ల కుమార్తె పూజ(20) ఓ ప్రైవేట్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తోంది. రోజు మాదిరిగానే 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఉద్యోగానికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె మొబైల్ ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యువతి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గణేష్ మండపం వద్ద విషాదం
సాక్షి, జీడిమెట్ల: వినాయకుడి మండపం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్‌కు గురై ఓ బాలుడు మృతిచెందిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాలు.. షాపూర్‌నగర్‌లోని న్యూ ఎల్బీనగర్కు చెందిన గుండు ఆనంద్ కుమారుడు అనిల్(5) ఇంటి సమీపంలోని సంతోషిమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పిల్లలతో కలిసి సోమవారం ఉదయం 11 గంటలకు ఆడుకుంటున్నాడు. మండపం నిర్వాహకులు అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వైర్లు అస్తవ్యస్తంగా ఉండటంతో అనిల్ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. బంధువు మల్లేష్ అనిల్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డ్యూటీ డాక్టర్ బాలుడు మరణించినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
జీడిమెట్ల: ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని..
సాక్షి, జీడిమెట్ల: అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చింతల్ ద్వారకానగర్‌కు చెందిన యాదగిరి కుమారుడు మహేష్ (21) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని మహేష్ సదరు యువతికి తెలుపగా నిరాకరించింది. దీంతో మదనపడిన మహేష్ గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి మహేష్ మరణించి ఉన్నాడు. మృతుని తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై కేసు నమోదు భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య -
‘మీ జీవితంలో 17 ఏళ్లు ప్రశాంతత దూరం చేశాను.. నన్ను క్షమించండి’
సాక్షి, జీడిమెట్ల: మీ జీవితంలో 17 ఏళ్లపాటు ప్రశాంతత దూరం చేసినందుకు నన్ను క్షమించండి. మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఓ విద్యార్థి లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.బాలరాజు సమాచారం మేరకు... కుత్బుల్లాపూర్ డివిజన్ చెరుకుపల్లి కాలనీకి చెందిన ఎ.శివుడు కుమారుడు ఎ.పునీత్(17) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. సోమవారం ఉదయం నీట్ పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన పునీత్ రాత్రైనా తిరిగి రాలేదు. పునీత్ తండ్రి శివుడు కళాశాలకు వెళ్లి వాకబు చేయగా కళాశాల సిబ్బంది అక్కడకు రాలేదని తెలిపారు. పునీత్ రూంలో వెతకగా పునీత్ రాసిన ఉత్తరం లభించింది. దీంతో కంగారు పడిన పునీత్ తండ్రి సోమవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పోలీసులకు తలనొప్పి.. చచ్చిందెవరో.. చంపిందెవరో! స్నేహితురాలి వద్దకు వెళుతున్నానని... -
మహిళతో వివాహేతర సంబంధం, పెళ్లయ్యాక సీన్ రివర్స్.. చివరికి!
సాక్షి, జీడిమెట్ల: ఓ వివాహిత హత్య కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపారు.. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజాంగర్ జిల్లా లోనాపార్క్‌కు చెందిన సుజీత్‌యాదవ్ (35), రింకూ యాదవ్ (24) భార్యాభర్తలు. వీరు జీడిమెట్ల వినాయనగర్‌లో ఉంటున్నారు. సుజీత్ యాదవ్ ఆటో డ్రైవర్. అయితే కూకట్‌పల్లిలో ప్రైవేట్ ఉద్యోగం చేసే రాజేష్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా వీరితో షేరింగ్ రూమ్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రింకూ యాదవ్, రాజేష్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజేష్ ఆమెకు ఆర్థికంగా సాయం చేస్తుండే వాడు. అయితే ఏప్రిల్‌లో రాజేష్‌కు ధన్‌బాద్‌కు చెందిన పూజాతో వివాహమైంది. వివాహానంతరం రాజేష్, పూజలు అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి కావడంతో రాజేష్.. రింకూ యాదవ్‌ను పట్టించుకోవడం మానేశాడు. ఇంకో ఇంటికి మారేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో రాజేష్‌ను తన వైపునకు తిప్పుకోవాలంటే పూజ అడ్డును తొలగించుకోవాలని రింకూ యాదవ్ దంపతులు భావించారు. ఈ నెల 10 తేదీన రాజేష్ పని మీద బయటకు వెళ్లగా పూజ ఒకత్తే ఉంది. ఇదే సరైన సమయంగా భావించిన రింకూయాదవ్, సుజీత్‌యాదవ్‌లు పూజముఖంపై దిండుతో ఊపిరాడకకుండా చేసి హత్య చేశారు. ఆపై నేరం తమపైకి రాకుండా పూజ వంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు. కొద్దిసేపటి తరువాత వచ్చిన రాజేష్‌కు కట్టుకథ అల్లారు. పూజ మాజీ ప్రియుడు వచ్చి తనతో పాటు రమ్మని బలవంతం చేశాడని, రానని చెప్పడంతో హత్య చేసి వెళ్లిపోయాడని నమ్మించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రింకూయాదవ్, సుజీత్‌యాదవ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే పూజను హత్య చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు లాకెట్‌ను స్వాదీనం చేసుకుని, ఇరువురిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: పెళ్లైన తర్వాత.. ప్రియుడితో ఫోన్‌కాల్స్.. చాటింగ్.. -
పెళ్లైన తర్వాత.. ప్రియుడితో ఫోన్‌కాల్స్.. చాటింగ్..
సాక్షి, జీడిమెట్ల: వివాహితను ఆమె మాజీ ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కె.బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన పూజ (21)కు అదే ప్రాంతంలోని రాజేంద్రన్ వర్మతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ఈ దంపతులు కొన్నిరోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. జీడిమెట్ల డివిజన్ వినాయకనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పూజ నగరానికి వచ్చిన తర్వాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్ అనే యువకుడితో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుండేది. ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్ మరో యువకుడితో కలిసి ధన్‌బాద్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని పూజ ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. రాకేష్ ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. తనతో ధన్‌బాద్ రావాలని పట్టుబట్డాడు. పూజ అందుకు నిరాకరించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణను గమనిస్తున్న అదే ఇంటిలో ఉన్న రింకు ఆపేందుకు ప్రయత్నించగా.. అడ్డువస్తే నీ కుమారుడిని చంపేస్తానని రాకేష్ బెదిరించాడు. అనంతరం రాకేష్‌తో ఝార్ఖండ్ నుంచి వచ్చిన యువకుడు పూజ కాళ్లను అదిమి పట్టుకున్నాడు. రాకేష్ దిండుతో ఆమె ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితులిద్దరూ అక్కణ్నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూజ భర్త రాజేంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. -
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
-
జీడిమెట్లలో ఘోరం: అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం
జీడిమెట్ల: ల్యాబ్‌కు సంబంధించిన ఫర్నిచర్ తయారుచేసే ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. జీడిమెట్లకు చెందిన సురేశ్‌కుమార్ అనే వ్యక్తి జీడిమెట్ల ఫేజ్ -5లో ఆర్ట్ ఫ్యాబ్రికేషన్స్ పేరిట ఇండస్ట్రీ, క్లినికల్ ల్యాబ్ ఎక్విప్మెంట్ తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు. శనివారం పరిశ్రమలో పనిచేసే 60 మంది కార్మికులు పనిచేస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండో అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ల్యాబ్‌లో అపురూ పకాలనీకి చెందిన యశోద (40), లక్ష్మి (28), కృష్ణవేణి (57) క్లీనింగ్ పనులు చేస్తున్నారు. యశోద మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మి, కృష్ణవేణి గాయపడగా వారిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. పరిశ్రమకు అనుమతుల్లేవు.. ఫ్యాబ్రికేషన్స్ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలో మంటలను నియంత్రించేం దుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన మహిళ కుటుంబానికి నష్టప రిహారం ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
Jeedimetla: మహిళ దారుణ హత్య.. కొడుకే చేశాడా?
సాక్షి, జీడిమెట్ల: ఓ మహిళ దారుణహత్యకు గురైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. చింతల్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన ముప్పిడి మల్లేష్, స్వరూప(48) భార్యాభర్తలు. మల్లేష్ సనత్‌నగర్‌లో టైలర్‌షాపు నిర్వహిస్తుండగా భార్య సరస్వతి ఇంట్లోనే టైలరింగ్ చేస్తోంది. వీరి ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం కుమారుడు హరిబాబును తన ద్విచక్రవాహనంపై ఐడీపీఎల్‌లో దింపి మల్లేష్ సనత్‌నగర్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం మల్లేష్ భార్య స్వరూపతో ఫోన్లో మాట్లాడాడు. సాయంత్రం మరోమారు ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. రాత్రి 8గంటలకు మల్లేష్ ఇంటికి వెళ్లేసరికి ఇంటి తలుపులు మూసి బయట నుంచి గడియ పెట్టి ఉంది. మల్లేష్ తలుపులు తెరిచి లోపలికి వెళ్లేసరికి బెడ్రూమ్లో పడిఉన్న స్వరూప నోరు, కళ్లలో రక్తం కనిపించింది. ఆమె అప్పటికే మృతి చెంది ఉండగా తల పక్కనే టవల్ ఉంది. బంగారు పుస్తెలతాడుతో పాటు కాళ్ల పట్టగొలుసులు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి చూడగా బీరువా తలుపులు తెరిచి చూడగా.. 11 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి, రూ.50 వేల నగదు కనిపించలేదు. మల్లేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కొడుకే హత్య చేశాడా? స్వరూప కుమారుడు హరిబాబు(23)పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీడిమెట్ల సీఐ బాలరాజు ఇంటి వద్ద విచారించిన సమయంలో హరిబాబు జల్సాలకు అలవాటు పడి ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుసుకున్నారు. మృతురాలి కుమారుడు హరిబాబును సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చదవండి: మహమ్మారిని జయించిన ఆనందం.. అంతలోనే విషాదం -
హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఆటోలో వదిలేశారా?
సాక్షి, హైదరాబాద్ ( జీడిమెట్ల): కన్న తల్లికి పేగు బంధం బరువైందో.. లేక ఆడపిల్ల పుట్టిందని వద్దనుకుందో.. ఏమోకాని మూడు నెలల చిన్నారిని ఆగిఉన్న ఆటోలో వదిలి వెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌లోని న్యూఎల్బీనగర్కు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం డయల్ 100కు ఫోన్ చేసి ఆటోలో చిన్నారి ఎడుస్తోందని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, షీటీం బృందం ఆటోలో ఉన్న పాపను స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రుల కోసం ఆరా తీయగా ఫలితం లేకపోయింది. ఎవరూ పాప అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు చిన్నారిని అమీర్‌పేట్‌లోని శిశువిహార్‌కు తరలించారు. ( చదవండి: ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన భర్త ) -
రసాయన గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: దూలపల్లిలోని ఓ రసాయన గోదాంలో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్‌రావు, పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్, ప్రత్యక్షసాక్షులు తెలిపిన మేరకు.. నర్పత్రావు అనే వ్యక్తి దూలపల్లి పారిశ్రామికవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమల మధ్యలో సాల్వెంట్ గోదాం నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోదాంలో ముగ్గురు కార్మికులు రసాయనాలను మిక్సింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రసాయన చర్య జరిగి ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టాయి. దీంతో గోదాంలో ఉన్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. సుమీర్ అనే కార్మికునికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఐదు ఫైరింజన్లతో వచ్చిన సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. గోదాంను నిర్వహిస్తున్న వ్యక్తిపై పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సైదులు, జీడిమెట్ల ఫైర్ ఆఫీసర్ సుభాష్‌రెడ్డి, కూకట్పల్లి ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఉండి.. మంటలు అదుపులోకి వచ్చే వరకు పరిస్థితిని పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ.. కేవలం 250 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సదరు యజమాని గోదాంను నిర్వహిస్తున్నాడు. గోదాంలో దాదాపు 200 వరకు డ్రమ్ముల్లో రసాయనాలను నిల్వ ఉంచారు. దీంట్లో ఎక్కువగా మండే స్వభావం కలిగి ఉన్న రసాయనాలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. గోదాంకు ఆనుకుని ఉన్న 3 ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలలో ఉన్న కార్మికులు పరుగులు తీయడంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకోగలిగారు. ఒక్కో డ్రమ్ము పేలుతూ గాల్లోకి 20 మీటర్ల మేర ఎగిరి కింద పడ్డాయి. ( చదవండి: Solar Power: హైదరాబాద్ నగరంలో పవర్ హౌస్ ) -
వ్యాపారిని పిస్తోలుతో బెదిరించి
సాక్షి, హైదరాబాద్: పిస్తోలుతో బెదిరించి ఇద్దరు ఆగంతకులు ఓ మనీ ట్రాన్స్ఫర్ వ్యాపారి నుంచి రూ.1.95 లక్షలు దోచుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల మేరకు..కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన రవికుమార్ మూడు సంవత్సరాలుగా అయోధ్యనగర్ చౌరస్తాలో ‘లక్ష్మి మనీ ట్రాన్స్ఫర్’ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రవికుమార్ దుకాణం మూసేందుకు సిద్ధమై ఆరోజు వచ్చిన మొత్తం రూ.1.95 లక్షలు బ్యాగులో పెట్టుకున్నాడు. ఇంతలో షాపులోకి హెల్మెట్, మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు చొరబడి తుపాకీ చూపించి..అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. భయపడిన రవికుమార్ మాట్లాడకుండా ఉండిపోయాడు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు బ్యాగులో ఉన్న డబ్బును తీసుకుని ఉడాయించారు. దీంతో రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు సెల్‌ఫోన్ లభించింది. ఇద్దరు యువకులు నెంబర్ ప్లేట్‌లేని తెల్లరంగు హోండా యాక్టివాపై వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. పోలీసులు దొంగల వేలిముద్రలతో పాటు సీసీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇది తెలిసినవారి పనేనా? ఇది తెలిసిన వారి పనేనా..? లేక కొత్త వ్యక్తులు ఎవరైనా దొంగతనానికి పాల్పడ్డారా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో త్వరలోనే దొంగలను పట్టుకుంటామని సీఐ తెలిపారు. ( చదవండి: బావ గొంతుకోసిన బావమరిది: అందుకే చంపేశానంటూ ) -
మూడు వేర్వేరు ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు
-
నిర్లక్ష్యపు నడక, బైకర్ అతివేగం.. మీరు మారరా!
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. మద్యం సేవించి డ్రైవ్ చేయకండి అంటూ ట్రాఫిక్ అధికారులు ఎన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు, సూచనలు చేసినా పట్టించుకోని వారు కోకొల్లలు. ట్రాఫిక్ అధికారులు చెప్పేది మన ప్రాణాలు కాపాడటం కోసమే. కానీ మనం వినకుండా ఇదిగో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. ఓ వ్యక్తి ఏమరపాటుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ బైకు వేగంగా వస్తోంది. బైక్ సమీపించడంతో పాదచారి పరుగెత్తుకెళ్లాడు. దాంతో బైక్ అతన్ని ఢీకొట్టి ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి, బైకర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించకపోవండంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను హెల్మెట్ ధరించి ఉంటే ఇంత తీవ్రంగా గాయపడేవారు కాదంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పాదచారి నిర్లక్ష్యం, బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. బైక్ మీద వెళ్తోన్నప్పుడు హెల్మెట్ ధరిచండం ఎంత ముఖ్యమో.. ప్రయాణం చేసేటప్పుడు చుట్టు పక్కల గమనించడం కూడా అంతే ముఖ్యమని.. లేదంటే మీతో పాటు మీ కుటుంబాలు కూడా బాధపడతాయంటూ ట్రాఫిక్ పోలీసులు మరో సారి హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం జీడిమెట్ల చింతల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్ ‘అయ్యా నీకో దండం.. ఇది బైకా ఎడ్ల బండా? -
జీడిమెట్ల చింతల్లో రోడ్డు ప్రమాదం
-
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ కాలితే.. బీపీ పెరగడం ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు కాలిపోతే వినియోగదారుల నుంచే వాటి విలువను ఆరేళ్ల కింద ఉన్న అధిక ధరలతో వసూలు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయం తీసుకుంది. మీటర్ వ్యయాన్ని వినియోగదారుల నెలవారీ విద్యుత్ బిల్లులో కలిపి వసూలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.11,279 వ్యయాన్ని జీఎస్టీతో కలిపి వసూలు చేయాలని అన్ని సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. 4 రెట్లు అధిక వ్యయం గత కొంతకాలంగా బహిరంగ మార్కెట్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. 2017 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) నిర్వహించిన టెండర్లలో రూ.2,503కే సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్ విక్రయించడానికి ఐటీఐ లిమిటెడ్ అనే కంపెనీ ముందుకు వచ్చింది. అంతకుముందు టెండర్లలో రూ.2,722కే ఈ మీటర్‌ను విక్రయించడానికి ఎల్అండ్టీ సంస్థ బిడ్ దాఖలు చేసింది. దేశంలోని విద్యుత్ వినియోగదారులందరికీ దశలవారీగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగిపోయి ధరలు ఇంకా పతనం అవుతున్నాయి. మరోవైపు కాలిపోయిన మీటర్ల వ్యయాన్ని వినియోగదారుల నుంచి 6 ఏళ్ల కింద ఉన్న నాలుగైదు రెట్ల అధిక ధరలతో వసూలు చేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పరిశ్రమలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను టీఎస్ఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం దాదాపు 20 వేల మీటర్లను సింగిల్ ఫేజ్ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్ మీటర్‌కు రూ.11,279 చెల్లించి ఆరేళ్ల కింద టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. వీటిలో కొన్ని రిజర్వులో ఉన్నాయి. ఎక్కడైనా స్మార్ట్‌మీటర్ పాడైతే... గతంలో అధిక ధరలకు కొన్నవాటినే బిగి స్తున్నామని, సంస్థ నిబంధనల ప్రకారం ఈ ధరలనే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఓ అధికారి వివరించారు. కొత్తగా ప్రీపెయిడ్ మీటర్లు కొనుగోలు చేసే వరకు ఈ పాత ధరలే కొనసాగుతాయని పేర్కొంటున్నారు. ఈ అంశంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి వివరణ కోసం ‘సాక్షి’ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. -
ఆన్లైన్ క్లాస్.. బాలిక ఫోటోలతో బెదిరింపు
సాక్షి, మేడ్చల్ : ఆన్లైన్ విద్య కారణంగా పాఠశాల విద్యార్థులకు మొబైల్ ఫోన్స్ చేతికివ్వడంతో తీవ్ర అనార్థాలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో అపరిచితుల చేతికి చిక్కి అభాసుపాలవుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు వేధింపులకు దిగారు. ఫోటోలను మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరించే ఏకంగా నాలుగు లక్షల వసూలు చేశారు. స్థానిక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. తెలంగాణలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో జీడిమెట్లకు చెందిన ఓ బాలికకు కుటుంబసభ్యులు ఫోన్ కొనిచ్చారు. క్లాసుల అనంతరం బాలిక సోషల్ మీడియా సమయం గడపడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇస్టాగ్రామ్‌లో ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఆమెతో స్నేహం పెంచుకున్న యువకులు... చనువుగా మాట్లాడం ప్రారంభించారు. (యూపీలో సమాజం తలదించుకొనే చర్య) ఈ క్రమంలోనే బాలిక ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఇన్‌స్టాలోని ఫోటోలను మార్ఫింగ్ చేస్తామని బెదిరింపులకు దిగారు. తొలుత నాలుగు లక్షలు తీసుకున్నారు. మరికొంత డబ్బు కావాలంటూ ఈనెల 14న బాలిక ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు గమనించి వారిని ప్రశ్నించడంతో తెలివిగా స్టడీ మెటీరియల్ కోసం వచ్చామంటూ బుకాయించారు. అయితే ఇంట్లో డబ్బు మాయం కావడంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా అసలు నిజం బయటపెట్టింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ముగ్గురు యువకులు ఎలిశా, కిషోర్, రాంవికాస్‌ను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ క్లాసులు నేపథ్యంలో పిల్లలు సైబర్ క్రైమ్ నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం అనార్ధాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. -
కెమికల్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
పాతాళ గరళం
సాధారణంగా లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములు మించరాదు. కానీ పలు పారిశ్రామికవాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదైంది. ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలను నిర్మానుష్య ప్రదేశాల్లో, నాలాల్లో డంప్ చేస్తుంటారు. ఇవి నేరుగా భూమి పొరల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్/జీడిమెట్ల/సనత్‌నగర్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పాతాళగంగ భయంకరమైన కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పారిశ్రామికవాడల్లోని భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) తాజా నివేదిక నిగ్గుదేల్చింది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలను నాలాలు, చెరువులు, కుంటలు, బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా వదిలిపెడుతుండటం.. అవి భూమిలోకి ఇంకడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని అధ్యయనం తేల్చింది. ఈ నీళ్లు పశుపక్ష్యాదుల దాహార్తిని సైతం తీర్చలేవని, మొక్కలకు పట్టడానికి, బట్టలు ఉతకడానికి, పాత్రలు శుభ్రం చేయడానికి, స్నానానికి పనికిరావని స్పష్టం చేసింది. చుక్క నీరూ స్వచ్ఛం లేదు.. గతేడాది వర్షాకాలానికి ముందు (మే–2019), ఆ తరువాత (జనవరి–2020) సుమారు 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాల, చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షలు నిర్వహించింది. సాధారణంగా లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములు మించరాదు. కానీ పలు పారిశ్రామికవాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదైంది. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాలు సేకరించి.. పరీ క్షించగా వచ్చిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు నీటి నమూనాల్లో ఆర్సెనిక్, లెడ్ జింక్ తదితర భారలోహాల ఆనవాళ్లున్నట్టు పరీక్షల్లో తేలింది. ఎన్జీఆర్ఐ నివేదిక నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’బృందం ఆయా ప్రాంతాల్లోని భూగర్భజలాల నాణ్యత, ఆ నీటితో స్థానికులు పడుతున్న అవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సాక్షి విజిట్.. గతేడాది కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో బోర్లు వేయగా రసాయన జలాలతో కలుషిత నీళ్లు పడ్డాయి. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో వందలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతి 10 మీటర్లకు ఒక బోరు ఉంది. ప్రస్తుతం బోరు వేయాలంటే వెయ్యి నుంచి 1,600 అడుగుల లోతుకు వెళ్తేనే నీటి జాడ తెలుస్తోంది. ఒక్కో ప్లాట్‌లో రెండు మూడు బోర్లు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మోటారు వేయగానే ఎరుపు, పసుపు పచ్చని రంగులో నీళ్లొస్తున్నాయి. కొన్నిచోట్ల నీరు రంగు లేకున్నా.. వాసన ముక్కుపుటాలు అదరగొడుతోంది. ఈ నీటితో గిన్నెలు, వాహనాలు కడిగితే వాటిపై మరకలు, తుప్పు వస్తున్నాయి. జీడిమెట్ల: నీళ్లు తాగాలంటే హడలే జీడిమెట్లలో వందకుపైగా ఫార్మా, బల్క్‌డ్రగ్ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే వ్యర్థ రసాయన జలాలను 1983 నుంచి ఇప్పటివరకు ఖాళీ ప్రదేశాల్లో, ఓపెన్ నాలాల్లో గుట్టుచప్పుడు కాకుండా డంప్ చేస్తున్నారు. ఫలితంగా ఈ పారిశ్రామికవాడలోని భూగర్బ జలాలు విషతుల్యమయ్యాయి. బోర్లు తవ్వగా వచ్చిన నీరు దాదాపు రసాయనాలను పోలి ఉంటుంది. బోరు మోటార్ వేయగానే ఎరుపు, పసుపు పచ్చని రంగులో నీళ్లు ఎగదన్నుతాయి. దీంతో రోజూ ఇక్కడి ఒక్కో కుటుంబం.. కుటుంబసభ్యుల అవసరాలకు తగినట్టు నీటిని కొనాల్సిందే. 20 లీటర్ల డబ్బాకు రూ.30 నుంచి రూ.50 వరకు పెడుతున్నారు. దీంతో ప్రతి నెలా ఒక్కో కుటుంబం పాల బిల్లుతో సమానంగా నీటి బిల్లు చెల్లిస్తోంది. ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థ రసాయనాలను అర్ధరాత్రి దాటాక నిర్మానుష్య ప్రదేశాల్లో, నాలాల్లో, పరిశ్రమ లోపల పాడుబడిన బోరు బావుల్లో డంప్ చేస్తుంటారు. ఇవి నేరుగా భూమి పొరల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. జీడిమెట్లలో బోరు నుంచి వస్తున్న రసాయన జలం 30 ఏళ్లుగా విషాన్ని చూస్తున్నా.. 30 ఏళ్లుగా నేనిదే ప్రాంతంలో ఉంటున్నాను. రోజురోజుకూ భూగర్భ జలాలు విషపూరితమైపోతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రసాయనాలను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భావితరాలకు మంచినీరు దొరకడం కష్టమే. – శ్రీనివాస్, ఎస్ఆర్ నాయక్‌నగర్ సనత్‌నగర్: కలుషితంతో సతమతం దేశంలో తొలి పారిశ్రామికవాడగా పేరొందిన సనత్‌నగర్ పారిశ్రామికవాడలో ‘భూగర్భ జలం’హాలాహలమైంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను చెరువులు, కుంటలు, నాలాల్లోకి వదులుతుండటంతో వ్యర్థ రసాయన జలాలు భూగర్భంలోకి ఇంకి పాతాళగంగ కలుషితమైంది. జీడిమెట్ల, కూకట్పల్లి, ఫతేనగర్ పారిశ్రామికవాడల నుంచి వచ్చే విషజలాలు హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే నాలాలో కలుస్తుంటాయి. ఈ నాలా సనత్‌నగర్ పారిశ్రామికవాడను ఆనుకుని ఉండడంతో భూగర్భ జలం విషపూరితమవుతోంది. ఇక్కడ భూగర్భ జలం రంగు మారి వస్తుండడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి ఉంది. ఫిల్టర్ నీళ్లు కొంటున్నాం.. బోరు నీళ్లు రంగు మారి వస్తున్నాయి. తాగేందుకు ఫిల్టర్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తుంటాం. దీని ద్వారా మాకు అదనపు భారమే. ఒక్క జలమండలి నీరు మాత్రమే అయితే సరిపోవడం లేదు. – శివప్రసాద్, లోథా కాసాపారడిసో అపార్ట్మెంట్ -
శై'శవ' గీతం!
జీడిమెట్ల: బతికున్నంత కాలం మనిషిని డబ్బే నడిపిస్తుంది. చనిపోయినా అది లేకుంటే మృతదేహం కూడా ‘కదలదు’. ఆ డబ్బు లేక తమ కొడుకు మృతదేహాన్ని ఖననం చేయడానికి ఓ బెంగాలీ కుటుంబం నరకయాతన అనుభవించింది. ఓ వైపు శిశువు చనిపోయిన దుఃఖం... మరోవైపు మృతదేహాన్ని ఖననం కూడా చేయలేని అయోమయ పరిస్థితి. ఇదిగో పై చిత్రంలో చనిపోయిన బిడ్డను మోసుకుంటూ వస్తున్న ఇతని పేరు విప్లవ్. పశ్చిమ బెంగాల్ నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాడు. సోమాజీగూడలో ఉంటూ సెంట్రింగ్ పని చేసుకుంటున్నాడు. ఇతని నాలుగు నెలల బాబు తకోష్ న్యూమోనియాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అంత్యక్రియలు చేసే ఆర్థిక స్థోమత లేక కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో ఖననం చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కొందరు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. విప్లవ్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు బీరప్ప నగర్ శ్మశాన వాటికలో పూడ్చేందుకు తీసుకెళ్లారు. అది ఓ వర్గానికి చెందినది కావడంతో అక్కడ ఖననం చేసేందుకు వారు నిరాకరించారు. దీంతో పోలీసులు చెన్నప్ప, సుధాకర్ వారి ని భగత్‌సింగ్‌నగర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఖననం చేసేందుకు పోలీసులు రూ.1,500కు ఒప్పించారు. ఏ రోజు కూలీతో ఆ రోజు పొట్టపోసుకునే విప్లవ్ కుటుంబం ఆ మొత్తం చెల్లించి కొడుకు మృతదేహాన్ని ఖననం చేశారు. -
పచ్చని కుటుంబంలో చిచ్చు
సాక్షి, హైదరాబాద్: పచ్చని కుటుంబంలో ఊహించని ప్రమాదం పెను విషాదం రేపింది. గ్యాస్ సిలిండర్ మృత్యుపాశంగా మారి చిన్నారితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలంటుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా, మదిర గ్రామానికి చెందిన షేక్ సుభానీ(32), షేక్ షర్మిళ (25) దంపతులు హైదరాబాద్ నగరానికి వలస వచ్చి సూరారం హనుమాన్ నగర్లో నివాసముంటున్నారు. వీరికి షేక్ హైదర్ ఫిర్దోస్(3) కుమార్తె. ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 5న సాయంత్రం ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో సుభానీ సిలిండర్ మార్చాడు. 6వ తేదీ ఉదయం అతను సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు స్విచ్ ఆన్ చేశాడు. అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుభానీతో పాటు అతడి భార్య షర్మిళ, కుమార్తె ఫిర్దౌస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 12న సుభాని, షర్మిళ మృతి చెందగా, చిన్నారి ఫిర్దోస్ బుధవారం కన్నుమూసింది. -
జీడిమెట్ల పారిశ్రామికవాడలో పేలుడు!
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగింది. జీవిక లైఫ్ సైన్సెస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతులను అంబరీష్, అన్వర్ లుగా గుర్తించారు. రియాకర్ట్ పేలుడుతో స్థానికంగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతోపాటు సంఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగిశాయి. పేలుడు శబ్దం విని హడలిపోయిన స్థానికులు కాసేపు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. -
ఆర్టీసీ సమ్మె; నమ్మకద్రోహంపై మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ జన సమితి ఆందోళనకు దిగడంతో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వామపక్ష నేతలతో పాటు తెలంగాణ జన సమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. జీడిమెట్లలో వినూత్న నిరసన విధుల్లో చేరడానికి అంగీకరిస్తూ యాజమాన్యానికి లేఖలు ఇచ్చిన డ్రైవర్ మల్లిఖార్జున్, కండక్టర్ మల్లికపై సమ్మెలో ఉన్న కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా ఆకలి కేకలతో సమ్మె చేస్తుంటే నమ్మక ద్రోహానికి పాల్పడతారా అంటూ మండిపడ్డారు. వీరిద్దరి ఫొటోలతో ఫ్లెక్సీలు తయారు చేయించి చెప్పుల దండ వేసి జీడిమెట్ల బస్ డిపో ముందు నిరసన తెలిపారు. చెప్పులతో కొట్టి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఈ ఫ్లెక్సీని తొలగించారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయంలో కొంత మంది నమ్మకద్రోహం చేశారని కార్మికులు వాపోయారు. గుత్తాకు వినతిపత్రం కోదాడలో శానన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాన్వాయ్‌ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సంస్థను, కుటుంబాలను కాపాడుకోవడానికి కార్మికులు సంయమనం పాటించాలని కోరారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. మంత్రి ఇల్లు ముట్టడికి యత్నం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటి ముట్టడికి అఖిల పక్ష నాయకులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆర్టీసీ మహిళా కార్మికురాలు సొమ్మసిల్లి పడిపోయింది. అరెస్ట్ చేసిన ఆందోళనకారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్‌లో మానవహారం 34వ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద మానవ హారం చేపట్టారు. అంతకుముందు ధర్నా చౌక్ నుంచి కవిత కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ మీదుగా తిరిగి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీచేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. -
కాలువ కనుమరుగు!
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పరిధిలోని కోర్ కాలువ కనుమరుగైంది. కాలువపై ఆక్రమణలు వెలియడంతో వరద ఉప్పొంగుతోంది. కాలనీలను ముంచెత్తుతోంది. మరోవైపు డ్రైనేజీ బ్లాక్ అయి, ఎగువ కాలనీల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోనల్ స్థాయిలో అనుమతులు తీసుకొని కాలువను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టడంతో దాదాపు పది కాలనీల్లోని 15వేలకు పైగా జనం ఇబ్బందులు పడుతున్నారు. 9 ఆక్రమణలను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేయడానికి వెళ్లగా... గతంలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగంలో పని చేసిన ఓ ఉద్యోగి వారిని బెదిరింపులకు గురి చేయడంతో వెనుదిరిగారు. సదరు ఉద్యోగి సైతం కాలువపై ఆక్రమ నిర్మాణం చేపట్టడం గమనార్హం. ఇళ్లు ఖాళీ... ఉడ్స్ కాలనీ, యాదిరెడ్డి బండ, పేట్‌బషీరాబాద్, ఎన్సీఎల్ సౌత్, వైష్ణోవ్ ఎన్క్లేవ్, సెయింట్ ఆన్స్ స్కూల్, హర్షా ఆస్పత్రి, దాదాపు వందకు పైగా అపార్ట్మెంట్లకు సంబంధించిన డ్రైనేజీ పైపులైన్ వ్యవస్థ ఎన్సీఎల్ కాలనీ మీదుగా శ్రీనిధి ఎన్క్లేవ్ నుంచి అంగడిపేట, మీనాక్షి, వెన్నెలగడ్డ చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అయితే ఎన్సీఎల్ నుంచి అంగడిపేట వరకు కాలువపై ఆక్రమణలు వెలిశాయి. దీంతో వర్షం నీరు మొత్తం ఎన్సీఎల్ సౌత్ కాలనీని ముంచెత్తుతోంది. బాలాజీ ఆస్పత్రి నుంచి కిందకు వెళ్లే రెండో రోడ్డు కుడివైపు గల్లీలో సుమారు 16 ఇళ్లు ఉన్నాయి. వర్షం పడిన ప్రతిసారీ వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదకు తోడు డ్రైనేజీ ఇళ్లలోకి చేరుతోంది. దుర్వాసన, దోమలవ్యాప్తితో ప్లాట్ నంబర్ 64, 65, 66, 67, 68, 69, 52, 53 యజమానులు అన్నపూర్ణ, గాంధీబాబు, శ్రీహరిరాజు, రంజిత్‌సింగ్, అరవింద్‌గౌడ్, విజయవర్మ, లక్ష్మీదేవి, శ్రీనివాసులు ఏకంగా ఇళ్లు ఖాళీ చేసి అద్దె గదుల్లో ఉండడం గమనార్హం. వరదతో డ్రైనేజీ రోడ్లపైకి చేరడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో చాలామంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఆగస్టు 4న అప్పటి గ్రేటర్ కమిషనర్ దానకిషోర్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత పర్యటించారు. ఎన్సీఎల్ సౌత్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. కాలువపై ఆక్రమణలను తొలగించాలని స్థానిక ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో ఉపకమిషనర్ మంగతాయారు, ఈఈ కృష్ణచైతన్య, టౌన్‌ప్లానింగ్ అధికారి రాజ్‌కుమార్ ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లగా... ఆక్రమణదారులు వారినే బెదిరించారు. నోటీసులు లేకుండా ఎలా కూల్చివేస్తారని? ప్రశ్నించారు. అధికారులు ఓవైపు జేసీబీతో కాలువ మట్టిని తొలగించగా... మరోవైపు పూడ్చడంతో అప్పట్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని విజిలెన్స్ విభాగంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండతో... గతంలో అదే విభాగంలో పనిచేసిన ఓ ఉద్యోగి స్థానిక అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నాడు. మిగతా ఆక్రమణదారులు కూల్చివేతలకు అంగీకరించినా... ఇతడు మాత్రం అడ్డుకుంటున్నాడు. దీంతో దాదాపు 10 కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు మంజూరైనా.. వరద ఇబ్బందులపై స్థానికులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్ 2016లో కుత్బుల్లాపూర్‌లో పర్యటించారు. వెన్నెలగడ్డ ఎన్నాచెరువు ఎగువ, దిగువ ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా కోర్ కాలువను విస్తరించాలని ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు పనులు జరగలేదు సరికదా.. ఆక్రమణలు వెలిశాయి. ఉడ్స్ కాలనీ నుంచి యాదిరెడ్డి బండ మీదుగా బొల్లారం ఫారెస్ట్ నుంచి వర్షపు నీరు వెన్నెలగడ్డ ఎన్నా చెరువు వరకు చేరుకుంటుంది. అప్పట్లో కోర్ కాలువ ఉండడంతో ఈ వరద సాఫీగా వెళ్లేది. ప్రస్తుతం ఆక్రమణలు చోటుచేసుకోవడంతో వాటిని తొలగించి కోర్ కాలువను యథావిధిగా పునరుద్ధరించాలని ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. సుమారు 3 కిలోమీటర్ల మేర 3–5 మీటర్ల మేర వెడల్పుతో కోర్ కాలువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే నీటి పారుదల ప్రాజెక్ట్ అధికారులు నాలా సర్వే చేపట్టి చేతులు దులుపుకోవడంతో ఈ పనులు ముందుకుసాగడం లేదు. దీంతో మంజూరైన నిధులు కాస్త.. వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇదీ పరిస్థితి ♦ కోర్ కాలువ ఉడ్స్ కాలనీ, యాదిరెడ్డి బండ, పేట్‌బషీరాబాద్, ఎన్సీఎల్ కాలనీ మీదుగా శ్రీనిధి ఎన్క్లేవ్ నుంచి అంగడిపేట, మీనాక్షి, వెన్నెలగడ్డ ఎన్నా చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ♦ ఎన్సీఎల్ నుంచి అంగడిపేట వరకు కాలువపై 9 ఆక్రమ నిర్మాణాలు వెలిశాయి. ♦ ఫలితంగా ఎన్సీఎల్ సౌత్ కాలనీని వరద ముంచెత్తుతోంది. మరోవైపు డ్రైనేజీ బ్లాక్ అవ్వడంతో ఎగువ కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ♦ తరచూ వరద, డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతుండడంతో ఎన్సీఎల్ సౌత్ కాలనీ ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ♦ 2016లో మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించి కోర్ కాలువను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టులో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పర్యటించి కాలువపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ♦ అయితే ఆక్రమణల కూల్చివేతలను ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగి అడ్డుకుంటున్నాడు. సదరు ఉద్యోగి సైతం కాలువపై ఓ అక్రమ నిర్మాణం చేపట్టడం గమనార్హం. -
వివాహిత ఊహాశ్రీ అదృశ్యంపై పలు అనుమానాలు
సాక్షి, బొమ్మలసత్రం(కర్నూలు) : నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన వివాహిత ఊహాశ్రీ హైదరాబాద్‌లో కనిపించకపోవటంతో తల్లిదండ్రుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భర్త బంధువుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదైనప్పటికీ నేటికీ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు తన కుమార్తెను కిడ్నాప్ చేసి ఉండవచ్చని తండ్రి నాగరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఎస్బీఐ కాలనీకి చెందిన నాగరాజు, అరుణ దంపతుల కుమార్తె ఊహాశ్రీని హైదారాబాద్‌లోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన నాగరాజు, శాంతమ్మ దంపతుల కుమారుడు మురళితో రెండేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే మురళి ఉద్యోగరీత్యా ఖడ్తర్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఊహాశ్రీ అత్తమామల వద్దే ఉంటుండగా ఆరోగ్యం సరిగా లేక అత్త కొంత కాలం క్రితం చికిత్స నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. మామ నాగరాజుతో కలిసి ఊహశ్రీ ఇంట్లోనే ఉంటోంది. గత నెల జూలై 5న మామ నాగరాజు ఉద్యోగరీత్య విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాగా ఊహాశ్రీ కనిపించలేదు. సమీప బంధువులను విచారించినా ప్రయోజనం లేకపోవడంతో జీడిమెట్ల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఊహాశ్రీ కోసం తెలంగాణ పోలీసులు ఎంత గాలించినా ఫలింతం లేకపోవటంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. గత నెల 9న ఒంగోలులో ఓ వ్యక్తితో ఊహాశ్రీ కనిపించినట్లు తల్లిందండ్రులు, పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో కలిసి తల్లిదండ్రులు ఒంగోలు, చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు తమ కుమార్తె జాడ తెలియకపోవటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
హైదరాబాద్ జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం..!
సాక్షి, హైదరాబాద్: బీ-ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసు నుంచి తెరుకొనేలోపే నగరంలోని జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. అయితే కిడ్నాపర్లు దివ్యను ఒంగోలులో విడిచి పెట్టడంతో పోలీసులు దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గత వారం సోనీ కిడ్నాప్.. రెండు రోజులకు ముందు వ్యాపారవేత్త గజేందర్ కిడ్నాప్, రెండు గంటల్లో విడుదల.. ఇలా నగరంలో ఏదో ఓ చోట కిడ్నాప్ కేసులు నమోదవుతూ తీవ్ర ఉత్కంఠకు తెర లేపుతున్నాయి. హయత్ నగర్ యువతి కిడ్నాప్ తరహాలోనే జీడీమెట్లలో దివ్యని కిడ్నాప్ చేసి ఒంగోలులో విడిచిపెట్టారు. యువతి అపహరణకు గురైనప్పటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. అయితే హయత్ నగర్ కిడ్నాపర్ రవి శేఖర్‌కు, జీడిమెట్ల దివ్య కిడ్నాప్ కేసుకు లింక్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు కిడ్నాప్‌లు రవి శేఖర్ చేశాడా? అన్నకోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
జీడిమెట్ల పారిశ్రమిక వాడలొ అగ్ని ప్రమాదం
-
చిన్నారిపై టీచర్ అమానుషం
హైదరాబాద్, జీడిమెట్ల: ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. బోర్డు వైపు చూడడంలేదన్న కారణంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయురాలు చేయిచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన మేరకు.. చింతల్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి కుమారుడు రత్నవర్దన్‌రెడ్డి(6) ఏన్‌ఆర్‌ఐ టాలెంట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. గురువారం రత్నవర్ధన్ బోర్డు వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాడన్న నెపంతో టీచర్ సునీత రత్నవర్దన్ చేతులపై కొట్టింది. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన తల్లి చూసేసరికి విద్యార్థి చేతులపై వాతలు ఉన్నాయి. టీచర్ సునీతను అడగగా క్లాసులో బోర్డు వైపు చూడటంలేదని సమాధానం చెప్పింది. దీంతో విషయంపై బాలుడి తండ్రి ప్రశాంత్ రెడ్డి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీచర్‌పైవెంటనే చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
యాసిడ్ దాడి కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల యాసిడ్ దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కుటంబ కలహాల కారణంగానే యాసిడ్ దాడి జరిగినట్లు తేల్చారు. బాధితురాలి దగ్గరి బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 12 గంటల్లో యాసిడ్ దాడి కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. భాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పరిధి చింతల్లో ఉన్న సిద్ధార్థ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోన్న సూర్యకుమారిపై గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా యాసిడ్ దాడి జరిగింది. విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని కూకట్‌పల్లిలోని రెమెడీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నారు. సూర్య కుమారి అక్క కుమారుడే ఈ దాడి చేసినట్లు సమాచారం. -
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం
-
జీడిమెట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో టీఎస్ఐఐసీ కాలనీ వద్ద జరిగింది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఘటన స్థలంలోని మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతిచెందిన యువకులు సురారం సాయిబాబా నగర్‌కి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బైక్‌ను ఢీ కొట్టిన వాహనం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం యజమానిని కోల్పోయింది. ఈ ఘటన దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. వీరంకి రమేష్(50) బహదూర్ పల్లి గ్రామం స్వస్థలం. ఆయన వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం తన ఇద్దరు పిల్లలు సంజన(14),దేవదాస్(13)లను స్కూల్లో దింపేందుందకకు బైక్‌పై జీడిమెట్ల వైపు వెళ్తున్నాడు. అతను ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన టాటా మోటార్ వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రమేష్ తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. దేవదాస్‌కు స్పల్ప గాయలయ్యాయి. కూతురు సంజనకు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. చికిత్స నిమిత్తం అతడిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తాగిన మైకంలో నాలాలోకి దిగి... కొట్టుకుపోయి..
హైదరాబాద్: తాగిన మైకంలో నాలాలోకి దిగి, నీటి ఉధృతికి ఓ యువకుడు కొట్టుకుపోయిన సంఘటన హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ వర్షం కురిసింది. అదే సమయంలో ఓ నల్ల చొక్కా వేసుకున్న యువకుడు చింతల్ మధుసూదన్‌రెడ్డి నగర్ నాలాలోకి దిగాడు. ఒక్కసారిగా నాలాలోని నీటి ఉధృతి పెరగడంతో కొద్దిసేపు సిమెంట్ దిమ్మెను పట్టుకుని నిల్చున్నాడు. ఇది గమనించిన స్థానికులు గుంపులుగా అక్కడకు చేరుకుని, యువకుడిని రక్షించేందుకు నీటిలోకి తాడును విసిరారు. యువకుడు తాడును గట్టిగా పట్టుకోవడంతో నెమ్మదిగా లాగడం ప్రారంభించారు. ఇక బయటికి వచ్చినట్లే అనుకుంటుండగా తాడు యువకుడి చేజారింది. దీంతో ప్రవాహ ఉధృతిలో అతను కొట్టుకుపోయాడు. అంత మంది ఉండి.. కళ్ల ముందే ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోతుండటంతో కాపాడేందుకు కొందరు స్థానికులు నాలా వెంట పరుగు తీశారు. నాలాలో నీరు ఎక్కువగా వస్తుండటంతో యువకుడు కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై వీరబాబు ఇతర పోలీసులతో వెంటనే రంగంలోకి దిగారు. ద్వారకానగర్ నాలా వద్ద చెత్త తట్టుకుని ఉండటంతో జేసీబీతో తొలగించారు. ప్రవాహ వేగానికి అక్కడికి కొట్టుకుని వస్తాడని భావించినా, యువకుడి ఆచూకీ లభ్యంకాలేదు. కాగా తాగిన మైకంలోనే యువకుడు నాలాలోకి దిగాడని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ యువకుడు ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు. -
సౌమ్య కేసులో మరో కోణం.. !
సాక్షి, హైదరాబాద్: సౌమ్య హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. సౌమ్యకు రెండేళ్ల క్రితమే వివాహమైందని... విడాకులు కూడా తీసుకుందని బంధువులు చెప్తున్నారు. ఇంటర్లో ఉన్న సమయంలోనే సౌమ్యకు పెళ్లి చేశారని, అయితే, ఆ పెళ్లి నచ్చకపోవడంతో ఆమె అత్తింటికి వెళ్లలేదని, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారని బంధువులు వివరించారు. కృష్ణయ్యకు సౌమ్యకు మరదలు అవుతుందని, వీరి మధ్య ఎలా అనుబంధం ఏర్పడిందన్న విషయం తెలియదని, అతను ఎందుకు హత్య చేశాడో తెలియదని చెప్పారు. సౌమ్య హత్యతో ఆమె కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సౌమ్య మృతదేహాన్ని వెలికితీసిన ఐడీఎల్ చెరువు వద్ద సౌమ్య తల్లి, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలిచివేసింది. తమ బిడ్డను కృష్ణయ్య అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడని ఆమె కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. -
సౌమ్య కేసులో మరో కోణం.. !
-
అందుకే సౌమ్యను చంపేశా: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థిని సౌమ్యను హత్య చేసిన ఆమె బావ కృష్ణయ్య ఎట్టకేలకు నోరు విప్పినట్టు సమాచారం. సౌమ్యను తానే హత్య చేసినట్టు కృష్ణయ్య అంగీకరించాడు. ఆమెను తాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆమె ఇతరులతో చనువుగా ఉండటం నచ్చలేదని, అందుకే సౌమ్యను చంపేశానని కృష్ణయ్య పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. సౌమ్యకు కృష్ణయ్య వరుసకు బావ అవుతాడు. సౌమ్యను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని గతంలో కుటుంబసభ్యులు భావించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, సౌమ్యతో కృష్ణయ్య వివాహ నిశ్చితార్థం అయినట్టు కథనాలు వచ్చాయి. ఈ కథనాలను పోలీసులు తోసిపుచ్చారు. సౌమ్యతో కృష్ణయ్యకు నిశ్చితార్థం కాలేదని, కానీ వరుసకు బంధువులు కావడంతో వీరు సన్నిహితంగా ఉండేవారని పోలీసులు తెలిపారు. ఇటీవల సౌమ్య ఇతరులతో చనువుగా ఉండటం కృష్ణయ్యలో అనుమానం పెంచిందని పోలీసులు అంటున్నారు. సౌమ్యనే పెళ్లి చేసుకోవాలనుకున్న కృష్ణయ్య.. ఆమె ఇతరులతో చనువుగా ఉండటం సహించలేకనే.. ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు -
మరొకరితో చనువుగా ఉంటుందని చంపేశాడు
-
మాట్లాడాలని పిలిచి చంపేశాడు!
విద్యార్థిని దారుణ హత్య సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో డిగ్రీ ఫస్టియర్ విద్యార్ధిని దారుణ హత్యకు గురైంది. 19 ఏళ్ల విద్యార్ధిని సౌమ్యను కృష్ణయ్య అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో పడేసిన కృష్ణయ్య అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సౌమ్యకు బావ వరుస అయ్యే కృష్ణయ్య.. బోరబండ పర్వతనగర్‌లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికి పెళ్లి చేయాలని గతంలో కుటుంబసభ్యులు నిర్ణయించారు. సౌమ్య చింతల్లోనే ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో.. సౌమ్య మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని కృష్ణయ్య జీర్ణించుకోలేకపోయాడు. మాట్లాడాలంటూ శుక్రవారం ఉదయం ఆ అమ్మాయిని హెచ్ఎంటీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశానికి రమ్మన్నాడు. మాట్లాడుతుండగా మాటామాట పెరిగి కోపంతో కొట్టడంతో.. సౌమ్య అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని సంచిలో కట్టుకుని తన వాహనంలో తీసుకువచ్చి కూకట్పల్లి ఐడిఎల్ చెరువులో పడవేశాడు. అనంతరం పర్వత్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లి సాయంత్రం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా, కాలేజీకి వెళ్లిన సౌమ్య సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు జీడిమెట్ల పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కృష్ణయ్య లొంగిపోవడంతో సౌమ్య హత్య గురించి వెలుగులోకి వచ్చింది. అనుమానంతోనే.. సౌమ్య ప్రవర్తనపై అనుమానంతో హత్య చేసినట్టు నిందితుడు కృష్ణయ్య ఒప్పుకున్నట్టు ఏసీపీ గోవర్ధన్ తెలిపారు. సౌమ్య ఛాతిపై బలంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. నిన్న ఉదయం తొమ్మిదున్నర... 10గంటల మధ్యలో హత్య జరిగినట్టు గుర్తించామన్నారు. నిందితుడిని కూకట్పల్లి పోలీసులు.. జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. జీడిమెట్ల పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మొన్న మియాపూర్‌లో ఇంటర్ విద్యార్థిని హత్య నేపథ్యంలో తాజాగా విద్యార్థిని సౌమ్య హత్య నగరంలో కలకలం రేపుతోంది. -
రియాక్టర్ పేలి ఒకరి మృతి
హైదరాబాద్: ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఓ కార్మకుడు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ రియాక్టర్ పేలడంతో అప్పల నాయుడు(35) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా.. జగదీశ్వర్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ అంశంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి యత్నిస్తున్నారు. -
కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..
హైదరాబాద్: కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబ నగర్‌కు చెందిన ప్రీతి(17) చింతల్‌లోని ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 20న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గంపల బస్తీ కెమికల్ గోదాములో మంటలు
-
కొడుకుపై తల్లి రాక్షసత్వం
-
కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి..
జీడిమెట్ల(హైదరాబాద్): ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..గాజులరామారం డివిజన్ హెచ్ఏఎల్ కాలనీకి చెందిన రాములు కుమార్తె మౌనిక(19) చింతల్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. శనివారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన వెళ్లిన మౌనిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల స్నేహితుల ఇళ్ల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రైనేజీలో పడి ఇద్దరు కార్మికులు మృతి
కుత్బుల్లాపూర్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. ఎక్సెల్ ఓవెన్ శాక్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో డ్రైనేజీ సంప్‌లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు బెంగాల్ కు చెందిన అజయ్‌సింగ్(23), విజయ్‌సింగ్(30)లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
15రోజులకే నిండిన నూరెళ్లు..
జీడిమెట్ల(హైదరాబాద్‌సిటీ): తల్లి ఒడిలో జోలపాటలతో హాయిగా నిదురించవలసిన ఆ పసికందు మృతదేహమై నాలాలో పడిఉంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వివరాలు..షాపూర్‌నగర్ రైతు బజారు వద్ద గురువారం ఉదయం హమాలీ పని చేయడానికి వచ్చిన కూలీ మేషయ్య నాలాలో పడిఉన్న పసికందు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పసిపాప కు 15 రోజుల వయసు ఉంటుందని మేషయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో గడిచిన పదిహేను రోజుల్లో ఎవరెవరు ప్రసవించారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. -
డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 40 వేల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఆదివారం రంగంలోకి దిగిన పోలీసులు రత్నగిరి, కిషోర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. -
మహిళపై యాసిడ్ దాడి
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. కుత్బుల్లాపూర్ శివాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నడిచి వెళ్తున్న అయోధ్యనగర్‌కు చెందిన రాజేశ్వరి(30)పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కేకలు వేయటంతో దుండగుడు పారిపోయాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
జీడిమెట్లలో ఓ దొంగలకు దేహశుధ్ది
-
ఆటో ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పరిధిలోని అపురూప కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలపాలైన చిన్నారి తనూశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. తనూశ్రీ తండ్రి పేరు అచ్యుతరావు. సొంతూరు శ్రీకాకుళం జిల్లా. స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గొంతులో రొట్టె ఇరుక్కుని బాలుడి మృతి
జీడిమెట్ల: రొట్టె ముక్క గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సుమన్ కథనం ప్రకారం... కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన సిద్దిరాములు ఆటో డ్రైవర్. ఇతనికి సంజయ్ (3) ఏకైక కుమారుడు. మంగళవారం రాత్రి 8 గంటలకు సంజయ్‌కు రొట్టె తినిపిస్తుండగా గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక ఇబ్బందిపడుతున్న కుమారుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తమ గారాలపట్టి తమ కళ్లెదుటే కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి సంజయ్ మృతి కుత్బుల్లాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బీ కేర్‌ఫుల్.. బ్రదరూ..
చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు సెల్ఫీకి రెడీ అంటున్నారు నేటి యువత. అది ఎంత ప్రమాదకరమైన ప్రాంతమైన కేర్లెస్గా ఉంటున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. ఇటీవల కురిసిన వర్షాలతో జీడిమెట్ల ఫాక్‌సాగర్ చెరువు జల కళతో తోణికిసలాడుతోంది. దీంతో ఆ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. తూము ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కొందరు ప్రమాదభరితంగా సెల్ఫీలు దిగుతున్నారు. ఏమాత్రం పట్టుతప్పినా అదే ఆఖరు సెల్ఫీ అవుతుందని మరిచి ఇలా చేస్తున్నారు. మంగళవారం చెరువు తూముపై ప్రమాదకరంగా నిలబడి ఫొటోలు దిగుతున్న కొందరు యువకులు ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. – ఫొటోలు: దశరథ్ రజువా -
విషవాయువు విడుదల డ్రైనేజీలో మంటలు
-
బైక్‌ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి
జీడిమెట్ల: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగిని మృతి చెందింది. జీడిమెట్ల ఎస్సై సైదిరెడ్డి కథనం ప్రకారం.. జీడిమెట్ల విలేజ్‌కు చెందిన వెంకటేశ్వరరాజు కుమార్తె తంగెళ్ల సంధ్యారాణి(25) గ్లోబల్ లాజిక్ సంస్థలో ఉద్యోగి. శనివారం మధ్యాహ్నం ఆమె షాపూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై జీడిమెట్ల పేజ్–1 పైపులైన్ రోడ్డు మీదుగా ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ( నెంబర్: ఏపీ 09 ఎక్స్ 5935) ఢీకొట్టింది. కిందపడిపోయిన సంధ్యారాణి తలపై నుంచి లారీ ముందు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిమెట్లలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గంపలబస్తీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానిక గల కారణాలు తెలియాల్సిఉంది. -
ఆంధ్రాబ్యాంకు దొంగల అరెస్ట్
హైదరాబాద్: జీడిమెట్ల ఆంధ్రాబ్యాంకులో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఆంధ్రాబ్యాంకులో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. బ్యాంకుకు సమీపంలోనే నివాసముంటున్న తమసయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ బ్యాంకులో లైటు వెలుగుతుండటం గమనించాడు. బ్యాంకు దగ్గరికి వెళ్లి చూడగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. బయటి వ్యక్తులు తమను గమనించారని తెలుసుకున్న దొంగలు పరారయ్యారు. ఇందులో ఓ వ్యక్తిని పోలీసుల సహాయంతో ఆర్టీసీ డ్రైవర్ తమసయ్య పట్టుకున్నారు. తర్వాత పరారైన వ్యక్తిని పట్టుబడిన వ్యక్తి సహాయంతో అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను నిజామాబాద్ జిల్లాకు చెందిన తుడుం స్వామి(25), సడుగు నవీన్(21)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూలు బస్సు కిందపడి చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్లలోని సాయిసుధా స్కూల్ బస్సు కింద పడి జశ్వంత్(4) అనే చిన్నారి మృతి చెందాడు. జశ్వంత్ అదే స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. బస్సును రివర్స్ తీసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాన్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శ్రీవేంకటేశ్వర సహకార సొసైటీ పరిధిలో ఉన్న ఒక ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 9 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పరిశ్రమలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ప్లాస్టిక్ కవర్లో మృతదేహం
హైదరాబాద్ : జీడిమెట్లలోని ఓ నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెత్తాచెదారంలో పడేసి ఉన్న పురుషుడి మృతదేహం (సుమారు 55 సంవత్సరాలు) గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై అఘాయిత్యం
జీడిమెట్ల : పాఠశాల విద్యార్ధినిపై డిగ్రీ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. రంగారెడ్డి నగర్ డివిజన్ విజయ నగర్ కాలనీకి చెందిన బాలిక(14) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా శనివారం బాలిక స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంది. అదే కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి రమేష్ ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. -
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన జీడిమెట్లలో మంగళవారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లి పారిశ్రామిక వాడలోని కెమికల్ గోదాము వద్ద.. లారీ నుంచి కెమికల్ తీస్తుండగా.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో.. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. -
హత్యకేసులో నిందితుడి అరెస్ట్
కుత్బుల్లాపూర్: మహిళ హత్య కేసు మిస్టరీని జీడిమెట్ల పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఛేదించారు. పాత నేరస్తుడే బంగారు ఆభరణాల కోసం మహిళను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. చెరుకుపల్లి కాలనీకి చెందిన మహ్మద్ షమీర్ (32)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతనిపై జీడిమెట్ల పీఎస్‌తో పాటు పలు పోలీస్స్టేషన్లలో 11 పైగా దొంగతనాలు, దోపిడీ కేసులున్నాయి. మద్యానికి బానిసైన షమీర్ అప్పులు చేశాడు. ఈ నెల 5వ తేదీన బాకీ తీరుస్తానని హామీ ఇచ్చాడు. ఇదే క్రమంలోనే 2వ తేదీన ప్రతిరోజూ కల్లు దుకాణానికి వచ్చే చాకలి పోచమ్మపై అతని కన్ను పడింది. ఆమె కడియాలు, చెవిదిద్దులను కాజేయాలని పథకం పన్నాడు. ఈమేరకు హెచ్ఎంటీ ఖాళీ ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లి ఆమెతో మద్యం తాగించాడు. సృహ కోల్పోయిన పోచమ్మ తలపై బండరాయితో మోది చంపి రూ. 25 వేలు విలువ చేసే 60 తులాల వెండి, 3 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో పోచమ్మతో పాటు షమీర్ వెళ్తున్న దృశ్యాలను గుర్తించిన పోలీసులు పాత నేరస్థుడిగా నిర్ధారించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. -
జీడిమెట్లలో మహిళ దారుణ హత్య
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హెచ్ఎంటీ సమీపంలో గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని దుండగులు మహిళ(45)ను బండరాయితో కొట్టి చంపినట్లుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
చిన్నారి కిడ్నాప్‌కు విఫలయత్నం
హైదరాబాద్ : పాఠశాల ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేయడానికి యత్నించిన యువకుడిని గుర్తించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక పాఠశాల ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఓ యువకుడు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక కేకలు వేసింది. బాలిక కేకలు విన్న స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. -
జీడిమెట్లలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల ప్రాంతంలోని సోనాలి పరిశ్రమలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భారీగా ఎగిసి పడటంతో భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ... భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. -
ప్లాస్టిక్ కంపెనీ యజమాని ఆత్మహత్య
జీడిమెట్ల: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సుబాష్‌నగర్‌లో సుమన్ ప్లాస్టిక్ కంపెనీ యజమాని మలారం చౌదరి(45) గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాశాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందిన విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాక్టరీలో విషవాయువులు: ఒకరి మృతి
హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో వెలువడిన విషవాయువులు ఒకరి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్థానికంగా ఉండే వసంత కెమికల్స్ లో బుధవారం రాత్రి విషవాయువులు వెలువడ్డాయి. ఈ క్రమంలో కంపెనీలో రెండో షిప్టులో పనిచేస్తున్న నర్సింగరావు(39) విషవాయువులు పీల్చడంతో అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా అతనిని గాంధీ ఆసుపత్రికి తరిలించింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సింగరావు మృతిచెందాడు. దీంతో మృతుడి బంధువులు యాజమాన్యాన్ని వివరణ కోరగా వారు చర్చలు జరుపుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సరిగా స్పందించడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన ట్యాంకర్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ ముందు ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని బుధవారం రాత్రి ఓ కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయిల్ ట్యాంకర్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షాపూర్లో అకౌంటెంట్‌పై కాల్పులు
-
షాపూర్లో అకౌంటెంట్‌పై కాల్పులు
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాపూర్లో మంగళవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. రఘుశర్మ(56) అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి అనంతనం కాల్పులు జరిపారు. వివరాలు..రఘు శర్మ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని షాపూర్‌లోని ఉషోదయ టవర్స్‌లో ఉన్న తనఫ్లాట్కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు రఘు తలపై రాడ్‌తో బలంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న మరో వ్యక్తి ప్రతిఘటించడంతో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు నుంచి రఘు తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దుండగులు రఘు చేతిలో ఉన్న బ్యాగు తీసుకుని పరారయ్యారు. బ్యాగులో టిఫిన్ బాక్సు తప్పితే ఏమీలేదని బాధితుడు తెలిపాడు. బాధితుడ్ని షాపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలం నుంచి ఓ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
జీడిమెట్ల (హైదరాబాద్) : ఒకే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్‌లో ఉన్న సాయిలత పాఠశాలలో ఆరో తరగతి చదివే ప్రసాద్, ప్రదీప్, సిద్ధు అనే ముగ్గురు విద్యార్థులు 4వ తేదీ పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రమాదవశాత్తూ కార్మికుడి మృతి
హైదరాబాద్ సిటీ: జీడిమెట్లలోని శ్రీపతి ఫార్మా కంపెనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదవశాత్తూ సునీల్ కుమార్ (24) అనే కార్మికుడు ఒకటో అంతస్తు మీది నుంచి కింద పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు, తోటి కార్మికుల ఆందోళనతో బాధిత కుటుంబానికి యాజమాన్యం రూ.7 లక్షల నష్ట పరిహారం చెల్లించింది. బిహార్‌కు చెందిన సునీల్ ప్రస్తుతం రామిరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
హైదరాబాద్ : గుర్తుతెలియని వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసి పొదల్లో పారేసిన సంఘటన హైదరాబాద్ జీడిమెట్ల హెచ్ఎంటీ కాలనీలో గల నిర్జన ప్రదేశంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గమనించిన స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. హత్యకు పాల్పడిన దుండగులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నారని సమాచారం. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగనట్లుగా తెలుస్తోంది. -
నకిలీ డ్రగ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
హైదరాబాద్ (జీడిమెట్ల) : హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌నంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జీడిమెట్ల ప్రాంతంలో మందుల షాపుల యాజమానులను మామూళ్లు ఇవ్వాలని వేధించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నకిలీ డ్రగ్ ఇన్స్పెక్టర్ బాగోతం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పనిచేస్తున్న కంపెనీకే కన్నం
జీడిమెట్ల (హైదరాబాద్) : ఒకరు కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి, మరొకరు అదే కంపెనీలో పని చేసి మానేసిన వ్యక్తి. ఇద్దరూ కలసి ఓ రాత్రి వేళ కంపెనీలోకి చొరబడి రూ.7 లక్షల విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్-3లో ఉన్న ఆక్వాగార్డు కంపెనీలో కొన్ని రోజుల క్రితం చోరీ జరిగింది. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు రాజ్‌కుమార్ ప్రసాద్ సింగ్ (19)తో పాటు ఆ కంపెనీ మాజీ కార్మికుడు రాజేష్ (23)లను మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువైన డ్రిప్ ఇరిగేషన్ పరికాలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు పంపారు. -
బంగారు తాళి తెంపుకెళ్లారు
హైదారాబాద్: పట్టపగలే స్నాచర్లు తెగబడ్డారు.. ఆరు బయట కూర్చున్న మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోయారు... ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం ఎస్సై రామకృష్ణ వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ డివిజన్ ఎల్‌బినగర్‌కు చెందిన రామకృష్ణ భార్య శ్రీలక్ష్మి(40) బుధవారం సాయంత్రం కరెంట్ లేకపోవడంతో ఉక్కపోత భరించలేక ఆరు బయటకూర్చుంది. అదే సమయంలో నడుచుకుంటూ వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. షాక్‌లోంచి తెరుకున్న ఆమె వారి వెంట పరుగు తీసింది. అప్పటికే ద్విచక్ర వాహనంపై సిద్దంగా మరో వ్యక్తి ఉండగా ముగ్గురు కలిసి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిమెట్లలో స్వల్ప అగ్నిప్రమాదం
జీడిమెట్ల (హైదరాబాద్) : హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో గురువారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని ఒక రసాయనాల పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం..
-
వృద్ధుడి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన ఘటన నగరంలోని గాజుల రామారం ప్రాంతంలో జరిగింది. విశాఖపట్టణానికి చెందిన సత్యం (65) గాజుల రామారంలో ఉండే తన కుమారుడు నాయుడు దగ్గరకు 20 రోజుల క్రితం వచ్చాడు. అయితే, సోమవారం ఉదయం సత్యం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకగా గాజులరామారంలోని ఓ క్వారీ గుంతలో శవమై కనిపించాడు. పని కోసం వచ్చి క్వారీలో పడి మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (జీడిమెట్ల) -
కూలిన సినిమా హాల్ పైకప్పు
జీడిమెట్ల: సినిమా థియేటర్లో సీలింగ్ పై కప్పుకు మరమ్మతు చేస్తూ ఓ యువకుడు కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. సినిమా చూస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. జీడిమెట్ల ఎస్సై వెంకటరాజ గౌడ్ కథనం ప్రకారం... మెదక్ జిల్లా ఎన్సాన్పల్లికి చెందిన కరుణాకర్‌రెడ్డి(23) షాపూర్‌నగర్‌లో ఉంటూ రంగ థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం మార్నింగ్ షో ప్రారంభమైంది. తరచూ వర్షపు నీరు థియేటర్ పై నుంచి చుక్కలు చుక్కులుగా రూ.20ల టికెట్ ప్రాంతంలోని సీట్లపై పడుతోంది. ఈ విషయంపై ప్రేక్షకుల నుంచి ఫిర్యాదు అందండంతో ఆపరేటర్ కరుణాకర్‌రెడ్డి సీలింగ్ పైకి ఎక్కి మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా పై నుంచి పట్టుతప్పి థియేటర్ లోపల పడ్డాడు. అదే సమయంలో సీలింగ్ అట్టలు కూలి సినిమా చూస్తున్న రోడామిస్త్రీనగర్కు చెందిన మహ్మద్ ఇతియాస్(15), శ్రీనివాస్(23), బహదూర్‌పల్లి శివరాం(25), రంగారెడ్డినగర్‌కు చెందిన సత్యనారాయణ (31)లకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కరుణాకర్ రెడ్డిని షాపూర్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడిని నుంచి నగరంలో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రటి మంటలు.. నల్లటి పొగలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఆదివారం ఉదయుం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్ల ఫేజ్-1లో పద్మావతి కెమికల్స్ పేరుతో డీఆర్ జైన్ సాల్వెంట్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఉదయం 9 గంటల సమయం లో కంపెనీ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు దట్టమైన పొగలు కమ్ముకుని, మంటలతో కెమికల్ సాల్వెంట్ డబ్బాలు గాల్లో ఎగిరి పడుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కంపెనీలో టౌలిన్, ఇథైల్ ఎసిటేట్, ఐటిఏ, ఎనెగ్జిన్ వంటి రసాయనాలతో కూడిన డ్రమ్ములు ఉండగా ఇందులో ఎనెగ్జిన్, టౌలిన్ పెట్రోలియాన్ని తలపించేలా ఉంటాయి. శనివారం రాత్రే టౌలిన్ తీసుకువచ్చి డ్రమ్ముల్లో డంప్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగగా ఈ డ్రమ్ములు గాల్లో ఎగురుతూ భయాన్ని రేకెత్తించాయి. ఈ ఘటనతో పక్కనే ఉన్న సూర్య ఇండస్ట్రీ ఎక్విప్మెంట్, సిమ్‌టెక్ కంపెనీల కార్మికులు పరుగులు తీశారు. ఈ రెండు కంపెనీలకూ మం టలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ ప్రమాదాన్ని నివారించారు. సాల్వెం ట్ నిల్వ చేసిన గోదాము మాత్రం పూర్తిగా దగ్ధమైంది. నష్టం ఎంత ఉంటుందన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. నష్టం కోట్లలో ఉంటుందని అగ్నివూపక అధికారు లు అంచనా వేస్తున్నారు. జీడిమెట్ల, సికింద్రాబాద్, మౌలాలి, కూకట్పల్లి, సనత్‌నగర్, మాదాపూర్ ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చి ఫైర్ సిబ్బంది వుూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. -
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.
-
జీడిమెట్లలో చోరి
జీడిమెట్ల : ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ దత్తసాయి రెసిడెన్సిలోని 104 ప్లాట్‌లో పట్టపగలు చోరీ జరిగింది. ప్లాట్‌లో నిమాసముంటున్న పరమేశ్వర్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరులేని సమయంలో దొంగలుపడి 19 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానకి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
జీడిమెట్లలో అగ్ని ప్రమాదం
జీడిమెట్ల(హైదరాబాద్): జీడిమెట్లలోని ఒక ప్రింటింగ్ యూనిట్లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ప్రింటింగ్ ప్రెస్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం సంభవించిందని నిర్వాహకుడు రామ్హ్రీమ్ తెలిపారు. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ఆయన చెప్పారు. జనావాసాల మధ్య ఉన్న ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికులు స్పందించి మంటలు ఆర్పివే శారు. -
జీడిమెట్లలో విషవాయువులు
జీడిమెట్ల చింతల్ పారిశ్రామి ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. దాంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రంగానగర్ కాలనీ ప్రాంతంలో ఏదో పరిశ్రమ నుంచి చాలా ఘాటైన వాసనతో కూడుకున్న విషవాయువు వ్యాపించింది. దాంతో ఆ ప్రాంత వాసులు కళ్లమంటలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఈ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో తరచు ఘాటైన వాసనతో ఏవో వాయువులు వస్తూనే ఉంటాయని, ఈసారి మాత్రం దాని తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు తెలియజేశారు. -
పెళ్లైన మూడు నెలలకే భార్యను హతమార్చాడు
హైదరాబాద్ : హైదరాబాద్ జీడిమెట్ల శ్రీరామ్‌నగర్‌లో దారుణం జరిగింది. వరకట్నం వేధింపులకు ఓ గృహిణి బలైంది. అదనపు కట్నం కోసం పెళ్లైన మూడు నెలలకే కట్టుకున్న భార్యను హతమార్చాడో భర్త. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే శ్రీరామ్ నగర్‌కు చెందిన పెయింటర్ ఇజాజ్‌కు మెదక్ జిల్లా తండుమూరు గ్రామానికి చెందిన మున్నీసా బేగంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇజాజ్‌కు లక్ష రూపాయిలకు పైగా కట్నం ఇచ్చారు. అయినా అతడు అదనపు కట్నం తీసుకు రావాలని మున్నీసా బేగాన్ని వేధించసాగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించటంతో విచక్షణ కోల్పోయిన ఇజాజ్ బుధవారం అర్థరాత్రి భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. -
పెళ్లయిన 3 నెలలకే భార్యను చంపిన భర్త
-
హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది
* కేక్ కట్ చేయాలని పిలిచి.. భవనంపై నుంచి తోసేసిన ప్రియుడు హైదరాబాద్: ప్రేమోన్మాదుల దాడికి యువతులు బలవుతూనే ఉన్నారు. తనను ప్రేమించడం లేదని సోమవారం ఓ ఉన్మాది రవళిని కత్తితో దాడి చే సిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమె పుట్టినరోజు నాడే హతమార్చేందుకు కుట్ర చేశాడు. కేక్ కట్ చేయాలంటూ భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా తోసేశాడు. అదృష్టవశాత్తు సిమెంట్ రేకులపై పడడంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకలగూడ చింతబావికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గడ్డం శ్రీశైలం పెద్దకుమార్తె రూప (21). పదవ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. జీడిమెట్ల గాజులరామారానికి చెందిన మహ్మద్ సాజిద్ (24)తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. సాజిద్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం వచ్చి... మంగళవారం రూప పుట్టిన రోజు కావడంతో అదేరోజు ఆమెను హతమార్చేందుకు సాజిద్ పథకం సిద్ధం చేసుకున్నాడు. అందులో భాగంగా సాయంత్రం రూప ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలని ఆమెను అపార్ట్మెంట్(మూడంతస్తుల భవనం)పైకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తనను నిర్లక్ష్యం చేస్తున్నావని ఆగ్రహించిన సాజిద్.. రూప ను బలవంతంగా అక్కడి నుంచి నెట్టివేశాడు. రేకుల షెడ్‌పై పడడంతో రూప తల, మెడకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, సాజిద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రస్తుతం రూపకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న తనను నిర్లక్ష్యం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉండడం భరించలేకే రూపను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు సాజిద్ పోలీసులకు తెలిపాడు. కాగా, సోమవారం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బీటెక్ విద్యార్థిని రవళి కూడా సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. -
బాలపేట చెరువులో బాలుడి మృతదేహం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అదృశ్యమైన బాలుడు కిషోర్‌కుమార్ నిహంత్ సాయి వర్మ(6) చెరువులో శవమై తేలాడు. ఖమ్మం జిల్లా బాలపేట చెరువులో అతడి మృతదేహం బయటపడింది. అతడిని ఎవరైనా హత్య చేశారా, అతడే చెరువులో పడి మరణించాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సాయి వర్మ ఈనెల 11న అదృశ్యమైయ్యాడు. ఖమ్మం జడ్పీ సెంటర్లోని శ్యామల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన చెల్లిని పరామర్శించేందుకు వెళ్లింది. అక్కడ విమలాదేవి, ఆమె సోదరి మాట్లాడుకుంటుండగా సాయివర్మ ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి వరకు అతడిని వీరు గమనించలేదు. ఆ తరువాత, ఆ చిన్నారి కనిపించలేదు. ఆస్పత్రిలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, బస్టాండులో, రైల్వే స్టేషన్లో ఎంతగా వెతికినా ఆ చిన్నారి జాడ తెలీలేదు. దీంతో, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విమలాదేవి ఫిర్యాదు చేశారు. -
కొంత ఉంది; కొంత లేదు
ఆజన్మం ఒక్కరికైనా లేచి సీటు ఇవ్వకపోవడానికి తగిన కారణం కనబడలేదు. చాలా రోజుల తర్వాత మేడ్చల్ వెళ్లాను. తెలియడంలేదుగానీ నిజానికి రోజులు కాదు, వెళ్లక ఏళ్లయింది. ఒక్కడినే పోవడానికి తోచక, పిల్లాణ్ని తీసుకెళ్దామనుకున్నాను. చూడండి... నేను అచ్చు సంసారినైపోతున్నాను! ‘వెళ్దాం’ అని ఊల పెట్టేసరికి, చిన్నోడు ఏడుప్పాట ఎత్తుకున్నాడు; ఎక్కడ వాణ్ని తీసుకెళ్లనేమోననీ, వాడికి బదులుగా అన్నను తీసుకెళ్తానేమోననీ. అదింకా ఎక్కువ బాధ కదా! పెద్దపిల్లల్తో పోల్చితే చిన్నవాళ్లు కొంత విస్మరణకు గురవుతారనుకుంటాను; ప్రతి ‘ఫస్ట్ మూమెంట్’ పెద్దపిల్లలే ఇస్తుంటారు కాబట్టి. ఆ ‘గ్రౌండ్’ మీద చిన్నోడివైపు మొగ్గాను. ‘పిల్లికి (కూడా) జిన్పాయింట్ ఏద్దా’మనే రకం వాడు! వేసుకుని, జుట్టు కట్టుకుని తయారైయాడు. బస్టాపుకు నడుస్తుండగా- ‘నేను ఎనుకకు వోత’ అని ముందు నడిచాడు; ‘ఆటో పీక ఒత్తుత నానా... నానా, ఆటో పీక ఒత్తుత’ అన్నాడు. అన్ని ఆటో హారన్లు ఒత్తించలేం; డ్రైవర్ ముఖం కొంత ప్రసన్నంగా కనబడాలి! ప్యారడైజ్ వెళ్తుండగా- ‘చీతపులి’ గురించి చెప్పాడు; ‘నేనింత పెద్దగైనగదా’ అని తన మూరెడు కొలత చూపించాడు; ‘నాగాజున్కు జిన్ పాయింట్ ఉంటదా’ అనడిగాడు; ‘నేను చిన్నగున్నప్పుడు’ పోయిన జా(రుడు)బండ గురించి చెప్పాడు. వాడికీ నాస్టాల్జియా! ఆ పూట మాటలు ‘ఖాళీ’ అయ్యాక, కునికిపాట్లు పడసాగాడు. దాంతో భుజం మీద వేసుకున్నాను. ప్యారడైజ్‌లో మేడ్చల్వి వరుసగా ఆరు బస్సులు వెళ్లిపోయాయి. అన్నీ ఫుల్లు! ఆదివారం పూట అంత రద్దీని ఊహించలేదు. ఏడోది కూడా వదులుకోవడం ఇష్టంలేక, వచ్చిన ‘మెట్రో’ ఎక్కేశాను(ము). రద్దీగా లేదుగానీ సీటు లేదు. ‘‘మీక్ సీట్ దొర్కలేదా?’’ టికెట్‌కు వచ్చిన కండక్టర్ ఆశ్చర్యపోయాడు! చంటిపిల్లాడిని ఎత్తుకుని కూడా నిలబడేవున్నానని ఆయన ఉద్దేశం! నవ్వి ఊరుకున్నాను. కాసేపు రాడ్ పట్టుకున్నాను; కాసేపు వాణ్ని కుడి భుజం మీదికి మార్చుకున్నాను; కొద్దిగా కదిలితే వీపుమీద నెమ్మదిగా తట్టాను. బస్సు వెనకవైపున్నాం. అందరూ ఊరికే కూర్చున్నారు. లగేజీలేం లేవు. ఒక్కరికైనా లేచి సీటు ఇవ్వకపోవడానికి తగిన కారణం కనబడలేదు. వాళ్లకు వాళ్లే బరువుగావుంటే ఏం లేస్తారులే! నేను కూర్చునివుండి, ఇంకెవరైనా ఇలా బాబుతో ఉంటే- ‘లేస్తానా, లేవనా’ అని తర్కించుకున్నాను. మహా అయితే పాతిక కిలోమీటర్ల దూరం! లేచేవాణ్నే, అనిపించింది. ఇక్కడ దూరం కన్నా కూడా, ఒక కన్సెర్న్ కదా! నా చిన్నపాటి వ్యక్తిగత సౌఖ్యం సమాజంతో ముడిపడివుండటం బాధించింది. అంతకుముందటి ప్రయాణానందం చేదెక్కింది. అందరి ముఖాలు నాకు వికారంగా కనబడుతున్నాయి. వాళ్లు సెల్‌ఫోన్లల్లో మాట్లాడుతున్నది చెత్త! కిటికీల్లోంచి చూస్తున్నది పేలవమైన ప్రపంచం! జీడిమెట్ల దగ్గర ఒకాయన సీటు ఆఫర్ చేశాడు(‘‘ఫర్లేద్సర్.’’). చిత్రంగా ఆయన ‘ప్రేమ’ కూడా నాకు రుచించలేదు. ‘దగ్గర్లోనే దిగుతా’నని లేచాడు. కూర్చున్నాక- ఎవరివైపూ తేరిపారగా చూడటం ఇష్టం లేకపోయింది. ఆ బస్సే సుఖంగా లేదు. కొంపెల్లి అందాజాలో చిన్నోడు మేలుకున్నాడు. ‘ఇది ఎంత నానా? అది ఎంత నానా?’ (ఏంటి) అని అడుగుతూపోయాడు. ‘ఇది నానా! అది నానా!’ అని చెబుతూపోయాను. నానా: ఒకే పదాన్ని రెండు భిన్న ప్రేమల్తో పిలుచుకోవడం ఆశ్చర్యంగా లేదూ! ఒక విషయాన్ని రియలైజ్ అవుతున్నప్పుడు- కేవలం అందులో ఆనందం పొందుతాను. ఆ అనుభవపు అసలైన క్షణం దాటింతర్వాత, ‘అరె, ఇది రాయొచ్చుకదా!’ అనిపిస్తుంది. వాళ్లకు మోకాళ్ల నొప్పులుండొచ్చు; కడుపులో మంట కావొచ్చు; గంటక్రితం వేరే బస్సులో నిలబడి వచ్చి, ‘అమ్మయ్య సీటుదొరికిం’దని కూర్చునివుండొచ్చు; ఏదైనా ఆపరేషన్ జరిగివుండొచ్చు; కొందరికి ఇవ్వాలనివున్నా మొహమాటం అడ్డురావొచ్చు. సానుకూల మొహమాటం కూడా ఉంటుంది. ఎవరూ భిక్ష వేయనప్పుడు మనం వేయడానికి పడే ఇబ్బందిలాంటిది! కొందరికి ఈ ఇష్యూతో సంబంధం లేకుండా ఇప్పుడే వచ్చిన స్టాపులో ఎక్కివుండొచ్చు. అయినా వాళ్లందరివైపూ నా కోపం పాకింది. వర్గం, కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన ఏర్పడే ద్వేషభావన కూడా ఇలాగే ఎదుటివారిని గురించి ఆలోచించనీయని అహేతుకతకు దారితీస్తుందా! సాయంత్రం రిటర్నులో- ప్యాట్నీ దగ్గర- దిగడానికి ఫుట్‌బోర్డు మీద రెడీగావున్న హెడ్‌ఫోన్స్-బ్లాక్ జీన్సు- బ్లూ టీషర్టు కుర్రాడు కవర్లో ఏదో ద్రవం పట్టుకెళ్తున్నాడు. కారి, ప్యాంటు మీద బుడగల్లా పడిందది. వెంటనే, వెనకసీట్లో కూర్చున్న బ్లాక్ జీన్సు- చెక్స్ షర్ట్ అబ్బాయి తన ‘సర్టిఫికెట్ల’ కవర్ తీసిచ్చాడు (‘‘థాంక్సన్నా.’’). మనుషుల దగ్గర కొంతేదో ఉంది; కొంతేదో లేదు. - పూడూరి రాజిరెడ్డి -
జీడిమెట్లలో మరో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో 24 గంటలు తిరగక ముందే మరో అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో ఈరోజు తెల్లవారుజామున అనూహ్యరీతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమలోని ప్లాస్టిక్ అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా రసాయనాలతో మంటలు చెలరేగటంతో జీడిమెట్ల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. నిన్న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఇంకా కోలుకోకముందే మరో ప్రమాదం జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని, వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వారు మండిపడుతున్నారు. -
రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
జీడిమెట్ల, న్యూస్‌లైన్: పారిశ్రామికవాడలోని ఓ రసాయనాల తయారీ పరిశ్రమలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలంటుకున్న వెంటనే కార్మికులు పరిశ్రమ నుంచి పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా, లక్షల్లో ఆస్తినష్టం ఉంటుందని తెలిసింది. వివరాలు... జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఫేజ్-3లో యూసుఫ్, అక్రమ్, హుస్సేన్‌లు భారత్ ఫ్లెక్సో గ్రాఫైట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కెమికల్ సాల్వెంట్స్‌ను తయారు చేసి విక్రయిస్తుంటారు. కాగా ఆదివారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఐదుగురు కార్మికులు సాల్వెంట్స్‌ను తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు లేచాయి. కార్మికులు భయంతో బయటకు పరుగు తీశారు. పరిశ్రమలో భారీ ఎత్తున సాల్వెంట్స్ నిల్వ ఉండటంతో మంటలు ఒక్కసారిగా అంటుకుని క్షణాల్లో పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. మంటల ధాటికి పరిశ్రమలోని డ్రమ్ములు 50 అడుగుల మేర గాల్లోకి ఎగిరి పడటంతో భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల, సనత్‌నగర్ ఫైర్స్టేషన్ల సిబ్బందితో పాటు హెటిరో పరిశ్రమ ఫైర్ సిబ్బంది వచ్చి.. ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. జీడిమెట్ల సీఐ సుదర్శన్ ఇతర ప్రాంతాల నుంచి ఫోమ్, వాటర్ ట్యాంకర్లను తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. ప్రమాదంలో సుమారు 200 కెమికల్ డ్రమ్ములు కాలిపోయాయి. పరిశ్రమ యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత నష్టం జరిగిందనేది తెలియరాలేదు. అయితే, లక్షల్లో ఆస్తినష్టం ఉంటుందని స్థానికులంటున్నారు. సంఘటనా స్థలా న్ని బాలానగర్ ఏసీపీ నాగరాజురెడ్డి, వైఎస్సాఆర్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం కార్యదర్శి సురేందర్‌రెడ్డి తదితరులు సందర్శించారు. అనుమతి లేని పరిశ్రమ.. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. సాల్వెంట్స్‌ను తయారు చేసి భారీగా నిల్వ చేస్తున్నారు. వీరి వద్ద ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్ కూడా లేదు. అగ్నిప్రమాదం జరిగితే అదుపు చేసేందుకు అవసరమైన నియంత్రణ పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. ఈ పరిశ్రమకు చెందిన మరో బ్రాంచ్‌లో 2012 ఆగస్టు 15న అగ్ని ప్రమాదం జరిగింది. తరుచూ ప్రమాదాలు.. పట్టించుకోని పీసీబీ ఇటీవల సుభాష్‌నగర్‌లోని పరిశ్రమలోన రసాయనాలు పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, స్టాలిన్ పెయింట్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి 10 రోజులు గడవక ముందే ‘భారత్ ఫ్లెక్సో’ పరిశ్రమలో ప్రమాదం జరగడం పీసీబీ అధికారుల పని తీరుకు అద్దం పడుతోంది. మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు అనుమతి లేని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు నిబంధనలు పట్టించుకోని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం
-
హైదరాబాద్‌లో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మరో డ్రగ్ రాకెట్ బట్టబయలయింది. భారీ స్థాయిలో మత్తు పదార్ధాలను అధికారులు కొనుగొన్నారు. జీడిమెట్ల ప్రాంతంలో ఉన్న బాలాజీ ల్యాబ్‌పై సైబారాబాద్ ఎస్ఓటీ, ఎన్సీబీ అధికారులు దాడులు చేసి 11 కిలోల కెటామైన్ స్వాధీనం చేస్తున్నారు. దీని విలువ రూ. 2 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో సంబంధమున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మత్తుపదార్థాలు పట్టుబడడంతో సంచలనం రేగింది. దీని వెనుక అంతర్జాతీయ ముఠా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఎగుమతి అయిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో పలువురు సినిమా నటులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో ఈ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. -
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
-
బాలికపై లైంగిక దాడి.. బీరువాలో బందీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం విషయం బయట పడుతుందని బాలిక గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. బాలిక చేతులు కట్టేసి ఊపిరాడకుండా బట్టలు కప్పి బీరువాలో కుక్కి పరారయ్యాడు. ఓ మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా తల్లిదండ్రులు తమ చిన్నారిని ప్రాణాలతో కాపాడుకోగలిగారు. నివ్వెరపోయే ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సీఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట దావుద్బస్తీకి చెందిన బాలిక(9) కుటుంబం, బీహార్‌కు చెందిన బబ్లూ(25) కుటుంబం పక్క పక్క గదుల్లో అద్దెకు ఉంటున్నారు. స్థానికంగా ఓ ఆటో సర్వీసింగ్ సెంటర్లో పని చేస్తున్న బబ్లూ ఆ కుటుంబంతో చాలా చనువుగా ఉండేవాడు. బబ్లూ భార్య ప్రసవం నిమిత్తం బీహార్‌కు వెళ్లటంతో అతడి కన్ను బాలికపై పడింది. బబ్లూ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి బాలికను నాలుగో అంతస్తులోని తన గదికి తీసుకువెళ్లాడు. అనంతరం బాలికపై ఆత్యాచారం జరిపి చేతులు కట్టేసి బీరువాలో కుక్కి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం కుమార్తె కోసం గాలిస్తున్న బాలిక తల్లిదండ్రులతోనే ఏమీ తెలియనట్లు కొద్దిసేపు గడిపాడు. బాలికను బబ్లూ తీసుకెళుతుండగా చూసినట్లు ఓ మహిళ రాత్రి 7 గంటల సమయంలో వెల్లడించటంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. బబ్లూ గది తాళాన్ని పగులగొట్టిన బాలిక తల్లిదండ్రులు బీరువా నుంచి శబ్దాలు రావటంతో తెరచి చూశారు. బీరువాలో బాలికను చేతులు కట్టేసి ఉంచటంతో అపస్మారక స్థితికి చేరుకుంది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు నిందితుడు బబ్లూపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకోండి ప్లీజ్
-
ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య
జీడిమెట్లలోని షాపూర్ నగర్ సమీపంలోని న్యూ ఎల్.బి.నగర్లో గత అర్థరాత్రి ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారినా ఇంకా తలుపులు తీయకపోవడంతో ఆ ఇంటి పక్కవారు కిటికిలో నుంచి చూడగా దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గమనించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫేస్బుక్లో పోస్ట్ చేసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మబ్బుగుంటపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, కనకమ్మల కుమారుడు వేణు(25) స్థానికంగా బీటెక్ చదువుతున్న క్రమంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆరు నెలల క్రితం కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎన్‌ఎల్‌బీనగర్‌కు వచ్చి తన స్నేహితులతో కలిసి ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రేమించిన యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని బుధవారం స్నేహితులకు ఫేస్బుక్లో మెస్సేజ్ పోస్ట్ చేసి తాను చనిపోతున్నానని అందులో పేర్కొన్నాడు. బుధవారం స్నేహితుడు అనిల్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి వేణు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం
-
గాజులరామారంలో దారుణం
జీడిమెట్ల పీఎస్ పరిధిలో గాజులరామారంలో దారుణం చోటుచేసుకుంది. వీఎస్ఆర్ టవర్స్‌లో ఉంటున్న షేర్‌మార్కెట్ వ్యాపారి రమేష్‌వర్మ అనే వ్యక్తి తన భార్య, కొడుకును హత్య చేశాడు. తర్వాత ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్‌సాగర్‌లో దూకి అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. లేక్ పోలీసులు అతడిని కాపాడారు. అయితే స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాల కారణంగానే రమేష్‌వర్మ ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.