
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అట్టి గృహంపై దాడి చేసి నిర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు.
చదవండి: ఢిల్లీలో దారుణం.. ఇంటి ముందే బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
Comments
Please login to add a commentAdd a comment