Unidentified deadbody
-
ప్లాస్టిక్ కవర్లో మృతదేహం
హైదరాబాద్ : జీడిమెట్లలోని ఓ నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెత్తాచెదారంలో పడేసి ఉన్న పురుషుడి మృతదేహం (సుమారు 55 సంవత్సరాలు) గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో గుర్తుతెలియని మృతదేహం
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో గుర్త తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సోమవారం సాయంత్రం అటువైపుగా వెళుతున్న ఓ వ్యక్తి చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే చీకటి పడటం, మృతదేహం సైతం చెరువు మధ్యలో ఉండటంతో వెలుపలకు తీయడం పోలీసులకు సాధ్యపడలేదు. దీంతో మంగళవారం ఉదయం మృతదేహాన్ని వెలికి తీస్తామని ఈతగాళ్లు వెనుదిరిగారు. -
అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం చిలామాకులరాయి అటవీ ప్రాంతంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అటవీ ప్రాంతంలో పడి ఉన్న ఈ మృతదేహన్ని చూస్తే.. ఎవరైనా చంపి ఇక్కడ పడివేసి ఉండవచ్చుననే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.