ఢిల్లీ: రిపబ్లిక్ డే-2025 వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నారు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండోనేషియా బృందం పాల్గొనుంది. యుద్ధ వీరుల స్మారక స్తూపం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించనున్నారు. 300 మంది కళాకారులతో సారే జహాసే అచ్చా సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించనున్నారు.
స్వర్ణీం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. 75 ఏళ్ల రాజ్యాంగానికి సంబంధించిన రెండు ప్రత్యేక శకటాలను రూపకల్పన చేశారు. కర్తవ్య పత్‌లో 11 నిమిషాల పాటు జయ జయ భారతం సాంస్కృతిక నృత్య ప్రదర్శన, ఈనెల 29న విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్, వివిధ బెటాలియన్లకు సంబంధించిన మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన, భారతీయ మ్యూజిక్ బ్యాండ్‌ను బెటాలియన్లు ప్రదర్శించర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment