
ముంబై: మహారాష్ట్రలోని భీవండి నగరంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మృతి చెందగా.. మరో 20 మందిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.