Republic Ceremonies
-
గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోదీ.. కారణమిదే
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. గుజరాత్ శకటాన్ని పరిశీలనగా చూసి, మురిసిపోయారు. ఆ శకటం వెళుతున్నంత సేపూ ప్రధాని దానినే చూస్తూ ఉండిపోయారు.ఈసారి గుజరాత్ శకటంలో ప్రధాని మోదీ జన్మస్థలమైన వాద్‌నగర్‌కు స్థానం కల్పించారు. ఈ శకటంలో గుజరాత్ అభివృద్ధితో పాటు అక్కడి సంస్కృతి, వారసత్వం కనిపిస్తుంది. అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిపై నిర్మించిన అటల్ వంతెనకు గుజరాత్ శకటంలో చోటు కల్పించారు. ద్వారక నగరం భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందబోతోందో కూడా చూపించారు. గత సంవత్సరం ఒడిశా ఉత్తమ శకట అవార్డును అందుకోగా, గుజరాత్ శకటానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో మొదటి స్థానం లభించింది. #WATCH 76वें गणतंत्र दिवस की परेड में गुजरात की 'स्वर्णिम भारत- विरासत और विकास' की झांकी ने कर्त्तव्य पथ पर मार्च किया। (सोर्स: डीडी न्यूज) pic.twitter.com/iGVGkctJQ1— ANI_HindiNews (@AHindinews) January 26, 2025గుజరాత్ శకటంలో 12వ శతాబ్దపు ‘కీర్తి తోరణ్’కు రూపమిచ్చారు. దీనిని గుజరాత్ సాంస్కృతిక ద్వారం అని పిలుస్తారు. అలాగే సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నమూనాను కూడా రూపొందించారు. శకటం వెనుక భాగంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేసిన సీ-295 విమాననపు ప్రతిరూపాన్ని ఉంచారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు -
Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు
గణతంత్ర వేడుకల సందర్భంగా దేశమంతా త్రివర్ణమయంగా మారిపోయింది. దీనిలో భాగంగా భారతీయ రైల్వే వివిధ రైల్వేస్టేషన్లను అందంగా ముస్తాబు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు మురిసిపోతున్నారు.అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ త్రివర్ణ పతాక కాంతిలో వెలుగొందుతోంది. రామాలయ నిర్మాణం తర్వాత, దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు.అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు.ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. ఇక్కడికి విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తారు. త్రివర్ణ పతాక కాంతిలో వారణాసి రైల్వే స్టేషన్ చాలా అందంగా కనిపిస్తోంది.దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు గణతంత్ర దినోత్సవ ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రైల్వే స్టేషన్ పూర్తిగా త్రివర్ణ లైట్లతో అలంకరించారు. రైల్వే స్టేషన్ మొత్తాన్ని త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల లైట్లతో అలంకరించారు.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. త్రివర్ణ పతాక కాంతిలో ఝాన్సీ రైల్వే స్టేషన్ మిలమిలా మెరిసిపోతోంది.ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సానాలోని రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
Republic Day: ఇండోనేషియా ప్రతినిధి బృందం నోట ‘కుచ్ కుచ్ హోతాహై’ పాట
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందులో ఇండోనేషియా ప్రతినిధి బృందం పాల్గొంది.ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందం బాలీవుడ్ సినిమా 'కుచ్ కుచ్ హోతా హై'లోని పాటను ఆలపించింది. ఈ ప్రతినిధి బృందంలో ఇండోనేషియా సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. #WATCH | Delhi: A delegation from Indonesia sang Bollywood song 'Kuch Kuch Hota Hai' at the banquet hosted by President Droupadi Murmu in honour of Prabowo Subianto, President of Indonesia at Rashtrapati Bhavan. The delegation included senior Indonesian ministers. The… pic.twitter.com/VH6ZHRTbNS— ANI (@ANI) January 25, 2025కాగా భారతదేశం-ఇండోనేషియా రక్షణ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, రక్షణ తయారీ తదితర రంగాల్లో సంయుక్తంగా పనిచేయడానికి అంగీకరించాయి.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతీయ వేడుక రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రధాన గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో ప్రధానమంత్రి ఒక పోస్ట్‌లో ‘అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతపై ఆధారపడి ఉండేలా మార్గాన్ని రూపొందించిన మహనీయులందరికీ మనం నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు. Happy Republic Day. Today, we celebrate 75 glorious years of being a Republic. We bow to all the great women and men who made our Constitution and ensured that our journey is rooted in democracy, dignity and unity. May this occasion strengthen our efforts towards preserving the…— Narendra Modi (@narendramodi) January 26, 2025నేటి గణతంత్ర దినోత్సవంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. గణతంత్ర దినోత్సవ కవాతు దేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. అయితే 1950 జనవరి 26న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.ఇది కూడా చదవండి: Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు -
నిఘా వలయం..
సాక్షి, సిటీబ్యూరో: గణతంత్ర దినోత్సవం.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి మూడంచెల భద్రత కల్పించారు. వేడుకలు జరిగే ఈ మైదానాన్ని బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేపట్టాయి. నగరంలోనూ అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. లాడ్జీలు, హోటళ్లు, సినిమా థియేటర్ల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు, అనుమానిత ఉగ్రవాదులపై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర శివార్లలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్తీలు, కాలనీల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచారు. నిఘా నీడలో పరేడ్ మైదానం.. గణతంత్ర వేడుకలు జరిగే పరేడ్ మైదానం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి తదితరులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. వేడుకలకు హాజరయ్యేవారిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన తర్వాతే మైదానంలోకి అనుమతిస్తారు. గ్రౌండ్లోకి బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్స్‌లు తీసుకురావద్దని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. మైదానం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు పార్కింగ్ చేసే ప్రదేశాల్లో సైతం నిఘాను పెంచారు. గ్రౌండ్ చుట్టూ మొబైల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనుమానిత వస్తువులు, కొత్త వ్యక్తులపై నిఘా పెట్టారు. * టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో లాడ్జీలు, హోటళ్లు, సినిమా థియేటర్ల వద్ద మూడు రోజులుగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయా కూడళ్ల వద్ద మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. * సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. అన్ని ఠాణాల పరిధిలో మైత్రి, శాంతి కమిటీలతో ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు సమావేశాలు నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారం వస్తుండడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. * ఐటీ కారిడార్‌లో మాదాపూర్ డీసీపీ కార్తికేయ అక్కడి షాపింగ్ మాల్స్, ఐటీ కంపెనీలు, సినిమా థియేటర్ల సెక్యూరిటీ గార్డులతో కూకట్‌పల్లిలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. * నగర డీసీపీలు డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరావు, కమలాసన్‌రెడ్డి, సుధీర్‌బాబు, సత్యనారాయణ తమ జోన్ల పరిధిలో రోడ్లపై మార్చ్‌పాస్ట్ చేయించారు. ఫుట్ పెట్రోలింగ్‌ను సైతం చేపట్టారు. రద్దీ మార్కెట్ సెంటర్లలో తనిఖీలు చేశారు. కార్డన్ సర్చ్, డెకాయి ఆపరేషన్లు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.