జీడిమెట్ల: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సుబాష్‌నగర్‌లో సుమన్ ప్లాస్టిక్ కంపెనీ యజమాని మలారం చౌదరి(45) గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాశాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందిన విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.