మంటలతో కుప్పకూలిన ఓ భవనం
దట్టమైన పొగలతో పరిసరాలు భయానకం
బయటికి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్న కార్మికులు
ఘటనా స్థలికి 8 ఫైరింజిన్లు.. ఒక బ్రాంటోస్కైలిఫ్ట్
అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు
పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా
జీడిమెట్ల: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. ఓ భవనం కుప్పకూలింది. అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఫేజ్–5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు.
పరిశ్రమ గ్రౌండ్ ఫ్లోర్ సహా మరో రెండు ఫ్లోర్లు ఉండగా ఆపైన పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు ఉండగా.. మంగళవారం జనరల్ షిఫ్ట్‌లో దాదాపు 200 మంది ఉన్నారు. మధ్యాహ్నం పరిశ్రమ మూడో అంతస్తులోని రేకుల షెడ్డులో కొంతమంది కారి్మకులు ఆర్‌పీ (రీప్రాసెసింగ్) మెషీన్ వద్ద పనులు చేస్తున్నారు. 12.30 గంటల ప్రాంతంలో రేకుల షెడ్డులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కార్మికులు బతుకు జీవుడా అంటూ కిందకు పరుగులు తీశారు.
శ్రమించిన 50 మంది ఫైర్ సిబ్బంది..
సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో భారీగా మంటలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్‌రెడ్డి ఉన్నతాధికారులకు వివరించడంతో 8 వాహనాలు పరిశ్రమ వద్దకు చేరుకున్నాయి.
దాదాపు అయిదు ఫైర్ స్టేషన్‌ల నుంచి వచ్చిన 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మూడో అంతస్తులోకి నీటిని చిమ్మడం కష్టంగా మారడంతో బ్రాంటోసై్కలిఫ్ట్‌ను తెప్పించారు. మంటలు అర్ధరాత్రి వరకు కూడా అదుపులోకి రాలేదు.
పైనుంచి కింది అంతస్తు వరకు వ్యాపించిన మంటలు..
పరిశ్రమ విశాలంగా ఉండటంతో పాటు లోపల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బ్యాగులు నిల్వ ఉన్నాయి. పైన ఆర్‌పీ యంత్రం వద్ద అంటుకున్న మంటలు ఒక్కో అంతస్తు నుంచి నేరుగా కింది అంతస్తు వరకు వ్యాపించాయి. పరిశ్రమ భవనం మంటల తాకిడికి రెండో అంతస్తు గోడలు కూలిపోయాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో ఘటనా స్థలికి బాలానగర్ ఏసీసీ హన్మంతరావు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లే‹Ù, ఎస్‌ఐలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment