సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్‌ఎంను ఫోన్‌లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment