అందరికీ ఆనందం పంచాలని ఆశిస్తున్నా ప్రజలకు ప్రధాని  | President Pm And Others New Year 2025 Wishes Updates | Sakshi
Sakshi News home page

అందరికీ ఆనందం పంచాలని ఆశిస్తున్నా ప్రజలకు ప్రధాని 

Published Wed, Jan 1 2025 9:00 AM | Last Updated on Thu, Jan 2 2025 6:27 AM

President Pm And Others New Year 2025 Wishes Updates

నూతన సంవత్సర శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ కొత్త ఆశలు, ఆశయాలకు నెలవైన నూతన సంవత్సరానికి అందరూ ఆనందంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సంతోషాలు, అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందాలను తీసుకు రావాలని ఆశిస్తున్నా. ఆయురారోగ్యాలతో ఉండేలా కొత్త సంవత్సరం అందర్నీ దీవించనుంది’’ అని మోదీ అన్నారు. ‘‘ సమష్టిగా ప్రయత్నించి గత సంవత్సరం మనందరం అనేక అద్భుత విజయాలు అందుకున్నాం. 2025 సంవత్సరంలోనూ మరింతగా కష్టపడి పనిచేసి వికసిత్‌ భారత్‌ దిశగా వడివడిగా అడుగులు వేద్దాం’’ అని అన్నారు. గత ఏడాది కాలంలో భారతదేశం సాధించిన పురోగతి, ఐక్యత, అభివృద్ధి ప్రస్థానం వైపు వేసిన అడుగులను వివరిస్తూ మోదీ ఈ సందర్భంగా ఓ వీడియోను ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌చేశారు.
 

గ్రీటింగ్స్‌ చెప్పిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి
మరింత సమ్మిళితమైన, సుస్థిరమైన భారత్‌తో పాటు ప్రపంచ శాంతి కోసం దేశ ప్రజలంతా ఉమ్మడిగా కష్టపడి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం తన నూతన ఏడాది సందేశంలో పిలుపునిచ్చారు. ‘‘ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షులు. 2025 ఏడాది మీ జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, నూతనోత్సాహం, సా మరస్యం, సంతోషం వెల్లివిరియాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఆమె అన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సైతం ప్రజలకు న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌ చెప్పారు. లోక్‌సభ స్వీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సైతం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement