Bhiwandi
-
త్రిపుర చిట్ ఫండ్ కేసు: 12 ఏళ్ల తర్వాత సీబీఐకి చిక్కిన నిందితుడు
న్యూఢిల్లీ: త్రిపుర చిట్ ఫండ్ కుంభకోణం కేసులో దాదాపు 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని మహారాష్ట్రలోని భివాండిలో సీబీఐ అరెస్టు చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపుర చిట్ ఫండ్ కేసులో వికాస్ దాస్ 2013 నుండి పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.20,000 రివార్డును ప్రకటించారు.‘సూచ్నా రియల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’, దాని డైరెక్టర్లు అధిక లాభాల హామీనిచ్చి వందలాది మంది పెట్టుబడిదారుల నుండి డబ్బు వసూలు చేశారని, అయితే కంపెనీ పెట్టుబడిదారులకు ఎటువంటి మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation) (సీబీఐ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 2012లో మెచ్యూరిటీ మొత్తాన్ని సంబంధీకులకు చెల్లించకుండానే చిట్‌ఫండ్ కార్యాలయాన్ని మూసివేశారన్నారు.అగర్తలలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి 2024, ఆగస్టు 16న నిందితుడు వికాస్ దాస్(Vikas Das)ను ప్రకటిత నేరస్తునిగా వెల్లడించి, అతనిపై వారెంట్ జారీ చేశారు. అనంతరం నిందితుని ఆచూకీ తెలిపిన వారికి సీబీఐ రూ. 20,000 రివార్డును కూడా ప్రకటించింది. అయితే నిందితుడు 12 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు సీబీఐ 2025 ఫిబ్రవరి 3న భివాండిలో అరెస్టు చేసింది. కాగా సీబీఐ 2023లో రెండు కేసులు నమోదు చేసింది. వీటిలో వికాస్ దాస్ ప్రధాన నిందితుడు. ఈయన ‘సూచ్నా రియల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే చిట్ ఫండ్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ కంపెనీ దాదాపు రూ. 6,60,000 మేరకు మోసానికి పాల్పడింది. కేసు దర్యాప్తు అనంతరం సీబీఐ 2025, జనవరి 21న వికాస్ దాస్, సుజిత్ దాస్, కంపెనీపై చార్జిషీట్ దాఖలు చేసింది.ఇది కూడా చదవండి: మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
కనులపండువగా అమ్మవారి ఒడిబియ్యం మహోత్సవాలు
భివండీ: భివండీ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ పురస్కరించుకొని శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి అమ్మవారికి ఒడి బియ్యం మహోత్సవ కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్ దీపాలతో పాటు వివిధ రంగుల పూలతో వైభంగా ముస్తాబు చేశారు. పద్మశాలీయుల ఆడపడుచైన అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమాలలో పద్మశాలీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు దేవస్థాన ప్రధాన అర్చకుడు ప్రసాద్ స్వామి నేతృత్వంలో జరిగాయి. శనివారం ఉదయం స్వామి వారికి నిత్య పూజలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఒడి బియ్యం కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వేంకటేశ్వర స్వామి అమ్మవారిని శేషవాహనంపై మందిరం నుంచి ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపు పద్మనగర్ పురఃవీధులు మహాముని చౌక్, దత్తమందిర్, రామ్ మందిర్, గీతా మందిర్, బాజీ మార్కెట్, వరాలదేవి రోడ్ నుంచి తిరిగి రాత్రి 10 గంటల వరకు మందిరాన్ని చేరుకుంది. ఊరేగింపులో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీధివీధిన స్వామి వారికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. దర్శనం నిమిత్తం బారులు తీరి హారతులు, కానుకలు సమరి్పంచుకున్నారు. సిద్ధివినాయక్ భజన మండలి, గీతా భజన మండలి వారు ఆలకించిన అన్నమయ్య కీర్తనలతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. రాత్రి నిర్వహించిన అన్నదానంలో సుమారు ఐదు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారని దేవస్థాన కమిటీ సభ్యుడు దావత్ కైలాస్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గౌడ లింగం, బైరి జనార్దన్, డాక్టర్ పాము మనోహర్, వడిగొప్పుల శంకర్ పంతులు, బాలె శ్రీనివాస్, అవధూత బలరామ్, భీమనాథిని శివప్రసాద్, బూర్ల మనోజ్‌తో పాటు వందల సంఖ్యలో పద్మశాలీ కులబాంధవులు భక్తులు పాల్గొని సేవలందించారు. ఇదీ చదవండి : వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు -
కార్పొరేటర్‌పై దౌర్జన్యం.. కర్రలు, రాళ్లతో దాడి
సాక్షి, ముంబై: భివండీ పట్టణంలోని లాహోటి కంపౌండ్ ప్రాంతంలో గురువారం రాత్రి బీజేపి కార్పొరేటర్ నిత్యానంద్ నాడార్ అలియాస్ వాసు అన్నాపై దాడి జరిగింది. తన మర్సిడీస్ కారులో కార్యాలయం నుంచి వెళ్తున్న వాసు అన్నాపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తలపై, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవిలో రికార్డు అయినట్లు తెలుస్తుంది. బీజేపీ కార్పొరేటర్ వాసు అన్నా తన కార్యాలయంలో పనులు ముగించుకొని రాత్రి సుమారు 9 గంటలకు తన స్వంత మర్సిడీస్ కారులో డ్రైవర్, బాడీగార్డ్‌తో కలిసి ఇంటికి బయలుదేరాడు. తన కార్యాలయానికి కేవలం వంద అడుగుల దూరంలోనే ఓ వ్యక్తి కారుని ఆపడంతో హుటాహుటిన ఓ ముఠా కారుని అడ్డుకొని రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో కూర్చున్న నిత్యానంద్ నాడార్‌పై కూడా దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడిలో నిత్యానంద్‌కు ముఖంపై, తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ వేగంగా కారును తోలడంతో ఆయన ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు. కళ్యాన్ రోడ్‌లోని హిల్ లైఫ్ ఆనే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పట్టణ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ చేతన్ కాఖడే తో పాటు బృందం సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సతీష్ వావిలాల, కోళి దేవా, ఇబ్రహీం, దాసి సాయినాథ్తో పాటు పది పన్నెండు మంది వ్యక్తులు దాడి చేశారని నిత్యానంద్ నాడార్ పిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సతీష్ వావిలాలను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, మరికొద్ది నెలల్లో కార్పొరేషన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, వార్డు నంబర్ 16లో పలువురు అభ్యర్థులు సన్నాహాలు ప్రారంభించడంతో ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీలో వివాదాల వల్లే ఈ దాడి జరిగిందని, పార్టీలో లాబీయింగ్ జరుగుతుందని ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పడంవల్లే నాపై దాడి జరిగిందని కార్పొరేటర్ నిత్యానంద్ నాడార్ ఆరోపించారు. సీసీ టీవి ఆధారంగా దాడి చేసిన ముఠాల కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ చేతన్ కాఖడే తెలిపారు. అయితే పారీ్టలోని విభేదాల కారణంగానే ఈ దాడి జరిగిందా అన్న విషయంలో ఇంకా స్పస్టత రాలేదు. చదవండి: వణికిస్తున్న వైరస్.. మీజిల్స్‌తో మరో బాలుడి మృతి -
పసిపిల్లలపై మీజిల్స్ పంజా.. వ్యాధి లక్షణాలివే...
సాక్షి, ముంబై: భివండీలో చిన్నారులకు సోకే మీజిల్స్ వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. పట్ణణవ్యాప్తంగా ఇప్పటి వరకు 341 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇప్పటికి 44 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్యాధికారి సైయద్ బుషరా పేర్కొన్నారు. ఇంకా కొంత మంది రిపోట్లు పుణే సెంటర్ నుంచి రానున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో చాలా మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. వ్యాధి కారణగా ఠాణాలోని కల్వా ఆసుప్రతిలో ఒకరు, ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఒకరు మృతి చెందారని అన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు స్థానిక ఇందిరా గాంధీ ఆసుపత్రిలో, పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. భివండీలో హైరిస్క్ ప్రాంతాలు... భివండీ పట్టణంలో 8 లక్షల 98 వేల 923 మంది జనాభా ఉంది. ఇందులో 341 మంది పిల్లలకు వ్యాధి లక్షణాలు కనిపించాయి. 130 మంది వ్యాధిగ్రస్తులు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 211 మంది పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికి చికిత్స పొందుతున్నారు. ఎక్కువ శాతం భివండీలోని మురికి వాడలలో గల గాయిత్రినగర్, నదినాక, నయీబస్తి, శాంతినగర్, అంజూర్‌పాట, ఆజ్మీనగర్, ఈద్గారోడ్, గైభినగర్, మిల్లత్‌నగర్, కామత్‌ఘర్, అవుచిత్పాడ, బండారి కంపౌండ్ ఇలా 12 ప్రాంతాలలో ఉన్న పిల్లలకు ఇన్ఫెక్షన్ డిసీస్ తొందరగా వ్యాప్తి చెందుతుండటంతో ఈ ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించారు. మురికివాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న మరికొంత మంది పిల్లలు కూడా ఉండవచ్చనే అనుమానంతో ప్రతి గుడిసెలో సోదాలు చేయడం ప్రారంభించామని, ఈ సోదాల్లో డాక్టర్ సుంఖ సంజనా, డాక్టర్ స్వపనాళి, డాక్టర్ మినల్, జాక్టర్ రాజ్‌కుమార్ తదితర్లు పాల్గొంటున్నట్లు వైద్యాధికారి పేర్కొన్నారు. పట్టణంలో 3,075 మంది పిల్లలకు ఎం.ఆర్.–1 వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2,302 మంది పిల్లలు అనగా 75 శాతం పూర్తి అయిందని అన్నారు. ఎం.ఆర్.–2 వ్యాక్సినేషన్ 2,291 మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,791 మంది పిల్లలకు అనగా 78 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించామని వైద్యాధికారి బుషరా పేర్కొన్నారు. స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు, పట్టణవ్యాప్తంగా 16 ఆరోగ్య కేంద్రాలలోనే గాకుండా స్వచ్చంధ సంస్థల కార్యాలయాలలో, పాఠశాలల్లో, బస్టాండ్, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలు కనపడితే తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాల్సిందిగా ప్రచారం ముమ్మరంచేశామని వైద్యాధికారులు చెబుతున్నారు. టీకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం... వ్యాధి తీవ్రంగా ప్రబలడానికి పేద జీవన పరిస్థితులు, పెద్ద కుటుంబాలు, సరైన ఆరోగ్య సేవలు లేకపోవడం, పారిశుద్ధ్య సౌకర్యాలు, పోషకాహార లోపం, చిన్నారుల్లో పేలవమైన రోగనిరోధక శక్తి, టీకాలు ఇవ్వకపోవడం వంటివి నగరంలో వ్యాధి వ్యాప్తికి కొన్ని ప్రధాన కారణాలని వైద్య నిపుణులు అంటున్నారు. పౌర డేటా ప్రకారం, 2020లో 25, 2021లో తొమ్మిది మీజిల్స్ కేసులు నమోదవగా, ఈ సంవత్సరం మీజిల్స్ కేసులు ముంబైలో బహుళ రెట్లు పెరిగాయి. 2023 చివరి నాటికి ఈ వ్యాధిని నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మహానగరం వ్యాధి వ్యాప్తికి సాక్ష్యంగా నిలుస్తోంది. అంతకుముందు, ముంబైలో 2019లో మీజిల్స్ కారణంగా మూడు మరణాలు నమోదయ్యాయి, 2020లో నాగ్‌పూర్, చంద్రపూర్, అకోలాలో ఒక్కో మరణం నమోదైంది. థానే, ముంబైలో 2021లో ఒక్కొక్క మరణం నమోదైంది. ఒక వారంలో ఐదు అనుమానిత ఇన్ఫెక్షన్ కేసులు ఉంటే, వాటిలో రెండు కంటే ఎక్కువ ప్రయోగశాల పరీక్షలో నిర్ధారించబడినట్లయితే, దానిని వ్యాధి వ్యాప్తిగా పేర్కొంటారని మహారాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి ప్రదీప్ అవతే వెల్లడించారు. ముంబై వెలుపల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందడంతోపాటు, పొరుగున ఉన్న థానే జిల్లాలోని భివండీ పట్టణంలోని కొన్ని ప్రదేశాలలో ఏడు కేసులు, నాసిక్ జిల్లాలోని మాలెగావ్ ఐదు కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా కూడా కారణమే: గోమరే 2020, 2021సంవత్సరాలలో కరోనా మహమ్మారి కారణంగా, సాధారణ టీకాలు వేసే కార్యక్రమాలు సైతం ప్రభావితమయ్యాయని, ఫలితంగా మీజిల్స్‌కు వ్యతిరేకంగా టీకాలు వేసే కార్యక్రమం కూడా దెబ్బతిందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కారణంగానే పెద్ద సంఖ్యలో పిల్లలు మొదటి లేదా రెండవ డోసులను వేసుకోలేదు. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇప్పుడు మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించడానికి మూడు–పాయింట్ల కార్యక్రమాన్ని చేపట్టామని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మంగళ గోమరే వెల్లడించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ చివరి వారం నుంచే కేసులు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమైందని, దీంతో పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారిందని గోమరే తెలిపారు. మీజిల్స్ డోస్ వేసుకోని పిల్లల కోసం 100–150 అదనపు సెషన్ల టీకాల క్యాంపులను ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. ఇప్పటికే 2 ఏళ్లలోపు 10 వేల మంది పిల్లలకు టీకాలు వేయించామని, మిగిలిన 10 వేల మంది చిన్నారులకు, 5 ఏళ్లలోపు 40 వేల మందికి వ్యాక్సినేషన్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గోమరే తెలిపారు. వ్యాధి లక్షణాలివే... దగ్గు, తుమ్ము సమయంలో వ్యాధి సోకిన వ్యక్తులు వదిలే శ్వాసకోశ బిందువుల ద్వారా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇది మోరిబిలివైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్, ఇది మనుషులకు మాత్రమే సోకుతుంది. ఇది సోకినవారికి తీవ్రంగా జలుబు, దగ్గు, విరోచనాలు, జ్వరం, కండ్లల్లో దురద తదితర లక్షణాలుంటాయి. చెవి, ముఖం నుంచి మొదలై శరీర భాగం మొత్తం దద్దుర్లు ఏర్పడుతాయి. తక్కువ వయసు కల్గిన పిల్లలకే ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరిలో రోగ నిరోధక శక్తి లోపించిన వారికే ఎక్కువ శాతం వ్యాధి ప్రమాదకరంగా మారుతోంది. – డా.బుషరా సైయద్, ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి -
బతికుండగానే భార్యను తగులబెట్టాడు
భివండీ (ముంబై): స్పృహ తప్పిన భార్యను బతికుండగానే తగలబెట్టాడు ఓ భర్త. ఈ సంఘటన స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. సంతోశ్ చౌరసియా తన భార్య కవిత ఇద్దరు పిల్లలతో కలిసి చావింద్రలోని మహం కాళి దాబా ప్రక్కనే ఉన్న గుడిసెలో నివసిస్తున్నారు. కూలి పనిచేసే సంతోష్ వ్యసనాల కారణంగా పనికిపోక తరుచుగా భార్యతో గొడవ పడేవాడు. మంగళవారం మద్యం సేవించిన సంతోశ్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆవేశంతో సంతోశ్ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పహతప్పిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వ చేసిన కర్రల కుప్ప దగ్గరకు కవితను లాకొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి నిప్పు అంటించి హత్యచేసి పారిపోయాడు. పోలీసులు నిందుతున్ని అరెస్ట్ చేశారు. చదవండి: (పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..) -
Viral Video: అగ్నిప్రమాదమా? అయితే మాకేంటి ముందు పొట్టనిండాలి!
రుచికరమైన భోజనం చేస్తున్న సమయంలో పక్కన ఏం జరిగినా పట్టించుకోరు కొంతమంది. అయితే అటువంటి ఓ ఘటన మహారాష్ట్రలోని భీవండిలో చోటు చేసుకుంది. భీవండిలోని అన్సారీ ఫంక్షన్హాల్లో ఆదివారం ఓ వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వివాహనికి వచ్చిన అతిథులు, బంధువులు భోజనాలు చేస్తున్నారు. అదే సమయంలో ఫంక్షన్ హాల్లో ఓ చోట భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చదవండి ఒకే వేదికపై ఇద్దరు ఎంపీలు.. హుషారైన స్టెప్పులతో రచ్చ.. అయితే వాటిని గమనించని కొంతమంది అతిథులు మాత్రం.. భోజనం టెబుల్ మీద కూర్చొని తింటూ కనిపిస్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘వెనుక అగ్ని ప్రమాదం బాబాయ్‌లు.. భోజనం ఆపి పరుగెత్తండి!’.. ‘భోజనం ముందుంటే.. అగ్ని ప్రమాదం కనిపించదా?’ ‘అగ్నిప్రమాదమా? అయితే మాకేంటి ముందు పొట్టనిండాలి!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
విద్యుత్ బకాయిల కోసం వెళ్తే.. ప్రాణం తీశారు
థానే: మహారాష్ట్రలోని ఓ గ్రామంలో చేపట్టిన విద్యుత్ బకాయిల వసూళ్ల డ్రైవ్ హింసాత్మకంగా మారింది. గ్రామస్తుల మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రైవేట్ విద్యుత్ సంస్థ గార్డు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మరమగ్గాల పరిశ్రమ కేంద్రమైన భివాండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ బిల్లుల బకాయిదార్లపై చర్యలు తీసుకునేందుకు ఓ విద్యుత్ సంస్థకు చెందిన సిబ్బంది తమ సెక్యూరిటీ గార్డు తుకారాం పవార్‌తో కలిసి శనివారం భివాండి సమీపంలోని కనేరి గ్రామానికి వెళ్లారు. విద్యుత్ సరఫరా లైన్లను కట్ చేసేందుకు ప్రయత్నించగా గ్రామంలోని 10 నుంచి 15 మంది కలిసి వారందరినీ కొట్టారు. ఈ దాడిలో గార్డు తుకారాం పవార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు నిజాంపుర స్టేషన్ పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక అందాక తదుపరి చర్యలుంటాయని చెప్పారు. ఇక విద్యుత్ సంస్థే తమ తండ్రి మరణానికి కారణమని తుకారాం కుమారుడు ఆరోపిస్తున్నారు. బకాయిదారులపై చర్యలు సాధారణంగా ఉండేవేనని, అందుకే పోలీసు రక్షణ కోరలేదని సదరు విద్యుత్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. నేరస్థుడి మృతితో దాడి మరో ఘటనలో నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లిన వాళ్లపై దాడి జరిగింది. భివాండిలోని కసాయివాడలో శుక్రవారం ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి జరిగింది. గుజరాత్ పోలీసులు, భివాండి క్రైం బ్రాంచి పోలీసులు సాధారణ దుస్తుల్లో వెళ్లి జమీల్ ఖురేషిని పట్టుకునేందుకు వెళ్లారు. వారి నుంచి తప్పించు కునే క్రమంలో ఖురేషి తను ఉన్న నాలుగో అంతస్తు ఫ్లాట్ కిటికీ నుంచి కిందికి దూకి, ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు పోలీసులే కారణ మంటూ స్థానికులు, మృతుడి కుటుంబీకులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
కుప్పకూలిన భవనం.. 17 మంది దుర్మరణం
సాక్షి ముంబై: మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మూడంతస్తుల భవనం నేలమట్టం కావడంతో అందులోని 17 మంది మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురు ఉన్నారు. ఈ సంఘటనలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. భివండీ ధామన్కర్నాకా పటేల్ కాంపౌండ్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనం సోమవారం వేకువజామున 3.15 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అంతా గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని వారు ఉలిక్కిపడ్డారు. బాధితుల హాహాకారాలు విని ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ ఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపాదికపై సహాయక చర్యలు ప్రారంభించారు. ఉదయం 11 గంటల సమయానికి 13 మందిని శిథిలాల నుంచి కాపాడగలిగారు. సహాయక చర్యలు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. సాయంత్రం 6.15 గంటల వరకు అందిన వివరాల మేరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాధితుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడటంతో వారందరికీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి∙ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు 43 ఏళ్లనాటి ఈ శిథిల భవనం ప్రమాదకరమైందంటూ భివండీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనంలో 150 మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. అధికారులు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. భివండీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. -
కుప్పకూలిన భవనం.. 10 మంది దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలోని భీవండి నగరంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మృతి చెందగా.. మరో 20 మందిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
భివండీలో తెలంగాణ ప్రజల వెతలు
భివండీ: వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు పెళ్లిళ్లకి వచ్చిన తెలంగాణ ప్రజలు భివండీలో ఇరుక్కుపోయారు. భివండీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలుగు వారుండే ప్రాంతాల్లో ఇంకా కరోనా వ్యాపించనప్పటికీ భివండీలో 13 మందికిపైగా కరోనా బారిన పడినవారున్నారు. ఇలాంటి నేపథ్యంలో పెళ్లిళ్లకు వచ్చి లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేక, భివండీలో ఉండలేక తెలంగాణప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందిన వివరాల మేరకు సుమారు 100 మందికిపైగా భివండీలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తమను ఎలాగైనా స్వగ్రామాలకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇలాంటి వారు అనేక మంది ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి తమ వినతిని తెలపాలని కోరుతున్నారు. ముఖ్యంగా వీరిలో కొందరు వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు ఉండడంతో పంటలకు నష్టం వాటిల్లే ముప్పు ఉందని వాపోతున్నారు. పద్మనగర్‌లో ... మార్చి 19వ తేదీ పవర్లూమ్ కార్మికుడు నవజీవన్ కాలనీలో నివసించే అకెన్ కనుకయ్య కుమారుడు శ్రీనివాస్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిరిసిల్ల, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 35 మంది ఇరుక్కుపోయారు. అలాగే ఆదర్శనగర్‌లో టీ స్టాల్ నడిపే కూరపాటి వీరయ్య కుమార్తె స్రవంతి వివాహ వేడుకల కోసం వరంగల్ అర్బన్, జిల్లాలోని గట్ల నర్సింగపరం నుంచి వచ్చిన 11 మంది లాక్డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. వ్యవసాయ కూలీలైన వీరు ఇరుకైన గదులలో ఉండలేక, సరైన భోజన వసతిలేక, పడుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొంటున్నారు. గాయత్రీనగర్ కి చెందిన జెల్ల రమేశ్ కూతురు రుషిక వివాహం కోసం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంకు చెందిన ఆరుగురు భివండీ వచ్చి ఇక్కడే చిక్కుకుపోయారు. కామత్‌ఘర్‌లో... కామత్‌ఘర్‌లో కూడా కరీంనగర్, జనగాం జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన సుమారు 22 మందికిపైగా ఇరుక్కుపోయారు. మార్చి 19వ తేదీన మామిడాల ఈశ్వర్ కుమారుడు రాజేష్ వివాహం జరిగింది. ఈ వేడుకల కోసం వచ్చిన వీరందరూ లాక్ డౌన్ కారణంగా గత నెలరోజుల నుంచి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ధామన్‌కర్ నాకాలో.. ధామన్‌కర్ నాకా ప్రాంతంలో మార్చి 19వ తేదీన జరిగిన సైరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి వివాహ వేడుకల్లో సుమారు 80 మంది బంధువులు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రాగా వీరిలో తొమ్మిది మంది మాత్రం భివండీలోనే ఇరుక్కుపోయారు. భివండీ తాలూకా కరివళి గ్రామంలో.. భివండీ తాలూకాలోని కరివళి గ్రామంలో సిరిసిల్లా నుంచి వచ్చిన తొమ్మిది మంది ఇరుక్కుపోయారు. వీరందరు కరివళి గ్రామానికి చెందిన తుమ్మ శ్రీనివాస్ కుమారుడు శైలేష్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. కోతకు వచ్చిన పంట ఏమవుతుందో... ఇంట్లో చిన్న పిల్లలను విడిచి వచ్చాం. వరి, మొక్కజొన్న కోతకు వచ్చింది. ఊర్లో గాలి దుమారం, వాన వచ్చిందంట. చేతికొచ్చిన పంట మట్టి పాలవుతుందోమోనని భయంగా ఉంది. మమ్మల్ని ఊరికి పంపించండి. –కొచెర్ల యాదగిరి (వరంగల్ జిల్లా కుమ్మరి గూడెం గ్రామం) వాతావరణం పడక ఇబ్బంది.. సిరిసిల్లలో మాకు పవర్లూమ్ పరిశ్రమలు ఉన్నాయి. మావద్ద 8 మంది ఉత్తర భారతీయులు పనిచేస్తున్నారు. మేము ఇక్కడ, వారు అక్కడా చిక్కుకుపోయాం. ఇక్కడ భోజనానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం, నాకు ముందు నుంచే ఆరోగ్యం బాగా లేదు. ఇక్కడ వాతావరణం పడక మరింత ఇబ్బందులు పడుతున్నా. –ఆకెన్ రాజేశం (సిరిసిల్ల) కుమారుని ఆరోగ్యం క్షీణిస్తోంది... దగ్గరి బంధువులు కావడంతో పెండ్లికి మా ఇద్దరి పిల్లలను తీసుకొచ్చాను. నా భర్త సిరిసిల్లలోనే ఉన్నాడు, మా అబ్బాయి అభినవ్‌కి ఫిట్స్ వ్యాధి ఉంది. నెల రోజులుగా ఇక్కడ ఒకే గదిలో ఉండటం వలన ఆరోగ్యం క్షీణించిపోతోంది. మమ్మల్ని ఎలాగైనా మా ఊరికి తీసుకెళ్లండి. –క్యాతం రూప (సిరిసిల్ల) ఆసుపత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి... ప్రభుత్వ ఆసుపత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నాను. తిరిగి రమ్మని డాక్టర్లు ఫోన్లు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా నేను భివండీలో ఇరుక్కుపోయాను. మా ఇంట్లో వృద్ధులున్నారు. –కొండ సంతోశ్ (సిరిసిల్ల) -
భివండీలో తెలుగు యువతి ఆత్మహత్య
సాక్షి, భివండీ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తెలుగు యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని భివండీలో జరిగింది. వివరాలు.. కామత్‌ఘర్‌కు చెందిన స్వాతి వేముల (21), బాలాజి నగర్‌కు చెందిన సాయిచంద్ర మాచెర్ల (25) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని స్వాతి చెప్పడంతో సాయిచంద్ర నిరాకరించాడు. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరులేని సమయంలో స్వాతి ఉరేసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదుచేసి సాయిచంద్రని అదుపులోకి తీసుకున్నారు. -
ఒకేచోట 86,707 సూర్యనమస్కారాలు
భివండీ: భివండీ పట్టణంలోని ఎన్ఈఎస్ హైస్కూ వార్శికోత్సవం వినూత్న పద్దతిలో చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కలసి 86,707 సూర్యనమస్కారాలు చేశారు. ఎన్ఈఎస్ పాఠశాలను స్థాపించి 50 వసంతాలు పూర్తయ్యాయి. దీంతో పాఠశాల వార్శికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వార్శికోత్సవాలలో భాగంగా 2,240 మంది విద్యార్థులు మూడు ప్రాంతాల్లో ఒకే సారి సూర్య నమస్కారాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు ప్రతి ఒక్కరు 13 సూర్య నమస్కారాలు చొప్పున కొంత సమయం విశ్రాంతి తీసుకుని మళ్లీ 123 సార్లు ఇలా మూడు పర్యాయాలుగా చేశారు. అయితే వీరిలో కొందరు 13 సార్లు సూర్యనమస్కారాలు చేయలేకపోవడంతో మొత్తం 86,707 సూర్య నమస్కారాలు పూర్తిచేసినట్లయింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మాజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా మహర్శి అరుణ్ దాతర్, క్రీడా భారతి సంస్థా మహామంత్రి రాజ్ చౌదరి, కమలా కిశోర్ హెడా, డాక్టర్ రాహుల్ జోషి, వినోద్ శెటే, దాస్బాయి పటేల్‌లు హాజరయ్యారు. అభినందనీయం: అరుణ్ దాతర్ క్రీడా మహర్శి అరుణ్ దాతర్ మాట్లాడుతూ.. వార్శికోత్సవం సందర్భంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. నేటి యుగం వేగంగా పరుగెడుతున్న తరుణంలో యువకులు, విద్యార్థులు యోగ, కసరత్తులాంటివికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పోతున్నారు. ఉదయం నిత్యం సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఆరోగ్యంతో పాటు విద్యార్థులు అన్ని విద్యల్లో చురుకుగా ఉంటారని సూచించారు. అదేమాదిరిగా పాఠశాల ఉపాధ్యక్షులు డాక్టర్ వివేక్ జోషి మాట్లాడుతూ.. విద్యార్థులకు సూర్యనమస్కారాలు నేర్పించడానికే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. -
భవనం కుప్పకూలి ఇద్దరు మృతి
ముంబై: మహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ దారుణం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. భివాండి ప్రాంతంలో నిర్మించిన ఈ అక్రమ కట్టడానికి పగుళ్లు రావడం గమనించిన మున్సిపల్ అధికారులు అందులో నివసిస్తున్న ప్రజలని ఖాళీ చేయాల్సిందిగా కోరారు. దాదాపు 22 కుటుంబాలను బిల్డింగ్ నుంచి తరలించారు. అయితే కొందరు తమ వస్తువులను తీసుకెళ్లడం కోసం తిరిగి బిల్డింగ్‌లో ప్రవేశించారు. ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొద్ది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. -
బాలికపై దాడి చేసి.. టబ్‌లో పడేసి
సాక్షి, ముంబై: ఎన్ని చట్టాలు చేసినా.. అనేక రక్షణ చర్యలు చేపట్టినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. ఆడపిల్లలకు బయటనే కాదు ఇంట్లో కూడా రక్షణ కరువైంది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన ఘటన మహారాష్ట్రలోని భీవండిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీవండిలోని పవర్లూమ్ టౌన్లో గుర్తుతెలియని దుండగులు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసి, అతి దారుణంగా కొట్టి, వాటర్ టబ్‌లో పడేసి చంపారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక అక్క.. విగతజీవిగా ఉన్న చెల్లిని చూసి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరస్తులపై ఐపీసీ 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఎంత మంది ఈ హత్యలో పాల్గొన్నారో వివరాలు తెలియాల్సివుంది. -
ముంబైలో కూలిన భవనం, ఒకరు మృతి
ముంబయి : మహారాష్ట్ర ముంబయిలోని బీవండిలో శుక్రవారం ఉదయం ఓ మూడంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఢిల్లీలోని తైమూర్ నగర్లో ఓ భవనం కుప్పకూలింది. అయితే ఎవరికి గాయాలు కాలేదు. -
మహిళకు ఆపరేషన్ చేస్తూ వీడియో తీసిన డాక్టర్
థానే(మహారాష్ట్ర): ఆపరేషన్ కోసం వచ్చిన మహిళను మాటలతో వేధిస్తూ.. అభ్యంతరకరంగా వీడియో తీయటమే కాకుండా మిగతా వారికి వాటిని పంపించి, అసభ్యకర కామెంట్లు పెట్టాడో వైద్యుడు. గౌరవప్రదమైన వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన సదరు వైద్యులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది. భివండి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నెల 12వ తేదీన ఒక మహిళకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ సందర్భంగా వైద్యుడు అభ్యంతరకరంగా కామెంట్లు చేస్తూ తీవ్రంగా మనోవేదనకు గురిచేశాడు. ఆమెకు సంబంధించిన వీడియోను దొంగతనంగా తీయటంతోపాటు దానిని తన స్నేహితుడైన మరో డాక్టర్‌కు ఫోన్లో పంపించాడు. వీటన్నిటినీ సదరు స్నేహితుడు మరో వ్యక్తికి పంపించాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. ఇద్దరు వైద్యులతోపాటు మూడో వ్యక్తిపైనా 354ఏ, 500, 509 సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. -
లేటు వయసులో వికృత చేష్టలు..
థానే: గత ఆరు నెలలుగా మైనర్లను లైంగికంగా వేధిస్తున్న ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని భీవండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీవండిలోని ఖాజా మొహల్లా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్లాం మహమ్మద్ ఖాలిక్ మోమిన్(60) స్థానికంగా నేత పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు పనిచేసే పవర్లూమ్ వద్ద కొందరు బాలికలు కూడా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా వారిని మహమ్మద్ అస్లాం తన వికృత చేష్టలతో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధిత బాలికలు గత ఆరు నెలల నుంచి బాధను భరిస్తూ వస్తున్నారు. అయితే, ఆ వృద్ధుడి చేష్టలతో సహనం కోల్పోయిన ఓ బాలిక ఇటీవల తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు బుధవారం భీవండి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు మహమ్మద్ అస్లాంపై పోస్కోతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితులు ఎంతమంది అనేది స్పష్టం కాలేదని, దర్యాప్తు జరిపి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. -
నడిరోడ్డు మీద అమ్మాయికి ప్రపోజ్.. దుమారం!
-
నడిరోడ్డు మీద అమ్మాయికి ప్రపోజ్.. దుమారం!
నడిరోడ్డు మీద వాహనాలు అటూ-ఇటూ రద్దీగా వెళుతున్న సమయంలో ఓ అమ్మాయికి యువకుడు తన ప్రేమను తెలుపుతూ ప్రపోజ్ చేయడం మహారాష్ట్రలోని భివండిలో దుమారం రేపుతోంది. స్థానిక మతనాయకులు ఈ జంట చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. భివండిలో ఈ నెల 11న యువకుడు బురఖా ధరించిన ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఆమెను కౌగిలించుకొని తన ప్రేమను ప్రకటించాడు. ఈ అనూహ్య ఘటనను చూసి కొందరు వాహనదారులు విస్తుపోగా.. మరికొందరు వారిని ఉత్సాహ పరిచారు. వీరి ప్రపోజ్ వీడియో సోషల్ మీడియాలో, ఆన్లైన్లో పెనుదుమారం సృష్టించింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కూడా ముస్లిం వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో వారి తీరు మత ఆచారాలకు విరుద్ధంగా ఉందని, వారికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తామంటూ మతసంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని అమ్మాయి తండ్రి తెలిపారు. ఇలా వేధింపులు ఆపకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని అమ్మాయి కూడా మీడియాతో పేర్కొంది. మరోవైపు నడిరోడ్డు మీద తాను చేసిన చర్యకు విచారం వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెప్తూ సదరు అబ్బాయి కూడా యూట్యూబ్‌లో రెండు వీడియోలు పెట్టారు. మతపెద్దల బెదిరింపుల నేపథ్యంలో ఆ జంటకు పోలీసులు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి బెదిరింపులు గురిచేసే వారిపై తీవ్రంగా చర్యలు ఉంటాయని, అలాగే వారి ప్రేమ వీడియోను ఆన్లైన్లో పోస్టుచేసిన వ్యక్తిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
తుపాకులతో కాల్చి..ఆపై కత్తులతో నరికి..
-
దేశవ్యాప్తంగా వర్ష విలయం...
-
దేశవ్యాప్తంగా వర్ష విలయం
* ముంబైలో భవనం కూలి 9 మంది దుర్మరణం * ముంబైలో నెలరోజుల్లో 925 మి.మి. వర్షపాతం ముంబై: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముంబైతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన థానే, పాల్ఘర్ జిల్లాల పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సామాన్య జన జీవనం అస్తవ్యస్తమైంది. ముంబై శివారులోని భివండీలో భారీ వర్షాలకు భవంతి కుప్పకూలి 9 మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ రెండతస్తుల భవంతిలో ఏడెనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయని, ఉదయం 9.30 గంటలకు భవనం కూలిపోయిందని భివండీ తహసీల్దార్ వైశాలి లాంబేట్ తెలిపారు. థానేలో ఘోడ్‌బందర్ రోడ్డులో మురుగు కాల్వ పొంగడంతో 12 మంది చిక్కుకుపోయారు. విపత్తు నిర్వహణ సిబ్బంది వారిని రక్షించారు. థానేలో ఆదివారం సాయంత్రం వరకూ 175 మి.మి. వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ముంబైలో జూలై నెల సరాసరి వర్షపాతం 799.7 మి.మీ.లు కాగా, ఈసారి 925.6 మి.మీ.లు నమోదైంది. నాసిక్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో నాసిక్‌లో 158.4 మి.మీ. వర్షం కురిసింది. సోమవారం కూడా ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బిహార్, అస్సాంలో మారని వరద దుస్థితి బిహార్, అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. బిహార్‌లో 12 జిల్లాలో మొత్తం 27.5 లక్షల మంది వరద బారిన పడ్డారు. 8 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అస్సాంలోని 28 జిల్లాల్లో 37 లక్షల మంది వరద ముంపులో చిక్కుకున్నారు. ఇంతవరకూ 31 మంది మరణించారు. నేమాటిఘాట్, గోల్పారా, ధుబ్రి పట్టణాల సమీపంలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఒడిశాలో పిడుగుపాటుకు మృతి చెందిన వారి సంఖ్య ఆదివారానికి 41కి చేరింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. గంగ, శారదా నదులు పలుచోట్ల ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో భారీ వర్షాలకు కొండచరియలు పడడంతో ఐదుగురు యాత్రికులు గాయపడ్డారు. చార్ధామ్ యాత్ర మా ర్గంతో పాటు పలు రోడ్లు మూతబడ్డాయి. -
శిథిలాల కింద ఆరుగురు సమాధి
-
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: ముంబయి శివారులోని థానే జిల్లా భీవాండిలోని ఓ వస్త్ర పరిశ్రమలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయిదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు వేగంగా పై అంతస్థులకు పాకాయి. దుస్తులు వేగంగా మంటలకు ఆహుతై మొత్తం నాలుగు ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ అలుముకుంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించిన బీఎంసీ అధికారులు, పోలీసులు .. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఉదయం షిఫ్ట్‌లో పని చేస్తున్న 80 మంది ఫ్యాక్టరీ పైకప్పు మీదకు చేరుకుని తమనకు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీతో పాటు నివాస కాంప్లెక్స్ అయినందున కార్మికులే కాకుండా మరో 70 మందికి పైగా మంటల్లో చిక్కుకుపోయారు. అయితే చిక్కుకున్నవారు 150మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. భీవాండి అగ్ని ప్రమాదంపై తెలంగాణ జిల్లాల చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. భీవాండి పరిసర ప్రాంతాల్లోని వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల చేనేత కార్మికులే పని చేస్తుంటారు. కాగా ఈ ఫ్యాక్టరీకి ఒకే ద్వారం వున్నందున లోపలి కార్మికులను బయటకు తరలించే అవకాశం లేదు. కేవలం నిచ్చెనల ద్వారా లేదంటే హెలికాప్టర్ల ద్వారా కార్మికులను సురక్షితంగా కిందకు దించే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాలుడిపై అత్యాచారం చేసి నిప్పంటించాడు
భీవాండి: ఇదో అమానవీయ సంఘటన. సిగ్గుతో తలదించుకునే విషయం. మానవత్వం రోజుకింత దిగుజారుతుందా అని అనుమానం కలిగించే అవకాశం. ఇప్పటి వరకు పసిపాప నుంచి పండుముసలమ్మ వరకు మృగాళ్లు లైంగికదాడులకు పాల్పడుతుండగా ఇప్పుడు ఓ మృగాడు మాత్రం మరింత రెచ్చిపోయి.. ఏడేళ్ల బాలుడుపై లైంగికదాడికి పాల్పడటంతోపాటు అతడికి నిప్పంటించాడు. మహారాష్ట్రలో భీవాండిలో చోటుచేసుకున్నఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడికి 30శాతం కాలినగాయాలయ్యాయి. ఈ దారుణానికి పాల్పడింది తెలిసినవారేనని పోలీసుల ప్రాథమిక సమాచారం. ఇంటివద్ద బాలుడిని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ బాలుడు ఆ కర్కశుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై 307, 377 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. -
మాంత్రికుడి చేతిలో పోలీస్ భార్య బురిడీ
భివండీ, న్యూస్‌లైన్ : మాంత్రికుని చేతిలో మోసపోయిన ఓ పోలీస్ భార్య ఉదంతం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఠాణే కోపిరి ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న టేంగర్ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు భార్య రూపాలి (34) తన సమస్యలను విన్నవించుకొనేందుకు కల్యాణ్ నాకలోని సుందర్బేన్ కాంపౌండ్‌లో నివసించే మాంత్రికుడికి వద్దకు వెళ్లింది. ఆమె సమస్యలు పరిష్కరించడానికి మాంత్రికుడు రూ. 35 వేలు ఖర్చు అవుతాయని చెప్పాడు. ఆమె తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో ఆభరణాలు ఉన్నా తీసుకురావాలని మాంత్రికుడు చెప్పాడు. దీంతో ఆమె మంగళవారం తన వద్ద ఉన్న రూ. 25 వేల విలువచేసే బంగారు గొలుసు, రూ.34 వేలు విలువ చేసే నెక్లస్‌తో పాటు ఐదు వేల నగదును ఇచ్చింది. మాంత్రికుడు తనను మోసం చేశాడని గుర్తించి బుధవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
15 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్
భివండీ న్యూస్‌లైన్ : పదిహేనేళ్ల బాలికపై పాల్ఘర్ జిల్లా వాసాయిలో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. భివండీకి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఈ బాలికను పోగావ్ ప్రాంతానికి చెందిన రామ్‌పర్వేశ్ చౌవ్హాన్ (26) కొద్ది రోజుల క్రితం వివాహాం చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తన మిత్రులు ధామన్‌కర్ నాక ప్రాంతానికి చెందిన ఇజాజ్ అహ్మద్ (26) గజని చౌదరి (30)తో కలిసి బాధితులారాలిని ఈ నెల 5నఅపహరించారు. వడూన్గర్ గ్రామంలోని ఓ చిన్న గదిలో ఆమెను బంధించి ముగ్గురూ సామూహిక అత్యాచారం చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే ఆమె అనారోగ్యం పాలవడంతో తల్లి దగ్గరిలో ఉన్న వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయట పడింది. బాధితురాలి తల్లి స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేస్ నమోదు చేశారు. ప్రధాన నిందుతుడు రామ్‌పర్వేశ్ చౌహాన్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు చెప్పారు. -
బాలల సంక్షేమ సంస్థకు తెలుగు చిన్నారులు
భివండీ, న్యూస్‌లైన్: ఆరు రోజుల క్రితం తల్లి వదిలేసి పోయిన నలుగురు తెలుగు చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది. కన్నతల్లి జాడే తెలియకపోగా, కన్నతండ్రి కనీసం చూసేందుకు కూడా రాలేదు. అయితే ‘సాక్షి’ చొరవతో అయిదు రోజుల అనంతరం పిల్లలను తీసుకుపోయేందుకు మేనమామ వచ్చారు. కానీ ‘బాల్ కల్యాణ్ సమితి’ (బాలల సంక్షేమ సంస్థ) పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారిని అప్పగించేందుకు నిరాకరించింది. ఆ పిల్లలను రెండు రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బోయ రాజేశ్వరి (9), బోయ స్వప్న (7), బోయ అఖిల (5), బోయ మహాలక్ష్మి (3)లను వారి కన్నతల్లి డిసెంబరు 31వ తేదీ తెల్లవారజామున కల్యాణ్ బస్‌స్టాండ్‌లో వదిలిపెట్టిపోయిన సంగతి తెల్సిందే. వీరిని పోలీసులు స్థానిక బాలల సంక్షేమ కేంద్రానికి పంపించారు. ఈ సంఘటన జరిగిన అయిదు రోజుల అనంతరం పిల్లలను తీసుకుపోయేందుకు వారి తల్లి బోయ సుజాత సోదరుడైన చంద్రకంటి ఆంజనేయులు, మరో గ్రామస్థుడు జోగి నారాయణ సోమవారం కల్యాణ్ చేరుకున్నారు. మహాత్మఫులే పోలీసు స్టేషన్లో అన్ని వివరాలను అందించిన వీరిని పోలీసులు పిల్లలనుంచిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్దకు తీసుకెళ్లారు. అయితే పిల్లలను మేనమామ ఆంజనేయులుకు అప్పగించేందుకు కమిటీ అధ్యక్షురాలు మీనల్ ఠాకోర్, సభ్యురాలు విద్యా ఆటపాడ్కర్, సభ్యుడు కిరణ్ మోరేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజనేయులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, పిల్లలను తీసుకుపోయేందుకు తండ్రి రాలేదని, తదితర కారణాల చూపుతూ వారిని అప్పగించేందుకు నిరాకరించారు. ఆ నలుగురు పిల్లలను తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆనందంనుంచి తేరుకునేలోపే.... అయిదు రోజులుగా అయినవారు కనిపించక బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు ఊరి నుంచి వచ్చిన మేనమామను చూసి ఒక్కసారిగా ఆనందంతో తబ్బిబ్బయ్యారు. వారి ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. తమను ఊరికి తీసుకెళ్లమంటూ మేనమామ వద్ద గోళ చేశారు. అయితే చైల్డ్వెల్ఫేర్ కమిటీ వారిని అప్పగించేందుకు నిరాకరించడంతో పిల్లల ముఖాల్లో విషాదం నిండుకుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన పిల్లలు మళ్లీ సంక్షేమ కేంద్రానికి వెళ్లేందుకు నిరాకరించారు. మేనమామతో కలిసి అమ్మమ్మ దగ్గరికి వెళ్తామంటూ చేసిన వారి రోదనలు అక్కడ చేరిన వారిలో కంటతడిపెట్టించాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటి ఆదేశానుసారం రెండు రోజుల్లో పిల్లలను మహబూబ్‌నగర్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటికి అప్పగిస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ నిషార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
వలస కార్మికులు తెలంగాణకు వచ్చేయాలె!
* భివండీలోని చేనేత కార్మికులతో కడియం శ్రీహరి భివండీ, న్యూస్‌లైన్ : భివండీలో స్థిరపడ్డ తెలంగాణకు చెందని వలస ప్రజలందరూ తమ సొంత రాష్ట్రంలోనే స్థిరపడాలనితెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరుతున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణలో వస్త్ర పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అందువల్ల వలసప్రజలందరు మళ్లీ తెలంగాణకు రావాలని పిలుపునిచ్చారు. టెక్స్టైల్ పార్కుల అధ్యయనం కోసం బయలుదేరిన తెలంగాణ ప్రతినిధుల బృందం భివండీ చేరుకుంది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూర రమేష్, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు బి.వి.పాపారావు, పరిశ్రమల విభాగం కమిషనర్ జయేష్ రంజన్ తదితరులతో కూడిన బృందం రెండు రోజుల పాటు సూరత్‌లో పర్యటించి, మూడవ రోజు భివండీ చేరుకున్నారు. ఇక్కడి అత్యాధునిక హంగులతో కూడిన టెక్స్టైల్స్ పరిశ్రమలతోపాటు చిన్నతరహా పరిశ్రమలు, పవర్‌లూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా భివండీ పద్మశాలి సమాజ్ హాల్లో అఖిల పద్మశాలి సమాజం, పవార్‌లూమ్ విభాగం, ఆల్ ఇండియా పద్మశాలి సంఘం, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతినిధి బృందం సభ్యులు పద్మశాలి సమాజ పెద్దలు, పవార్ లూమ్ యజమానులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక మంది తెలంగాణలో తామెదుర్కొన్న సమస్యలను ప్రభుత్వ ప్రతినిధుల ముందు ఏకరువు పెట్టారు. గాజెంగి రాజు, ఎస్ మల్లెశం, వేముల నర్సయ్య, వంగ పురుషోత్తం, సిరిపురం తిరుపతి తదితరులు మాట్లాడుతూ 15 ఏళ్ల కిందట అనాటి ప్రభుత్వ హామీల మేరకు అనేక మంది భివండీకి చెందిన తెలంగాణ ప్రజలు సిరిసిల్ల పట్టణంలో కోట్లాది రూపాయలతో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సీడీలేవీ లభించకపోగా తెలంగాణలో కరెంటు కష్టాలు కూడా తీవ్రంగా ఉన్నాయన్నారు. మరోసారి మీరు రావడం ఆనందకరమైనప్పటికీ హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. అనంతరం ప్రతినిధి బృందానికి విన్నతిపత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షులు కముటం శంకర్, కొంక మల్లేశం, బొల్లి రమేష్, కుందన్ పురుషోత్తం, మంచికట్ల విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మా కుమారుడిని రక్షించండి!
భివండీ, న్యూస్‌లైన్ : బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏడాది వయస్సున్న ఓ తెలుగు బాలుడి చికిత్స నిమిత్తం అతని తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, చందుర్తి మండలం, మరిగడ్డ గ్రామానికి చెందిన కూచన గణేష్, భార్య రాజలక్ష్మీ భీవండీలో స్థిరపడ్డారు. ఏడాది వయస్సున్న వీరి కొడుకు సాయికుమార్ గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి రక్త పరీక్షలు నిర్వహించగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో ముంబైలోని టాటా ఆసుపత్రిని ఆశ్రయించారు. డాక్టర్లు సుమారు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో వీరు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుండగా గణేశ్.. పవర్లూమ్ పరిశ్రమలో భీములు నింపే విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు సంవత్సారల నుంచి పరిశ్రమలు మందకొడిగా నడుస్తుండటంతో చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు లక్ష రూపాయలకు పైగా వైద్యానికి ఖర్చు అయిందనీ ఇప్పుడు తమ వద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవని ఆ దంపతులు చెప్పారు. తమ కొడుకును బ్రతికించుకోవడానికి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సహాయం చేయదలచిన వారు, ఆంధ్రా బాంక్ అకౌంట్ నం. 161810100141696లో విరాళం ఇవ్వవచ్చని, అదేవిధంగా మొబైల్ నంబర్‌కు 9921859856 సంప్రదించాలని బాలుడి తల్లిదండ్రులు కోరారు. -
టింబర్ డిపోలో అగ్నిప్రమాదం: 8మంది మృతి
థానే(ముంబై): మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భీవండిలో శనివారం ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున టింబర్ డిపోలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. డజను ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. -
భివండీలో రోడ్ల పనులు ప్రారంభం
భివండీ, న్యూస్‌లైన్ : భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక మేయర్ తుషార్ చౌదరి ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే భివండీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 27 కోట్ల అంచనావ్యయంతో భివండీ పట్టణవ్యాప్తంగా ఉన్న 39 రోడ్లను పూర్తిగా ఆధునికీక రించనున్నారు. ఇందులో ముఖ్యంగా ఐదు ముఖ్య మార్గాలైన కామత్‌ఘర్ తాడాళి, అంజూర్ పాట నుంచి రాజీవ్ గాంధీనగర్, నార్‌పోళి బాలూ పాటిల్ చౌక్ నుంచి దర్గా రోడ్, సమృభాగ్ నుంచి కరివళి రోడ్, కళ్యాణ్ రోడ్‌తోపాటు చిన్న చిన్న మార్గాల ఆధునికీకరణ పనులను బుధవారం సాయంత్రం 4 గంటలకు తుషార్ చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కమిషనర్, మాజీ డిప్యూటీ మేయర్ మనోజ్ కాటేకర్, గట్ నేత నిలేష్ చౌదరితోపాటు ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. -
పవర్లూమ్ సమస్యను పరిష్కరించండి
భివండీ, న్యూస్‌లైన్: పవర్ లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును భివండీకి చెందిన పద్మశాలీ సంఘాలు కోరాయి. రాజ్ భవన్లో సోమవారం మధ్యాహ్నం భివండీకి చెందిన పద్మశాలీ సంఘాల సభ్యులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో స్థిరపడిన పద్మశాలీల్లో అధిక శాతం మంది పవర్లూమ్ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన పవర్లూమ్ ప్యాకేజీ కేవలం జైన్, మైనార్టీ, బడుగు కులాల వారికే లబ్ధిచేకూర్చేలా ఉందని, ఎస్బీసీలకు ఏమాత్రం ప్ర యోజనం కలిగించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్బీసీలకు చెందిన పద్మశాలీలకు కూడా ఈ ప్యాకేజీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భివండీలో తెలుగు ప్రజలు స్థిర పడిన ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తెలుగు పాఠశాలలు, ఆశ్రమశాల, కార్మికులకు ప్రత్యేక వైద్యశాలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా విన్నవించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అసంఘట్ పవర్లూమ్ విభాగ చైర్మన్, భివండీ పద్మనగర్ పవర్లూమ్ వివర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ పురుషోత్తం, అఖిల పద్మశాలి సమాజం కార్యాధ్యక్షుడు వేముల నర్సయ్య, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, యెల్లె సాగర్ తదితరులు ఉన్నారు. -
విద్యతోనే గౌరవం
భివండీ, న్యూస్‌లైన్: విద్యతోనే ఎవరికైనా గౌరవం దక్కుతుందని, విద్యలేని నాడు ఎన్ని సంపదలున్నా వ్యర్థమేనని ముఖ్య అతిథులు కిరణ్ వాంఖడే, విజయ్ దలాల్ తెలిపారు. తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలుగు విద్యార్థులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కన్నెరి ప్రాంతంలోని పద్మశాలి హైస్కూలు, భావన రుషి తెలుగు మీడియం పాఠశాలలో మంగళవారం , కామత్‌ఘర్‌లోని పద్మశాలి ఇంగ్లీష్ మీడియం హైస్కూలు అండ్ జూనియర్ కాలేజీలో బుధవారం ఈ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కిరణ్ వాంఖడే, విజయ్ దలాల్ విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాంఖడే మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో విద్య అందరికీ అవసర మని స్పష్టం చేశారు. చదువుకున్న వారు ఎక్కడికి వెళ్లినా వారికి గౌరవం దొరుకుతుందన్నారు. తల్లిదండ్రులు దూరంగా ఉంటే విద్యార్థులు అభివృద్ధి సాధిస్తారని వివరించారు. అనంతరం దలాల్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి మంచి మార్గంలో నడుస్తూ యోగ, ధ్యానం లాంటివి చేస్తూ చదివితే వారు తప్పకుండా గొప్పవారవుతారని పేర్కొన్నారు. ఇళ్లల్లో పిల్లలు టీవీల్లో వచ్చే అనవసర కార్యక్రమాలు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పుడే వారికి చదువుకునేందుకు తగిన సమయం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ట్రస్టీలు దాసి అంబాదాస్, బైరీ రామస్వామి, చైర్మన్ డాక్టర్ పాము మనోహర్, కుందెన్ పరుషోత్తం, కళ్యాడపు భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తమ సంస్థ తరఫున రెండు రోజులపాటు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఆ సంస్థ అధ్యక్షుడు గుండ్ల శంకర్ చెప్పారు. -
కొనసాగుతున్న విగ్రహ నిర్మాణ పనులు
భివండీ, న్యూస్‌లైన్ : స్థానిక వరాలదేవి మందిరం వద్ద శ్రీ హనుమాన్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఆంజనేయస్వామి విగ్రహ తయారీ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొంతమంది భక్తులు 41 రోజుల ముందు హనుమాన్ మాలధారణ చే స్తారు. నిత్యం ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని శ్రీ హనుమాన్ సేవా ట్రస్టు భారీ ఆంజనేయ స్వామి విగ్రహ తయారీకి పూనుకుంది. అంతేకాకుండా ప్రతి ఏటా హనుజ్జయంతి సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. 2007లో సంపూర్ణ రామకోటి రాసి భద్రాచల రామయ్యకు అంకితం కూడా చేశామని ట్రస్ట్ సభ్యుడొకరు పేర్కొన్నారు. 2009లో లక్షదీపార్చన కార్యక్రమం కూడా నిర్వహించామన్నారు. 2010 లో 1,111 మంది మహిళా భక్తులతో లలితాదేవి కుంకుమార్చన, శ్రీచక్ర పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఇలా ప్రతి ఏడాది ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూన్న ట్రస్టు సంస్థాపకుడు గుండేటి నాగేష్, కార్యదర్శి బాలకిషన్ కోశాధికారి కోడూరి మల్లేశంలు తెలిపారు. కాగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గ్రామానికి చెందిన వడ్డెపల్లి సత్యనారాయణ... ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ విగ్రహం తయారీకోసం పెద్దఎత్తున విరాళాలను సేకరించాల్సి ఉందన్నారు. పట్టణానికి చెందిన కొంతమంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారన్నారు. అయినప్పటికీ అవి సరిపోవన్నారు. అందువల్ల విగ్రహ తయారీకి ఆర్థిక సహాయం చేయాలని స్థానికులను వారు కోరారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు తమను 09320607696 నంబర్‌పై సంప్రదించాలని కోరారు. -
తల్లిపై కొడవలితో దాడి
భివండీ, న్యూస్ల్: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిపై కొడుకు కొడవలితో దాడిచేయడంతో తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... కామత్‌ఘర్ ప్రాంతానికి చెందిన భారత్ బారడ్ (33), తన సోదరుడు రఘునాథ్‌ల మధ్య గొడవ జరుగుతుండగా, తల్లి పుష్ప బారడ్ (62), వారిని విడిపించే ప్రయత్నం చేసింది. దీంతో భారత్ తల్లిపై కొడవలితో దాడిచేశాడు. ఆమె కూతురు జయశ్రీ, రఘునాధ్ ముఖాలపై భారత్ భార్య శారద కారం చల్లింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని స్థానిక నిర్మయ్ ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. -
‘సేవ’ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ భివండీ
భివండీ, న్యూస్‌లైన్: భివండీలో తెలుగు ప్రజలు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో ‘సేవా’ సంస్థ నేతృత్వంలో ఆదివారం స్వచ్ఛ్ భివండీ నిర్వహించారు. ప్రధాన నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ను ప్రేరణగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ (సేవ) నేతృత్వంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘సేవ’తో పాటు పట్టణంలోని తెలుగు సేవా సంస్థలు నటరాజ్ మిత్ర మండల్, ఫ్రీడమ్ గైస్, ఓంకార్ మిత్ర మండల్, వినాయక్ మిత్ర మండల్, శ్రీ గజానన్ మిత్ర మండల్, మార్కండేయ మిత్ర మండల్, ఏక్తా మిత్ర మండల్, నవజావన్ చారిటబుల్ పాఠశాల, వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో అన్ని వర్గాలకు చెందిన 15 నుంచి 70 యేళ్ల మధ్య వయస్కులు పాల్గొనడం విశేషం. పద్మనగర్ ప్రాంతంలోని వార్డు నంబర్ 31,32 ల్లోని మార్కండేయ నగర్, గణేశ్ టాకీస్, రామ మందిరం, దత్తా మందిర్, బాలాజీ సొసైటీ, సోనార్ పాడ, మార్కండేయ మహాముని చౌక్, నీలకంఠేశ్వర మందిరం, గాయిత్రీ నగర్, మిలింద్ నగర్, జూనా పక్కుల్ చాల్, అలంకార్ టాకీస్, పక్కుల్ చాల్, రాజు చాల్, ధర్మచాల్, బోబుడే కంపౌండ్, యశ్వంత్ చాల్, జై భారత్ వ్యాయామశాల, వరాలదేవి రోడ్, గీతా మందిర్ రోడ్ తదితర ప్రాంతాల ప్రధాన రహదారులపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. అంతేగాకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతపై స్థానిక తెలుగు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్పొరేషన్ గత ఐదు నెలల నుంచి గంటా గాడీలను నిలిపివేయడంతో రోడ్డు ఇరుపక్కల వీధివీధినా ఎక్కడ చూసినా చెత్త కుప్పలు ఉన్నాయి. ఈ విషయంపై కార్పొరేషన్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో శనివారం నుంచి తిరిగి గంటా గాడీలను ప్రారంభించారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ గంటా గాడిలోనే చెత్త వేయవలసిందిగా సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు రామ మందిరం ప్రాంగణంలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. -
తూర్పులో విజయం సాధిస్తా: బీజేపీ అభ్యర్థి
భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలోని 137-తూర్పు నియోజక వర్గంలో తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి సంతోష్ ఎం. శెట్టి ధీమా వ్యక్తం చేశారు. అత్యధికంగా తెలుగు ప్రజలు స్థిరపడిన కామత్‌ఘర్, భాగ్యనగర్, గణేష్‌నగర్, రాజీవ్‌గాంధీ నగర్, ఆశ్వీద్‌నగర్, పేవా గావ్, మాన్సరోవర్ ప్రాంతాలల్లో బుధవారం మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే అన్ని ప్రాంతాలల్లో బీజేపీని గెలిపించి ప్రధాన మంత్రికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. తనకు తెలుగు ప్రజల మద్దత్తో పాటు కొందరు మరాఠీ, ముస్లింలు, గుజరాతీ, ఉత్తర భారతీయులు కూడా మద్దతు ఇస్తున్నారని అన్నారు. భివండీలో బీజేపీ విజయం సాధిస్తేనే పట్టణ అభివృద్ధి సుసాధ్యమని అన్నారు. ఈ ర్యాలీలో అత్యధికంగా తెలుగు ప్రజలతో పాటు ఆర్.పి.ఐ. పట్టణ అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్, బీజేపీ కార్పొరేటర్లు నిలేష్ చౌదరి, హనుమాన్ చౌదరి, లక్ష్మీ పాటిల్‌తో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట!
థానే: పరువు నష్టం దావా కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మహారాష్ట్రలోని బీవాండీ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఈకేసులో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. గత లోకసభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనంటూ దాఖలు చేసిన పిటిషన్ కు న్యాయమూర్తి ఎస్ వీ స్వామి సానుకూలంగా స్పందించారు. జాతిపిత మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే చంపారని చేసిన వ్యాఖ్యలపై రాహుల్ పై బీవాండీ యూనిట్ ఆర్ఎస్ఎస్ రాజేశ్ కుంటే కేసు నమోదు చేశారు. -
మసీదుకు దారి చూపించమని.. అత్యాచారం
మసీదుకు ఎలా వెళ్లాలో దారి చూపించాలని అడిగి.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో జరిగింది. శనివారం రాత్రి బిస్కట్లు కొనుక్కోడానికి బయటకు వెళ్లిన బాధితురాలు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు భివాండి ఇన్స్పెక్టర్ ఎస్.బి. షెంగ్డె తెలిపారు. క్వాటర్ గేట్ మసీదుకు ఎలా వెళ్లాలో దారి చూపించాలని అడిగి, ఆమెను ఓ గోడౌన్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. తెల్లవారుజాము సమయంలో ఇంటికి చేరుకున్న బాలిక తన తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 376, 363, 506ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. -
హెల్ప్‌లైన్‌కు కార్పొరేటర్ల మోకాలడ్డు
భివండీ, న్యూస్‌లైన్ : భివండీ కార్పొరేషన్ పట్టణ ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించనుంది. వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ఆయా విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేయడానికి కార్పొరేషన్ కమిషనర్ జీవన్ సోనావణే 997001312 అనే హెల్ప్ లైన్ నంబర్ ప్రాంభించాలని సంకల్పించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ, కొందరు కార్పొరేటర్ల నుండి వ్యతిరేకత రావడంతో ఇది అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందిలేకుండా.. భివండీ మున్సిపల్ కార్పొరేషన్ 26 కి.మీ. మేర విస్తరించి ఉంది. ప్రజల ఫిర్యాదులు ఏమైనా చేయాలంటే కార్యాలయానికి వ్యయప్రయాసాలకు ఓర్చి రావల్సి వస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హెల్ప్ లైన్ ప్రారంభించాలని కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆరోగ్య విభాగం-బి 01, విద్యుత్ శాఖ-02, నీటి పారుదల శాఖ-03, నిర్మాణ శాఖ-04, లెసైన్స్ శాఖ-05, టౌన్ ప్లానింగ్ శాఖ-06, పన్ను చెల్లింపు శాఖ-07, అగ్నిమాపక శాఖ-08, ఉద్యాన వన విభాగం-09, వైద్య ఆరోగ్య విభాగం-10 ఇలా ఇంటర్ కామ్ నంబర్లను కేటాయించారు. కార్పొరేటర్ల వ్యతిరేకత ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించడాన్ని కొందరు కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెంబర్ వల్ల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతింటాయని కొందరు ఇటీవల జరిగిన మహాసభలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్ ప్రారంభించడంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో ఇది ప్రారంభానికి నోచుకొంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేటర్ల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం కానీ కార్పొరేషన్ కమిషనర్ మాత్రం ప్రజల నుండి ఫిర్యాదులు చేయడానికి ఎలాగైనా సౌకర్యం కల్పిస్తామని అధికారులు అంటున్నారు. ఈ విషయమై జీవన్ సోనావణే‘ న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ఒకవేళ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తే ఎస్సెమ్మెస్ సేవలనుఅందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. -
పట్టణ సమస్యలపై పోరాటం
- భివండీలో కాంగ్రెస్ వినూత్న ఆందోళన - అంబులెన్స్‌లో రోగిని తీసుకువచ్చి నిరసన - రోడ్లు మరమ్మతులుచేయించాలని డిమాండ్ భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీపట్టణ అధ్యక్షుడు ప్రవీణ్ పాటిల్ ఆధ్వర్యంలో శనివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ రోడ్ల కిరువైపులా చెత్త పేరుకుపోయిందని, మంచినీటిలో మురుగు కలుస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. రోడ్లు గుంతలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. ఈ విషయమై భివండీనిజాంపూర్ షహర్ మహానగర్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. కాగా, ఈ సమస్యలన్నింటిని కళ్లకు కట్టినట్లు చూపించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ప్రాంగణంలోకి అంబులెన్స్‌లో రోగిని తీసుకువచ్చారు. స్కూలు విద్యార్థులు, గోవిందా బృందాలతో ‘ఉట్టి’ కొట్టించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వచ్చేృకష్ణాష్టమి, గణపతి నవరాత్రుల లోపు పట్టణంలోని ప్రధాన రహదారులైన దామన్‌కర్ నాక, ఆగ్రా రోడ్, అంజూర్ పాట,ఠాణా రోడ్, పంజరి పట్టి నాక, రాజీవ్‌గాంధీ ఫైల్వోర్ రోడ్లలో మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రవాది యువ ఉపాధ్యక్షుడు గుప్తా మనీష్, వాలియా బల్వీర్ సింగ్, బోడ భగవాన్, మాత్రే గురునాథ్, గోరే అజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పాఠశాల స్లాబ్ కూలి తెలుగు విద్యార్థులకు గాయాలు
థానే: మహారాష్ట్ర థానే జిల్లా భీవండి పట్టణం పద్మా నగర్లో తెలుగు పాఠశాల తరగతి గది పై కప్పు కుప్ప కూలింది. ఆ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాల ప్రారంభమైంది. ఎనిమిదో తరగతి విద్యార్థులు తరగతి గదిలో కుర్చుని ఉండగా గదిపై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో వారిని హుటాహుటిన పట్టణంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు, మున్సిపల్ ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్కూల్ నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు. -
వ్యభిచారం చేసేందుకు నిరాకరించింది అంతే...
వ్యభిచారం చేసేందుకు నిరాకరించిన మహిళపై ముగ్గురు యువకులు పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆ మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది.ఆ ఘటన బివండిలోని హనుమాన్ టెక్డిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... గుజరాత్ నుంచి తీసుకువచ్చిన ఓ మహిళను వ్యభిచార కూపంలో దించేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని సదరు మహిళ తొసిపుచ్చింది. దాంతో సదరు యువకులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఆమెపై ఐరన్ రాడ్‌తో దాడి చేసి పాశవికంగా దాడి చేసి అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన బీవండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. -
మహా‘గోదాం’
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ఒకప్పుడు వరి పంట కు ప్రసిద్ధిగా ఉన్న ఆ తాలూకా ఇప్పుడు అత్యధిక గోదాములు ఉన్న ప్రాంతంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం అక్కడి రైతులు వరి పొలాలను గోదాములు నిర్మించేందు కు లీజుకు ఇస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం భివండీ తాలూకాలోని పూర్ణా గ్రామంలో గోదాముల నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు భివండీ తాలూకా ‘అంతర్జాతీయ గోదాముల నగరం’గా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడి భూములు చాలా వరకు బిల్డర్స్ లాబీల కబ్జాలో ఉన్నాయి. తర్వాత విడతలు గా అనేక గ్రామాల్లో గోదాములు వెలిశాయి. చిన్న వి, పెద్దవి కలుపుకొని ఇలా ఇప్పటి వరకు సుమారు 1.5 లక్షల గోదాములను ఏర్పాటు చేసినట్లు తెలి సింది. దేశ, విదేశాల్లోని వివిధ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ నిల్వ చేస్తారు. వాటి సూచన మేరకు వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తా రు. ముంబై సమీపంలో స్థలం కొరత ఉండటంతో భివండీతాలూకాలోని అనేక గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థలాలు చాలా మంది వ్యాపారులు(బిల్డర్లు) ఇంతకుముందే కొనుగోలు చేసుకున్నారు. పెరుగుతున్న ధరలు 1982-83 సంవత్సరంలో పూర్ణా గ్రామంలో గల ఖండాగళే ఎస్టేట్‌లో తొలి గోదాం నిర్మాణం జరిగిం ది. ఆ సమయంలో రైతుల భూమికి రూ.80 నుంచి రూ.100 ఎకరం చొప్పున బిల్డర్లు కొనుగోలు చేశా రు. ఇనుప రేకులతో గోదాములను నిర్మించి, రూ.110 నుంచి రూ.120 లకు చదరపు అడుగు చొప్పున విక్రయించారు. తర్వాత పూర్ణా గ్రామం పక్కనున్న రహణాల్లో గోదాముల నిర్మాణం ప్రారంభమైంది. 1993-94 సంవత్సరంలో అరి హంత్ డెవలపర్స్ యజమాని వినోద్భాయ్ దోడి యా పూర్ణాలో 50 నుంచి 60 భవనాలను నిర్మించి అందులో గోదాములను ఏర్పాటు చేశారు. ఎకరానికి రూ.150 నుంచి రూ.200 చొప్పున భూమి కొనుగోలు చేసి, గోదాములను ఏర్పాటు చేసి వాటి ని రూ.350 నుంచి రూ.400 లకు చదరపు అడుగు చొప్పున విక్రయించారు. అరిహంత్ డెవలపర్స్ నిర్మించిన గోదాములకు ఉత్తమ స్పందన రావడం చూసి రాజ్యలక్ష్మి డెవలపర్స్ ఈ రంగంలోకి దిగిం ది. కాల్హేర్లో సుమారు 400 భవనాలు నిర్మించి గోదాములు ఏర్పాటు చేసింది. 1995-96 సంవత్సరంలో సుమారు రూ.300 నుంచి రూ.400 వరకు ఎకరం చొప్పున రైతుల నుంచి భూములను కొనుగోలు చేసి, ఆ స్థలంలో నిర్మించిన గోదాముల గిడ్డం గులను ఒక చదరపు అడుగుకు రూ.400 నుంచి రూ.500 చొప్పున విక్రయించింది. దాపోడాలో ఇండియన్ కార్పొరేషన్ పేరిట రుద్రప్రతాప్ త్రిపాఠి కూడా 2002-03 సంవత్సర కాలంలో గోదాములు నిర్మించడం ప్రారంభించారు. తర్వాత రూ.800 నుంచి రూ.900 చదరపు అడుగు చొప్పున గోదాముల గిడ్డంగులను విక్రయించారు. ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,500 చదరపు అడుగు చొప్పున ధర నడుస్తోంది. కాల్హేర్, కశేలి, కోపర్, పూర్ణా, రాహనాల్, వల్పాడా, దాపోడా, గుందవలి, మాణ్కోలి, అంజూర్, హైవే-దివే, ఓవళి, పిం ప్లాస్, రాంజనోలి, గోవే, పింపల్గర్, సోనాలే, వడ్గార్ ఇలా అనేక గ్రామాల్లో గోదాములు వెలి శాయి. అనేక గ్రామాల్లో స్థలం మిగిలి ఉండకపోవడంతో బిల్డర్లు భివండీ-పడ్గా రోడ్డుపై వడపా, వుక్సే-బోరివలి, సవాద్, ఆమణే-పిసే తదితర గ్రామాలను టార్గెట్ చేసి, గోదాములను నిర్మిస్తున్నారు. కానీ ఈ పరిసర ప్రాంతాలు దూరంగా ఉండడంతో ఎక్కువగా అమ్ముడుపోవడం లేదు. బిల్డర్లకు స్థలాన్ని లీజుకు ఇస్తున్న రైతులు స్థానిక రైతులు గోదాములు నిర్మించే బదులు స్థలా న్ని అభివృద్ధి చేయాలని బిల్డర్లతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆ ప్రకారంగా నిర్మించిన గోదాములను రైతులు అద్దెకు ఇచ్చేస్తున్నారు. వరి పంట నష్టమవుతున్నప్పటికీ గోదాముల అద్దె ద్వారా వచ్చే ఆదాయం వారికి ఎక్కువ గిట్టుబాటు కలిగిస్తోందని తెలుస్తోంది. ఏ రైతులైతే అధిక స్థలాన్ని అభివృద్ధి కోసం ఇచ్చారో, వారికి ప్రతి నెల చదరపు అడుగుకు రూ.8 నుంచి రూ.10 అద్దె లభిస్తోంది. అంటే లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షల వరకు సమకూరుతున్నాయి. అదే దిశగా ఇతర చిన్నగ్రామాలు కూడా నడుస్తుండటం గమనార్హం. -
భివండీలో బీజేపీ రక్తదాన శిబిరం
భివండీ, న్యూస్‌లైన్: మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయ్ 89వ జన్మదినం పురస్కరించుకొని పట్టణంలోని బీజేపీ పట్టణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం జరిగింది. టెలిపాడ ఆగ్రా రోడ్డులో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ మహేశ్ చౌగులే నేతృత్వంలో జరిగిన ఈ శిబిరాన్ని ఉదయం తొమ్మిది గంటలకు బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్యామ్ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్ చౌగులే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మాజీ ప్రధాని వాజ్‌పేయ్ జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. స్థానికులతో పాటు కార్యకర్తలు కూడా పాల్గొని రక్తదానం చేశారన్నారు. 70 మంది రక్త బాటిళ్లను సేకరించారని తెలిపారు. రక్తదానం చేసిన వారికి అల్పాహారంతో పాటు గుర్తింపు పత్రాన్ని అందజేశామని మహేశ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నీలేశ్ చౌదరి, సభాపతి మురళి మచ్చ, సామాజిక కార్యకర్తలు అనిల్ పాటిల్, రవి పాటిల్, వినోద్ పాటిల్, సచిన్ పాటిల్, పార్టీ ప్రముఖ కార్యాకర్తలు కముటం సుధాకర్, నిష్కం భైరి, కొండ వివేక్, ఎనగందుల ఉమేశ్, మామిడాల ధన్వంతరి, వెంగళ్ శ్రీనివాస్, బొల్లు నవీన్, బూర్ల మనోజ్ తదితరులు హాజరయ్యారు. -
కొనసాగుతున్న పోరాటం
భివండీ, న్యూస్‌లైన్: పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవడం తదితర డిమాండ్లతో భివండీ మరమగ్గాల యజమానులు చేపట్టిన బంద్ శనివారంతో 11వ రోజుకు చేరుకుంది. నిరవధిక బంద్‌తో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని యజమానులు, కార్మికులు, స్థానిక నాయకులు మండిపడుతున్నారు. అందుకే బంద్‌ను ఈ నెల 20 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. గత పది రోజుల నుంచి రాస్తారోకోలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం దారుణమని భివండీ పవర్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు, ఎంపీ సురేష్ ఠావురే అన్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ఆయన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ర షీద్ తాహిర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోహెబ్ గుడ్డూ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 వరకు నిర్వహించాల్సిన బంద్‌ను 20 వరకు పొడగించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భివండీలోని ఆనంద్దిగే చౌక్ నుంచి ముంబై మంత్రాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని సురేష్ ఠావురే ప్రకటించారు. నాయకులు అసమర్థులు... భివండీలో రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్య పరిష్కారమవుతుంది. వారి అసమర్థత వల్లే ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. బీజేపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎంపీ కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీళ్లు ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదు. - వడ్డెపల్లి శ్రీనివాస్ (టెక్స్టైల్ డిజైన్ మాస్టర్) మిలాఖత్ వల్లే... కొందరు విలేకరులు, పోలీసులు టోరెంట్ పవర్ కంపెనీతో చేతులు కలుపుతున్నారు. అందుకే విద్యుత్ చార్జీలు పెంచినా ఎవరూ ఏమీ అనడం లేదు. వస్త్రపరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఎంఎస్ఈబీ విద్యుత్ సరఫరా చేస్తున్న సమయంలో పోలీసులతోపాటు విలేకరులు ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలకు అండగా నిలిచేవారు. ఇప్పడు వారు టోరెంట్ కంపెనీకే సహకరిస్తున్నట్టు అనిపిస్తోంది. -వాసం రాజేందర్ (నేత కార్మికుడు) -
భివండీ ఆందోళన మరింత తీవ్రం
భివండీ, న్యూస్‌లైన్: భివండి పవార్‌లూమ్ పరిశ్రమల యజమానులు చేపట్టిన ఆందోళన ఆరో రోజుకు చేరింది. వీరి డిమాండ్ల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో సోమవారం ఆందోళనను మరింత తీవ్రం చేశారు. భీవండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అశోక్‌నగర్ నుంచి టోరంటో నోడల్ కంపెనీ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పవార్‌లూమ్స్ యజమానులు పాల్గొన్నారు. విద్యుత్ వితరణ కంపెనీకి చెందిన నోడల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, విద్యుత్ రేట్లు తగ్గించాలని, టోరంట్ కంపెనీని భివండీ నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో కూడిన ఓ విన్నతిపత్రాన్ని నోడల్ అధికారి పరస్బి జాడ్కర్కు అందించారు. ఈ ర్యాలీలో భీవండీ పవర్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు, ఎంపీ సురేష్ టావ్రే, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రశీద్ తాహిర్, శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రేతోపాటు పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు. న్యాయం చేసేందుకు కృషి చేస్తా: సీఎం భివండీ పవార్‌లూమ్స్ యజమానుల సమస్యలపై సంఘర్ష్ సమితి అధ్యక్షులైన ఎంపీ సురేష్ టావ్రే సోమవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవార్‌లూమ్స్ యజమానులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు టావ్రే తెలిపారు. పవార్‌లూమ్స్ యజమానులు, సంఘర్ష్ సమితి పదాధికారులతోపాటు టొరంటో కంపెనీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టావ్రే ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
మరమగ్గాల సమ్మెతో రోజుకు రూ.90 కోట్ల నష్టం
భివండీ, న్యూస్‌లైన్: కరెంటు చార్జీల పెంపు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం భివండీ వస్త్ర పరిశ్రమల యజమానులు ఈ నెల ఆరు నుంచి బంద్ పాటించడంతో మరమగ్గాలకు తీవ్రనష్టాలు వాటిల్లుతున్నాయి. పట్ణంలోని దాదాపు ఏడు లక్షల మగ్గాలు మూలనబడడంతో నిత్యం రూ.90 కోట్ల నష్టం వాటిల్లుతోందని స్థానిక ఎంపీ సురేశ్ ఠావురే పేర్కొన్నారు. 12 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి పరిశ్రమలు శాశ్వతంగా మూతబడే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మరమగ్గాల పరిశ్రమల సమస్యలపై ప్రభుత్వం ఎంతమాత్రమూ స్పందించడం లేదని ఠావురే విమర్శించారు. స్వగ్రామాలకు పయనం.. బంద్ కారణంగా భివండీ స్తంభించడంతో కార్మికులు ఏం చేయాలో తోచక స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. పరిశ్రమలు యంత్రాలను నిలిపివేయడంతో కార్మికులకు పనిలేకుండాపోయింది. బంద్ కొనసాగినంత కాలం వారికి భృతి ఇవ్వాలని భివండీ కామ్‌గార్ సంఘర్షణ సమితి కార్యదర్శి విజయ్ ఖానే యాజమాన్యాలను డిమాండ్ చేశారు. కార్మికుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో వారిలో చాలా మంది యజమానుల నుంచి జీతాలు తీసుకొని స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. కళ్యాణ్ రైల్వే స్టేషన్లో నిత్యం ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకకు వెళ్లే కార్మికులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. గతంలో సేల్స్‌ట్యాక్స్, ఎల్బీటీ, టోరెంట్ పవర్ కంపెనీ అధిక చార్జీల విధింపు వంటి సమస్యలు ఎదురైతే ఆందోళనకు దిగిన యజమానులకు కార్మికులు సహకరించారు. ఇప్పుడు మాత్రం వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఖానే అన్నారు. -
రెండోరోజూ కొనసాగిన బంద్
భివండీ, న్యూస్‌లైన్: కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా భివండీ వస్త్ర పరిశ్రమల యజమానులు పాటిస్తున్న బంద్ రెండోరోజు ప్రశాంతంగా కొనసాగింది. నిత్యం మరమగ్గాల చప్పుళ్లతో హడావుడిగా ఉండే పట్టణం బంద్ వల్ల ప్రశాంతంగా కనిపిస్తోంది. అయితే పరిశ్రమలు స్తంభించిపోవడంతో వాటిపై ఆధారపడి ఉన్న పాన్‌షాపులు, టీ కొట్లు తదితర చిన్న వ్యాపారాలూ దెబ్బతింటున్నాయి. ప్రతినిత్యం పనిచేస్తేనే ఈ చిన్నవ్యాపారులు కుటుంబాలను పోషించుకోగలుగుతారు. మరోవైపు బంద్ ఈ నెల 15 వరకు కొనసాగనున్నందున.. చాలా మంది కార్మికులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. గత రెండు రోజుల నుంచి సుమారు 500 మందికిపైగా కార్మికులు స్వగ్రామాలకు వెళ్లారని పరిశ్రమల యజమానులు తెలిపారు. మగ్గాలు పున:ప్రారంభమైనా కార్మికులు లేకపోవడంతో ఉత్పత్తి కష్టంగా మారుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భివండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో ప్రాంతాధికారి కార్యాలయం ఎదురుగా గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు సురేష్ టావురే మాట్లాడుతూ...బంద్ పాటిస్తూనే మరోవైపు రాస్తారోకో, ధర్నా, ఆందోళన, మోర్చాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సురేష్ డిమాండ్ చేశారు. -
భివండీ బంద్
భివండీ, న్యూస్‌లైన్: మహారాష్ట్ర మాంఛెస్టర్గా పేరున్న భివండీ బుధవారం స్తంభించింది. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్త్రపరిశ్రమల యజమానులు బుధవారం నుంచి ఈ నెల 15 వరకు బంద్ పాటిస్తున్నారు. దీంతో పట్టణంలో ఉన్న సుమారు 10 లక్షల మరమగ్గాలు, ఇతర యంత్రాలు నిలిచిపోయాయి. భివండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఆరు నుంచి 15 వరకు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భివండీకి వలస వచ్చారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా వ్యాపారాలు మందకొడిగా సాగుతుండడంతో వేలాది మంది యజమానులు, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరమగ్గాల కార్మికుల కోసం సంక్షేమ పథకాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించకపోవడంతో వీరి జీవితాల్లో సంక్షోభాలు తప్పడం లేదు. సుమారు 12 లక్షలకు పైగా జనాభా ఉన్న భివండీలో 90 శాతం మంది ప్రజలు వస్త్రపరిశ్రమలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మరమగ్గాల పరిశ్రమలు నడిస్తేనే ఇతర వ్యాపారాలూ నడుస్తాయి. గత మూడు సంవత్సరాల నుంచి నూలు ధరల్లో హెచ్చుతగ్గుల వలన వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో ఇప్పటికే 30 శాతం చిన్నపాటి పరిశ్రమలు మూతబడ్డాయి. మూతబడ్డవాటిలో తెలుగు వారికి చెందిన పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఒకటి నుంచి విద్యుత్ చార్జీలను పెంచి పరిశ్రమల యజమానుల నడ్డి విరుస్తోందని భివండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరమగ్గాల యంత్రాలను కిలోల చొప్పున చిత్తు మాదిరిగా అమ్ముకోవాల్సి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భివండీ పద్మనగర్ పవర్లూమ్ అసోసియేషన్, శాంతినగర్ పవర్లూమ్ అసోసియేషన్, అలాగే షోలాపూర్, ఇచ్చల్కరేంజీ, సాంగ్లీ, మాలేగావ్, విఠా, సతారా ప్రాంతాల్లోని సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విద్యుత్‌శాఖ మంత్రి అజిత్ పవార్‌ను గత నెల మూడున కలిసి తమ సమస్యలపై చర్చించారు. మరమగ్గాల కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినా ఇంత వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భివండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో పట్టణంలోని అన్ని పరిశ్రమలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. ముత్యాల ఫ్యాక్టరీలు, డయింగ్ ఫ్యాక్టరీలు కూడా బంద్‌లో పాలొన్నాయి. -
గోదాములో అగ్నిప్రమాదం
భివండీ న్యూస్‌లైన్ : రహనాల్ గ్రామంలోని సద్గురు కాంపౌండ్ సిరాజ్ కెమికల్ కంపెనీ గోదాములో గురువారం ఉదయం 11 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా మంటలు చెలరేగడంతో గోదాము ఎదురుగా నిలిపి ఉంచిన టెంపో దగ్ధమైంది. అగ్మి మాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన గోదాముకు ఎలాంటి అనుమతులు లేవని గ్రామ పంచాయితి వికాస్ అధికారి నరేష్ పాటిల్ మీడియాకు తెల్పారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. -
వైభవంగా వరలక్ష్మీవ్రతం
సాక్షి, ముంబై: భివండీలోని నవజీవన్ కాలనీలో ఉన్న శ్రీ సద్గురు బ్రహ్మర్షి విద్యానందగిరి ఆశ్రమంలో భక్తబృందం ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు మహిళలు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. ప్రతి శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుతామని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూజా కార్యక్రమం జరిగిందన్నారు. పూజానంతరం మధ్యాహ్నం భక్తులందరికీ మహాప్రసాదం అందజేశామని తెలిపారు. ఇదిలా ఉండగా పద్మనగర్, మార్కండేయనగర్, గాయిత్రీనగర్, కామత్‌ఘర్, కన్నేరి, కొంబడ్పాడా, కాసార్ అలీ, నయీబస్తీ తదితర తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో కూడా మహిళలు తమ ఇళ్లల్లో వరలక్ష్మీవ్రతం నిర్వహించారు. పద్మనగర్‌లోని వైష్ణవ దేవాలయం, బాలాజీ మందిరాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు జరిగాయి. ఒకవిధంగా పండుగ వాతావరణం కనిపించిందని చెప్పవచ్చు. శ్రీ సత్యానందమహర్షి భక్తమండలి ఆధ్వర్యంలో ప్రభాదేవిలోని శ్రీ సత్యానంద మహర్షి భక్తమండలి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ‘వరలక్ష్మీ వ్రతం’ శ్రీహరి తీర్థ స్వాముల వారిచే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్రతం తర్వాత స్వామీజీ ఉపన్యసిస్తూ వ్రతం విశిష్టతను వివరించారు. హారతి తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేసినట్లు మండలి కార్యదర్శి మంచె పురుషోత్తం తెలిపారు.