banashankari police station
-
ఆస్పత్రుల్లో బెడ్ బ్లాక్ ముఠా అరెస్ట్
బనశంకరి: బెడ్బ్లాకింగ్ కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. బీబీఎంపీ దక్షిణ వలయ కోవిడ్ వార్ రూమ్ హెల్ప్‌లైన్‌లో పనిచేసే వరుణ్, అతడి స్నేహితుడు యశ్వంతకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెడ్ అవసరమైన వారి ఫోన్ నంబరును వరుణ్ సేకరించి స్నేహితుడు యశవంత్‌కుమార్ ద్వారా మాట్లాడించేవాడు. ఐసీయూలో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌలభ్యం కలిగిన బెడ్ ఇస్తామని చెప్పి తన బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమ చేయించుకొని ప్రభుత్వ కోటాలోని బెడ్ కేటాయింపు చేసేవాడు. ఇప్పటి వరకు ఎంతమంది వద్ద డబ్బు తీసుకున్నారనేది విచారిస్తున్నామని సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. -
అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్
బనశంకరి: పరారీలో ఉన్న రౌడీ షీటర్‌ను పట్టుకోవడానికి వెళ్లగా పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్‌పై చాకుతో గాయపరచడంతో పోలీసులు గన్‌కు పని బెట్టారు. నిందితుడిని అదుపులోకి చేసేందుకు పోలీసులు కాలిపై కాల్పులు జరపడంతో రౌడీ షీటర్ కిందపడిపోయాడు. కిందపడిన అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కర్నాటకలోని బనశంకరి ప్రాంతంలో జరిగింది. రామమూర్తినగరకు చెందిన సూర్య అలియాస్ జెట్టి రెండు హత్యలు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రౌడీ షీటర్‌గా గుర్తింపు పొందాడు. ఇతడి ముఠా ఈ నెల 4వ తేదీన రఘురామ్ అనే వ్యక్తిపై దాడి చేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతడు ఒకచోట ఉన్నాడని తెలుసుకుని వెళ్లగా పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ఏసీపీ పరమేశ్వర్ నేతృత్వంలో మంగళవారం అర్ధరాత్రి హెచ్బీఆర్ లేఔట్ రెండోక్రాస్లోని ఓ ఇంటిపై దాడి చేశాడు. అతడిని పట్టుకోబోగా చీకట్లో పారిపోయాడు. సమీపంలో కానిస్టేబుల్ హనుమేశ్, సూర్యలపై చాకుతో దాడి చేశాడు. దాడికి దిగడంతో విధిలేక ఏసీపీ పరమేశ్వర్ కాల్పులు జరిపాడు. జెట్టి కాలికి కాల్పులు చేయడంతో గాయమై కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు ఆ రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని బౌరింగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రౌడీ షీటర్ చేతిలో గాయపడిన పోలీసులను కూడా ఆస్పత్రికి తరలించారు. చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా -
కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి నగదు చోరి
బెంగళూరు : ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి దాదాపు రెండు లక్షల చోరి జరిగింది. చన్నపట్న నియోజవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ తన అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు మోసపూరితంగా ఎవరో విత్‌డ్రా చేశారని బనశంకరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ జేసీ రోడ్డు శాఖలోని తన అకౌంట్ నుంచి మార్చి 18న ఈ దొంగతనం జరిగినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబాయి , పూణే నుంచి వీటిని విత్ డ్రా చేసినట్టు కూడా తన ఫిర్యాదులో చెప్పారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏటీఎం కార్డు ద్వారానా లేదా ఇతర పద్ధతుల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఈ దొంగతనం పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విత్ డ్రాకు అవకాశముండే అన్ని రకాల విధానాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.