గణతంత్ర వేడుకల సందర్భంగా దేశమంతా త్రివర్ణమయంగా మారిపోయింది. దీనిలో భాగంగా భారతీయ రైల్వే వివిధ రైల్వేస్టేషన్లను అందంగా ముస్తాబు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు మురిసిపోతున్నారు.
అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ త్రివర్ణ పతాక కాంతిలో వెలుగొందుతోంది. రామాలయ నిర్మాణం తర్వాత, దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు.
అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు.
ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. ఇక్కడికి విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తారు. త్రివర్ణ పతాక కాంతిలో వారణాసి రైల్వే స్టేషన్ చాలా అందంగా కనిపిస్తోంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు గణతంత్ర దినోత్సవ ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రైల్వే స్టేషన్ పూర్తిగా త్రివర్ణ లైట్లతో అలంకరించారు. రైల్వే స్టేషన్ మొత్తాన్ని త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల లైట్లతో అలంకరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. త్రివర్ణ పతాక కాంతిలో ఝాన్సీ రైల్వే స్టేషన్ మిలమిలా మెరిసిపోతోంది.
ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సానాలోని రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.
ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment