తుపాకులతో కాల్చి..ఆపై కత్తులతో నరికి.. | Congress Leader's Murder In Maharashtra | Sakshi
Sakshi News home page

Feb 15 2017 6:33 PM | Updated on Mar 21 2024 8:11 PM

ముంబై శివారు ప్రాంతంలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సంబంధించి ఫుటేజీ మహారాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. వివరాలు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ మనోజ్ మెహట్రె(53) మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ ముంగించుకొని రాత్రి 9:30 గంటలకు ఓస్వల్వాడీలోని తన ఇంటికి వచ్చారు. కారును పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఇద్దరు దుండగులు మొదట అతనిపై కాల్పులు జరిపారు. దీంతో మనోజ్ అక్కడే కుప్పకూలిపోయాడు. అంతటితో ఆగకుండా దుండగులు కిందపడ్డ మనోజ్పై పదునైన ఆయుధాలతో ఇష్టానుసారంగా దాడికి దిగారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాకు చిక్కింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement