ఢిల్లీ : క్తరవ్యపథ్ వేదికగా ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకలు (76th Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు, ముఖ్య అతిథి, ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) పాల్గొన్నారు.
👉76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలు
ఢిల్లీలో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు 90 నిమిషాల పాటు నిర్విరామంగా కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకల్ని ప్రారంభించారు.
#WATCH | President Droupadi Murmu unfurls the National Flag at Kartavya Path, on the occasion of 76th #RepublicDay🇮🇳
National anthem and 21 Gun salute follows.
(Source: DD News) pic.twitter.com/6969bmx2B4— ANI (@ANI) January 26, 2025
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రబోవోతో పాటు 352 మంది సభ్యుల ఇండోనేషియా కవాతు, బ్యాండ్ బృందం కవాతులో పాల్గొంటుంది.
గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించడంతో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ వేడుకల్ని వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ సంస్థలకు చెందిన 15 శకటాలతో మొత్తం 31 శకటాలు కర్తవ్య పథ్ వేదికగా ప్రదర్శించనున్నాయి
బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో సహా అత్యాధునిక రక్షణ శకటాలు ప్రదర్శించనున్నాయి. ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’ డీఆర్‌డీవో ‘ప్రళయ్’ వ్యూహాత్మక క్షిపణి తొలిసారిగా ప్రదర్శించనుంది. ప్రదర్శనలో ఇతర సైనిక శకటాలలో టీ-90 ‘భీష్మ’ ట్యాంకులు, శరత్ పదాతిదళం వాహనాలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, మౌంటెడ్ పదాతిదళ మోర్టార్ సిస్టమ్ (ఐరావత్) ఉన్నాయి.
దేశంలోని సాయుధ దళాల మధ్య ఐక్యత స్ఫూర్తికి ప్రతీకగా త్రివిద దళాల సేవలు ఉమ్మడిగా ప్రదర్శించనుండగా.. డీఆర్‌డీవో ‘రక్షా కవచ్’ థీమ్‌ను ప్రదర్శించనుంది.
మౌంటెడ్ కాలమ్‌కు నాయకత్వం వహించే మొదటి ఆర్మీ దళం ఐకానిక్ 61 అశ్వికదళం. ఇది ప్రపంచంలోని ఏకైక గుర్రపు అశ్వికదళ రెజిమెంట్. నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రివిధ దళాల అనుభవజ్ఞులైన మహిళా అధికారులు ఉంటారు.
కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ మోటార్‌సైకిల్ ప్రదర్శన 90 నిమిషాల నిడివి గల కవాతులో హైలైట్‌గా నిలవనుంది.
- కర్తవ్య పథంలో మొత్తం 5,000 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 300 మంది కళాకారులు సంగీత వాయిద్యాలపై ‘సారే జహాన్ సే అచ్ఛా’ ను వినిపించనున్నారు.
- ఢిల్లీలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీని ఆరు లేయర్‌ల భద్రతా కొనసాగుతుంది. ఫేస్ రికగ్నైజన్ టెక్నాలజీతో 2,500 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు, యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లు, రూఫ్‌టాప్ స్నిపర్‌లు పహారాకాస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment