దేశ రాజధాని న్యూఢిల్లీ ఇంద్రలోక్ ప్రాంతంలో శనివారం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న మున్సిపల్ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉన్నతాధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.