హైదరాబాద్ : జీడిమెట్లలోని ఓ నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి చెత్తాచెదారంలో పడేసి ఉన్న పురుషుడి మృతదేహం (సుమారు 55 సంవత్సరాలు) గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు.