హైదరాబాద్ : క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన ఘటన నగరంలోని గాజుల రామారం ప్రాంతంలో జరిగింది. విశాఖపట్టణానికి చెందిన సత్యం (65) గాజుల రామారంలో ఉండే తన కుమారుడు నాయుడు దగ్గరకు 20 రోజుల క్రితం వచ్చాడు. అయితే, సోమవారం ఉదయం సత్యం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకగా గాజులరామారంలోని ఓ క్వారీ గుంతలో శవమై కనిపించాడు. పని కోసం వచ్చి క్వారీలో పడి మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(జీడిమెట్ల)
వృద్ధుడి అనుమానాస్పద మృతి
Published Tue, Apr 28 2015 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement