సాక్షి, విజయనగరం : జిల్లాలోని కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కుప్పకూలింది. గత మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యార్థులకు దసరా సెలవులు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. భవనంలో కొంత భాగం కూలిపోగా.. మిగతా భాగం కూడా నెలకొరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోడలు చాలా వరకు బీటలు వారి ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment