
జీడిమెట్లలో మరో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో 24 గంటలు తిరగక ముందే మరో అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో ఈరోజు తెల్లవారుజామున అనూహ్యరీతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమలోని ప్లాస్టిక్ అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా రసాయనాలతో మంటలు చెలరేగటంతో జీడిమెట్ల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది.
నిన్న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఇంకా కోలుకోకముందే మరో ప్రమాదం జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని, వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వారు మండిపడుతున్నారు.