prostitute house
-
వ్యభిచార గృహంపై దాడి.. పశ్చిమ బెంగాల్ నుంచి యువతులను తీసుకువచ్చి
సాక్షి, వరంగల్: హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డికాలనీలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ డాక్టర్ జితేందర్‌రెడ్డి తెలిపారు. రెడ్డికాలనీకి చెందిన ఓ మహిళ అదే కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు కుతాటి నందిని, విటులు మరిపెల్లి స్టిఫెన్, మరిపెల్లి పీటర్‌ను అరెస్ట్ చేసి హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. -
రెండు వారాలు వేశ్య గృహంలో ఉన్నా: మృణాల్ షాకింగ్ కామెంట్స్
మృణాల్ ఠాకుర్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సీతారామం మూవీతో రాత్రికిరాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో యువరాణిగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మృణాల్లో తొలి బిగ్గెస్ట్ కమర్శియల్ హిట్ అందుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మొదట బుల్లితెర నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది. హిందీతో పాటు తెలుగలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్‌తో నటిగా గుర్తింపు పొందింది. చదవండి: గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఆ తర్వాత హిందీ చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్గా మారింది. ఈ జర్నీలో తాను ఎన్నో స్ట్రగుల్స్ పడ్డానంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. తాను మొదట సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక అయినట్లు చెప్పింది. కానీ చివరకు చిత్రం నుంచి తనని తొలగించారని చెప్పింది. ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ.. ‘సుల్తాన్ చిత్రంలో అనుష్క శర్మ చేసిన పాత్రలో నేను నటించాల్సింది. ఈ సినిమా కోసం ఫైటింగ్లో కూడా శిక్షణ తీసుకున్నా. 11 కిలోల బరువు కూడా తగ్గాను. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా నుంచి నన్ను తొలగించి అనుష్క శర్మను తీసుకున్నారు. దానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ, నేను ఎక్కువ బరువు తగ్గడమే దానికి కారణమని ఆ తర్వాత తెలిసింది’ అని చెప్పింది. ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని, ఈ సినిమా కోసం తాను రెండు వారాల పాటు వేశ్య గృహంలో ఉండాల్సి వచ్చిందంటూ షాకింగ్ విషయం చెప్పింది మృణాల్. ‘నేను చేసిన లవ్ సోనియాలో అక్రమ రావాణకు గురైన చెల్లిని రక్షించుకునే అక్క పాత్ర నాది. దానికి కోసం నేను వేశ్యగా మారాల్సి ఉంటుంది. చదవండి: యూట్యూబ్ ద్వారా గంగవ్వ నెల సంపాదన ఎంతంటే నా పాత్ర సహజంగా వచ్చేందుకు కోల్‌కతాలోని వేశ్య గృహంలో రెండు వారాల పాటు ఉన్నాను. అక్కడ వాళ్ళతో గడిపి వారి కథలు విన్నాను. వారి గురించి వింటుంటే నా గుండె చలించిపోయింది. ఆ తర్వాత ఎప్పడు నాకు వాళ్లే గుర్తోచ్చేవారు. ఆ సమయంలో డిప్రషన్‌లోకి కూడా వెళ్లాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా వారే గుర్తొచ్చేవారు. 17 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల వృద్ధుడికి అమ్మే సన్నివేశమది. ఆ సీన్ చేస్తుంటే వేశ్యల కథలే కళ్ళముందు కదిలాయి. దీంతో నేను చేయలేను అంటూ ఏడ్చేశాను. కానీ డైరెక్టర్ నువ్వు ఈ సీన్ చేస్తే ప్రపంచం చూస్తుంది అని నాకు కౌన్సిలింగ్ ఇచ్చేశారు. ఆయన మాటలతో ధైర్యం తెచ్చుకుని యాక్ట్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. -
జీడిమెట్ల.. వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అట్టి గృహంపై దాడి చేసి నిర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు. చదవండి: ఢిల్లీలో దారుణం.. ఇంటి ముందే బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. టీవీ నటి సహా ఇద్దరు మహిళలను..
పనాజీ: మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. కాగా, పోలీసుల దాడుల్లో ఓ టీవీ నటి సహా మరో ఇద్దరు మహిళలను పోలీసులు కాపాడారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన మహిళ కావడం గమనార్హం. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పక్కా సమాచారంలో ఓ హోటల్‌పై పోలీసులు రైడ్స్ చేశారు. ఈ దాడుల్లో టీవీ నటితో సహా మరో ఇద్దరు మహిళలను పోలీసులు కాపాడారు. కాగా టీవీ నటి, మరో మహిళ ముంబై సమీపంలోని విరార్‌కు చెందిన వారు కాగా.. మూడో మహిళను హైదరాబాద్‌కు చెందినట్టు నిర్ధారించారు. అరెస్ట్ చేసిన అనంతరం విచారణలో భాగంగా హఫీజ్ సయ్యద్ బిలాల్.. సదరు మహిళలకు బలవంతంగా వ్యభిచారకూపంలోకి దింపినట్టు తెలిపారు. కాగా , వీరికి రూ. 50వేలు చెల్లించడానికి కస్టమర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అయితే, నిందితుడు వారిని గురువారం అక్కడికి తీసుకువచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. -
కీసర: వ్యభిచార గృహంపై దాడి.. గతంలోనూ అదే పని
కీసర: గోధుమకుంట పంచాయతీ పరిధిలోని టీపీఎస్‌కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై కీసర పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను సోమవారం అరెస్టు చేశారు. కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన కె.కుమారస్వామి(49) ఈసీఐఎల్ ఎంజేకాలనీలో నివసిస్తున్నాడు. ఇతనికి కీసర మండలం టీపీఎస్‌కాలనీలో హోటల్ నిర్వహించే ఓ మహిళ (అరుణకుమారి)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరిపై గతంలో మేడిపల్లి పీఎస్ పరిధిలో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు కేసు నమోదయ్యింది. తర్వాత తమ మకాంను గోధుమకుంట టీపీఎస్‌కాలనీకి మార్చారు. ఆన్లైన్లో డబ్బులు వసూలు చేసి కస్టమర్లు అడిగిన చోటకి మహిళలను పంపేవాడు కుమారస్వామి. గత నెల అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్ ఢాకాకు చెందిన మహిళ కలకత్తా నుంచి వచ్చి వీరిని ఆశ్రయించింది. ఆ మహిళను బొడుప్పల్కు చెందిన కస్టమర్ వద్దకు పంపేందుకు సిద్దమవుతుండగా సమాచారం అందుకున్న కీసర పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు వాడిన కారు, రెండు సెల్ఫోన్లు, రూ.4వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: దారుణం: మంచినీళ్ల నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై..) -
Nalgonda: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు
నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్‌చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని పోలీసులు తెలిపారు. ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరో మహిళను సఖి కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్న ఓ మహిళ విటురాలుగా ఉందని అన్నారు. కాగా రమేష్‌చారి తిప్పర్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నాడు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి పోలీసులు దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన ముక్కర రాజు(31) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా భాగ్యనగర్‌కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ నెంబర్ 303ని అద్దెకు తీసుకొని పానగం శ్రీకాంత్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు విటులు ముక్కపాటి హరి, ఆకుని నీలంధర్, జింకల పృథ్వీరాజ్‌తో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ( చదవండి: జుత్తాడ మర్డర్: పాత కక్షలతో దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు ) -
పేటలో వ్యభిచారం.. ‘ఆమె’ చెరలో 16 మంది
సాక్షి, సూర్యాపేట క్రైం : రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుట్టుగా వ్యభిచారం సాగుతోంది. పట్టణంలోని అంజనాపురి కాలనీకి చెందిన ఓ మహిళ బాలికల చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు మరో ముగ్గురు కలిసి వివిధ చోట్ల వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నట్లు గురువారం వెలుగుచూడడంతో ఈ విషయం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో హైటెక్ బస్టాండ్ సమీపంలో ఓ బాలిక (13) ఫూటుగా మద్యం సేవించి ఉండడంతో ఓ వ్యక్తి 181 సఖి కేంద్రానికి సమాచారం చేరవేశారు. సఖి కేంద్రం నిర్వాహకులు ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో..) తన స్వస్థలం సూర్యాపేట పట్టణమేనని.. తనకు తల్లి కూడా ఉన్నట్లు విచారణలో చెప్పింది. అంజనాపురి కాలనీకి చెందిన మహిళ తనతోపాటు మరో 15మంది బాలికల చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో మూడు రోజులక్రితం ఆ బాలిక వారినుంచి తప్పించుకుంది. దీంతో సఖి కేంద్రం నిర్వాహకులు ఈ విషయాన్ని సూర్యాపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెతికి మళ్లీ ఆ బాలికను సఖికేంద్రం వారికి అప్పగించారు. బాలికను గురువారం నల్లగొండ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు సూర్యాపేట సఖి కేంద్రం నిర్వాహకులు తెలిపారు. బాలికలకు డ్రగ్స్, మద్యం సదరు మహిళ.. బాలికలకు మద్యం, గుట్కాలు, డ్రగ్స్, గంజాయి అలవాటు చేయడంతోపాటు హార్మోన్ ఇంజెక్షన్లు కూడా వేయిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యభిచారం మార్చి నుంచే జిల్లా కేంద్రంలో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంజనాపురి కాలనీలోనే కాకుండా విద్యానగర్‌లో కూడా వ్యభిచారం దందా నడిపిస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలికల చేత వ్యభిచారం నడిపిస్తున్న ముఠా సభ్యుల గుట్టు రట్టు చేయడంలో పోలీసుల గోప్యతపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయమై సూర్యాపేట డీఎస్పీ ఎస్.మోహన్‌కుమార్‌ను వివరణ కోరగా.. బాలికలచే జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో పక్కా సమాచారంతో నేరుగా వ్యభిచార గృహంపై దాడి చేసి మహిళ గుట్టు రట్టు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తమ అదుపులో వ్యభిచార గృహం నిర్వహించే ముఠా సభ్యులు ఎవరూ కూడా లేరన్నారు. (రూరల్ సీఐ పోలీసు వాహనం చోరీ) ఆమె చెరలో పలువురు బాలికలు అంజనాపురి కాలనీలోని మహిళ తన నివాసంతో పాటు మరో రెండు నివాస గృహాలను అద్దెకు తీసుకొని వ్యభి చారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురు కలిసి విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ఈ దందాను నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాలికలను టార్గెట్ చేసుకుని వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు తెలిసింది. మరో 15మంది బాలికలు వ్యభిచార గహాల్లో ఉన్నట్లు బాలిక ఇచ్చిన సమాచారంతో వెలుగుచూసింది. (కాసేపట్లో పెళ్లి.. అంతలోనే మరో యువతి ఎంట్రీ) కూతవేటు దూరంలో ఠాణాలు.. ఇంటలిజెన్స్ సీఐ కార్యాలయం అంజనాపురి కాలనీకి సూర్యాపేట పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లు కూతవేటు దూరంలోనే ఉంటాయి. కానీ పోలీసులు పూర్తిస్థాయిలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతరం ఆ రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది తిరగడమే కాకుండా.. అదే ప్రాంతంలో ఇంటలిజెన్సీ సీఐ కార్యాలయం కూడా ఉంటుంది. కానీ, హైటెక్ బస్టాండ్ సమీపంలో బాలిక తిరుగుతుండగా.. అజ్ఞాతవాసి సఖి కేంద్రానికి ఇచ్చిన సమాచారంతో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ లీలలను కనుగొనలేకపోవడంలో ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు. -
కేపీహెచ్బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు
కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్‌బీ పోలీసులతో కలిసి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆదివారం వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లోని ఎమ్ఐజీ–59లోని ఫ్లాట్ నంబర్–202లో యూనివర్సల్ హెయిర్ అండ్ స్పా నిర్వహిస్తున్నారు.ఆన్లైన్లో విటులను ఆకర్శించి వ్యభిచారం చేయిస్తున్నారు. మసాజ్ పేరుతో ఈ తతంగం నిర్వహిస్తున్నారు. విటుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదివారం స్పాపై దాడి చేసిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు యువతులను రెస్క్యూహోమ్‌కు తరలించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కోర్టు ఎదుట హాజరుపరిచారు. నిందితుల నుంచి రూ.1.36 లక్షల నగదు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
అత్తాపూర్‌లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు
అత్తాపూర్: ఓ కాలనీలో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారం దందాను పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఈమేరకు ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు విటులు, ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోకచక్రవర్తి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన సాయి ఉప్పర్‌పల్లి సన్‌రైజ్ కాలనీలో మూడు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని 15 రోజుల నుంచి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు చెందిన యువతులను తీసుకొచ్చి దందా చేయిస్తున్నాడు. ఈ విషయమై పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు ఉప్పర్‌పల్లిలోని వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేశారు. ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు విటులు, మరో ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యభిచార ముఠాను సాయి.. దినేష్‌సింగ్, మణిశర్మతో కలిసి నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్ విటులను పంపిస్తుండేవాడని చెప్పారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి యువతులను తీసుకువచ్చి నెలకు 25 వేల జీతం, భోజనం, వసతి కల్పిస్తామని మాయమాటలు చెప్పి నిర్వాహకులు వ్యభిచారం నిర్వహించినట్లు తెలిపారు. 2016లో దినేష్‌సింగ్‌పై కేసు నమోదైనా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని ఏసీపీ వివరించారు. గతంలో మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్ ప్రాంతాల్లో సైతం ఇలాంటి కార్యకలాపాలు సాగించారని తెలిపారు. ఈమేరకు పూర్తి విచారణ జరుపుతున్నట్లు తెలియజేశారు. యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిర్వాహకులు, విటులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు వెల్లడించారు. ప్రజలు తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్సైలు బాలరాజు, రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
అడ్డగుట్ట: మసాజ్ సెంటర్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాకు తుకారాంగేట్ పోలీసులు చెక్ పెట్టారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈస్ట్ మారేడుపల్లిలోని రాజేష్ కుమార్ అనే వ్యక్తి ‘ట్రాంక్విల్ యూని సెక్స్ సెలూన్ అండ్ స్పా’ పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మన్నపు శ్రావన్‌కుమార్, ఎల్క విద్యా సాగర్‌తో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి తుకారాంగేట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రావణ్‌కుమార్, విద్యాసాగర్, విటులు విద్యానగర్‌కు చెందిన పులుగుర్త సురేష్, నాచారం ప్రాంతానికి చెందిన మేడల రాజ్ కుమార్‌తో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు యువతులను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి 8 సెల్ ఫోన్లు, రూ. 13,040 నగదు స్వాధీనం చేసుకొని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి..
నెల్లూరు(క్రైమ్): మైనర్ బాలికలను వ్యభిచార కూపంలోకి దించుతున్న ఓ ముఠాను గురువారం వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్న పలువురు మహిళలు యువకులను చేరదీసి వారి ద్వారా ప్రేమపేరిట మైనర్ బాలికలకు, యువతులకు ఎరవేస్తున్నారు. అనంతరం వారిని నగ్నంగా ఫొటోలు తీసి వాటి ఆధారంగా వ్యభిచారకూపంలోకి దించి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా నెల్లూరు నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోన్న ఈ తతంగం ఇటీవల ఓ మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకొనే క్రమంలో వెలుగులోకి వచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా.. పోలీసుల సమాచారం మేరకు సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన ఓ మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలికను కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న దివ్య అనే మహిళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆమెను లొంగదీసుకున్నాడు. అక్కడ బాలికకు నగ్నంగా ఫొటోలు తీసి వాటితో దివ్య, ఆ బాలుడు కలిసి ఆమెను బెదిరించి వ్యభిచార కూపంలోకి దించారు. అప్పటి నుంచి దివ్య కొండాయపాలెం నక్కలగుంట ప్రాంతానికి చెందిన మాలతి, గాయత్రినగర్‌కు చెందిన సుమతి, ప్రసాద్‌లతో కలిసి ఆ బాలికతో వ్యభిచారం చేయించేవారు. అయితే బాలిక ప్రవర్తనలో మార్పులను గమనించిన ఆమె తల్లి వివాహం చేసేందుకు నిశ్చయించారు. బయటపడింది ఇలా.. కుమార్తెకు వివాహం చేస్తే మార్పు వస్తుందన్న ఆలోచనతో తల్లి ఆ బాలికకు తన సమీప బంధువుకు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించింది. ఈ విషయం తెలుసుకున్న ముఠా ఆ పెళ్లిని ఆపి ఆ బాలికను యథావిధిగా వ్యభిచారంలో కొనసాగించాలని ఎత్తుగడవేసింది. అందులో భాగంగా మైనర్ బాలికకు తల్లి బలవంతంగా వివాహం చేస్తోందని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు, వేదాయపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం మైనర్ బాలికను, ఆమె తల్లిని స్టేషన్‌కు తరలించి విచారించగా ఈ వ్యభిచార ముఠా గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో బాధిత బాలిక తనలాగే చంద్రమౌళినగర్‌కు చెందిన మరో మైనర్ బాలికను సైతం ఇలాగే వ్యభిచారకూపంలోకి దించినట్లు తెలిపింది. బాలిక ఇచ్చిన వివరాల మేరకు వేదాయపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ పేరుతో చంద్రమౌళినగర్‌కు చెందిన బాలికను మోసగించిన బాలుడిని, వ్యభిచారకూపంలోకి దించిన దివ్య, సుమతి, మాలతి, ప్రసాద్‌లను గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన బాలిక విషయంలో ఇప్పటికే ఇద్దరు యువకులను వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. -
వేశ్యాగృహానికి అమ్మేశారు
చిత్తూరు, మదనపల్లె క్రైం : అయిన వాళ్లే తనను మోసగించి ముంబయిలోని వేశ్యాగృహానికి అమ్మేశారని, ఏడాదిన్నరపాటు అక్కడ చిత్రహింసలు అనుభవించి ఎలాగో తప్పించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చానని బాధితురాలు వాపోయింది. ఆమె గురువారం తనకు న్యాయం చేయాలని కోరుతూ డీఎస్పీ చిదానందరెడ్డికి ఫిర్యాదు చేసింది. మదనపల్లె డివిజన్లోని కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన యువతి (25)ని ఆరేళ్ల క్రితం మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన మల్లికార్జునకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు వంశీ పుట్టాడు. ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. నాలుగేళ్ల తర్వాత సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ మఠంవడ్డిపల్లెకు చెందిన దంపతులు సల్లాపురి, యల్లమ్మ కుమారుడు రెడ్డెప్పను రెండో వివాహం చేసుకుంది. వీరు కొంత కాలానికి మదనపల్లె అనపగుట్టలో స్థిరపడ్డారు. ఆ సమయంలో రెడ్డెప్ప తండ్రి సల్లాపురి చనిపోవడంతో తిరిగి మకాంను స్వగ్రామానికి మార్చాడు. అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో వరుసకు మరిది అయిన నరసింహులు, అతని భార్య అరుణ కలిసి రెడ్డెప్ప ఇంటిలో లేని సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చారు. మెలకువ వచ్చి చూడగా ముంబయిలోని వేశ్యం గృహంలో ఉంది. ఏడాదిన్నరపాటు వేశ్యావృత్తిలో చిత్రహింసలు అనుభవించింది. అదేవిధంగా మరో ముగ్గురు మహిళలు వైశ్యాగృహం నుంచి తప్పించుకోబోయి నిర్వాహకులు తీసిన కరెంటు ఉచ్చులో పడి మృతి చెందారని బాధితురాలు తెలిపింది. దీంతో భయపడి తాను తప్పించుకోవడానికి మార్గాలు వెతికి ఆరు రోజుల క్రితం అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లు తెలిపింది. అనంతరం భర్త ఉన్న చోటును తెలుసుకుని జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో సీపీఐ నాయకుల సహాయంతో ఇక్కడికి వచ్చినట్టు పేర్కొంది. తనలాగా మరెందరో మహిళలు వేశ్యాగృహాల్లో మగ్గుతున్నారని కన్నీటిపర్యంతమైంది. స్పందించిన డీఎస్పీ కిడ్నాప్ చేసిన ప్రాంతం సోమల మండలానికి చెందినది కావడంతో అక్కడి డీఎస్పీ, సీఐలతో మాట్లాడి బాధితురాలిని సోమలకు పంపారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
కర్నూలు: స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీనివాసనగర్ రెవెన్యూ వార్డులో గదిని అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యులముఠా గుట్టుçను షీ–టీమ్స్ రట్టు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్‌కు చెందిన లక్ష్మి, వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన మండ్ల మధుసూదన్‌రావు, శరీన్‌నగర్‌కు చెందిన మన్నెపోగు ప్రవీణ్‌కుమార్, రామచంద్రానగర్‌కు చెందిన మంగలి ఉపేంద్ర, విశాఖపట్టణానికి చెందిన పోలవరం భవాని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా కర్నూలు నగరంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. నెలకోసారి కాలనీలు మారుస్తూ గుంటూరు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారి ఫొటోలను విటులకు వాట్సాప్‌ల ద్వారా పంపించి రహస్యంగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు షీ–టీమ్స్ ఎస్ఐ విజయలక్ష్మి తన సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పట్టుడిన ముగ్గురు మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి స్వదార్ హోమ్‌కు తరలించారు. ఇందులో కర్నూలుకు చెందిన ఒకరు, తిరుపతికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితులను తాలూకా పోలీసులకు అప్పగించారు. మద్దూర్ నగర్లో...: మద్దూర్ నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మహిళా పీఎస్ ఎస్ఐ చిన్నపీరయ్య నేతృత్వంలో మంగళవారం దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు సయ్యద్, షాహిదాబీ, షేక్ ముబీనా, షేక్ గౌసియాబీతో పాటు విటుడు రమేష్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద 8 సెల్ఫోన్లు, రూ.7,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
బ్యూటీ పార్లర్లో వేశ్యవాటిక డబ్బులు ఇవ్వలేదనే..
మైసూరు: నగరంలో ఓ బ్యూటీ పార్లర్లో వేశ్యవాటిక నడుపుతూ పట్టుబడ్డ కేసులో ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. బ్యూటీపార్లర్‌లో పని చేస్తున్న యువతి డబ్బులు డిమాండ్ చేసిందని అందుకు అంగీకరించకపోవడంతో తన భర్త రాజేశ్‌పై కమిషనర్‌కు ఫిర్యాదు చేసిందంటూ బ్యూటీ పార్లర్ యజమాని రాజేశ్ భార్య సవిత ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన భర్త రాజేశ్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పార్లర్‌ను ప్రారంభించారని, అయితే పార్లర్లో నష్టాలు రావడంతో రెండు నెలలుగా పార్లర్ అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామన్నారు. ఇంటి అద్దె కూడా చెల్లించే స్థోమత లేకపోవడంతో తన కుమార్తెతో పాటు పార్లర్‌లోనే ఉంటున్నామన్నారు. ఆరోపణలు చేసిన యువతి తమ పార్లర్లో పది రోజులు కూడా పని చేయలేదని 20 రోజుల క్రితం శెలవుపై వెళ్లిన యువతి మంగళవారమే తిరిగి వచ్చిందన్నారు. మరుసటి రోజే పార్లర్‌పై పోలీసులు దాడి చేసారన్నారు. వ్యక్తిగత కక్షతోనే ఒడనాడి సంస్థ సదరు యువతితో కలసి కుట్ర పన్నారని, అందులో భాగంగానే పార్లర్లో తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ నాటకమాడారని ఆరోపించారు. -
కూకట్‌పల్లిలో వ్యభిచార గృహం గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నవారికి హైదరాబాద్ పోలీసులు చెక్‌పెడుతున్నారు. వరుసగా వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నారు. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేశారు. నలుగురు నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేశారు. కూకట్పల్లి 6వ ఫేజులో వ్యభిచారం నడుస్తోందనే సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈదాడుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతితోపాటు పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి రూ.లక్షా 32 వేల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈదాడుల్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్వాహకులు ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఫోన్ ద్వారా విటులకు గాలం వేస్తారు. అనంతరం రేటు మాట్లాడుకొని వ్యభిచార గృహానికి పంపిస్తారు. గత కొద్ది నెలలుగా గుట్టు చప్పడుకాకుండా, ఇరుగు పొరుగుకు ఏమాత్రం అనుమానం రాకుండా ఈ తంతు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
కుషాయిగూడ (హైదరాబాద్): ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నూర్జహాన్, ప్రియాంక, శేఖర్‌రెడ్డి అనే ముగ్గురు మౌలాలి హసింగ్బోర్డు, కృష్ణానగర్ కాలనీలో గతకొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు దాడులు జరిపి విటులు వెంకటేశ్, అఖిల్, వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువతలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు శేఖర్‌రెడ్డి, ప్రియాంకను అరెస్టు చేయగా నూర్జహాన్ పరారీలో ఉంది. కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న యువతులను స్టేట్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.