న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందులో ఇండోనేషియా ప్రతినిధి బృందం పాల్గొంది.
ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందం బాలీవుడ్ సినిమా 'కుచ్ కుచ్ హోతా హై'లోని పాటను ఆలపించింది. ఈ ప్రతినిధి బృందంలో ఇండోనేషియా సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
#WATCH | Delhi: A delegation from Indonesia sang Bollywood song 'Kuch Kuch Hota Hai' at the banquet hosted by President Droupadi Murmu in honour of Prabowo Subianto, President of Indonesia at Rashtrapati Bhavan. The delegation included senior Indonesian ministers.
The… pic.twitter.com/VH6ZHRTbNS— ANI (@ANI) January 25, 2025
కాగా భారతదేశం-ఇండోనేషియా రక్షణ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, రక్షణ తయారీ తదితర రంగాల్లో సంయుక్తంగా పనిచేయడానికి అంగీకరించాయి.
ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment