గుజరాత్‌ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోదీ.. కారణమిదే | Republic Day-2025 Parade PM Modi Watched Gujarat Tableau Vadnagar | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోదీ.. కారణమిదే

Published Sun, Jan 26 2025 1:28 PM | Last Updated on Sun, Jan 26 2025 1:36 PM

Republic Day-2025 Parade PM Modi Watched Gujarat Tableau Vadnagar

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. గుజరాత్ శకటాన్ని పరిశీలనగా చూసి, మురిసిపోయారు. ఆ శకటం వెళుతున్నంత సేపూ ప్రధాని దానినే చూస్తూ ఉండిపోయారు.

ఈసారి గుజరాత్ శకటంలో ప్రధాని మోదీ జన్మస్థలమైన వాద్‌నగర్‌కు స్థానం కల్పించారు. ఈ శకటంలో గుజరాత్ అభివృద్ధితో పాటు అక్కడి సంస్కృతి, వారసత్వం కనిపిస్తుంది. అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిపై నిర్మించిన అటల్ వంతెనకు గుజరాత్ శకటంలో చోటు కల్పించారు. ద్వారక నగరం భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందబోతోందో కూడా చూపించారు. గత సంవత్సరం ఒడిశా ఉత్తమ శకట అవార్డును అందుకోగా, గుజరాత్ శకటానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో మొదటి స్థానం లభించింది.
 

గుజరాత్ శకటంలో 12వ శతాబ్దపు ‘కీర్తి తోరణ్‌’కు రూపమిచ్చారు. దీనిని గుజరాత్ సాంస్కృతిక ద్వారం అని పిలుస్తారు. అలాగే సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నమూనాను కూడా రూపొందించారు. శకటం వెనుక భాగంలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేసిన సీ-295 విమాననపు ప్రతిరూపాన్ని ఉంచారు.

ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement