సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 0ట్యాంకర్లతో నీటి సరఫరా చేశారు. నాలుగున్నర గంటలకు పైగా భవనం మంటల్లోనే ఉంది. ఏడు ఫైర్‌ఇంజిన్లు, 40 వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు.
పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment