చిత్తూరు (అర్బన్) : చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో గుర్త తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సోమవారం సాయంత్రం అటువైపుగా వెళుతున్న ఓ వ్యక్తి చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే చీకటి పడటం, మృతదేహం సైతం చెరువు మధ్యలో ఉండటంతో వెలుపలకు తీయడం పోలీసులకు సాధ్యపడలేదు. దీంతో మంగళవారం ఉదయం మృతదేహాన్ని వెలికి తీస్తామని ఈతగాళ్లు వెనుదిరిగారు.