ఆరు నెలలుగా ఆస్పత్రి మంచంపైనే...
- చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారి
- బోన్‌మారో ట్రాన్‌సప్లాంటేషన్ కోసం రూ.25 లక్షలకుపైగా ఖర్చు
- దిక్కుతోచని స్థితిలో బాలిక తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్: తరచూ వళ్లు కాలిపోయే జ్వరం... అంతకంతకూ క్షీణిస్తున్న ఆరోగ్యం... మాయదారి జబ్బుతో పన్నెండేళ్ల చిన్నారి ఆస్పత్రి మంచంపై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమ ఏకైక గారాల పట్టి బాధ చూడలేక... చికిత్సకు లక్షలకు లక్షలు భరించలేక... బిడ్డను బతికించుకొనే దారి లేక చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రైవేటు కాలేజీ లెక్చరర్ వి.శ్రీనివాస్, స్వరూప దంపతుల ఏకై క కుమార్తె నిత్య(12) ఆరో తరగతి చదువుతోంది. ఆరు నెలల కిందట అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. తరచూ హైఫీవర్ వస్తుండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులకు చూపించారు.
జ్వరం తగ్గక పోగా ఆరోగ్యం మరింత దెబ్బతింది. చివరకు రెరుున్‌బో ఆస్పత్రికి చెందిన హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ శిరీషారాణిని ఆశ్రరుుంచగా... బాధితురాలు ‘ఇమ్యునో డెఫిసియన్సీ’తో బాధపడుతున్నట్లు గుర్తించారు. బ్లడ్‌లో ఇన్‌ఫెక్షన్ వల్ల వైట్ బ్లడ్ సెల్స్ 240కి, హిమగ్లోబిన్ 7.4 శాతానికి, ప్లేట్‌లెట్స్ కౌంట్ 19 వేలకు పడిపోయాయి. బోన్‌మారో ట్రాన్‌సప్లాంటేషన్ ఒక్కటే దీనికి పరిష్కారమని, అందుకు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. ఇప్పటికే ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశామని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని రోదిస్తున్నారు. దాతలెవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డను కాపాడాలని వేడుకొంటున్నారు. సాయం చేయదలుచుకున్నవారు ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ నంబర్ 117810100070778 (ఐఎఫ్‌ఎస్‌సీకోడ్: ఏఎన్‌డీబీ0001178)కు డబ్బు పంపాలని కోరుతున్నారు. వివరాలకు 9490182998 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.