
నిందితులు వరుణ్, యశ్వంత్‌కుమార్
బనశంకరి: బెడ్‌బ్లాకింగ్ కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. బీబీఎంపీ దక్షిణ వలయ కోవిడ్ వార్ రూమ్ హెల్ప్‌లైన్‌లో పనిచేసే వరుణ్, అతడి స్నేహితుడు యశ్వంతకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెడ్ అవసరమైన వారి ఫోన్ నంబరును వరుణ్ సేకరించి స్నేహితుడు యశవంత్‌కుమార్ ద్వారా మాట్లాడించేవాడు. ఐసీయూలో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌలభ్యం కలిగిన బెడ్ ఇస్తామని చెప్పి తన బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమ చేయించుకొని ప్రభుత్వ కోటాలోని బెడ్ కేటాయింపు చేసేవాడు. ఇప్పటి వరకు ఎంతమంది వద్ద డబ్బు తీసుకున్నారనేది విచారిస్తున్నామని సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు.