వ్యభిచార ముఠా గుట్టురట్టు | she teams areest prostitution team | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టురట్టు

Published Wed, Jan 24 2018 12:07 PM | Last Updated on Wed, Jan 24 2018 12:07 PM

she teams areest prostitution team - Sakshi

మద్దూర్‌నగర్‌లో వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్టు చూపుతున్న పోలీసులు

కర్నూలు:  స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీనివాసనగర్‌ రెవెన్యూ వార్డులో గదిని అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యులముఠా గుట్టుçను షీ–టీమ్స్‌ రట్టు చేసింది.  వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్‌కు చెందిన లక్ష్మి, వీకర్‌సెక్షన్‌ కాలనీకి చెందిన మండ్ల మధుసూదన్‌రావు, శరీన్‌నగర్‌కు చెందిన మన్నెపోగు ప్రవీణ్‌కుమార్, రామచంద్రానగర్‌కు చెందిన మంగలి ఉపేంద్ర, విశాఖపట్టణానికి చెందిన పోలవరం భవాని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా కర్నూలు నగరంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు.

నెలకోసారి కాలనీలు మారుస్తూ గుంటూరు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారి ఫొటోలను విటులకు వాట్సాప్‌ల ద్వారా పంపించి రహస్యంగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు షీ–టీమ్స్‌ ఎస్‌ఐ విజయలక్ష్మి తన సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. పట్టుడిన ముగ్గురు మహిళకు కౌన్సెలింగ్‌ నిర్వహించి స్వదార్‌ హోమ్‌కు తరలించారు. ఇందులో కర్నూలుకు చెందిన ఒకరు, తిరుపతికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు.   నిందితులను తాలూకా పోలీసులకు అప్పగించారు.

మద్దూర్‌ నగర్‌లో...: మద్దూర్‌ నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం  జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మహిళా పీఎస్‌ ఎస్‌ఐ చిన్నపీరయ్య నేతృత్వంలో మంగళవారం దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు సయ్యద్, షాహిదాబీ, షేక్‌ ముబీనా, షేక్‌ గౌసియాబీతో పాటు విటుడు రమేష్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద 8 సెల్‌ఫోన్లు, రూ.7,050 నగదు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement