
వ్యభిచారం చేసేందుకు నిరాకరించింది అంతే...
వ్యభిచారం చేసేందుకు నిరాకరించిన మహిళపై ముగ్గురు యువకులు పాశవికంగా దాడి చేశారు.
వ్యభిచారం చేసేందుకు నిరాకరించిన మహిళపై ముగ్గురు యువకులు పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆ మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది.ఆ ఘటన బివండిలోని హనుమాన్ టెక్డిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... గుజరాత్ నుంచి తీసుకువచ్చిన ఓ మహిళను వ్యభిచార కూపంలో దించేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని సదరు మహిళ తొసిపుచ్చింది.
దాంతో సదరు యువకులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఆమెపై ఐరన్ రాడ్తో దాడి చేసి పాశవికంగా దాడి చేసి అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన బీవండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.