హాస్పిటల్ బెడ్‌పై జుకర్‌బర్గ్ - ఇన్‌స్టా పోస్ట్ వైరల్ | Mark Zuckerberg In Hospital Bed Photos Viral | Sakshi
Sakshi News home page

Mark Zuckerberg: ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. హాస్పిటల్ బెడ్‌పై జుకర్‌బర్గ్ - ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Published Sat, Nov 4 2023 2:45 PM | Last Updated on Sat, Nov 4 2023 3:07 PM

Mark Zuckerberg In Hospital Bed Photos Viral - Sakshi

మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) మోకాలికి గాయం కావడంతో ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సమయంలో మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు.

మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ ప్రకారం, ఏఎల్‌సీ (Anterior Cruciate Ligament) తొలగించి రీప్లేస్ చేయించుకోవడానికి ఆపరేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్‌లోని వైద్య సిబ్బంది తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.

ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో

వచ్చే ఏడాది మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొనటానికి ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీని వల్ల శిక్షణకు ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి ఉందని, కోలుకున్న తరువాత మళ్ళీ శిక్షణ ప్రారంభిస్తానని జుకర్‌బర్గ్ వెల్లడించారు. నాపైన ప్రేమ చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement