
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో, పోకిరీలకు షీ టీమ్స్ చెక్‌పెడుతున్నాయి. గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మంది అకతాయిలను షీ టీమ్స్ పట్టుకున్నారు.
కాగా, గణేష్ ఉత్సావాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణపతి వద్దకు వేలాది సంఖ్యలో మహిళలు, యువతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వారి పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించారు. గడిచిన ఏడు రోజుల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మందిని అరెస్ట్ చేసినట్టు షీ టీమ్స్ తెలిపాయి. ఇక, గణేష్ ఉత్సవాల్లో మహిళల భద్రతపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఖైరతాబాద్‌లో కిక్కిరిసిన భక్త సందోహం