building collapses
-
ఎలివేషన్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా.. ఘోర ప్రమాదం!
హైదరాబాద్: కూకట్పల్లి సర్కిల్ అడ్డగుట్ట సొసైటీలోని ఓ భవన నిర్మాణం ఎలివేషన్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఆరో అంతస్తుపై ఉన్న పిట్టగోడ కూలిపోయింది. దీంతో భవన నిర్మాణానికి ఏర్పాటు చేసిన గోవా కర్రలు విరిగిపోయాయి. ఈ ఘటనలో కర్రలపై నిల్చుని ప నిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగుట్ట సొసైటీలోని ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఎలివేషన్ కోసం సెంట్రింగ్ పనుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. సెంట్రింగ్ తొలగిస్తున్న సమయంలో పిట్టగోడ కూలి సానియా బట్నాయక్ (19), సామ బట్నాయక్ (23), సానియా చలాన్ (20)లు మృతి చెందారు. వీరితో పాటు పని చేస్తున్న ముదాబత్ నాయక్, బలరాం, సుప్రా బట్నాయక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సామ బట్నాయక్, సానియా చలాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, సానియా బట్నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భవనం పిట్టగోడ కూలిన విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో గురువారం పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ భవనం దాసరి సంతోష్, దాసరి సాయిరాం పేరుపై 2022 డిసెంబర్ 2వ తేదీన జీ 5 అంతస్తులకు అనుమతులు తీసుకున్నారు. అదనంగా మరో ఫ్లోర్ అక్రమ నిర్మాణం చేపట్టారు. ఆ అంతస్తులోనే పని చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నాణ్యత లేకపోవడంతోనే.. ఆరో అంతస్తుపై పిట్టగోడ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకోకపోవటంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు, గోవా కర్రలు తడిచిపోయాయి. పిట్టగోడ కోసం నిర్మించిన సిమెంట్ పెళ్లలు గోవా కర్రలపై పడిపోగా అవి విరిగి వాటిపై నిల్చుని పని చేస్తున్న కార్మికులు కింద పడిపోయారు. అనుమతులు పొందిన దానికంటే అక్రమంగా అంతస్తులు నిర్మాణం చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ముందుగానే అక్రమ అంతస్తులను అధికారులు అడ్డుకొని ఉంటే ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసేవి కావంటున్నారు. క్రిమినల్ కేసులు పెడతాం.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురి కార్మికుల మృతికి కారణమైన భవన యజమానులు, ఆర్కిటెక్ట్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అనుమతులు పొందిన దానికంటే అక్రమంగా నిర్మించిన మరో ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేస్తామని పేర్కొన్నారు. గతంలోనే రెండుసార్లు భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ.. ప్రమాదవశాత్తు పిట్టగోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందడం, ముగ్గురు కార్మికులకు గాయాలు కావటం దురదృష్టకరమని స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. భవన యజమాని, బిల్డర్, సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిజేస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఆయన చెప్పారు. -
కుప్పకూలిన భవనం..
-
కుప్పకూలిన భవనం.. 10 మంది దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలోని భీవండి నగరంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మృతి చెందగా.. మరో 20 మందిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
పేక ముక్కల్లా కూలిన భారీ కాంప్లెక్స్
తిరువనంతపురం: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని కేరళలోని భారీ కాంప్లెక్స్‌లను శనివారం అధికారులు కూల్చేయనున్నారు. కొచ్చిలోని మారడు ప్రాంతంలో ఉన్న కాంప్లెక్స్‌లను కూల్చి వేయాలని ఎర్నాకులం జిల్లా న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 343 ప్లాట్లు, 240 కుంటుంబాలు ఉంటున్నాయి. శనివారం, ఆదివారం రెండు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూల్చివేత పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతంలో పోలీసులు సెక్షన్ 144ను అమలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన నిర్మాణాలు చట్ట విరుద్ధమని 138 రోజుల్లోగా కాంప్లెక్స్‌లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లో ఆదేశించింది. తీర ప్రాంతంలో కట్టినందుకు నెలలోపు తొలగించాలని గత ఏడాది మే 8న సుప్రీంకోర్టు ఆదేశించింది. త్రిసభ్య కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కాంప్లెక్స్ నివాసితులు మొదట ఖాళీ చేయడానికి నిరాకరించినా అనేక నిరసనల అనంతరం రాజీకి వచ్చారు. ఫ్లాట్ల యజమానులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇక కాంప్లెక్స్ కూల్చివేతకు అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. కాంప్లెక్స్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించడంతోపాటు పరిసరాల ప్రజలను కూడా ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు. రహదారుల నుంచి పోలీసులు బారికేడ్లను తొలగించిన తర్వాత ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావచ్చని పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించరాదని కొచ్చి పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. భవనాల్లో బుధవారం పేలుడు పదార్థాలు ఉంచామని పేర్కొన్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా కూల్చివేత సురక్షితంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే సంఘటన ప్రాంతంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయగా.. ఈ ప్రక్రియను మొత్తం నిర్వహించడానికి 800 మంది సిబ్బందిని నియమించారు. -
కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్ భవనం
-
కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్ భవనం
సాక్షి, విజయనగరం : జిల్లాలోని కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కుప్పకూలింది. గత మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యార్థులకు దసరా సెలవులు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. భవనంలో కొంత భాగం కూలిపోగా.. మిగతా భాగం కూడా నెలకొరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోడలు చాలా వరకు బీటలు వారి ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
షాకింగ్ : చూస్తుండగానే బంగ్లా నేలమట్టం..!
డెహ్రాడూన్ : భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్ జలమయమైంది. జనజీవనం స్థంభించింది. ఉధృతమైన వరదల కారణంగా చమోలి జిల్లాలోని లంఖీ గ్రామంలో చూస్తుండగానే ఓ బంగ్లా కుప్పకూలింది. రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. బంగ్లాలో నివాసముండే ఏడుగురు శిథిలాల చిక్కుకున్నట్టు సమాచారం. దురదృష్టవశత్తూ వారిలో ఒక్కరు మినహా మిగతా ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇక రెండు రోజుల క్రితం తెహ్రీ జిల్లాలోని తార్థి గ్రామంలో ఓ ఇల్లు వరదల్లో పడి కొట్టుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ, ఆరేళ్ల ఆమె తనయుడు ప్రాణాలు విడిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఇళ్లు, పశువుల పాకలు వరదల తాకిడికి నేలమట్టమయ్యాయి. -
కూలిన భవనం.. ఏడుగురు దుర్మరణం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని సుదర్శన్ పార్క్ వద్దగల ఓ మూడంతస్థుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించండంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా మరో 8 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ (పశ్చిమ ఢిల్లీ) మోనికా భరద్వాజ్ తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్టు చెప్పారు. అయితే, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రమాద సమయంలో 13 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న స్క్రాప్‌యార్డులో మరో 12 మంది ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. -
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 30 మంది
గ్రేటర్ నోయిడా : నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో భవనంపై పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోమారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాలోని సాహ్ బెరి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలి పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనంపై పడింది. దీంతో నాలుగంతస్తుల భవనం కూడా కుప్పకూలి అందులో నివాసముంటున్న18 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. నాణ్యతాపరమైన లోపాల వల్లే భవనం కుప్పకూలి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇటలీలో భూకంపం, రోమ్ లోనూ భూప్రకంపనలు
-
ఇటలీలో భూకంపం, రోమ్ లోనూ భూప్రకంపనలు
రోమ్ : ఇటలీలో తీవ్ర భూకంపం సంభవించింది. రోమ్ నగరంతో పాటు సెంట్రల్ ఇటలీలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. స్వల్పకాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని ప్రభావంతో పురాతన భవనాలు నేలమట్టం కాగా, పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు రోమ్ లోనూ భూప్రకంపనలు వచ్చాయి. -
కుప్పకూలిన ఏడంతస్ధుల భవనం
-
భవనం కుప్పకూలి ఆరుగురి కార్మికుల మృతి
-
భవనం కుప్పకూలి ఆరుగురి కార్మికుల మృతి
చండీగఢ్ : భవనం కుప్పకూలిన ఘటన చండీగఢ్‌లో విషాదాన్ని నింపింది. సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించగా మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించిన పోలీసులు సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఓ భవన నిర్మాణం కోసం కార్మికులు తవ్వుతుండగా తవ్వకాల ధాటికి పక్కనే ఉన్న మరో భవనం హఠాత్తుగా కుప్పుకూలింది. భవనం కుప్పకూలి కార్మికులపై పడటంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. భవనం కింద చిక్కుకున్న 14 మందిని వెలికి తీయగా, మరో ఆరుగురు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్టు సమాచారం . ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోతీనగర్‌లో భవనం కూలి ఒకరు మృతి 11 మందికి గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: మూడంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఉన్న సదర్శన్‌పార్క్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడినవారిని భవనం శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూడటం కోసం అనేక గంటల పాటు గాలించారు. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని 20 సంవత్సరాల ఆనంద్ శశినాథ్‌గా గుర్తించారు. ‘ఉదయం 7.45 గంటలకు పేలుడు జరిగి భవనం కూలిన సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పలు అగ్నిమాపక వాహనాలతో రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలను ఆరంభించామని అగ్నిమాపక విభాగపు అధికారి ఒకరు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు తోడ్పడ్డారు. ఈ భవనంలో నివాసమున్న వారిలో అధికులు అద్దెకున్నవారేనని తెలిసింది. భవనం కింది అంతస్తులో ఓ ఫ్యాక్టరీ నడిచేద ని దానిలో బాయిలర్ పేలడంతోనే భవనం కూలి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
భవనంకు స్లాబ్... వేస్తుండగా పడిపోయిన సెంట్రింగ్
-
కుప్పకూలిన భవనం,శిధిలాల కింద ఆరుగురు?
-
ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం
దేశ రాజధాని న్యూఢిల్లీ ఇంద్రలోక్ ప్రాంతంలో శనివారం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న మున్సిపల్ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉన్నతాధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
సదర్‌బజార్‌లో కూలిన నిర్మాణం
న్యూఢిల్లీ: నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో అత్యంత ఇరుగ్గా ఉండే సదర్ బజార్ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ విషయమై డీసీపీ సింధు పిళ్లై మాట్లాడుతూ శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని వెలికి తీశామని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారన్నారు. మృతులను బాబూ పాశ్వాన్ (25), నట్వర్లాల్ (50), ఆయన కుమారుడు అశోక్ (25)లుగా గుర్తించామన్నారు. క్షతగాత్రులం తా కూలీలేనన్నారు. వీరందరినీ శుశ్రూత ట్రామా సెంటర్, రామ్మనోహర్ లోహియా ఆస్పత్రులకు తరలించామన్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటన జరిగిన సమయంలో రెండు, మూడు అంతస్తుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. భవన యజమానిపై నిర్లక్ష్యం అభియోగం కింద కేసు నమోదు చేశామన్నా రు. కేసు విచారణ కొనసాగుతోందన్నారు.మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అగ్నిమాపక శాఖ అధికారులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మధ్యాహ్నం గం. 12.30 నిమిషాలకు తమకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తక్షణమే ఐదు అగ్నిమాపక శకటాలను అక్కడికి తరలించామన్నారు. మూడు జేసీబీలను అక్కడికి తరలించామని, సాయంత్రానికల్లా శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయిందన్నారు. -
18 మందిని బలిగొన్న రోజు
-
మాసబ్‌ట్యాంక్ విజయ్‌నగర్ కాలనీలో కూలిన భవనం