కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి నగదు చోరి | Bengaluru: Rs 1.9 lakh stolen from my account, says Congress MLA | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి నగదు చోరి

Published Sat, Mar 25 2017 12:49 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

Bengaluru: Rs 1.9 lakh stolen from my account, says Congress MLA

బెంగళూరు : ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి దాదాపు రెండు లక్షల చోరి జరిగింది. చన్నపట్న నియోజవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ తన అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు మోసపూరితంగా ఎవరో విత్డ్రా చేశారని బనశంకరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ జేసీ రోడ్డు శాఖలోని తన అకౌంట్ నుంచి మార్చి 18న ఈ దొంగతనం జరిగినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ముంబాయి , పూణే నుంచి వీటిని విత్ డ్రా చేసినట్టు కూడా తన ఫిర్యాదులో చెప్పారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే  ఏటీఎం కార్డు ద్వారానా లేదా ఇతర పద్ధతుల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఈ దొంగతనం పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విత్ డ్రాకు అవకాశముండే అన్ని రకాల విధానాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement