NewYear 2025
-
New Year 2025 : నీతా అంబానీ న్యూ ఇయర్ లుక్, ధర ఎంతో తెలుసా?
అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా అందరికి సుపరిచితమే. నీతా అంబానీ ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఓనర్ కూడా. అలాగే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటి ఆధ్వర్యంలో ప్రాచీన కళలకు, సంస్కృతులకు పెద్ద పీట వేస్తున్నారు. అనేక మంది కళాకారులను ఎన్ఎంఏసీసీ ద్వారా ఆదరిస్తున్నారు. అయితే నీతా అంబానీ ఫ్యాషన్ ఐకాన్ కూడా. చేనేత చీరలు, ఖరీదైన పట్టుచీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ బ్యాగులు, లగ్జరీ పాదరక్షలు, ఇలా ఒకటనేమిటి ప్రతీ విషయంలోనూ తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. గోల్డెన్ కఫ్తాన్ గౌనులో నీతా అంబానీ గ్లామ్ న్యూ ఇయర్ లుక్ అభిమానులు, ఫ్యాషన్ ప్రియుల దృష్టిలో పడ్డారు. దాని ధర ఎంత అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Ritika kadam (@ritikahairstylist)సన్నిహితులు ,కుటుంబ సభ్యుల మధ్య 2025 ఏడాదికి స్వాగతం పలికారు నీతా అంబానీ. కొత్త కోడలు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చెంట్‌కు ఇది మొదటి న్యూఇయర్ కావడం మరో విశేషం. న్యూ ఇయర్ సందర్భంగా అనంత్, ఆకాష్ అంబానీ జంట అందంగా కనిపించారు. ఇక నీతా అంబానీ 60 ఏళ్ల వయసులో కూడా డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్, మౌస్లైన్ ఫాబ్రిక్‌తో రూపొందించిన ముదురు బంగారు కఫ్తాన్ గౌనులో అప్పరసలా మెరిసిపోయారు. నెక్లైన్ క్రిస్టల్ లీవ్స్, లాంగ్ కేప్ స్లీవ్స్, అందమైన కఫ్తాన్ సిల్హౌట్, వీటన్నింటికీ మించి ఫ్లోర్-స్వీపింగ్ హెమ్‌లైన్ మరింత ఆకర్షణీయంగా నిలిచారు. ఇంతకీ ఈ లగ్జరీ గౌన్ ధర ఎంతో తెలుసా? దీని ధర సుమారు రూ. 1.54 లక్షలు. -
న్యూఇయర్ వేళ.. 18 వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఎక్కడంటే?
ముంబై : న్యూఇయర్ వేడుకల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీ మొత్తంలో నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా ముంబైలో ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో వాహనదారుల నుంచి రూ.89లక్షల ఫైన్ల రూపంలో వసూలు చేశారు. ముంబై పోలీసుల సమాచారం మేరకు..న్యూఇయర్‌లో మొత్తం 17,800 ఇ-చలాన్లను జారీ చేశారు. అందులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తులపై 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు, ప్రజా రవాణాకు అర్హతలేని వాహనాల్ని డ్రైవ్ చేసినందుకు 1,976 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు నగరంలో మితిమీరిన వేగానికి 842 చలాన్, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై 432 చలాన్లు వేసినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూఇయర్ సందర్భంగా మద్యం తాగి డ్రైవ్ చేసిన వారికి 153 చలాన్లు, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడినందుకు 109 చలాన్లు, ట్రిపుల్ రైడింగ్ 123 చలాన్లను, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినందుకు 40 చలాన్లు విధించారు. అలా మొత్తంగా విధించిన చలాన్లతో రూ.89,19,750 వసూలు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్స్పెక్టర్లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు ముంబై వీధుల్లో విధులు నిర్వహించారు. -
వేడుకల వేళ ఉన్మాదం
న్యూ ఆర్లీన్స్: అమెరికాలో నూతన సంవత్సరం మొదలైన తొలి క్షణాలే కొందరికి ఆఖరి క్షణాలయ్యాయి. నడివీధిలో నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన జనంపైకి ఓ ఆగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి, తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపి పది మంది ప్రాణాలు తీశాడు. ఈ కాల్పుల ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు. వెంటనే మెరుపువేగంతో స్పందించిన పోలీసులు ఆ ఆగంతకుడిని హతమార్చారు. లూసియానా రాష్ట్రంలోని న్యూ ఆర్లీన్స్ సిటీలో మిసిసిప్పీ నదీతీరంలోని ఫ్రెంచ్ క్వార్టర్ ప్రాంత బార్బన్ వీధి ఈ దారుణానికి వేదికైంది. జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 3.15 నిమిషాలకు ఈ ఘోరం జరిగింది. ఇది ఉగ్రదాడి అని, పేలుడు పదార్థాలు లభించాయని సిటీమేయర్ లాటోయా కాంట్రెల్ ప్రకటించారు. కాల్పులు జరిపింది 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బార్‌గా పోలీసులు భావిస్తున్నారు.ఘటనాస్థలిలో ఒక హ్యాండ్ గన్, ఏఆర్ రకం రైఫిల్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అసలేం జరిగింది? ఘటన జరగడానికి ముందు బార్బన్ వీధిలో స్థానికులు గుమిగూడి కొత్త ఏడాదివేడుకలు చేసుకుంటున్నారు. సమీప సూపర్‌డోమ్ స్టేడియంలో జార్జియా, నోట్రే డామ్ జట్ల మధ్య షుగర్ బౌల్ కాలేజ్ ఫుట్‌బాల్ ప్లేఆఫ్ మ్యాచ్ జరిగింది. ఇందుకోసం వచ్చిన ప్రేక్షకులు వీళ్లకు జతకావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఎక్కువ మందిని చంపేయాలన్న ప్రతీకారంతో ఆగంతకుడు పికప్ ట్రక్‌ను వేగంగా ఎక్కువ మందిపై పోనిచ్చాడు. జనం మధ్యలో ఇరుక్కుని ట్రక్కు పోయాక కిందకు దిగిన ఆగంతకుడు పొడవాటి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 10 మంది చనిపోగా, 35 మంది గాయాలపాలయ్యారు. వేడుకల్లో జనాన్ని అదుపుచేసేందుకు అక్కడే ఉన్న పోలీసులు ఈ దాడిని చూసి హుతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆగంతకుడిపైకి కాల్పులు జరిపారు. పోలీసులపైకి అతను గురిపెట్టాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసు కాల్పుల్లో ఆగంతకుడు అక్కడిక్కడే మరణించాడు. వీలైనంత ఎక్కువ మందిని ట్రక్కుతో ఢీకొట్టి చంపేయాలన్న పక్కా ప్రణాళికతో ఆగంతకుడు దానిని నడుపుకుంటూ వచ్చాడని సిటీ పోలీస్ సూపరింటెండెంట్ అన్నారు. జనం ఎగిరిపడ్డారు అత్యంత వేగంగా ట్రక్కు ఢీకొనడంతో జనంలో కొందరు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షి 22 ఏళ్ల కెవిన్ గార్సియా చెప్పారు. ‘‘ జనం మీదకు ట్రక్కు దూసుకొచ్చి తొక్కుకుంటూ పోతోంది. కొందరు బలంగా ఢీకొనడంతో ఎగిరిపడ్డారు. ఒకరి మృతదేహం ఎగిరి నా మీద పడింది’’ అని గార్సియా చెప్పారు. ‘‘ నైట్‌క్లబ్ నుంచి బయటికొచ్చా. అప్పటికే జనం పరుగెడుతున్నారు. ఇక్కడి నుంచి పారిపో అని ఒకాయన హెచ్చరించాడు. అప్పటికే అక్కడ కొన్ని మృతదేహాలు రక్తపుమడుగులో పడి ఉన్నాయి. గాయపడిన వారికి చుట్టుపక్కల వాళ్లు అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఐదు ఆస్పత్రులకు తరలించారు’’ అని విట్ డేవిస్ అనే మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘‘వాహనాలను దాడులకు మారణాయుధాలుగా వాడుతున్న దారుణశైలి మొదలైంది. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంకావట్లేదు’’ అని మరొకరు వాపోయారు. An SUV crashed into a crowd in New Orleans, USA.At least 10 people were killed and 30 more were injured. After the collision, the driver got out of the car and started shooting.The perpetrator has not yet been arrested. pic.twitter.com/pOiHhIQu00— S p r i n t e r (@SprinterFamily) January 1, 2025 -
అందరికీ ఆనందం పంచాలని ఆశిస్తున్నా ప్రజలకు ప్రధాని
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ కొత్త ఆశలు, ఆశయాలకు నెలవైన నూతన సంవత్సరానికి అందరూ ఆనందంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సంతోషాలు, అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందాలను తీసుకు రావాలని ఆశిస్తున్నా. ఆయురారోగ్యాలతో ఉండేలా కొత్త సంవత్సరం అందర్నీ దీవించనుంది’’ అని మోదీ అన్నారు. ‘‘ సమష్టిగా ప్రయత్నించి గత సంవత్సరం మనందరం అనేక అద్భుత విజయాలు అందుకున్నాం. 2025 సంవత్సరంలోనూ మరింతగా కష్టపడి పనిచేసి వికసిత్ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేద్దాం’’ అని అన్నారు. గత ఏడాది కాలంలో భారతదేశం సాధించిన పురోగతి, ఐక్యత, అభివృద్ధి ప్రస్థానం వైపు వేసిన అడుగులను వివరిస్తూ మోదీ ఈ సందర్భంగా ఓ వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. Wishing everyone a very Happy New Year! May the year 2025 bring joy, harmony and prosperity to all! On this occasion, let us renew our commitment to work together for creating a brighter, more inclusive and sustainable future for India and the world.— President of India (@rashtrapatibhvn) January 1, 2025గ్రీటింగ్స్ చెప్పిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిమరింత సమ్మిళితమైన, సుస్థిరమైన భారత్‌తో పాటు ప్రపంచ శాంతి కోసం దేశ ప్రజలంతా ఉమ్మడిగా కష్టపడి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం తన నూతన ఏడాది సందేశంలో పిలుపునిచ్చారు. ‘‘ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షులు. 2025 ఏడాది మీ జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, నూతనోత్సాహం, సా మరస్యం, సంతోషం వెల్లివిరియాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఆమె అన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సైతం ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సైతం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. Happy 2025! May this year bring everyone new opportunities, success and endless joy. May everybody be blessed with wonderful health and prosperity.— Narendra Modi (@narendramodi) January 1, 2025 -
New year 2025 : అదిరే ముగ్గులతో న్యూ ఇయర్‌కి స్వాగతం చెబుదామా!
నూతన సంవత్సరం వస్తోందంటే ఆ సంతోషం వేరే లెవల్లో ఉంటుంది. వచ్చే ఏడాదంతా మంచే జరగాలని, కోరిన కోరికలు నెరవేరాలని ఆశపడతారు. తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అభిలషిస్తారు. మా ఆశలు పండించు అంటూ తమ ఇష్టదైవాన్ని కోరుకుంటారు. కొంగొత్త ఆశలు, కోరికలతో ఉత్సాహంగా న్యూ ఇయర్ స్వాగతం పలుకుతారు. ‘హ్యాపీ న్యూయర్’ అంటూ బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఇక గృహణులు ఇంట్లోని ఆడపిల్లల సందడి మరింత ఉత్సాహంగా ఉంటుంది. కేవలం తాము మాత్రమే అందంగా తయారవ్వడం కాదు. ఇల్లంతా అందంగా అలంకరించుకుంటారు. సరికొత్తగా తమ డ్రీమ్ హౌస్‌ను తీర్చిదిద్దుకుంటారు. ఈ అలంకరణలో ముఖ్యమైంది. ఇంటిముందు తీర్చి దిద్దే రంగవల్లులు. ఎంత చలి అయినా సరే, అర్థరాత్రి దాకా పెద్దపెద్ద ముగ్గులు వేయాల్సిందే. వాటికి చక్కటి రంగులద్ది వాకిళ్లను శోభాయమానంగా రూపొందించాల్సిందే.. వాటిని తిరిగి తిరిగి చూసుకొని మరీ మురిసి పోవాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈ రంగోలీ వారి కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. చక్కటి రంగవల్లులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తీరు చాలా ప్రత్యేకమైంది అనడంలో ఎలాంటి సందేహంలేదు.ముగ్గులు, రకాలుచిన్న పక్షి నుంచి, ఆకులు పువ్వులు దాకా ప్రకృతిలో ప్రతీ అంశం, ప్రతీ సంబరం, సంతోషం ముగ్గు రూపంలో ముంగిట వాలిపోతుంది. ఇక సంక్రాంతిలో వేసే చాప, రథం ముగ్గు దాకా ముగ్గుల్లో ఎన్ని రకాలుంటాయో ఒక్క మాటలో చెప్పడం కష్టం. పద్మాల ముగ్గు, గులాబీల ముగ్గు, తూనీగల ముగ్గు, చిలకల ముగ్గు, ఏనుగుల ముగ్గు, శంఖాల ముగ్గు, డప్పు, డోలు ముగ్గు, గంగిరెద్దుల ముగ్గు, దీపాల ముగ్గు, అబ్బో..ఇలా ఎన్నో రకాలు. ఎవరి ఊహకు తగ్గట్టు, ఎవరి నైపుణ్యానికి తగ్గట్టు వారు ముగ్గులు వేస్తారు. ఇందులో దాదాపు ప్రతీ మహిళ, ప్రతీ కన్నెపిల్ల సిద్దహస్తురాలే. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, మెలికల ముగ్గులు, అప్పటికప్పుడు అలా ఊహతో తీర్చిదిద్దే ముగ్గులు. తీరొక్క చుక్క, చుక్కకో లెక్కచుక్కల ముగ్గు వేయడంలో చుక్కలు వేయడం ప్రధానం. చుక్కలు లెక్క తప్పినా, ఏ మాత్రం వంకర పోయినా, ఆ ముగ్గు అందమే పోతుంది. చుక్క లెక్క తప్పిందా... ముగ్గు అంతా గోవిందా. అందుకే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వేయాలి. న్యూఇయర్, సంక్రాంతి ముగ్గుసంవత్సరం అంతా వేసే ముగ్గులు ఒక ఎత్తయితే, సంక్రాంతి నెల అంతా, కొత్త ఏడాదికి స్వాగతం చెపుతూ వేసే ముగ్గులు మరో ఎత్తు. చుక్కలతో పెద్ద ముగ్గులు వేసి, మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ (Happy New Year 2025) అని రాసి మురిసిపోయే సంబరం అంతా ఇంతా కాదు. ముగ్గులు వేయడం కష్టంగా అనిపిస్తే.. రకరకాల డిజైన్లతో ఈజీగా, సింపుల్‌గా రంగోలిని వేసుకోవచ్చు. చూడటానికి చాలా అందంగా, వెరైటీగా కూడా ఉంటాయి. మీ ఊహకు తగినట్టు చక్కగా పద్మాలను, రోజా పువ్వులను తీర్చిదిద్దుకొని వాటిని రంగులద్దుకోవాలి. మనకున్న వాకిలి ఆధారంగా డిజైన్ ఎంచుకోవాలి. వీలైతే ఒకసారి కాగితం మీద వేసుకుంటే చక్కగా అమరినట్టు వస్తుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వెల్కం బొమ్మ వేసి, ఇంద్రధనుస్సురంగులో నింపేసుకోవచ్చు. దీపాలు, పువ్వులను తీర్చిదిద్ది వాకిలిని అలంకరించుకోవచ్చు. ప్రత్యేకంగా రంగు రంగుల పువ్వులతోనే చక్కటి ముగ్గును వేసుకొని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పవచ్చు. లేదంటే మార్కెట్లో దొరికే అచ్చుల సాయంతో చక్కటి డిజైన్ వేసుకోవచ్చు.