team arrest
-
ఆస్పత్రుల్లో బెడ్ బ్లాక్ ముఠా అరెస్ట్
బనశంకరి: బెడ్బ్లాకింగ్ కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. బీబీఎంపీ దక్షిణ వలయ కోవిడ్ వార్ రూమ్ హెల్ప్‌లైన్‌లో పనిచేసే వరుణ్, అతడి స్నేహితుడు యశ్వంతకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెడ్ అవసరమైన వారి ఫోన్ నంబరును వరుణ్ సేకరించి స్నేహితుడు యశవంత్‌కుమార్ ద్వారా మాట్లాడించేవాడు. ఐసీయూలో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌలభ్యం కలిగిన బెడ్ ఇస్తామని చెప్పి తన బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమ చేయించుకొని ప్రభుత్వ కోటాలోని బెడ్ కేటాయింపు చేసేవాడు. ఇప్పటి వరకు ఎంతమంది వద్ద డబ్బు తీసుకున్నారనేది విచారిస్తున్నామని సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
కర్నూలు: స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీనివాసనగర్ రెవెన్యూ వార్డులో గదిని అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యులముఠా గుట్టుçను షీ–టీమ్స్ రట్టు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్‌కు చెందిన లక్ష్మి, వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన మండ్ల మధుసూదన్‌రావు, శరీన్‌నగర్‌కు చెందిన మన్నెపోగు ప్రవీణ్‌కుమార్, రామచంద్రానగర్‌కు చెందిన మంగలి ఉపేంద్ర, విశాఖపట్టణానికి చెందిన పోలవరం భవాని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా కర్నూలు నగరంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. నెలకోసారి కాలనీలు మారుస్తూ గుంటూరు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారి ఫొటోలను విటులకు వాట్సాప్‌ల ద్వారా పంపించి రహస్యంగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు షీ–టీమ్స్ ఎస్ఐ విజయలక్ష్మి తన సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పట్టుడిన ముగ్గురు మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి స్వదార్ హోమ్‌కు తరలించారు. ఇందులో కర్నూలుకు చెందిన ఒకరు, తిరుపతికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితులను తాలూకా పోలీసులకు అప్పగించారు. మద్దూర్ నగర్లో...: మద్దూర్ నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మహిళా పీఎస్ ఎస్ఐ చిన్నపీరయ్య నేతృత్వంలో మంగళవారం దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు సయ్యద్, షాహిదాబీ, షేక్ ముబీనా, షేక్ గౌసియాబీతో పాటు విటుడు రమేష్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద 8 సెల్ఫోన్లు, రూ.7,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
పాత కరెన్సీ మార్పిడి ముఠా గుట్టురట్టు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో పాత కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి జోన్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఇందులో కీలకపాత్ర పోషించిన ఇద్దరితోపాటు ఒక జువైనల్‌ను అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పీఎస్‌లో మల్కాజిగిరి ఏసీపీ సందీప్ రావు బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన మహమ్మద్ హఫీజ్ హైదరాబాద్ వచ్చి ముర్గీచౌక్‌లో గాజులు తయారు చేస్తున్నాడు. తలాబ్ కట్టకు చెందిన ఆదిల్, ఘాజీ బజార్‌కు చెందిన బాబుభాయ్, మరొక మైనర్‌తో కలిసి లక్షకు ఇరవై శాతం కమీషన్‌తో పాత కరెన్సీ మార్పిడి చేస్తామని నమ్మబలికి సన్నిహితులు, మిత్రులు, బంధువుల నుంచి దాదాపు రూ.75 లక్షలకు పాత కరెన్సీని సేకరించారు. ప్రధాన నిందితుడు హఫీజ్ బుధవారం ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లో తన దగ్గర ఉన్న రూ.74 లక్షల 71 వేలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి రెండు మోటర్ సైకిళ్లపై దాచిపెట్టి మధ్యవర్తుల కోసం ఆదిల్‌తో కలిసి ఎదురు చూస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.74.71 లక్షల విలువ జేసే పాత కరెన్సీ, రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు బాబూభాయ్ పరారీలో ఉండగా మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
గంజాయి స్మగ్లర్లకు పదేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా
రాజమహేంద్రవరం క్రైం : గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2016 సెప్టెంబర్ 11న డొంకరాయి వైపు నుంచి మోతుగూడెం వైపు వస్తున్న టాటా ఏస్ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. వరంగల్‌కు చెందిన బొంతు అశోక్ కుమార్, దారవాడ ప్రసాద్, మల్కన్ గిరి జిల్లాకు చెందిన మోర్సు నూకరాజు, విశాఖ జిల్లా సీలేరు గ్రామానికి చెందిన మహ్మద్ ఆలీ, కొత్తూరుకు చెందిన జ్యోతుల వెంకన్న పండులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి తరలిస్తున్న కారును, 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి డొంకరాయి ఎస్సై ఎం. పండుదొర, చింతూరు సీఐ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసును రాజమహేంద్రవరం 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిపారు. నిందితులపై నేరం రుజువు కావడంతో సెషన్స్ జడ్జి ఏవీ రవీంద్రబాబు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష తోపాటు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. శేషయ్య వాదనలు వినిపించారు. -
మహిళల విక్రయ ముఠా అరెస్ట్
మహిళల విక్రయ ముఠా అరెస్ట్ సత్యవేడు: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మహిళలను వ్యభిచార గహాలకు తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళలను అక్రమంగా రవాణా చేసే ముఠాపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ నెల 14వ తేదీన సత్యవేడులోని శ్రీకాళహస్తి బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా, పి.గన్నవరం మండలం, తాటికాయలవారిపాళెంకు చెందిన ఎస్.నగ సోమేశ్వరరావు అలియాస్ బాబు(33)ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణలో అతను మహిళలను ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపించి అక్కడ వ్యభిచార కేంద్రాలకు విక్రయించే ముఠా ఏజెంట్‌గా తేలిందని తెలిపారు. ఇతను పెయింటర్‌గా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మహిళలకు ఎరవేస్తున్నట్టు పేర్కొన్నారు. చెన్నైలోని రఫి, పాండియన్, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ఏరియా ఏజెంటుగా ఉన్న ఏసుప్రేమ తదితరులు నెల్లూరు, గుంటూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం తదితర పాంతాలకు చెందిన మహిళలను విదేశాలకు తరలించారని తెలిపారు. ఎస్.నగ సోమేశ్వరరావు అలియాస్ బాబు ఇప్పటి వరకు 10మంది మహిళలను మలేషియాకు పంపించాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.