Hospital Bed
-
హాస్పిటల్ బెడ్‌పై జుకర్‌బర్గ్ - ఇన్‌స్టా పోస్ట్ వైరల్
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) మోకాలికి గాయం కావడంతో ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సమయంలో మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ ప్రకారం, ఏఎల్సీ (Anterior Cruciate Ligament) తొలగించి రీప్లేస్ చేయించుకోవడానికి ఆపరేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్‌లోని వైద్య సిబ్బంది తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో వచ్చే ఏడాది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొనటానికి ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీని వల్ల శిక్షణకు ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి ఉందని, కోలుకున్న తరువాత మళ్ళీ శిక్షణ ప్రారంభిస్తానని జుకర్‌బర్గ్ వెల్లడించారు. నాపైన ప్రేమ చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు!
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి టీమిండియా ఆతిథ్యం ఇస్తుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియా గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో రోహిత్ సేనపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 2011లో వరల్డ్‌కప్ గెలిచిన ధోని సేన మ్యాజిక్‌ను రోహిత్ బృందం రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఇక వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా ఒక్క మ్యాచ్‌పై మాత్రం అందరి ఆసక్తి నెలకొంది. అదే ఇండియా, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న(ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న లీగ్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడంతో ఈసారి టీఆర్పీ రేటింగ్‌లు బద్దలవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ పురస్కరించుకొని అహ్మదాబాద్ ప్రాంతంలో అన్ని స్టార్ హోటల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మ్యాచ్ చూడడం కోసం వచ్చే అభిమానులతో హోటల్ గదులన్నీ నిండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం ఎన్నో నెలల ముందుగానే అహ్మదాబాద్ లో హోటల్ రూమ్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్కడి హోటల్ యజమాను ఏకంగా రోజుకు రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కొన్ని స్టార్ హోటల్స్ లో ఇది ఏకంగా రూ.లక్ష వరకూ ఉంది. అయినా వాటిలోనూ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దీంతో అభిమానులు కొత్త ప్లాన్ వేశారు. నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఒక రోజు వసతి కోసం అక్కడి హాస్పిటల్స్ ను కూడా ఫ్యాన్స్ వదలడం లేదు. ఇప్పటికే అలా తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గర్లో ఉన్న హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. హెల్త్ చెకప్ కూడా.. ఈ హాస్పిటల్ బెడ్స్ కు కూడా ఆ ఒక్క రోజు వసతి కోసం రూ.3 వేల నుంచి రూ.25 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. అందులోనే ఆహారంతోపాటు పూర్తి మెడికల్ చెకప్ లాంటి వసతులు కూడా ఇస్తున్నారు. దీంతో హోటల్ గదుల్లో వేలకువేలు పోసి రూమ్ తీసుకోవడం కంటే ఇలా చేయడం బెటరని చాలా మంది భావిస్తున్నారు. పేషెంట్ తోపాటు మరొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తమ హెల్త్ చెకప్ పూర్తి కావడంతోపాటు ఒక రోజు వసతి కూడా కలుగుతుందన్నది చాలా మంది భావనగా కనిపిస్తోందని అక్కడి హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ నిఖిల్ లాలా చెప్పారు. ఆ అక్టోబర్ 15 సమయంలోనే తమకు 24 గంటల నుంచి 48 గంటల వసతి కోసం ఎన్నో వినతలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్, కివీస్ మ్యాచ్‌తో మహాసంగ్రామం మొదలు.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో మొత్తంగా 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా లీగ్ మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనుండగా.. మొదటి సెమీ ఫైనల్‌కు ముంబై, రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక అక్టోబర్ 5న డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా సమరానికి తెర లేవనుంది. చదవండి: Ind Vs WI 2nd Test: ధోనిని అధిగమించిన రోహిత్.. సిక్సర్ల విషయంలోనూ రికార్డే -
హాస్పిటల్ బెడ్స్‌పై జీఎస్టీ బాదుడు: మరింత నరకం!
సాక్షి, ముంబై: ‘ఒకే దేశం ఒకే పన్ను’ అంటూ కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ ఇపుడికి రోగులను కూడా చుట్టుకుంది. కార్పొరేట్ ఆసుపత్రుల బాదుడుకు తోడు బీజేపీ సర్కార్ మరో భారాన్ని మోపింది. జూన్ చివరలో జరిగిన 47వ సమావేశంలో హాస్పిటల్ బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీని కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీని కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నేటి(జూలై 18, 2022) రూ.5 వేలకు పైగా చార్జీ ఉండే పడకలపై అదనపు భారం పడనుంది. ఐసీయూ మినహాయించి, ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ ఉండే బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడు తప్పదు. ఇన్పుట్ ట్యా ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి గది అద్దెపై జీఎస్టీ రోగుల ఆరోగ్య సంరక్షణ భారాన్ని పెంచుతుందని, అలాగే పరిశ్రమకు పెను సవాళ్లతోపాటు, ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. Instead of learning from the havocking results of its failed healthcare system during COVID, the Modi govt is hell-bent on making it more disastrous. #GabbarSinghStrikesAgain pic.twitter.com/M4KNPnn5LB — Congress (@INCIndia) July 18, 2022 ఈ రోజునుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్నులపై కాంగ్రెస్ మండిపడింది. చివరికి ఆసుపత్రి పడకలపై కూడా పన్ను బాదుడుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవస్పత్రి పడకలపై కూడా పన్నుతో గబ్బర్ సింగ్ మరో బాదుడుకు తెరతీశాడని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. కేంద్రం నిర్ణయం దేశ ప్రజలపై పెను భారం మోపుతుందని ట్విటర్లో మండిపడింది. అసలే కోవిడ్-19 మహమ్మారిసంక్షోభంతో ఆరోగ్య సంరక్షణకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి, ముఖ్యంగా పేద ప్రజలను మరింత నరకంలో నెట్టేసిందని ట్వీట్ చేసింది. కాగా దేశంలో హెల్త్‌కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకురావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో సహా అనేక వస్తువులపై జీఎస్టీ వసూలుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
మహారాష్ట్రలో లాక్డౌన్?.. ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మరోసారి స్పష్టం చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, రాజేశ్ టోపే, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, తాజా పరిస్థితులపై పవార్, టోపే ఆరా తీశారు. రాష్ట్రంలో చాపకింద నీరులా రోజురోజుకూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పవార్ వాస్తవాలు తెలుసుకునేందుకు టోపే, ఆరోగ్య శాఖ అధికారులతో స మావేశమయ్యారు. తాజా పరిస్థితులపై ప్రత్యామ్నాయ విధానాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వ్యాక్సినేషన్, లాక్డౌన్, కరోనా ఆంక్షలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంక్షలు సక్రమంగా అమలు కాకపోతే నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పవార్ నిర్ధేశించారు. రోగుల సంఖ్య పెరిగితే దుకాణాలు, సంస్థలు మూసివేయాలనే దానిపై కూడా చర్చ జరిగింది. అలాగే మాల్స్, రెస్టారెంట్లలో జనసమ్మర్థంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఈ విషయంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించని ప్రజలు, వాణిజ్య సముదాయాల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలని వారు ఆదేశించా రు. కరోనా టీకా విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని, సాధ్యమైనంత త్వరలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మోదీ పర్యటనలో భద్రతా లోపం.. సుప్రీంలో విచారణ ఇదిలాఉండగా ముంబైలో వీకెండ్ లాక్‌డౌన్‌పై కూడా చర్చలు జరిగినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్య మంత్రి తెలిపారు. ప్రస్తుతమైతే ఎక్కడా లాక్డౌన్ విధించే అలోచన ప్రభుత్వానికి లేదని వారు పునరుద్ఘాటించారు. ఇటీవల కూడా ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో లోకల్ రైలు ద్వారా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతానికి ఆ సేవలు నిలిపివేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కరోనా రెండు డోసుల టీకా తీసుకున్నవారినే రైళ్లలో అనుమతిస్తున్నామని, తగు జాగ్రత్తలతో రైళ్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. చదవండి: విదేశీ చేతుల్లోకి ఎల్ఐసీ! కేంద్రం కసరత్తు కాగా ముంబైలోనూ, రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 80 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ మాత్రం పెరగడం లేదని మంత్రి టోపే అన్నారు. ఇదిలాఉండగా శరద్ పవార్ కరోనా టీకా తీసుకుని 9 నెలలు కావస్తోంది. దీంతో ఆయన ఈ నెల 10వ తేదీన బూస్టర్ డోసు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
మెడికవర్ మరిన్ని ఆసుపత్రులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. 20 నెలల్లో 2,000 పడకలను జోడించి మొత్తం సామర్థ్యం 4,500లకు చేర్చింది. ఇప్పుడు అంతే వేగంగా 2024 నాటికి 7,500 బెడ్ల స్థాయికి చేరేందుకు ప్రణాళిక రచించినట్టు మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ అనిల్ కృష్ణా రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలో వైద్యులు, నర్సింగ్, ఇతర విభాగాల్లో కలిపి 10,400 మంది పనిచేస్తున్నారని తెలిపారు. మూడేళ్లలో మరో 5,000 మందికి కొత్తగా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనింకా ఏమన్నారంటే.. మెట్రో నగరాలు లక్ష్యంగా.. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, కాకినాడ, మహారాష్ట్రలో ఔరంగాబాద్, నాసిక్, సంగమనేర్లో ఆసుపత్రులు నెలకొన్నాయి. వీటిలో మల్టీ స్పెషాలిటీతోపాటు క్యాన్సర్ కేర్, పిల్లలు, స్త్రీల వైద్యం కోసం ప్రత్యేక కేంద్రాలూ ఉన్నాయి. మూడేళ్లలో కొత్తగా హైదరాబాద్‌తోపాటు వరంగల్, మహారాష్ట్రలో ముంబై, పుణే, కొల్హాపూర్, నాసిక్‌లో హాస్పిటల్స్ జతకూడనున్నాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరులో విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తాం. కొన్ని కేంద్రాలు లాభాల్లో, మిగిలినవి లాభనష్టాలు లేని స్థితికి చేరుకున్నాయి. సంస్థలో ప్రధాన వాటాదారు అయిన మెడికవర్ అంచనాలను మించి పనితీరు కనబరుస్తున్నాం. ఇతర విభాగాల్లోకి ఎంట్రీ.. ఔషధాల ఉత్పత్తి, విక్రయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నాం. డయాగ్నోస్టిక్స్ సేవలనూ పరిచయం చేస్తాం. ఇప్పటి వరకు సంస్థ రూ.1,450 కోట్లు వెచ్చించింది. మూడేళ్లలో కొత్త కేంద్రాలకు రూ.1,000 కోట్లు వ్యయం కానుంది. క్యాన్సర్ కేర్, పిల్లలు, స్త్రీల కోసం స్పెషాలిటీ హాస్పిటల్స్ నాలుగైదు రానున్నాయి. ఇందుకు మరో రూ.300 కోట్లు వ్యయం ఉంటుంది. 50 శాతం రుణం, మిగిలిన మొత్తాన్ని అంతర్గత వనరులు, వాటా విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరిస్తాం. సంస్థలో స్వీడన్‌కు చెందిన మెడికవర్‌కు 60 శాతం వాటా ఉంది. అన్నీ సవ్యంగా సాగితే 2025లో ఐపీవోకు రావాలన్నది ఆలోచన. -
పేదలకు సేవ చేయడమే లక్ష్యం..
సత్తుపల్లి: పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చంద్రభాను సత్పతి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో నిర్మించనున్న 250 పడకల ఆస్పత్రి భవనానికి సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి వారు శంకుస్థాపన చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి, చంద్రభానును ఎమ్మెల్యే సండ్ర సన్మానించారు. -
సత్తుపల్లిలో 250 పడకల ఆస్పత్రి
పంజగుట్ట: దేశంలో అన్నింటికన్నా వైద్యం ఎంతో ఖరీదుగా మారిందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో శ్రీ షిరిడీసాయి జన మంగళం ట్రస్ట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన ఆసుపత్రి లోగో, నమూనా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని, గతంలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం మరో 12 పెంచి మొత్తం 17 మెడికల్ కాలేజీలు, ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్యం అందించాలని 700 పీసీహెచ్ సెంటర్లకు అదనంగా గ్రామాల్లో 4 వేల పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ్డట్రస్ట్ ఆస్పత్రికి ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. గొప్ప కార్యక్రమం: టీటీడీ చైర్మన్ అందరూ ఆస్పత్రిని పెద్ద నగరంలో కడితే బాగుంటుందని అనుకుంటారని, కానీ సాయి ట్రస్ట్ మాత్రం సత్తుపల్లిలోని మారుమూల గిరిజన గ్రామాన్ని ఎంచుకుందని, ఇది గొప్ప కార్యక్రమమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఏపీ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలోనే ఆస్పత్రి రానుండటం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారికీ ఉపయోగంగా ఉంటుందన్నారు. టీటీడీ తరఫున తామూ కొన్ని ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందిస్తున్నామని, ఇటీవల పీడియాట్రిక్ ఆస్పత్రి పారంభించామని చెప్పారు. అభినందనీయం: నటుడు మోహన్‌బాబు ఎదుటివారి కష్టాలు తెలుసుకొని తీర్చేందుకు మారుమూల ప్రాంతంలో ఆస్పత్రి నిర్మిస్తున్న సాయి ట్రస్ట్ ప్రతినిధులు అభినందనీయులని ప్రముఖ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్‌బాబు అన్నారు. రెండేళ్లుగా ప్రజలు కొత్తకొత్త వ్యాధులతో సతమతమౌతున్నారని వారి ఇబ్బందులు చూసి మారుమూల ప్రాంతంలోని ప్రజలకు వైద్యం అందించేందుకు ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఐపీఎస్ చంద్రభాను సత్పతి, ట్రస్ట్ ప్రతినిధి రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
గాంధీ ఆస్పత్రి: హృదయ విదారకం.. ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు..
సాక్షి, గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి గైనకాలజీ విభాగంలో ఇరువురు బాలింతలకు ఒకే బెడ్ కేటాయించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రధాన భవనంలోని మొదటి, రెండు అంతస్తుల్లో గైనకాలజీ విభాగం కొనసాగుతోంది. గైనిక్ సాధారణ, లేబర్ వార్డుల్లో కలిపి సుమారు 200 మందికి వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. ప్రతిరోజు 25 నుంచి 30 డెలివరీలు జరుగుతాయి. ఇరువురు బాలింతలకు ఒకే బెడ్ కేటాయించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. కరోనా సమయంలో బాలింతలు, శిశువుల కలిసి మొత్తం నలుగురు ఒకే పడకపై ఎలా పడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేబర్‌వార్డులో ఒకే మంచంపై ఇరువురు బాలింతలు తమ శిశువులతో ఉన్న దృశ్యాలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి పాలన యంత్రాంగం స్పందించి విచారణ చేపట్టింది. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం కోవిడ్ పడకలతో సమస్య ఉత్పన్నం.. కరోనా మొదటి, సెకండ్‌వేవ్‌ల సమయంలో గాంధీ గైనకాలజీ విభాగం అత్యుత్తమ సేవలు అందించింది. కరోనా సోకిన వందలాది మంది గర్భిణులకు పురుడు పోసి తల్లీబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పాజిటివ్ గర్భిణులు, థర్డ్‌వేవ్ వస్తే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కొన్ని వార్డులను కరోనా కోసం కేటాయించడం, డెలివరీ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో పడకల సమస్య ఉత్పన్నమయినట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట గైనకాలజీ పడకల సంఖ్య పెంపు.. గైనకాలజీ విభాగంలో పడకల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. ఇరువురు బాలింతలకు ఒకే బెడ్ కేటాయించినట్లు మా దృష్టికి రావడంతో విచారణ చేపట్టాం. కొన్ని బెడ్లపై బాలింతలతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయకులు ఉన్నట్లు గుర్తించాం. గైనకాలజీ విభాగంలో కొన్ని వార్డులను కోవిడ్‌కు కేటాయించడంతో అందుబాటులో ఉన్న పడకల సంఖ్య కొంతమేర తగ్గాయి. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఆస్పత్రుల్లో బెడ్ బ్లాక్ ముఠా అరెస్ట్
బనశంకరి: బెడ్బ్లాకింగ్ కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. బీబీఎంపీ దక్షిణ వలయ కోవిడ్ వార్ రూమ్ హెల్ప్‌లైన్‌లో పనిచేసే వరుణ్, అతడి స్నేహితుడు యశ్వంతకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెడ్ అవసరమైన వారి ఫోన్ నంబరును వరుణ్ సేకరించి స్నేహితుడు యశవంత్‌కుమార్ ద్వారా మాట్లాడించేవాడు. ఐసీయూలో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌలభ్యం కలిగిన బెడ్ ఇస్తామని చెప్పి తన బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమ చేయించుకొని ప్రభుత్వ కోటాలోని బెడ్ కేటాయింపు చేసేవాడు. ఇప్పటి వరకు ఎంతమంది వద్ద డబ్బు తీసుకున్నారనేది విచారిస్తున్నామని సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. -
రోగులకు బెడ్ లేదనే సమాధానం రాదు: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్టణం: రోగులకు బెడ్ లేదు అనే సమాధానం లేకుండా వైద్యం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లాల్లో 79 కోవిడ్ ఆసుపత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించార. సిబ్బంది కొరత ఉంటే వెంటనే నియమించుకునే అధికారం జిల్లా అధికారాలకు కల్పించినట్లు గుర్తుచేశారు. ఆక్సిజెన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘1,443 ఆరోగ్య శ్రీ బెడ్లు ఉండగా వీటిని పెంచే యోచనలో ఉన్నాం. హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ పీపీ కిట్, ఎన్-95 మాస్కులు అందిస్తున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు.. విమర్శలకు తావులేకుండా సమష్టిగా పనిచేయాలి. కేంద్రం నుంచి దశల వారీగా వ్యాక్సిన్ వస్తోంది. అందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. జిల్లాలో 46 వేల మంది ఇటీవల కోవిడ్‌తో చేరగా అందులో 26 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వ్యక్తులు కోలుకుంటున్నారు.’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్ కొరత లేదు చదవండి: ‘కోవిషీల్డ్’ డోసులలో కీలక మార్పులు -
కోవిడ్ పేషెంట్స్ కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్న నటి
ఢిల్లీ : భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి ముందుకు వచ్చారు. ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంటుతో పాటు 100 పడకల హాస్పిటల్‌ను కట్టిస్తామని ప్రకటించింది. హాలీవుడ్ దర్శకుడు జాక్ స్నైడర్‌తో కలిసి తాత్కలిక ఆసుపత్రి సదుపాయాన్ని కల్పిస్తానని పేర్కొంది. ఇందుకోసం సేవ్ ది చిల్ర్డన్ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించడానికి వీలుగా స్పెషల్ కిట్స్ అందిస్తామని, రోగి కోలుకునేవరకు వారితో డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండేలా చేస్తామని వెల్లడించారు. ఇందుకు మీ అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత్‌లో కోవిడ్ కేసులు, వైద్యం అందక ప్రజలు పడుతున్న వేధనను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని తెలిపింది. తన వంతుగా వారికి సహాయం చేసేందుకు అండగా నిలబడతానని వివరించింది. ఇక హాలీవుడ్లో జాక్ స్నైడర్ డైరెక్షన్లో తాను నటించిన 'ఆర్మీ ఆఫ్ ది డెడ్' చిత్రం మే 14న థియేటర్స్‌లో, 21న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుందని తెలిపింది. I’ve joined hands with @stc_india help Delhi fight the pandemic. We are working to build a temporary hospital facility in Delhi, that will have a 100 beds along with an oxygen plant. Please support us ❤️🙏🏻 #BreathofLife https://t.co/5RuMP0u0NG pic.twitter.com/bgRuOgfGKq — Huma S Qureshi (@humasqureshi) May 10, 2021 I’ve joined hands with Save The Children to help Delhi fight the pandemic. They are working to build a temporary hospital facility in Delhi with 100 beds along with an oxygen plant. Please support❤️🙏🏻 #BreathofLife @humasqureshi International donors: https://t.co/9ZbOQuzwQ0 — Zack Snyder (@ZackSnyder) May 10, 2021 చదవండి : కోవిడ్‌తో కాదు..సరైన వైద్యం అందక చనిపోయారు : మీరా చోప్రా వారిని క్షమాపణలు కోరిన సల్మాన్ ఖాన్ -
100 కోట్ల సినిమా కంటే ఇదే ఎక్కువ సంతృప్తి: సోనూసూద్
లాక్డౌన్ నుంచి ఆపదలో ఉన్న వారిని దేవుడిలా ఆదుకుంటున్నాడు నటుడు సోనూసూద్. ఏ కష్టం వచ్చిన కాదనకుండా సాయం చేస్తూ ఆపద్భాందవుడిలా మారాడు. గతేడాది లాక్డౌన్లో ఎంతోమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చడంతో ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ తన సేవలను కొనసాగిస్తున్నాడు. తన పనులతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా దేశంలో కరోనా పరిస్థితిని చూసి మరింత చలించిపోయాడు. కోవిడ్ పేషెంట్లను ఆదుకొని వారి ప్రాణాలను నిలబెడుతున్నాడు. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ ఏర్పాటుకు తన వంతు సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఎయిర్ అంబులెన్స్ ద్వారా కోవిడ్ బాధితురాలిని చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ చేర్చాడు. తాజాగా సోనూసూద్ ట్విటర్ ద్వారా ఓ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 100 కోట్ల సినిమాలో నటించడం కంటే ప్రజలకు సేవచేయడం ఎంతో సంతృప్తిని అందిస్తుందని పేర్కొన్నాడు. ‘అర్ధరాత్రి అనేక కాల్స్ వచ్చాయి. వీరిలో కొంతమందికైనా బెడ్స్, ఆక్సిజన్ అందించడం.. వారి ప్రాణాలను నేను కాపాడుకోగలిగితే ఒట్టేసి చెబుతున్నాను అది 100 కోట్ల సినిమా చేయడం కంటే కొన్ని లక్షలరెట్లు ఎక్కువ సంతృనిస్తుంది. ప్రజలు ఆసుపత్రుల ఎదుట బెడ్స్ కోసం ఎదురు చూస్తుంటే మేమెలా పడుకోగలం..’ అని ట్వీట్ చేశాడు. కాగా ఈ నెల 17న సోనూసూద్ సైతం కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం మహమ్మారి నుంచి కోలుకున్నాడు. చదవండి:సోనూసూద్ ఔదార్యం.. పసిబిడ్డకు ప్రాణం పోశాడు! -
విషాదం: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే
జోగిపేట (అందోల్): బెడ్స్ కోసం పదులకొద్దీ ఆస్పత్రులు తిరిగారు. చివరకు ఎలాగో దొరికిందనుకుని బెడ్‌పై చేర్చినంతనే శ్వాస ఆగి కన్నుమూసిన వైద్యుడి విషాదమిది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వాసవీనగర్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కిష్టయ్య 25 ఏళ్లుగా బొడ్మట్‌పల్లి గ్రామంలో క్లినిక్‌ను ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 20-30 గ్రామాల్లో ఆయన వైద్యంపై అపార నమ్మకం. కిష్టయ్యకు కరోనా సోకడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఆయన కుమారులు హైదరాబాద్‌కు తరలించారు. 20కి పైగా ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా బెడ్స్ దొరకలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో బెడ్ దొరగ్గానే వెంటనే చేర్చారు. అయితే వైద్యులు నాడి చూసేసరికే శ్వాస ఆగిపోయింది. డాక్టర్ కిష్టయ్య జోగిపేట లైన్స్‌క్లబ్ సభ్యుడిగా కూడా ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఇలా రోజుల వ్యవధిలోనే అస్వస్థతకు గురై మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతదేహానికి స్వగ్రామమైన బిజిలీపూర్‌లో కరోనా నిబంధనల మేరకు శనివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. కడచూపునకు కూడా నోచుకోకపోవడంపై బంధువులు, స్నేహితులు బాధను వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా.. సీఎం కేసీఆర్ చదవండి: వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే -
వ్యాక్సిన్.. టెస్టులు.. బెడ్స్ కోసం పరుగే పరుగు
కరోనా ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది. ఇంట్లో ఒకరికి వస్తే మిగిలిన వారికి వ్యాపించే ప్రమాదం నెలకొంది. మన దేశంలో వైరస్ 800 రకాలుగా పరివర్తనం చెందింది. అందుకే ఈ విజృంభణ. కాబట్టి ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. - డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య డైరెక్టర్ కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోతున్నాయి. అత్యవసర పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత నెలకొంది. బాధితులు పడకల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. - డాక్టర్ కృష్ణ ప్రభాకర్, సిటీ న్యూరో ఆసుపత్రి సాక్షి, హైదరాబాద్: మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జనం తీవ్రమైన ఆందోళనల్లోకి వెళ్లిపోయారు. కొం దరు వ్యాక్సిన్ల కోసం, మరికొందరు నిర్ధారణ పరీ క్షల కోసం, ఇంకొందరు ఆసుపత్రుల్లో పడకల కోసం పరుగులు తీస్తున్నారు. దాదాపు ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబం ఇప్పుడు పై మూడు పనుల్లోనే నిమగ్నమైందని వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేసింది. వ్యాక్సిన్లు, టెస్ట్ కిట్లు, కరోనా పడకలు మూడింటికీ కొరత ఏర్పడటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఏ ఒక్కరిని కదిలించినా తమకు తెలిసిన లేదా తమ బంధువుల్లో కొందరికి కరోనా వచ్చిందంటూ చెబుతున్నారు. అధికారికంగా నమోదవుతున్న కేసులే భయాందోళనకు గురిచేస్తుంటే.. ప్రభుత్వ అనుమతి లేకుండా అనేక ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో చేస్తున్న పరీక్షలు, కేసులు లెక్కలోకి రావట్లేదని అధికారులే పేర్కొంటున్నారు. క్లస్టర్ దశలో కేసులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రపంచంలో 70 శాతం దేశాలు కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉన్నాయి. ఇండియా క్లస్టర్ దశలో ఉందని ప్రకటించింది. క్లస్టర్ దశ అంటే గత 14 రోజుల్లో కేసులు అధికంగా నమోదైనా, అవి ఎక్కువగా ఒక ప్రాంతానికి చెందినవిగా ఉంటాయి. బయట ప్రాంతం కేసులతో సంబంధం లేకుండా రావడం. మార్కెట్లో లేదా పెళ్లిళ్లలో ఇలా కొన్నిచోట్ల విజృంభించడం. ఇలా వస్తే క్లస్టర్లు అంటారు. చాలావరకు కేసులు మనం గుర్తించని రీతిలో నమోదైనవి ఉంటాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల వారికే వస్తాయి. మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా విస్తరించింది. సెకండ్ వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా విస్తరించింది. ఫస్ట్‌వేవ్‌లో నమోదైన కేసుల్లో 50 శాతం 40 జిల్లాల్లో ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో 20 జిల్లాల్లోనే 50 శాతం కేసులు నమోదయ్యాయి. మొదటి వేవ్‌లో 75 శాతం కేసులు 60 నుంచి 100 జిల్లాల్లో నమోదు కాగా, సెకండ్ వేవ్‌లో 75 శాతం కేసులు 20 నుంచి 40 జిల్లాల్లోనే ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో కొన్నిచోట్ల మరింత ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో నమోదైన 80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. యాక్టివ్ కేసుల్లో 63 శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, కేరళలో నమోదయ్యాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ కంటే ఎక్కువగా ప్రస్తుతం దేశంలో 63 శాతం యాక్టివ్ కేసులున్న ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లు తెలంగాణకు సరిహద్దులుగా ఉండటం వల్ల ఇక్కడ అధిక కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభావం మనపై తీవ్రంగా ఉంది. అందుకే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా కేసులు కన్పిస్తున్నాయి. ఫస్ట్ వేవ్‌లో సెప్టెంబర్ 18 నాటికి దేశంలో కరోనా పీక్ దశలో ఉంది. ఆ రోజు యాక్టివ్ కేసులు 10.17 లక్షలుంటే, ఈ నెల 18న 19.29 లక్షలు ఉన్నాయి. అంటే దాదాపు రెట్టింపు కేసులు రెండు నెలల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణలో గత సెప్టెంబర్ 18న 30,673 యాక్టివ్ కేసులుంటే, ఈ ఏప్రిల్ 18న 39,154 యాక్టివ్ కేసులున్నాయి. సామాజిక వ్యాప్తికి దగ్గరలో క్లస్టర్ దశను దాటి ఇప్పుడు సామాజిక వ్యాప్తికి దగ్గరలో ఉన్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోందని పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం గడిచిన 28 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే కరోనా లేనట్లు అర్థం. గత 14 రోజుల్లో కేసులు గుర్తించడం.. ఇతర దేశాల నుంచి రావడాన్ని స్పొరాడిక్ లేదా ఇంపోర్టెడ్ దశ అంటారు. అంటే ఇక్కడ కేసులు పుట్టుకుని రాకపోవడం. ఇక క్లస్టర్ దశలో గత 14 రోజుల్లో కేసులు నమోదై అవి ఎక్కువగా ఒక ప్రాంతానికి చెందినవిగా ఉండటం. బయట ప్రాంతం కేసులతో సంబంధం లేకుండా రావడం. నాలుగోది సామాజిక వ్యాప్తి. అన్ని ప్రాంతాల్లోకి వైరస్ విస్తరించి ఉండటం. ఇందులో మళ్లీ నాలుగు దశలు ఉంటాయి. ఒకటి గత 14 రోజుల్లో విపరీతంగా పెరగడం.. క్లస్టర్‌తో సంబంధం లేకుండా పెరగడం. ఎలా కేసులు పెరుగుతున్నాయో తెలియనంతగా నమోదు కావడం. చిన్న ప్రాంతాల్లో కూడా ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు కావడం. ఇలా ఉన్నా ఈ దశలో సాధారణ వ్యక్తులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. 2) 14 రోజుల్లో బాగా కేసులు వస్తాయి. సాధారణ ప్రజలకు మధ్య స్థాయి రిస్క్ ఉంటుంది. 3) సామాజిక వ్యాప్తి ఉంటుంది. 14 రోజుల్లో కేసులు బాగా వస్తాయి. అయితే కేసులు చాలా వరకు హైరిస్క్‌లోకి వెళ్తాయి. 4) నాలుగో దశలో సామాజిక వ్యాప్తి మరింత ఉధృతంగా ఉంటుంది. మరింత హైరిస్క్‌లోకి జనం వెళ్తారు. ఇంట్లో వారికి కూడా కరోనా సోకుతుంది. మన రాష్ట్రంలోనూ వివిధ జిల్లాల్లో సామాజిక వ్యాప్తికి సమీపంలో ఉన్నామని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ప్రాంతాలు మరింత హైరిస్క్‌లో ఉన్నాయి. హైదరాబాద్ కూడా హైరిస్క్‌లో ఉందని అంటున్నారు. -
ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా చంపేయండి
ముంబై : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశంలో మహారాష్ట్రపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా పడిందనే చెప్పాలి. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి వైద్యం కోసం అతని కొడుకు 24 గంటల పాటు రెండు రాష్ట్రాల్లోని ఆస్పత్రులను తిరిగినా ఒక్క బెడ్ కూడా దొరకని దయనీయమైన దుస్థితి ఏర్పడింది. చివరకు చేసేదేమిలేక ఆస్పత్రిలో చేర్చుకొని బెడ్ అయినా ఇవ్వాలని.. లేదంటే ఇంజక్షన్ ఇచ్చి చంపమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రోగి కుమారుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన సాగర్ కిశోర్ నహర్షివర్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడ్ని అంబులెన్స్‌లో ఉంచి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ కనికరించడం లేదు. మొదట చంద్రాపూర్‌లోని వరోరా హాస్పిటల్‌కు వెళ్లగా, అక్కడ వాళ్లు కుదరదని మరో చోటుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇక అక్కడి నుంచి పలు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లినా ఏం లాభం లేకపోయింది. చివరకు రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో సరిహద్దు రాష్ట్రం తెలంగాణకు కూడా వెళ్లినప్పటికీ, అక్కడ సైతం చికిత్స అందించలేకపోయారు. ఇక చేసేదేమిలేక మళ్లీ ఉదయం తిరిగి మహారాష్ట్రకు తిరిగి వచ్చారు. 24 గంటల నుంచి తన తండ్రి అంబులెన్సులోనే ఉన్నాడని కిశోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి చికిత్స అందించడం కోసం చేయని ప్రయత్నం లేదని బాధపడుతున్నాడు. ( చదవండి: మహారాష్ట్రలో 15 రోజుల పాటు సెమీ లాక్డౌన్ ) 24 घंटे चक्कर लगाए, कहीं बेड नहीं! बुज़ुर्ग मरीज़ के बेटे की गुहार, ‘या बेड दो या इंजेक्शन देकर मार दो!’ महाराष्ट्र के चंद्रपुर का हाल. pic.twitter.com/ZzxhlnzdZL — Puja Bharadwaj (@Pbndtv) April 14, 2021 -
హాస్పిటల్లో మాదాల
విప్లవ నటుడు, నిర్మాత ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన కుమారుడు, నటుడు మాదాల రవి మాట్లాడుతూ – ‘‘నాన్నగారికి గత ఏడాది గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించాం. అప్పటి నుంచి ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. డయాలసిస్ జరుగుతోంది. ఆయన్ని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ఆరు నెలలుగా ఆస్పత్రి మంచంపైనే...
- చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారి - బోన్‌మారో ట్రాన్సప్లాంటేషన్ కోసం రూ.25 లక్షలకుపైగా ఖర్చు - దిక్కుతోచని స్థితిలో బాలిక తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: తరచూ వళ్లు కాలిపోయే జ్వరం... అంతకంతకూ క్షీణిస్తున్న ఆరోగ్యం... మాయదారి జబ్బుతో పన్నెండేళ్ల చిన్నారి ఆస్పత్రి మంచంపై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమ ఏకైక గారాల పట్టి బాధ చూడలేక... చికిత్సకు లక్షలకు లక్షలు భరించలేక... బిడ్డను బతికించుకొనే దారి లేక చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రైవేటు కాలేజీ లెక్చరర్ వి.శ్రీనివాస్, స్వరూప దంపతుల ఏకై క కుమార్తె నిత్య(12) ఆరో తరగతి చదువుతోంది. ఆరు నెలల కిందట అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. తరచూ హైఫీవర్ వస్తుండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులకు చూపించారు. జ్వరం తగ్గక పోగా ఆరోగ్యం మరింత దెబ్బతింది. చివరకు రెరుున్‌బో ఆస్పత్రికి చెందిన హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ శిరీషారాణిని ఆశ్రరుుంచగా... బాధితురాలు ‘ఇమ్యునో డెఫిసియన్సీ’తో బాధపడుతున్నట్లు గుర్తించారు. బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వల్ల వైట్ బ్లడ్ సెల్స్ 240కి, హిమగ్లోబిన్ 7.4 శాతానికి, ప్లేట్లెట్స్ కౌంట్ 19 వేలకు పడిపోయాయి. బోన్‌మారో ట్రాన్సప్లాంటేషన్ ఒక్కటే దీనికి పరిష్కారమని, అందుకు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. ఇప్పటికే ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశామని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని రోదిస్తున్నారు. దాతలెవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డను కాపాడాలని వేడుకొంటున్నారు. సాయం చేయదలుచుకున్నవారు ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ నంబర్ 117810100070778 (ఐఎఫ్‌ఎస్‌సీకోడ్: ఏఎన్‌డీబీ0001178)కు డబ్బు పంపాలని కోరుతున్నారు. వివరాలకు 9490182998 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. -
పెళ్లికూతురి ప్రతీకారం
హాలీవుడ్ / కిల్‌బిల్ అది యూఎస్‌లోని టెక్సాస్... హైవే పక్కనే ఓ చర్చి. ఫాదర్‌తో కలిపి అందులో ఉన్నది ఆరుగురే. ఇంతలో తెల్లటి గౌన్‌లో సిగ్గులొలికిస్తూ పెళ్లి కూతురు.. సూట్లో ముసిముసి నవ్వులు చిందిస్తూ పెళ్లి కొడుకు ఎంటరయ్యాడు. పెళ్లికొడుకు తరపున కొంత మంది వస్తే, పెళ్లికూతురు తరపున మాత్రం ఎవరూ లేరు. ఆమె ఓ అనాథ. తన గురించి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై బయటకు వెళ్లి చల్లగాలిని ఆస్వాదిస్తానని చెప్పింది. భారంగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్. ఇంకొన్ని రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది ఆ పెళ్లి కూతురు. ఇంత హడావుడిలో ఉన్న ఆ పెళ్లికూతురి చెవులు వేణుగానాన్ని ఆస్వాదిస్తున్నాయి. అలాంటి వాతావరణంలో ఎవరినైతే తాను చూడకూడదు అనుకుందో అతను రానే వచ్చాడు. పేరు బిల్. బిల్ ఆమెను ‘‘కిడో’’ అంటూ పలకరించాడు. ఆ పేరు పిలిచేది తనకు తెలిసిన అతి కొద్ది మందే. వారిలో ఒకడే బిల్. ఉలిక్కిపడింది. ‘‘నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది?’’ అని అడిగింది. ‘‘నువ్వెక్కడున్నావో అక్కడికి కచ్చితంగా వస్తా’’అని బదులిచ్చాడు అతను. ‘‘ఇక్కడ ఎవరికీ అనుమానం రాకూడదు సరిగ్గా ఉండు’’ అని అతడిని బతిమాలింది. సరేనన్నాడతను. తన కాబోయే భర్తకు బిల్‌ను తండ్రిగా పరిచయం చేసింది. పెళ్లి ఇంకొంచెంసేపటిలో జరుగుతుందనగా ఓ నలుగురు కత్తులతో, గన్స్‌తో విరుచుకుపడి అందర్నీ హతమార్చారు. ముఖ్యంగా పెళ్లి కూతురిని అతిక్రూరంగా హింసించారు. చావుబతుకుల మధ్య కూడా ఆమె ‘‘బిల్ నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నన్నువదిలేయ్’’ అని ప్రాధేయపడింది. కనికరించలేదు. వెంటనే ఆమె తల్లోకి బుల్లెట్ దించాడు. కట్ చేస్తే...హాస్పిటల్ బెడ్ పై కిడో. కోమాలో! ఆ పరిస్థితిలో ఉన్న ఆమెను వదల్లేదు బిల్. తనను మోసం చేసిందన్న కసితో ఉన్నాడతను. విషం ఎక్కించి చంపించాలని ప్లాన్ చేశాడు. కానీ ఆమెను అలా చంపడం కన్నా, స్పృహలో ఉన్నప్పుడు చిత్రవధ చేసి చంపాలని చివరి నిమిషంలో ప్లాన్ మారుస్తాడు. ఇంతలోనే నాలుగేళ్లు గడిచిపోతాయి. ఓ రోజు కోమాలోంచి ఉలిక్కిపడి లేస్తుంది కిడో. బిడ్డకు దూరమై, జీవచ్ఛవంలా మిగుల్తుంది. తన పరిస్థితికి కసితీరా ఏడ్చి, తన పై అత్యాచారం చేయబోయిన హాస్పిటల్ సిబ్బందిలో ఇద్దరిని చంపి ఆక్కడి నుంచి బయటపడ్తుంది. ప్రపంచంలో అత్యంత కిరాతకమైన ‘ డెడ్లీ వైపర్ అసాసినేషన్ స్క్వాడ్’లో గతంలో కిడో కూడా సభ్యురాలే. అయితే ప్రశాంతమైన జీవితం గడపాలన్న ఉద్దేశంతో మొత్తం అందర్నీ విడిచిపెట్టి పెళ్లి చేసుకొని స్థిరపడాలనుకున్న ఆమెను ఆ స్క్వాడ్ సభ్యులు వదలరు. అందర్నీ హతమారుస్తారు. తన భర్తను, కడుపులో పెరుగుతున్న బిడ్డనూ లేకుండా చేసిన వాళ్లను హతమార్చాలని ఆమె ప్లాన్. . ఆ స్క్వాడ్‌లో ఉన్న వెర్నిటా గ్రీన్‌ను హతమారుస్తుంది. జపాన్‌లో మాఫియా డాన్‌లా పాతుకుపోయిన మరో స్క్వాడ్ మెంబర్ ఒ-రెన్తో పోరాడి, ఆమె సామ్రాజ్యాన్నీ కుప్పకూలుస్తుంది. ఒ-రెన్ చనిపోయిందన్న విషయం తెలుసుకున్న బిల్ అతని సోదరుడు బడ్ కంగారుపడతారు. ఇక కిడో తమనే టార్గెట్ చేస్తుందన్న విషయం తెలుసుకుని ఆమె కోసం రెడీగా ఉంటాడు బడ్. అనుకున్నట్టుగానే తమ పై ఎటాక్ చేసిన కిడోను సజీవ సమాధి చేస్తాడు. చావుకు దగ్గరగా రావడం తనకిది మొదటిసారి కాదు. చావంటే భయం లేదు. కానీ వాళ్లను చంపకుండా చనిపోకూడదనే పట్టుదల. ఎలా బయటపడాలి? అని ఆలోచిస్తే మార్షల్ ఆర్ట్స్ సాయంతో ఆ సమాధిని బద్దలు కొట్టుకుని బయటపడుతుంది కిడో. బిల్ నుంచి డబ్బులు తీసుకుని సెటిల్ అయిపోదామనుకుంటా బడ్. అతనికి డబ్బులు ఇచ్చిన ట్టే ఇచ్చి చంపేసి, దాన్ని కూడా కిడో మీదకు నెట్టేస్తుంది ఎలీ. కూడా చంపేసి బిల్‌ను చంపాలన్న కసితో వెళుతుంది. అతన్ని చంపుదామని తుపాకీ ఎక్కుపెట్టేలోగా కిడోకు షాక్. ఏ బిడ్డయితే తనకు దూరమైంది అనుకుందో ఆమె బతికే ఉంటుంది. తన కూతురు బతికే ఉన్నా తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన బిల్‌ను మాత్రం వదలాలనుకోలేదు. చంపేసింది.