అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా అందరికి సుపరిచితమే. నీతా అంబానీ ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఓనర్ కూడా. అలాగే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటి ఆధ్వర్యంలో ప్రాచీన కళలకు, సంస్కృతులకు పెద్ద పీట వేస్తున్నారు.
అనేక మంది కళాకారులను ఎన్‌ఎంఏసీసీ ద్వారా ఆదరిస్తున్నారు. అయితే నీతా అంబానీ ఫ్యాషన్ ఐకాన్ కూడా. చేనేత చీరలు, ఖరీదైన పట్టుచీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ బ్యాగులు, లగ్జరీ పాదరక్షలు, ఇలా ఒకటనేమిటి ప్రతీ విషయంలోనూ తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు.
తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. గోల్డెన్ కఫ్తాన్ గౌనులో నీతా అంబానీ గ్లామ్ న్యూ ఇయర్ లుక్ అభిమానులు, ఫ్యాషన్ ప్రియుల దృష్టిలో పడ్డారు. దాని ధర ఎంత అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది.
సన్నిహితులు ,కుటుంబ సభ్యుల మధ్య 2025 ఏడాదికి స్వాగతం పలికారు నీతా అంబానీ. కొత్త కోడలు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చెంట్‌కు ఇది మొదటి న్యూఇయర్ కావడం మరో విశేషం. న్యూ ఇయర్ సందర్భంగా అనంత్, ఆకాష్ అంబానీ జంట అందంగా కనిపించారు.
ఇక నీతా అంబానీ 60 ఏళ్ల వయసులో కూడా డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్, మౌస్‌లైన్ ఫాబ్రిక్‌తో రూపొందించిన ముదురు బంగారు కఫ్తాన్ గౌనులో అప్పరసలా మెరిసిపోయారు. నెక్‌లైన్ క్రిస్టల్ లీవ్స్, లాంగ్ కేప్ స్లీవ్స్, అందమైన కఫ్తాన్ సిల్హౌట్, వీటన్నింటికీ మించి ఫ్లోర్-స్వీపింగ్ హెమ్‌లైన్ మరింత ఆకర్షణీయంగా నిలిచారు. ఇంతకీ ఈ లగ్జరీ గౌన్ ధర ఎంతో తెలుసా? దీని ధర సుమారు రూ. 1.54 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment