దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు | PM Modi Greeted the Countrymen on the Occasion of 76th Republic Day | Sakshi
Sakshi News home page

దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Published Sun, Jan 26 2025 8:22 AM | Last Updated on Sun, Jan 26 2025 8:42 AM

PM Modi Greeted the Countrymen on the Occasion of 76th Republic Day

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతీయ వేడుక రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రధాన గణతంత్ర దినోత్సవ కార్యక్రమం  ప్రారంభమయ్యింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌' లో ప్రధానమంత్రి ఒక పోస్ట్‌లో ‘అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతపై ఆధారపడి ఉండేలా మార్గాన్ని రూపొందించిన  మహనీయులందరికీ మనం నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు.
 

నేటి గణతంత్ర దినోత్సవంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో  ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. గణతంత్ర దినోత్సవ కవాతు దేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. అయితే 1950 జనవరి 26న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా  అవతరించింది. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement