న్యూఢిల్లీ: త్రిపుర చిట్ ఫండ్ కుంభకోణం కేసులో దాదాపు 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని మహారాష్ట్రలోని భివాండిలో సీబీఐ అరెస్టు చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపుర చిట్ ఫండ్ కేసులో వికాస్ దాస్ 2013 నుండి పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.20,000 రివార్డును ప్రకటించారు.
‘సూచ్నా రియల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’, దాని డైరెక్టర్లు అధిక లాభాల హామీనిచ్చి వందలాది మంది పెట్టుబడిదారుల నుండి డబ్బు వసూలు చేశారని, అయితే కంపెనీ పెట్టుబడిదారులకు ఎటువంటి మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation) (సీబీఐ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 2012లో మెచ్యూరిటీ మొత్తాన్ని సంబంధీకులకు చెల్లించకుండానే చిట్‌ఫండ్ కార్యాలయాన్ని మూసివేశారన్నారు.
అగర్తలలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి 2024, ఆగస్టు 16న నిందితుడు వికాస్ దాస్(Vikas Das)ను ప్రకటిత నేరస్తునిగా వెల్లడించి, అతనిపై వారెంట్ జారీ చేశారు. అనంతరం నిందితుని ఆచూకీ తెలిపిన వారికి సీబీఐ రూ. 20,000 రివార్డును కూడా ప్రకటించింది. అయితే నిందితుడు 12 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు సీబీఐ 2025 ఫిబ్రవరి 3న భివాండిలో అరెస్టు చేసింది. కాగా సీబీఐ 2023లో రెండు కేసులు నమోదు చేసింది. వీటిలో వికాస్ దాస్ ప్రధాన నిందితుడు. ఈయన ‘సూచ్నా రియల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే చిట్ ఫండ్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ కంపెనీ దాదాపు రూ. 6,60,000 మేరకు మోసానికి పాల్పడింది. కేసు దర్యాప్తు అనంతరం సీబీఐ 2025, జనవరి 21న వికాస్ దాస్, సుజిత్ దాస్, కంపెనీపై చార్జిషీట్ దాఖలు చేసింది.
ఇది కూడా చదవండి: మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment