
ఘటనా స్థలంలో సహాయక చర్యలు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని సుదర్శన్ పార్క్ వద్దగల ఓ మూడంతస్థుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించండంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా మరో 8 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ (పశ్చిమ ఢిల్లీ) మోనికా భరద్వాజ్ తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్టు చెప్పారు. అయితే, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రమాద సమయంలో 13 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న స్క్రాప్‌యార్డులో మరో 12 మంది ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment