Government Junior College
-
ఎక్కడికక్కడే సమస్యలు నేటి నుంచి ఇంటర్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ క్లాసులు శనివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంటర్ అధికారులు చేశారు. ప్రస్తుతం వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మొదటివారం రోజులూ ప్రభుత్వ, గురుకుల కాలేజీలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో హాజరుశాతంపై అధికారులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. జూన్ రెండోవారం వరకూ విద్యార్థులు పెద్దగా కాలేజీలకు రాకపోవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కూడా జూన్ 1 నుంచే మొదలవ్వాలి. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ కారణంగా ఫస్టియర్ విద్యార్థులకు జూన్ ఆఖరు వరకూ క్లాసులు జరిగే అవకాశం లేదు. అయితే, ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికే దాదాపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా, చాలాచోట్ల అనధికారికంగానే క్లాసులు నడుస్తున్నాయనే వార్తలొస్తున్నాయి. రెండో సంవత్సరం క్లాసులు కూడా ఇప్పటికే ప్రారంభించారు. 600 కాలేజీలకు పూర్తికాని అఫ్లియేషన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు 3 వేలకుపైగానే ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు 422 వరకూ ఉన్నాయి. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు తీసేస్తే 1400 కాలేజీలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. వీటన్నింటికీ ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, పరిసరాలను జిల్లా అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఈ గుర్తింపు ఇస్తారు. అయితే సరైన డాక్యుమెంట్లు సమరి్పంచని కారణంగా ఇంకా 600 ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు రాలేదు.అయినా ఆ కాలేజీలు అడ్మిషన్లు కొనసాగించినట్టు తెలుస్తోంది. ఒక్కో కాలేజీ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి. వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 72వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులుంటే, ప్రైవేటు కాలేజీల్లో 2.35 లక్షల మంది ఉన్నారు. ఆఖరిదశ వరకూ అప్లియేషన్ల ప్రక్రియ కొనసాగించడం వల్ల ప్రతీ సంవత్సరం విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు.ప్రభుత్వ కాలేజీల్లో సమస్యలెన్నో... ⇒ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ⇒ 225 ఒకేషనల్ అధ్యాపకుల పోస్టులూ ఖాళీనే.ళీ 26 కాలేజీల్లో కీలకమైన సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ⇒394 కాలేజీలకు పక్కా భవనాలున్నా, నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు కావడం లేదు. ⇒ కొత్తగా 26 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసినా, అవసరమైన అధ్యాపకులను ఇవ్వలేదు. మౌలిక వసతులూ కలి్పంచలేదు. ⇒సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై ఇంతవరకూ ఎక్కడా నిధులు ఇవ్వలేదని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. ⇒ అదనపు గదులు లేకపోవడంతో కొన్ని గ్రూపులను కలిపి బోధించే పరిస్థితి ఉంది. ⇒ఇప్పటి వరకూ ఎక్కడా పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదు. ఇంటర్ విద్యపై దృష్టి పెట్టాలి పేద విద్యార్థులు చేరే ప్రభుత్వ ఇంటర్ కాలేజీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. త్వరగా పాఠ్యపుస్తకాలు అందితే బోధన అనుకున్న ప్రకారం జరుగుతుంది. ప్రైవేటు తో దీటుగా ఫలితాలు వస్తాయి. కాలేజీల్లో తాగునీటి సౌకర్యం, ఫరి్నచర్, సరిపడా గదులు ఏర్పాటు చేయాలి. – మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్మిడియట్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅన్ని సమస్యలూ పరిష్కరిస్తాం జూనియర్ కాలేజీల్లో ఎలాంటి సమస్యలూ లేకుండా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలేజీల అఫ్లియేషన్‌కు ఇంకా సమ యం ఉంది. అన్ని డాక్యుమెంట్లు సమరి్పస్తే కచి్చతంగా గుర్తింపు ఇస్తాం. మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాఠ్య పుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. త్వరలో అందించే ప్రయత్నం చేస్తాం. – శ్రుతి ఓజా, ఇంటర్‌బోర్డు కార్యదర్శి -
ప్రభుత్వ బడిలో ప్రగతి కెరటాలు
తల్లిదండ్రులు కష్టపడితేనే పూట గడిచే కుటుంబాలకు చెందిన పిల్లలు వీరు. సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో అత్యాధునికంగా మారిన ప్రభుత్వ బడుల నుంచి ఐక్యరాజ్య సమితిలో మెరిసిన మెరుపు తీగలు. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 550 నుంచి 590 మార్కులు సాధించి, ప్రతిభను నిరూపించుకున్న ఆణిముత్యాలు.నానాజీ అంకంరెడ్డి, సాక్షి అమరావతి: ప్రభుత్వ బడులు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని టాపర్లుగా నిలిచిన వారికి ఏటా ’జగనన్న ఆణిముత్యాలు’ పేరిట వైఎస్ జగన్ ప్రభుత్వం సత్కరిస్తోంది. రాష్ట్రంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు 22 వేల మందిని ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట నగదు ప్రోత్సాహకాలతో సత్కరించి, పేద విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు.. ఇలాంటి పేదింటి రత్నాలను ప్రభుత్వ ప్రతినిధులుగా 10 మందిని ఎంపిక చేసి ఐక్యరాజ్య సమితికి పంపించారు. అప్పటి వరకు కనీసం జిల్లా కేంద్రాన్ని కూడా చూడని ఈ విద్యార్థులు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులో ప్రసంగించడం చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన మార్పులు, మనబడి నాడు – నేడుతో సమకూరిన సదుపాయాలు, ఆధునిక ల్యాబ్స్‌తో జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో టాపర్లుగా నిలిచిన మరో ఏడుగురు విద్యార్థులు జపాన్ వెళ్లి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఈ స్థాయిలో ప్రోత్సహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. పేదింటి ఆణిముత్యాలే రాష్ట్ర ప్రతినిధులు 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పేదల పిల్లల విద్యాభివృద్ధిపై దృష్టి సారించారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేశారు. స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి, బోధన ప్రమాణాలు పెంచి, సర్కారు స్కూళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ గతేడాది ఆగస్టులో న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో ఏపీ విద్యా సంస్కరణలను తెలియజెబుతూ ఏర్పాటు చేసిన స్టాళ్లు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల అభివృద్ధిని స్వయంగా తెలుసుకుంటామని పలు దేశాల ప్రతినిధులు కోరడంతో పాటు ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులను పంపాలని ఆహా్వనించారు. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ సదస్సులకు అత్యున్నత అధికారులను పంపిస్తారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు విద్యార్థులే సరైన ప్రతినిధులని సీఎం జగన్ భావించారు. అందుకే ఈ ఆణిముత్యాలను అంతర్జాతీయ వేదికలపై ప్రతినిధులుగా పంపించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని మన పిల్లలు 2022–23 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలను 150 మందిని ఎంపిక చేసి, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష పెట్టారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మందికి ఇంటర్వ్యూలు చేసి, వారి నుంచి 10 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు వీరంతా ప్రభుత్వ ఖర్చుతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో స్వయంగా మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత అరుదుగా మాత్రమే ప్రవేశం లభించే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో సైతం వీరు మాట్లాడే అవకాశం లభించింది. పేదింటి పిల్లలైనా, ప్రభుత్వ చేయూతతో అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని సముపార్జించుకొన్న వీరంతా సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. సీఎం జగన్ ఆదర్శవంతమైన సంస్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు. జపాన్ సకురా సైన్స్ ఫెయిర్‌కూ ఏపీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నాడు – నేడు పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్‌సై్పర్డ్ రీసెర్చ్ (ఇన్‌సై్పర్) పోటీల్లో సత్తా చాటుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపే ఆకర్షణీయమైన అంశాలు, నమూనాలు తయారు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో లేబొరేటరీలు అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో మన విద్యార్థులు గత నాలుగేళ్లుగా ఏటా 40 వేలకు పైగా ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతున్నాయి. గత నాలుగేళ్లుగా జాతీయ పోటీలకు దాదాపు 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు ప్రభుత్వం పేటెంట్ హక్కులు కూడా ఇస్తుంది. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌సై్పర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. ఇక్కడే కాదు.. 2019 నుంచి 2022 వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడుగురు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించి, ‘జపాన్ సకురా’ అంతర్జాతీయ పోటీలకు ఎంపికై జపాన్‌లో పర్యటించి వచ్చారు.ప్రభుత్వ బడిలో కొత్త ఆవిష్కరణలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడంతో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకడంతో పాటు పేటెంట్లు సైతం అందుకుంటున్నారు. గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి.కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునేవారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె.ప్రణయ 15 రోజులు కూరగాయలు పాడవకుండా నిల్వ చేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి.చరణ్ తేజ బైక్‌పై వెనుక కూర్చున్న వారికి రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను తయారుచేశాడు. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురూ వారు నిత్యం చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించడమే కాదు.. గత నవంబర్‌లో జపాన్ వెళ్లి వచ్చారు. మరో నలుగురు విద్యార్థులు వచ్చే నెలలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.అత్యంత సామాన్యుల పిల్లలకే అవకాశం ⇒ ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు జెడ్పీ స్కూల్లో చదువుకున్న పసుపులేటి గాయత్రి గతేడాది పదో తరగతిలో 590 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. జగనన్న ఆణిముత్యాలు అవార్డు కింద రూ.50 వేలు అందుకుంది. కూలి పనులు చేసే తండ్రి కష్టంపైనే బతుకుతున్న ఈ కుటుంబానికి జగనన్న విద్య, సంక్షేమ పథకాలు దన్నుగా నిలిచాయి. ⇒ కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంటకు చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మలకు నలుగురు సంతానంలో ఒకరైన శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతిలో 541 మార్కులు సాధించింది. ⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన వంజవాకం యోగీశ్వర్ తండ్రి నాగరాజు సామాన్య రైతు. చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న యోగీశ్వర్ గతేడాది పదో తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానంలో నిలిచాడు. ⇒ విజయనగరంలో మెకానిక్‌గా పనిచేస్తున్న అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మిల కుమార్తె రిషితారెడ్డి స్థానిక కస్పా మున్సిపల్ కార్పొరేషన్ హైసూ్కల్లో పదో తరగతిలో 587 మార్కులు సాధించింది. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన షేక్ ఫాతిమా భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటోంది. ఈమె రెండో కూతురు అమ్మాజాన్ వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ⇒ నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్. తల్లి రామలక్ష్మమ్మ ఇంటి వద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివి 583 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ బాలిక ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె మోతుకూరి చంద్రలేఖ స్థానిక కేజీబీవీలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 523 మార్కులు సాధించింది. జిల్లా టాపర్‌గా నిలిచి జగనన్న అణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ⇒ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన రెండో సంతానమైన డి.జ్యోత్స్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో చదువుకుని పదో తరగతిలో 589 మార్కులు సాధించి జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతోంది. ⇒ పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరుపల్లి గ్రామానికి చెందిన జి.గణేష్ అంజన సాయి ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాలలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. ఇతని తండ్రి గోపి కౌలు రైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. -
జేసీ.. జేసీబీ!
తాడిపత్రి: ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో దర్జాగా అసాంఘిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవటమే కాకుండా తన అనుచరులతో కలసి కూల్చివేతలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనుల వద్ద వీరంగం సృష్టించారు. జేసీ గ్యాంగ్ కూలగొట్టిన పిల్లర్లను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించిన కార్మికులపై ఆదివారం ఉదయం దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఏం జరిగిందంటే... నాడు–నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మూడు రోజుల క్రితం చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉంది. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో నిర్మాణ పనుల వద్దకు అనుచరులతో కలసి చేరుకున్న జేసీ ‘రేయ్ జేసీబీతో పిల్లర్లను కూలదోయండిరా..’ అంటూ హుకుం జారీ చేశారు. జేసీబీతో కాంక్రీట్ పిల్లర్లను కూలదోశారు. మర్నాడు అక్కడకు వచ్చిన కూలీలను పనులు నిలిపి వేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అడ్డగించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ నిర్మిస్తున్నామని, అడ్డు తగలడం సమంజసం కాదని చెప్పినా వినిపించుకోలేదు. దీనిపై మేస్త్రీ గురుశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్మాణాలను దౌర్జన్యంగా కూలగొట్టడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస మల్లికార్జునరెడ్డి, సుబ్బయ్య, వడ్డే మధు, సోమశేఖర్ నాయుడు, దినేష్‌రెడ్డి, పవన్‌నాయుడు, మునిసిపల్ కాంట్రాక్టర్ తిరుపాల్‌రెడ్డి, కుమ్మరి వెంకటేష్, రాంబాబు, గురుజాల శివశంకర్‌రెడ్డి, చరణ్, హరినాథ్‌రెడ్డి, గండికోట కార్తీక్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ తెలిపారు. -
చిన్నారితో గది శుభ్రం చేయించడం దారుణం
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని స్పాట్ వాల్యుయేషన్ గదిని చిన్నారితో శుభ్రం చేయించడం దారుణమని, బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలను తెలుసుకుని, బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ► గదిని శుభ్రం చేయాల్సిన తండ్రి తన 6 ఏళ్ల కుమార్తెతో గదిని ఊడిపించడం చాలా బాధాకరం. తండ్రి అయినప్పటికీ అతనిపై చట్టపరమైన చర్యలు తప్పవు. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర వహించడం క్షమార్హం కాదు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఆ ఇద్దరిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించాం. ► చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్–1986 ప్రకారం 14 ఏళ్లు నిండని బాల బాలికల చేత చాకిరీ చేయించడం నిషిద్ధం. సెక్షన్ 14 ప్రకారం శిక్షార్హం. పని చేయించిన వ్యక్తులకు కనీసం 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. ► బాల బాలికలను ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించడం కూడా నేరమే అని తెలియచేసేలా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. -
ఆ ఘటన హృదయాన్ని కలచివేసింది : డీజీపీ
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ కాలేజీలో ఓ చిన్నారితో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిని శుభ్రం చేయించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కాలేజీ గదిని శుభ్రం చేస్తున్న చిన్నారి దృశ్యాలు తన హృదయాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ తండ్రి తన పనిని కూతురి చేత చేయించడం కూడా చట్టరిత్యా నేరమే అవుతుందన్నారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్స్ ప్రేక్షక పాత్ర వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించారు. కళాశాల యాజమాన్యంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. -
మెట్లే తరగతి గది.. విద్యార్థులే స్వీపర్లు
పేరుకే ప్రభుత్వ కళాశాల.. ఇక్కడ అన్నీ సమస్యలే.. ముఖ్యంగా తరగతి గదుల కొరత వేధిస్తోంది. మెట్లపై.. వరండాలో.. ఆరుబయటే తరగతులు నిర్వహిస్తున్నారు. పైగా విద్యార్థులే గదులను చీపురు పట్టుకుని శుభ్రం చేసుకుంటున్నారు. కొన్ని నెలులుగా ఇలా సాగుతున్నా పాలకులు దృష్టిసారించకపోవడం గమనార్హం. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండగా కేవలం ఆరు గదుల్లోనే తరగతులు నిర్వహిస్తుండటం వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దుస్థితిని తేటతెల్లంచేస్తోంది. వికారాబాద్ అర్బన్: విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పడుతున్న కష్టాలు మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కళాశాలలో సుమారు 400 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా గ్రామీణ, పేద కుటుంబాల నుంచి వస్తున్నవారే ఉన్నారు. ప్రస్తుతం కళాశాలలో ఏడు గ్రూపులు కొనసాగుతున్నాయి. తెలుగు మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఉర్దూ మాధ్యమంలో బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 17 సెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కల 17 తరగతి గదులు కావాలి. కానీ ఇక్కడ కేవలం ఆరు గదులే ఉన్నాయి. దీంతో రెండు మూడు సబ్జెక్టులకు సంబంధించి ఒకే దగ్గర కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న బైపీసీ, హెచ్ఈసీ రెండో సంవత్సరం విద్యార్థులను భవనం మెట్లపై కూర్చోబెట్టి పాటాలు చెబుతున్నారు. తరగతి గదులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు కళాశాలకు రాలేకపోతున్నారు. మెట్ల వద్దనే బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసి రోజు రెండు, మూడు తరగతులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలగజేసుకొని తరగతి గదుల కొరత తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆరుబయటే కళాశాల తరగతులు నిధులున్నా నిర్మాణం జరగడం లేదు 2017లో జూనియర్ కళాశాల భవన నిర్మాణం పూర్తి కావడంతో మూడేళ్లుగా తరగతి గదులు కొనసాగుతున్నాయి. ఈ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.2 కోట్ల 20 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ ప్రభుత్వం కేవలం రూ.కోటిని మాత్రమే ఖర్చు చేసి కళాశాల భవనాన్ని నిర్మించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 16 తరగతి గదులతో పాటు, ఒక ప్రిన్సిపాల్ గది, స్టాఫ్ రూమ్, నాలుగు సైన్స్ ల్యాబ్‌లు నిర్మించాలి. ఇవేవి నిర్మించకుండానే కేవలం ఆరు గదులు నిర్మించి వదిలేశారు. మిగత రూ.కోటి 20 లక్షలు సంబంధిత ఇంటర్మీడియట్ శాఖలో జమలో ఉన్నాయి. ఆ నిధులు ఖర్చు పెట్టి తరగతి గదుల కొరత తీర్చాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు చాలాసార్లు సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పేద విద్యార్థులు చదువుకుంటున్న కళాశాల సమస్యలు తీర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. తరగతి గదిలో చెత్తను ఊడుస్తున్న విద్యార్థిని విద్యార్థులే స్వీపర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్వీపర్ పోస్టు కూడా మంజూరు కాలేదు. దీంతో తరగతి గదులను విద్యార్థులే వంతుల వారీగా చీపురు పట్టి శుభ్రం చేసుకుంటున్నారు. మరుగుదొడ్లు కూడా తీవ్ర అపరిశుభ్రంగా మారినట్లు విద్యార్థులు చెబుతున్నారు. పేదల చదువులకు పెద్ద పీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం కనీసం ఒక స్వీపర్‌ను కేటాయించకపోవడంపై విద్యార్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాలని ఉన్నా సమస్యలు వెంటాడుతున్నాయని అంటున్నారు. కనీసం రోజు కూలీ లెక్కన ఒక స్వీపర్‌ను ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ కలెక్టర్‌ను కోరినా లాభం లేకుండా పోయింది. వసతులు కల్పించాలి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పోటీ పడి చదవాలని ఉన్నా ఇక్కడ వసతులు లేకపోవడంతో సమస్యగా మారింది. కొన్ని క్లాసులు భవనం మెట్లపై కూర్చోని వినాల్సి వస్తుండడంతో చాలా మంది ఇబ్బందికి గురై రాలేకపోతున్నారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం 400 మంది విద్యార్థులు చదివే కళాశాలకు వసతులు సమకూర్చలేకపోతున్నారు. ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థి పేద కుటుంబానికి చెందిన వారే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.– శివకుమార్, ఎంపీసీ, ద్వితీయ సంవత్సరం -
ప్రజాస్వామ్యం అంటే ఏంటి?
న్యాల్కల్ (జహీరాబాద్): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మరోసారి టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వారు సరైన సమాధానాలు చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులు, డప్నూర్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థులను పిలిచి 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇంటర్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? రాష్ట్ర అసెంబ్లీలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి ప్రభుత్వం కళాశాల భవనాన్ని నిర్మించిందని, కాని విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని, నాణ్యమైన విద్యనందించాలని అధ్యాపకులను కోరారు. ఎంత ఖర్చయినా చదివిస్తా: ఓ విద్యార్థిని చదువుకోసం ఎంత ఖర్చయినా తానే భరిస్తానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. గంగోత్రి అనే విద్యార్థిని మంత్రి వద్దకు వెళ్లి ‘మాది బీద కుటుంబం, మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. నేను చదువుకుంటానో లేదో’ అని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చలించిపోయిన ఆయన ‘నీవు ఎక్కడ చదువుకుంటావు.. చెప్పు! పూర్తి ఖర్చును నేనే భరిస్తాను’అని హామీ ఇచ్చారు. -
విధుల్లో చేరిన దిశ తండ్రి
సాక్షి, రాజేంద్రనగర్: దిశ తండ్రి శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. తన జాయినింగ్ రిపోర్టును ప్రిన్సిపాల్ అంజయ్యకు అందజేశారు. ఆయన ఇంతకుముందు మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లోని రాణి ఇంద్రాదేవి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే వారు. ఆయన బదిలీ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా ప్రభుత్వం రాజేంద్రనగర్ జూనియర్ కళాశాలకు బదిలీ చేసింది. -
ఒకే కళాశాలలో 23 మందికి సచివాలయ ఉద్యోగాలు
ఎంటెక్, బీటెక్ చదివినవారికి దక్కని అవకాశం ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు దక్కింది. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో వృత్తి విద్యా కోర్సుగా సెరికల్చర్ పూర్తి చేసిన 23 మందికి సచివాలయ పోస్టుల్లో ఉద్యోగాలొచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ కోర్సు చదివి ఒకే కళాశాలకు చెందిన ఇంతమందికి ప్రభుత్వ కొలువులు వరించడం నిజంగా ఓ రికార్డే. సాక్షి, పలమనేరు : పలమనేరు పట్టణంలోని తీర్థం కృష్ణయ్యశెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెరికల్చర్ కోర్సు పూర్తి చేసిన 23మందికి సచివాలయ ఉద్యోగాలు లభించాయి. ఒకేషనల్ కోర్సులో చేరేందుకే ఆసక్తి చూపని నేటి రోజుల్లో అవే కోర్సులు వీరికి కొలువులు తెప్పించాయి. దీంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారంతా కళాశాలకెళ్లి అధ్యాపకులు, ప్రిన్సిపల్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపక బృందం వారిని అభినందించారు. తొలినుంచి ఈ కళాశాలకు మంచి పేరుంది. సంప్రదాయ కోర్సులతోపాటు ఇక్కడ తొమ్మిది రకాల వృత్తి విద్యా కోర్సులు అన్ని వసతులతో ఉన్నాయి. ఈ కోర్సుల్లో సెరికల్చర్‌కి సంబంధించి ఏటా 20మంది విద్యార్థులు ఈ కోర్సులో విద్యనభ్యసించే అవకాశం ఉంది. గత పదేళ్లుగా ఇక్కడ సెరికల్చర్ కోర్సును పూర్తి చేసుకున్నవారు వందమంది వరకు ఉన్నారు. వీరిలో పలువురు పట్టుపరిశ్రమ శాఖకు సంబంధించి ప్రైవేటు రంగంలో ఉపాధి పొందుతున్నారు. మరికొందరు సొంతంగా మల్బరీని సాగుచేసి పట్టుగూళ్ల పెంపకం సాగిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. దీంతో తాజాగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సెరికల్చ ర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువగా ఉండడం, కనీసం సిలబస్ ఎలా ఉంటుందో తెలియక, ఈ కోర్సుకు సంబంధించిన మెటీరియల్ కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈసమయంలో ఈ కళాశాలలో సెరికల్చర్ అధ్యాపకురాలిగా ఎంతో అనుభవం కలిగిన రాజేశ్వరి ప్రత్యేక చొరవచూపారు. ఆమె ఈ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను తయారు చేసి విద్యార్థులకు పంపి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. సచివాలయ పరీక్షల్లో ఈ కళాశాలకు చెందిన 23మంది ఉద్యోగాలకు ఎంపిౖకై రికార్డు సృష్టించారు. చాలా ఆనందంగా ఉంది.. నేను అధ్యాపకురాలిగా ఇక్కడ 29 ఏళ్లుగా పనిచేస్తున్నా. సిరికల్చర్ కోర్సు చేసిన పూర్వ విద్యార్థులు, తాజాగా కోర్సు చేసిన వారు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నన్ను సంప్రదించారు. ఎలా చదవాలి, సిలబస్, మెటీరియల్ అందుబాటులో లేదన్నారు. దీంతో నేనే తయారు చేసిచ్చా. 23మంది నా వద్ద శిక్షణ పొందిన పిల్లలకు ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా ఉంది. –రాజేశ్వరి, సెరికల్చర్ అధ్యాపకురాలు, పలమనేరు రాష్ట్రంలోనే రికార్డేమో.. ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో ఒకే కోర్సు చదివిన 23మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం రాష్ట్రంలోనే ఓ రికార్డుని నేననుకుంటున్నా. చాలా సంతృప్తిగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఉద్యోగాలివ్వడంతోనే మా వద్ద శిక్షణ పొందిన వారు ఎంపికయ్యారు. –రామప్ప, సెరికల్చర్ ల్యాబ్ అసిస్టెంట్ సెరికల్చర్ కోర్సు జీవితాన్ని మార్చేసింది నేను ఇక్కడ 2011లో సెరికల్చర్ కోర్సు పూర్తి చేశా. ఈ కోర్సుకు ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఏం ఉద్యోగాలు వస్తాయిలేనని ఆశలు వదులుకున్నా. కానీ ఈ ప్రభుత్వ నిర్ణయంతో నాకు గవర్నమెంటు ఉద్యోగం దక్కింది. నా ఫ్రెండ్స్ అప్పట్లో బైపీసీ, ఎంపీసీ చేరితే నేను సెరికల్చర్ చేరా. ఇప్పుడు అదే కోర్సు నా జీవితాన్ని మార్చేసింది. –మునీశ్వరి, గ్రామ సచివాలయ ఉద్యోగి నిజంగా నమ్మలేకున్నా.. సెరికల్చర్ అసిస్టెంట్‌గా ఎంపికై ఇటీవల పోస్టింగ్‌లో చేరా. స్థానికంగానే ఉద్యోగం దొరికింది. మా కళాశాలలో చదువుకున్న వారికి 23మందికి నిజంగా అదృష్టమే. సెరికల్చర్ చదివితే ఏం ఉద్యోగవకాశాలుంటాయనుకొనే వారికి మేమే సాక్ష్యం. చాలా హ్యాపీగా ఉంది. ఇందుకు కారణమైన మా అధ్యాపకులకు ఎన్నటికీ మరువం. –వై.శ్రీనివాసులు. గ్రామసచివాలయ ఉద్యోగి -
కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్ భవనం
సాక్షి, విజయనగరం : జిల్లాలోని కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కుప్పకూలింది. గత మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యార్థులకు దసరా సెలవులు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. భవనంలో కొంత భాగం కూలిపోగా.. మిగతా భాగం కూడా నెలకొరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోడలు చాలా వరకు బీటలు వారి ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్రమాల ‘ప్రిన్స్’పాల్‌పై వేటు
వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చుంటే ఏముందన్నట్టుగా ఈ ప్రిన్సిపాల్ వ్యవహారం తయారైంది. విద్యా సంస్థకు అధినేతగా ఉండి కూడా పలు అక్రమాలకు పాల్పడుతూ అప్పటి టీడీపీ నేతల అండతో చెలరేగిపోయాడు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతోనే ఈయన అరాచకాలకు చెక్ పడింది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్కపెను తుపాన్‌కు నేలకూలిపోతుంద’నే సామెత రాజమహేంద్రవరం ప్రభుత్వజూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విషయంలో నిజమైంది. చంద్రబాబు ప్రభుత్వంలోరెండున్నరేళ్లు అవినీతి అక్రమాలతో చెలరేగిపోయిన ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయం ముందస్తుగానే ఊహించిన నిందితుడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రిన్సిపాల్ ఇంటి గోడకు అతికించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...అక్రమాలకు పాల్పడినా అధికార పార్టీ అండదండలుంటే తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ, నిరంతరం వ్యవస్థలను మేనేజ్ చేయడం అన్ని సమయాల్లో కలిసి రాదు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు మహిళా అధ్యాపకులపై వేధింపులు, విద్యార్థుల ఫీజులలో మోసాలు, యూనిఫారాల విక్రయాల్లో లొసుగులు, లక్షలు విలువైన రంగూన్ టేకు కలపను గుట్టుచప్పుడు కాకుండా విక్రయం...తదితర అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినా అప్పటి టీడీపీ నేతల అండదండలతో వాటిని తొక్కిపెట్టేయడంతో బాధితులు కూడా మౌనం వహించారు. టీడీపీ హయాంలో మహిళా అధ్యాపకులు పోరాడుతున్నా ‘పచ్చ’ నేతల ప్రోద్బలంతో ప్రిన్సిపాల్ బయటపడుతూ వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, లోపాయికారీ వ్యవహారాలపై ‘సాక్షి’ దృష్టిపెట్టి గత నెలలో ‘వేధింపుల్లో ప్రిన్సిపాల్’, ‘ఈయనో ప్రిన్సిఫ్రాడ్’, ‘ప్రిన్సిపాల్‌పై సీరియస్’, ‘యథానేత...తథామేత’, ‘ఉచ్చు బిగుస్తోంది’ తదితర శీర్షికలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో సంబంధితాధికారుల్లో కదలిక వచ్చింది. స్త్రీ,శిశు సంక్షేమ, విద్యాశాఖా మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌లు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రిన్సిపాల్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా నియమితులైన ఇంటర్మీడియట్ బోర్డు రాజమహేంద్రవరం రీజనల్ జాయింట్ డైరక్టర్ నగేష్‌కుమార్ ప్రిన్సిపాల్ వీర్రాజుపై కాలేజీలోని సెమినార్ హాలులో నాలుగు గోడల మధ్య 14 అంశాలతో కూడిన ప్రశ్నావళిని అందజేసి చాలా గోప్యంగా విచారణ జరిపారు. దళిత సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకురాలు ఉదయశాంతిపై ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడ్డ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కక్షకట్టి ఆమెకు మద్దతుగా నిలిచిన మహిళా అధ్యాపకులను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అధ్యాపకులంతా ఆర్జేడీ విచారణలో ప్రిన్సిపాల్ బాగోతాలను ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టు చెప్పుకున్నారు. ఓ వైపు వేధింపు ఫిర్యాదులపై విచారిస్తునే కాలేజీలో ఎస్సీ, బీసీ విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజులు, రూ.500లుండే యూనిఫారాన్ని తన బినామీల ద్వారా కాలేజీ ఆవరణలోనే రూ.800 నుంచి రూ.900లకు అధిక ధరలకు విక్రయించడం, కాలేజీలో బ్రిటిష్ హయాంలో నిర్మించిన పాత అతిథి గృహానికి సంబంధించిన రూ.50 లక్షలు విలువైన రంగూన్ కలప అక్రమంగా అమ్మకాలు...వీటిలో ఏ ఒక్కదానికీ రికార్డులు లేకపోవడంపై విచారణ జరిపిన నగేష్ కుమార్ 10, 12 పేజీల సమగ్ర నివేదికలో ‘అవన్నీ వాస్తవాలే’నని తేల్చి ఆ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరక్టర్ అప్పలనాయుడుకు నివేదించారు. నివేదికను కొత్తగా వచ్చిన కమిషనర్ రామకృష్ణకు వెళ్లడంతో ప్రభుత్వం నుంచి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం మీద మహిళా అధ్యాపకుల రెండున్నరేళ్ల పోరాటం ఎట్టకేలకు ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌తో సుఖాంతమైంది. -
ఈ మాస్టారు అలా వచ్చి.. ఇలా వెళ్తాడు
సాక్షి, పెనగలూరు(కడప) : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుందన్న సామెతను పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిజం చేస్తున్నారు. కళాశాలను నడిపించే వ్యక్తిగా ఉంటూ ప్రతి రోజూ 12గంటలకు రావడం 3 గంటలకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ప్రిన్సిపల్ నిర్వాహకం వల్ల కళాశాలలో క్రమశిక్షణారాహిత్యం లోపిం చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఆలస్యంగా వస్తున్న ప్రిన్సిపల్‌ను సోమవారం ప్రపంచ మానవహక్కుల సంఘం పెనగలూరు మండల అధ్యక్షుడు ఎం. విశ్వనాథరెడ్డి ప్రశ్నిం చారు. రైలుకు వస్తాను... రైలుకే వెళ్తాను. నేనొచ్చేది అంతే... అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన సమాధానం చూస్తే కళాశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రిజిష్టర్‌లో సంతకం చేసేందుకు మాత్రమే ఏదో ఒక సమయంలో వస్తున్నట్లు అర్థమైపోతోంది. ప్రిన్సిపల్ వ్యవహారశైలిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విశ్వనాథరెడ్డి తెలిపారు. -
కళాశాలపై నిర్లక్ష్యం నీడ..
అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో పల్లె ప్రజలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అరకొర విద్యనందిస్తున్న ప్రభుత్వ సంస్థలను పట్టించుకోవడం లేదు. జూనియర్ కళాశాల ఉన్నా వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. డిగ్రీ కళాశాలగా మార్పు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. కృష్ణాజిల్లా, కలిదిండి(కైకలూరు): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. 4 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. మరుగుదొడ్ల సౌకర్యం, సైకిల్ స్టాండ్, ప్రహరీ నిర్మాణం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోఆపరేటివ్ కళాశాల నుంచి.. కోఆపరేటివ్ జూనియర్ కళాశాలను నంబూరు వెంకటనరసింహరాజు 1989లో ప్రారంభించారు. ఈప్రాంతంలో ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ప్రభుత్వ కళాశాలగా మార్పు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కళాశాలగా మార్పు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కోఆరేటివ్ కళాశాలకు చెందిన రూ.50 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టు పద్ధతిలోనే సిబ్బంది.. కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ సిబ్బంది విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించలేదు. 2011లో తాత్కాలిక ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కంగుతిన్న ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. అనుకూలంగా తీర్పు వచ్చినా.. ఉద్యోగులు న్యాయం పోరాటం చేశారు. 2017లో ట్రిబ్యునల్ తీర్పు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. జూనియర్ కళాశాల ఉద్యోగుల జీతాల సమస్యపై శాసన సభ్యుడు కామినేని శ్రీనివాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదించి రూ.4.50 కోట్లు మంజూరుకు కృషి చేశారు. కేబినెట్ ఆమోదం అనంతరం పరిష్కారం కాబోతుందని గత డిసెంబరులో వార్తలు వచ్చాయి. అదనపు గదులకు ప్రతిపాదనలు స్థానిక జూనియర్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఏడు సంవత్సరాలు తరువాత కూడా ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. 2016–17లో అదనపు గదుల నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరయ్యాయని, వాటిని వినియోగించక పోవడంతో మళ్లీ 2017–18లో సర్వశిక్ష అభియాన్ ఏఈ ప్రేమ్‌చంద్ రూ.1.25 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. డిగ్రీ కోర్సులు మంజూరు చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కోర్సులు మంజూరు చేయాలి. ఇంటర్మీడియెట్ అనంతరం డిగ్రీ కోర్సులకు కైకలూరు, గుడివాడ, భీమవరం వంటి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. జూనియర్ కళాశాలలు కలిదిండి, కోరుకొల్లు ఏరియాల్లో మేనేజిమెంట్ ఆధీనంలో ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. బాల బాలికలకు భద్రత ఉంటుంది. –యాళ్ల జీవరత్నం, వైద్య విభాగం మండల కన్వీనర్ వైఎస్సార్ సీపీ కలిదిండి -
కదిలించిన ‘సాక్షి’ కథనం
తాండూరు : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు తక్షణమే రూ.20 లక్షలు మంజూరు చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ‘మంత్రి ఇలాఖా.. కాలేజీ ఇలాగా?’శీర్షికతో గురువారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మహేందర్‌రెడ్డి స్పందించారు. బుధవారంరాత్రి తాండూరులో బస చేసిన మంత్రి గురువారం ఉదయం నియోజకవర్గంలోని 12 గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ‘సాక్షి’ కథనాన్ని చూసి స్పందించారు. పంచాయతీల ప్రారంభోత్సవాలను వాయిదా వేసుకుని వెంటనే తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. అప్పటికే మున్సిపల్ చైర్పర్సన్ సునీతాసంపత్, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బెంచీలను పక్షం రోజుల్లో సమకూరుస్తామని, అందుకోసం రూ.20 లక్షలను వెంటనే మంజూరు చేస్తామని అన్నారు. అదనపు తరగతి గదులను మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ‘సాక్షి’కథనం విద్యార్థుల సమస్యకు దర్పణం పట్టిందన్నారు. నూతన గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలున్నా ‘సాక్షి’కథనం చూడగానే మధ్యలోనే వెనుదిరిగి ఇక్కడికి వచ్చానని చెప్పారు. విడతలవారీగా కళాశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. -
గెస్ట్ లెక్చరర్ల నియామకాలపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 1,200 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకాలను పారదర్శకంగా మెరిట్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా చేపడుతున్నామని ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ అశోక్ చెప్పారు. అయితే ఒక సంఘం నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని ఆరోíపించారు. ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయడం కుదరదన్న విషయంలో ఓ సంఘం నేతలు అపార్థం చేసుకుంటున్నారని, పాత వారిని అలాగే కొనసాగించాలని పట్టు పడుతున్నారని విమర్శించారు. కొత్త వారి నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వవద్దని ప్రిన్సిపాళ్లకు ఒక సంఘం సమాచారం పంపించిందని ఆరోపించారు. పాత వారిని రెన్యువల్ చేయాల్సిందేనంటూ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీకి హక్కులు ఉండవన్న విషయాన్ని గుర్తించడం లేదన్నారు. గతంలో గౌరవ వేతనం తీసుకున్న వారికి, అనుభవం కలిగిన వారికి ఆయా సర్టిఫికెట్లను జారీ చేయాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. దీంతో ఇదివరకు గెస్ట్ లెక్చరర్లుగా పని చేసిన వారికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు 205 కాలేజీల్లో నోటిఫికేషన్లు జారీ చేశామని, మరో 142 కాలేజీలు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు వద్దంటే ఎలా?: ఇంటర్ విద్యా జేఏసీ 1,200 మంది గెస్ట్ లెక్చరర్లు జూన్, జూలైల్లో పనిచేశారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లోనూ పాల్గొన్నారని, ఇప్పుడు వారిని అకస్మాత్తుగా రోడ్డు న పడేస్తే ఎలాగని ప్రశ్నించారు. 2016–17లో పనిచేసిన వారందరిని 2017–18లో తీసుకున్నారని, ఇప్పుడు వారిని పక్కకు పెట్టడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రిన్సిపాళ్లకు బాధ్యతలు అప్పగించ డం వల్ల స్థానికంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, వారు పనిచేసే పరిస్థితి లేదని వెల్లడించారు. ‘సరైన షెడ్యూల్ లేకుండా ఎలా?’ ఉన్నతాధికారులు తమను బలి పశువులను చేస్తున్నారని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు కృష్ణకుమార్ అన్నారు. ఏ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలి.. ఎన్ని రోజులు దరఖాస్తులు స్వీకరించాలి.. డెమో, ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహించాలన్న వివరాలతో కూడిన షెడ్యూల్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రాధాన్యాల విషయంలోనూ స్పష్టత లేదన్నారు. -
మండలానికో ప్రభుత్వ జూనియర్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ నిర్దేశించుకుంది. అంతేకాదు కాలేజీలన్నింటికీ పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యాశాఖ రూపొందించిన 2024 డాక్యుమెంట్లో పలు అంశాలను పొందుపరిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 500కి పైగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలు తక్కువగా ఉండటంతో గ్రామీణ నిరుపేద విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాలేజీలు లేని మండలాల్లో వాటి ఏర్పాటుకు అవసరమైన భూమి, నిధుల వివరాలను ఆ డాక్యుమెంట్లో పొందు పరిచింది. ప్రభుత్వ కాలేజీల్లో ఏటా 10 శాతం చొప్పున విద్యార్థుల నమోదును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 65 శాతం, ద్వితీయ సంవత్సరంలో 75 శాతం ఫలితాలను సాధించేలా కార్యాచరణను రూపొందించింది. అలాగే జూనియర్ కళాశాలల అభివృద్ధికి 23 రకాల అంశాలను గుర్తించి పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇవీ డాక్యుమెంట్‌లోని ప్రధానాంశాలు ♦ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత బస్‌పాస్ సదుపాయం కల్పించడం. ♦ జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేయడం. ♦ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టడం. జీతభత్యాలను బయోమెట్రిక్‌తో అనుసంధానం చేయడం. ♦ విద్యార్థినుల కోసం వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయడం. ♦ కాలేజీల్లో ఖాళీలు లేకుండా బోధనా సిబ్బంది నియామకం చేపట్టడం. ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం లెక్చరర్లను వీలైనంత తొందరగా నియమించడం. ♦ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చే ప్రైవేట్ జూనియర్ కాలేజీలను నియంత్రించడం. ♦ ఇంటర్ పరీక్షా పత్రాన్ని విద్యార్థులకు తేలిగ్గా అర్థమయ్యేలా రూపొందించడం. ♦ నిపుణులైన బోధనా సిబ్బంది సహకారంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వర్చువల్ తరగతులను నిర్వహించడం. ♦ డిజిటల్ లైబ్రరీ, కెరీర్ గైడెన్స్, స్పెషల్ తరగతులు, పున:శ్చరణ తరగతులను నిర్వహించడం. ♦ కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయడం. ♦ కాలేజీల భద్రత కోసం స్వీపర్, వాచ్మెన్, స్కావెంజర్ పోస్టులను భర్తీచేయడం. ♦ పరిస్థితులకు అనుగుణంగా బోధనా సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. ♦ వొకేషనల్ విద్యార్థుల ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించడం. -
మధ్యాహ్నం’ కలేనా?
► కళాశాలల్లో అమలుకు నోచుకోని భోజన పథకం ► అవస్థలు పడుతున్న విద్యార్థులు ► పట్టించుకోని ప్రభుత్వం ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధికంగా చదివేది గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులే. వీరు ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి ఆయా కళాశాలలకు జిల్లా కేంద్రానికి వస్తారు. వీరంతా చదువును మధ్యలో మానేయకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుకు గతేడాది నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి ఆ పథకం గురించి ప్రభుత్వం ఊసేత్తకపోవడంతో మధ్యాహ్న కలనే మిగిలిపోయేట్లు కనిపిస్తోంది. ఇదివరకు ప్రతి కళాశాలలో ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు చేయవచ్చు అనే విషయంపై ప్రభుత్వం సమగ్ర నివేదికను ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకున్నారు. ఒక విద్యార్థికి రూ. 14లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు ప్రారంభించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ కళాశాలల్లో అధికంగా పేద విద్యార్థులే చదువుతున్నారు. నియోజక వర్గంలో.. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 800 మంది వరకు ఉంటారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో దాదాపు వెయ్యి మంది వరకు, బేలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరిందరికి భోజనం అందించేందుకు ఇదివరకే అధికారులు ఇదివరకే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రభుత్వం మరోసారి ప్రకటించినప్పటికి నేటికి సాకారం కాలేదు. దూరప్రాంతాల నుంచి కళాశాలలకు వస్తున్న కొంత విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక మధ్యాహ్నం వరకు తరగతులకు హాజరై ఇంటి ముఖం పడుతున్నారు. చాలా మంది విద్యార్థులు ఇంటి టిఫిన్ బాక్సులు తీసుకువచ్చి కళాశాలలో భోజనం చేస్తున్నారు. ఈ సారైనా అమలయ్యేనా ఈ విద్యా సంవత్సరమైన ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు విద్యాశాఖ మంత్రి.. కళాశాలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి, దీని ఊసెత్తడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. బడ్జెట్ కొరత వల్లే పునరాలోచనలో పడినట్లు ప్రచారం ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పథకం అమలు చేయడం వల్ల హాజరు శాతంతోపాటు ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు లెక్చరర్లు పేర్కొంటున్నారు. ఉదయం తినకుండానే.. ఉదయం ఇంటి నుంచి తినకుండానే కళాశాలకు వస్తున్నాం. ఒక్కోసారి ఇంట్లో వంట కాకపోతే పస్తులు ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – సౌందర్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల -
మా కాలేజీలో చేరండి..!
♦ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు విస్తృత ప్రచారం ♦ మొదటి విడతకు చివరి గడువు ఈ నెల 12 ♦ అదే రోజు నుంచి తరగతుల ప్రారంభం ♦ రెండో విడతకు చివరి గడువు ఈనెల 30 ♦ అడ్మిషన్లు పెరగాలని బోర్డు ఆదేశం ♦ గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ నల్లగొండ/భువనగిరి :ఇంటర్ అడ్మిషన్లకు బోర్డు అనుమతిచ్చింది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగానే ఇంటర్ ప్రవేశాలకు ఆమోదం లభించింది. ఈ ఏడాది ఆన్లైన్లో కాకుండా పాత పద్ధతిలోనే అడ్మిషన్లు స్వీకరించనున్నారు. అయితే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలకు మాత్రమే అడ్మిషన్ లాగిన్ ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. జిల్లాలోని ప్రైవేటు కాలేజీలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కొన్ని కాలేజీల విషయంలో మాత్రం లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సవరించుకుని బోర్డు గుర్తింపు పత్రం పొందితే గానీ అడ్మిషన్ లాగిన్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత అడ్మిషన్లకు చివరి గడువు ఈ నెల 12 కాగా...అదే రోజు నుంచి కాలేజీల్లో తరగతులు ప్రారంభించాలి. రెండో విడత అడ్మిషన్ల గడువు 30 వరకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ కాలేజీలు.. ప్రచార బాట ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ ఫలితాలు మెరుగ్గానే ఉన్నందున ఈ ఏడాది అడ్మిషన్లు పెంచాలని బోర్డు సూచించింది. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను గ్రామాల్లో వివరించి వారిని రప్పించేందుకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఉపకార వేతనాలు, మౌలి క వసతులు, బస్‌పాస్, కంప్యూటర్ సౌకర్యం, విశాలమైన తరగతి గదులు, ఆర్ఓ ప్లాంట్ ద్వారా తాగునీటి వసతి తదితర వాటి గురించి గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలి. కాలేజీ పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్స్‌కు వెళ్లి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను సేకరించి వారిని తమ కాలేజీల్లో చేర్పించేలా అధ్యాపకులు కృషి చేయాలి. ప్రతిరోజు కాలేజీలో చేర్పించిన విద్యార్థుల వివరాలను జిల్లా అధికారులకు పంపించాలి. ఆ సమాచారాన్ని జిల్లా అధికారులు బోర్డుకు పంపిస్తారు. ఈసారి ‘గెస్ట్’లు ముందుగానే.. ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల స్థానంలో గెస్ట్ లెక్చరర్స్‌ను ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో నియమించేవారు. అయితే ఈ ఏడాది అలాకాకుండా ముందుగానే వారిని నియమించుకునేందుకు బోర్డు అనుమతిచ్చింది. ఇటీవల కాలంలో పదోన్నతులు పొందడం వల్ల ఖాళీ అయిన అధ్యాపకుల స్థానంలో గెస్ట్ లెక్చరర్లను కాలేజీలు తెరవగానే నియమించాలని పేర్కొంది. ఈ నియామకాల విషయంలో బోర్డు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. పీహెచ్డీ, ఎంఫిల్, బోధనలో అనుభవం ఉన్న వారికి, స్థానికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. వీరికి కనీసం వేతనం నెలకు రూ.పది వేలు నిర్ణయించారు. సబ్జెక్టు నిపుణులు, సమీప కాలేజీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి గెస్ట్ లెక్చరర్స్‌ను నియమించాలని బోర్డు సూచించినట్లు నల్లగొండ డీఐఈఓ హన్మంతరావు ‘సాక్షి’కి తెలిపారు. -
పట్టపగలు చోరీ
59 సవర్ల బంగారు నగలు, రూ. 1.45 లక్షలు నగదు అపహరణ నాయుడుపేటటౌన్ : పట్టణంలో పట్టపగలే దొంగలు ఓ ఇంటిని లూటీ చేశారు. సుమారు రూ. 20 లక్షలకు పైగా విలువ చేసే సొత్తును అపహరించారు. ఈ సంఘటన శనివారం జరిగింది. నాయుడుపేటలోని పెసల గురప్పశెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్చార్జ్ ప్రిన్సిపల్‌గా కల్లూరు గురవయ్య, ఆయన సతీమణి సౌరమ్మ పట్టణంలోని టంగుటూరు ప్రకాశం పంతులు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరు పిచ్చిరెడ్డితోపులోని విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌరమ్మ పాఠశాలకు వెళ్లగా, గురవయ్య పరీక్ష పేపర్ వాల్యుయేషన్‌కు నెల్లూరుకు వెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సౌరమ్మ పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి మరో వైపు ఉన్న తలుపు పగులగొట్టి ఉంది. ఇంట్లో ప్రవేశించిన దుండగులు ఓ చోట దాచి ఉన్న బీరువా తాళాలతో రెండు బెడ్రూంల్లో బీరువాలు, హాలులో ఉన్న ర్యాక్‌లను తెరిచి అందులోని 59 సవర్ల బంగారు నగలు, రూ.1.45 లక్షల నగదు, అర కేజీకి పైగా వెండి వస్తువులను అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన తీరు చూస్తే స్థానికులపైనే అనుమానం ఎక్కువగా ఉంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు కావడంతో కొద్ది రోజులుగా రెక్కీ వేసి అదను చూసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎస్సై మారుతీకృష్ణతో పాటు ఐడీ పార్టీ సిబ్బంది సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. దొంగలు తలుపులు పగులగొట్టేందుకు వాడిన రెండు ఇనుప గునపాలను ఇంటి లోపల పడేసి ఉండడాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విధుల్లో చేరని అధ్యాపకులు
అందని షోకాజు నోటీసులు పరీక్ష ఏర్పాట్లలో ఇంటర్ బోర్డు మంచిర్యాల సిటీ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు బోధిస్తున్న కాంట్రాక్టు అ«ధ్యాపకులు గురువారం విధుల్లో చేరలేదు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మెలోకి వెళ్లిన అధ్యాపకులంతా ఈ నెల 12న తప్పనిసరిగా విధుల్లో చేరాలంటూ ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో చేరని వారిని ఇంటికి పంపుతామని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయినా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఏ ఒక్క అధ్యాపకుడు కూడా విధులకు హాజరు కాలేదు. ఇప్పటి వరకు షోకాజు నోటీసులు కూడా అందలేదని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల్లోని 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 478 మంది అధ్యాపకులు కాంట్రాక్టు ప్రాతిపదికన తరగతులు బోధిస్తున్నారు. బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా గురువారం నుంచి అధ్యాపకులు నాలుగు జిల్లాల్లోనూ నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సమ్మెను మరింత ఉధృతం చేయడానికే ముందుకు సాగుతున్నారు. పరీక్ష ఏర్పాట్లు.. ఇదిలా ఉంటే.. ఇంటర్మీడియెట్ 2017 ప్రాక్టికల్, థియరీ పరీక్షల ఏర్పాట్లలో బోర్డు నిమగ్నమైంది. కాంట్రాక్టు అధ్యాపకులు దీర్ఘకాలిక సమ్మెలోకి వెళ్లడంతో బోర్డు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 25న పరీక్ష ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నెల 28 నుంచి 30 వరకు పర్యావరణ పరిరక్షణ, నైతిక విలువలు పరీక్ష నిర్వహణకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 3 నుంచి బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు పదవీ విరమణ చేసిన వారితోపాటు కళాశాల సమీపంలో ఉన్న అర్హులైన నిరుద్యోగులను, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులను నియమించుకోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ అవసరమైతే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను కూడా సద్వినియోగం చేసుకోవాలని బోర్డు ఆలోచిస్తోంది. అదే విధంగా మార్చి ఒకటి నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలను నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు ప్రస్తుతం ఉన్న పర్మినెంటు అధ్యాపకులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను నియమించుకోడానికి బోర్డు అధికారులు ఈనెల 25న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మెను ముందు దృష్టితో చూసిన బోర్డు అధికారులు అదే చూపుతో ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 25 రోజులు దాటితే.. కాంట్రాక్టు అధ్యాపకులు దీర్ఘకాలికంగా 25 రోజుల సమ్మెలో ఉంటే వారు ఇంటికి వెళ్లాల్సిందే. వారు డిసెంబర్ 28 నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. సంక్రాంతి సెలవులు ఈనెల 16 వరకు ఉన్నాయి. సెలవుల్లోపు వారంతా విధుల్లోకి వెళ్తే కొలువు ఉంటుంది. ఆ తర్వాత మరో ఐదు రోజులు సమ్మెలోకి వెళ్తే 25 రోజలు సమ్మెలో ఉన్నట్టే. దీంతో నిబంధనల మేరకు దీర్ఘకాలిక సమ్మెలో 25 రోజలు ఉన్నవారు విధులకు దూరంగా ఉండాల్సిందేనంటూ బోర్డు అధికారులు ఆదేశాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం షోకాజు నోటీసులు ఇవ్వకుండా బోర్డు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. -
60 శాతం ఉత్తీర్ణత సాధించాల్సిందే
• ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫలితాలపై కడియం శ్రీహరి • బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు • ప్రిన్సిపాళ్ల వర్క్‌షాప్‌లో డిప్యూటీ సీఎం హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వచ్చే వార్షిక పరీక్షల్లో కనీసం 60 శాతం ఉత్తీర్ణతను సాధించాల్సిం దేనని, ఇప్పటికే 60 శాతం ఉత్తీర్ణత ఉన్న కాలేజీలు కనీసం పది శాతం అదనంగా ఉత్తీర్ణతను సాధించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇందుకోసం ప్రినిపాళ్లు, లెక్చరర్లు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలన్నారు. డిసెంబర్ నెలాఖరు కల్లా సిలబస్ మొత్తం పూర్తి చేసి, ఆ తరువాత రివిజన్, స్టడీ అవర్లు నిర్వహించి ఫలితాలను పెంచాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు బుధవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల బాధ్యతలు, విధుల మాన్యువల్‌ను ఆవిష్కరించారు. అనంతరం కడియం మాట్లా డుతూ, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం సరి పడా నిధులు ఇస్తోందని, మౌలిక సదుపాయా ల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటితోపాటు నాణ్యమైన విద్యను అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2,80,000 సీట్లు ఉన్నాయని, వచ్చే ఏడాది కనీసం 2 లక్షల మంది విద్యార్థులు చేరేలా ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు కృషి చేయాలని సూచించారు. విద్యావ్యవస్థ కీలకం: మానవ వనరులు అభివృద్ధి చెందలేదన్న అపవాదు తెలంగాణపై ఉందని, అది సీఎం కేసీఆర్‌కు ఇష్టంలేదని కడియం అన్నారు. మానవ వనరుల అభివృద్ధిలో విద్యా వ్యవస్థ కీలకమైందని సీఎం కేసీఆర్ గుర్తించి, అనేక విద్యా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అవి సత్ఫలితాలు ఇచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కాలేజీలను పటిష్టం చేసేందుకు పక్కా భవనాలు నిర్మిస్తున్నామని, కనీస వసతులు, కంప్యూటర్లు, లైబ్రరీలు, బయోమెట్రిక్ మిషన్లకు నిధులు ఇస్తున్నామని తెలిపారు. ఫలితంగా గత ఏడాది 40 వేల మంది విద్యార్థులు అధికంగా ప్రభుత్వ కాలేజీల్లో చేరారన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. అరుుతే న్యాయ పర ఇబ్బందుల వల్ల ఆలస్యం అవుతోం దన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాలేజీల్లో అడిగిన వసతులన్నీ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో పనిచేయకపోతే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ముందే నిధులు విడుదల చేయండి.. కాలేజీల నిర్వహణకు ఇచ్చే నిధులను కాలేజీల ప్రారంభానికి ముందే విడుదల చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను కడియం ఆదేశించారు. వీలైనంత వరకు ప్రిన్సిపాళ్లు కాలేజీలున్న చోటే నివాసం ఉండాలన్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలికల కాలేజీలో 2,500 మంది విద్యార్థినులు ఉన్నారని, వీరికి కావాల్సిన టారుులెట్స్, ఇతర అవసరాల కోసం కలెక్టర్‌ను సంప్రదిస్తే అవపసరమైన ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. -
‘చెప్పుకోలేని బాధ’పై కలెక్టర్‌కు నోటీసులు
- జారీ చేసిన బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ - ‘చెప్పుకోలేని బాధ’ కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు - డిసెంబర్ 20లోగా సమాధానం ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో మూత్రశాలలు లేక విద్యార్థినులు ఎదుర్కొంటున్న వైనాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కళాశాలలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో విద్యార్థినుల ఆరోగ్యంపై ఆందో ళన వ్యక్తంచేసింది. బుధవారం ’సాక్షి’లో ’చెప్పుకోలేని బాధ’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించి వివరణ ఇవ్వాల్సిం దిగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు నోటీసులు జారీచేసింది. ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొనడానికి గల కారణాలపై డిసెంబర్ 20లోగా తమకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మూత్రశాలలు సరిగాలేని కార ణంగా విద్యార్థినుల ఆరోగ్యంపై ఏమైనా ప్రభా వం చూపిందా.. అనే విషయాన్ని వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఏళ్ల తరబడి మూత్రశాలలు లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కదిలిన అధికార యంత్రాంగం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు మూత్రశాలలు లేక పడుతున్న అవస్థలను కళ్లకు కట్టినట్లు ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచు రితమైన ’చెప్పుకోలేని బాధ’ కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. జిల్లాలో ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ’స్వచ్ఛ మిషన్’ చేపట్టారు. 4 రోజుల క్రితమే జిల్లాలోని హన్వాడ మండలం సల్లోనిపల్లిలో కేవలం 48 గంటల్లో 336 మరుగుదొడ్లు నిర్మించేలా చర్య లకు ఉపక్రమించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీలో టారుు లెట్లు లేక విద్యార్థినులు పడుతున్న అవస్థలపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పరిస్థితిని వెంటనే చక్క దిద్దాలని మున్సిపల్ కమిషనర్ భూక్యా దేవ్‌సింగ్ నాయక్‌ను ఆదేశించారు. ఆయన కూడా బుధవారం ఉదయం 10 గంటలకే కళా శాలలోని మూత్రశాలలపై ఆరా తీశారు. మరు గుదొడ్లకు అవుట్లెట్ లేకపోవ డంతో తలెత్తిన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. మూత్రశా లలకు నీటి సౌకర్యం కల్పించాలని సూచిం చారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించా లని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. -
భూమి లేదు.. భవనం లేదు!
♦ కళాశాల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు ♦ స్థలం కేటాయింపు లేక ఇప్పటికే రెండుసార్లు నిధులు వాపస్ ♦ శివ్వంపేట జూనియర్ కాలేజీ విద్యార్థుల ఇబ్బందులు శివ్వంపేట: ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అంటే ఇదే! శివ్వంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి నిధులు పుష్కలంగా ఉన్నా.. అవసరమైన స్థలం కేటాయింపు జరకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. 2008లో శివ్వంపేటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మం జూరైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో తాత్కాలికంగా కాలేజీ ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో చాలీచాలని గదుల్లో ఎంపీసీ, సీఈసీ గ్రూపులు ప్రారంభమయ్యాయి. కాగా, ఎనిమిదేళ్లుగా కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణం చేత గత ఏడాది రెండు గ్రూపులకు సంబంధించి 60 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా.. ఈసారి ప్రవేశాలు సగానికి పడిపోయాయి. రూ.10 కోట్లు మంజూరు కాలేజీ నిర్మాణానికి వారం రోజుల క్రితం రూ.10 కోట్ల మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రూ.8.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించాయి. దీంతో పాటు కరీంనగర్ జిల్లా గొల్లపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, ఆదిలాబాద్ జిల్లా దండెపల్లిలో కాలేజీ భవన నిర్మాణాలకు ఈసారి నిధులు మంజూరయ్యాయి. శివ్వంపేటలో భవన నిర్మాణానికి 2010లో రూ.75 లక్షలు మంజూరు కాగా స్థలం కేటాయించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. 2012లో రూ.కోటి మంజూరు కాగా భూమి సమస్యే ఎదురైంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ఈక్రమంలో అనువైన స్థలాన్ని కేటాయిస్తే అన్ని వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి కాలేజీ నిర్మాణం జరుగనుంది. ఇందులో పూర్తిస్థాయి ఫర్నిచర్, కంప్యూటర్, డిజిటల్ క్లాస్, ఆర్వోప్లాంట్, ల్యాబ్ ఏర్పాటుచేయనున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కాలేజీ భవన నిర్మాణానికి సంబంధించిన భూమిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మండల కేంద్రంలో తూప్రాన్-నర్సాపూర్ ప్రధా న రహదారి పరిసరాల్లో ప్రభుత్వ భూ ములు ఉన్న అన్యాక్రాంతం కావడంతో స్థలం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేకు వినతి కాలేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని, భూమి కేటాయింపు చేపట్టాలని రెండు రోజుల క్రితం శివ్వంపేట పర్యటనకు వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యేకు కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు మెమెరాండం ఇచ్చారు. -
కళాశాలల్లోబయోమెట్రిక్
♦ పెరగనున్న విద్యార్థుల హాజరు శాతం ♦ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేవెళ్ల: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. సిబ్బంది, విద్యార్థుల హాజరులో మరింత పాదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నారుు. ఇవి కాకుండా ఐదు ఎరుుడెడ్, 12 ఆదర్శ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఈ కళాశాలల్లో సుమారు 15వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత నెలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. బుధవారం నుంచి అధ్యాపకులు, విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా హాజరుశాతాన్ని నమోదు చేసుకున్నారు. ప్రతి కళాశాలలో 4 సీసీన కెమెరాలు, బయోమెట్రిక్ పరికరం ప్రతి జూనియర్ కళాశాలలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేవెళ్ల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గదిలో, కళాశాల ముఖద్వారం వద్ద (ఎంట్రెన్ ్స), స్టాఫ్ రూం, ఒకేషన్ లో బిల్డింగ్‌లో ఒకటి చొప్పున ఏర్పాటుచేశారు. భద్రత పరంగా కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. సీసీ కెమెరాల పుటేజీలను ప్రిన్సిపాల్ గదిలో నుంచి పర్యవేక్షించవచ్చు. పెరగనున్న హాజరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థులు సమయపాలన పాటించడానికి బయోమెట్రిక్ విధానం ఉపకరించనుంది. ఉదయం 9:45 గంటలకు కళాశాల ప్రారంభం కానుంది. ఆలోపే.. అంటే 9.30 నుంచి 9.40 వరకు మాత్రమే బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు నమోదుచేయాల్సి ఉంటుంది. కళాశాలల వేళలు ముగిసే సమయానికి సాయంత్రం 3.50 నిమిషాలనుంచి 4 గంటలవరకు తిరిగి వెళ్లేటప్పుడు ఈ యంత్రం ద్వారా వేలిముద్రను వేయాల్సి ఉంటుందని ఇంటర్‌బోర్డు నిబంధనల్లో పొందుపరిచారు. అధ్యాపకులతోపాటుగా ఇతర సిబ్బంది, కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యార్థులు కూడా బయోమెట్రిక్ పరికరంలో హాజరును నమోదుచేసుకోవాలి. విద్యార్థుల హాజరుశాతం మెరుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రం ద్వారా అధ్యాపకులు, విద్యార్థులలో జవాబుదారీతనం, బాధ్యత మరింత పెరుగుతుంది. విద్యార్థులు హాజరుశాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రతిష్ట పెరుగుతుంది. ఇది మంచి ప్రయోగం. సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాం. - ఎం.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల -
నేనున్నా.. చెల్లెమ్మా..
► అనాథ యువతికి ఎమ్మెల్యే రసమయి భరోసా ► ఏడాదిపాటు ట్రినిటీలో చదివించేందుకు హామీ ► దుస్తులు, పుస్తకాలు కొనిచ్చి కళాశాలలో చేర్పించిన ఎమ్మెల్యే ఇల్లంతకుంట : ‘అమ్మనాన్నలు లేరని చింతించకు... అనాథ అని బాధపడకు. ఆపదొచ్చినా... పండగొచ్చినా నేనున్నా..’ అంటూ మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఓ అనాథ యువతికి అండగా నిలిచారు. మండలంలోని వంతడ్పులకు చెందిన చింతకింది బాలయ్యకు ఆంజనేయులు, అనిత సంతానం. బాలయ్య 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. తల్లి ఎటో వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆంజనేయులు, అనిత అనాథలయ్యూరు. కూలీ పనులు చేస్తూ చెల్లెను చదవించాడు ఆంజనేయులు. ఆమె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ పూర్తి చేసి 446 మార్కులు సాధించింది. నాలుగు నెలల క్రితం ఆంజనేయులు భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవడంతో అనిత ఒంటరిదైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిత ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనితకు తానున్నానని భరోసా ఇచ్చాడు. ఆమె చదువుకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించి వెంటనే కరీంనగర్‌లోని ట్రినిటీ కళాశాలలో చేర్పించారు. అనితకు కావాల్సిన దుస్తులు, పుస్తకాలతోపాటు రూ.5వేల అందించారు. ఆమెను తన చెల్లెగా చూస్తానని, ఏ కష్టం వచ్చినా.. పండగలొచ్చినా.. తన ఇంటికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనాథ బాలికను చేరదీసిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గుడిసె ఐలయ్య, సెస్ డెరైక్టర్ వుట్కూరి వెంకటరమణారెడ్డి, సర్పంచ్ కట్ట వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇంటర్ స్పెషల్ ఫీజుల రద్దు
శ్రీకాకుళం/శ్రీకాకుళం న్యూకాలనీ: సర్కారు జూనియర్ కళాశాలల్లో స్పెషల్ ఫీజులు రద్దయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రెవేశాల సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వెనుకబడిన వర్గాలకు చెంది అర్హత కలిగిన విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న స్పెషల్ ఫీజులను ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా రద్దుచేయాలని ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ నిర్ణయించారు. ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు మరింత ఊరట కలగనుంది. వివిధ గ్రూపుల విద్యార్థులకు సగటున రూ.500 నుంచి 800 వరకు ఫీజు భారం తగ్గనుంది. అక్రమాలకు తావులేదు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజులను వసూలు చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనిని అదునుగా చేసుకుని కొంతమంది ప్రిన్సిపాళ్లు నిధులు పక్కదారి పట్టించేవారు. స్పెషల్ ఫీజుల మొత్తాన్ని కళాశాల బ్యాంకు ఖాతాలకు జమ చేయవలసి ఉంది, అరుుతే, కొందరు ఈ నిధులను తమ జేబుల్లోనే వేసుకొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా లక్షల రూపాయల నిధులను అప్పనంగా బొక్కేసేవారు. కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు గుర్తించినప్పటికీ క్రమశిక్షణా చర్యలకు బాధ్యులవుతామని మిన్నికుండిపోయేవారు. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 20కుపైగా కళాశాలల్లో లక్షల్లో నిధులు తారుమారయ్యాయని గత ఏడాది అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే స్పెషల్ ఫీజులను రద్దుచేయాలనే డిమాండ్లు కూడా రెండేళ్లుగా కమిషనర్ దృష్టికి వెళుతున్నాయి. రసీదులు అందించాల్సిందే ఇదిలా ఉండగా ఈ ఏడాది నుంచి విద్యార్థులు కేవలం సాధారణ ఫీజులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజుల చెల్లింపులకు సంబంధించి సంబంధిత ప్రిన్సిపాళ్లు, సిబ్బంది విధిగా రసీదులు అందించాల్సిందేనని జిల్లా అధికారులు స్పష్టంచేస్తున్నారు. స్పెషల్ ఫీజులు వసూలు చేసిన, సాధారణ ఫీజుల రసీదులు ఇవ్వకపోయినా తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు కమిషనర్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజులు వసూలు చేయకూడదు. వసూలు చేస్తే అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. - రెయ్యి పున్నయ్య, డీవీఈఓ, ఇంటర్మీడియెట్ విద్య, శ్రీకాకుళం. రసీదులు అందజేయాలి ఫీజు వసూళ్ల మేరకు ప్రిన్సిపాళ్లు విధిగా రసీదులు అందజేయూలి. గతంతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తుండటం శుభసూచికం. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోనే అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకోవాలి. - పాత్రుని పాపారావు, ఆర్ఐఓ, ఇంటర్మీడియెట్ బోర్డు. -
జీతమెప్పుడొస్తుంది బాబో!
జీతాల కోసం గెస్ట్ ఫ్యాకల్టీల ఎదురుచూపు జిల్లాలో 59 మంది అధ్యాపకుల నియామకం విద్యా సంవత్సరం ముగిసినా పట్టించుకోని ప్రభుత్వం కర్నూలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేసిన అధ్యాపకులకు వేతనాలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దాదాపు ఆరు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్న పైసా చెల్లించలేదు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మరోవైపు కళాశాలల స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి గెస్టు ఫ్యాకల్టీకి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిస్తే చాలా వాటిలో అంత మొత్తంలో డబ్బులు లేవని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. చాలా కళాశాలల్లో అధ్యాపకులు లేరు. రెండేళ్లుగా కాంట్రాక్ట్ బేసిక్‌పై కూడా అధ్యాపకులను నియమించడం లేదు. ఈ నేపథ్యంలో కళాశాలలో ఇంటర్ విద్య మిథ్యగా మారకూడదని ప్రభుత్వం సెప్టెంబర్, నవంబర్ నెలల్లో 59 మందిని గెస్టు ఫ్యాకల్టీలుగా నియమించింది. పిరియడ్‌కు రూ. 150 చొప్పున 68 పిరియడ్లకు గౌరవ వేతనం చెల్లిస్తారు. అంతకన్న ఎక్కువ పిరియడ్లను తీసుకుంటే రూ. పది వేలకు మించకుండా చెల్లిస్తారు. పీజీలు చేసి నిరుద్యోగులుగా ఉన్న యువకులు ఆర్థిక ఇబ్బందులు కలుగతాయనే ఆశతో గెస్టు ఫ్యాకల్టీగా చేరారు. నెలనెలా గౌవర వేతనాన్ని చెల్లిస్తుందనుకుంటే ఆరు నెలలైనా పైసా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యారు. విద్యా సంవత్సరం ముగిసినా అధికారులు గౌవర వేతనం మాటెత్తకపోవడంతో ఆయోమయంలో ఉన్నారు. స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి చెల్లించాలని ఆదేశాలు: మరోవైపు గెస్ట్ ఫ్యాకల్టీలకు కళాశాలల స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి గౌరవ వేతనాలు చెల్లించాలని సోమవారం ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే చాలా కళాశాలల్లో అంత పెద్ద మొత్తంలో నిధులు లేవని, అలాంటి కళాశాలల్లో పనిచేసిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. పది రోజుల్లో చెల్లిస్తాం: కబీరు, డీవీఈఓ గెస్టు ఫ్యాకల్టీలుగా పనిచేసే వారికి స్పెషల్ ఫీజు మొత్తాల నుంచి జీతాలు చెల్లించాలని ప్రభుత్వం సోమవారం ప్రొసిడింగ్స్‌ను ఇచ్చింది. వారం, పది రోజుల్లో ఇచ్చేస్తాం. అయితే ఏయే కాలేజీలో ఎంత అమౌంటు ఉందో ముందు చూడాలి. తక్కువ మొత్తం ఉంటే మళ్లీ ప్రభుత్వానికి నివేదించాలి. స్పెషల్ ఫీజు గ్రాంట్లు ఉన్న కళాశాలల అధ్యాపకులకు చెల్లిస్తాం. మార్చిలో ఇస్తామన్నారు: ఎల్ల రంగడు, కౌతాళం జూనియర్ నేను నవంబర్‌లో గెస్టు ఫ్యాకల్టీగా కౌతాళం జూనియర్ కళాశాలలో చేరాను. ఇంత వరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. మార్చిలో ఇస్తామన్నారు. ప్రస్తుతం మే వచ్చింది. అయినా ఇంతవరకు ఎవరూ ఏమి అనడం లేదు. గెస్ట్ ఫ్యాకల్టీ అభ్యర్థులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలి. -
కళాశాలలపై నిఘా
♦ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ♦ సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లు ♦ నూతన విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరింత గాడిలోకి రానున్నాయి. బోధనలో పారదర్శకత తీసుకరావడం, హాజరు శాతం పెంచడానికి ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 23, రంగారెడ్డిలోని 26 ప్రభుత్వ కళాశాలల్లో చాలా వరకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కళాశాలకు నాలుగు చొప్పున బిగించారు. నెల రోజుల నుంచి సాగుతున్న ఈ ఏర్పాటు ప్రక్రియ మరో నాలుగైదు రోజుల్లో ముగియనుంది. కళాశాల ప్రాంగణం, స్టాఫ్ రూంలో ఒకటి చొప్పున, తరగతి గదులలో రెండు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలన్నీ నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డుకు అనుసంధానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, లెక్చరర్ల రాకపోకలపై కన్నేయడంతోపాటు.. భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సరైన బోధన అందించడంతోపాటు విద్యార్థులు, లెక్చరర్ల కదలికలు తెలుసుకునేందుకు ఈ చర్యకు శ్రీకారం చుట్టారు. అంతేగాక నగర శివార్లలోని చాలా కళాశాలలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారిన విషయం తెలిసిందే. మద్యం అక్కడే తాగడంతో పాటు కళాశాలలకు సంబంధించిన ఆస్తులను మద్యం మత్తులో ధ్వంసం చేస్తున్నారు. విలువైన వస్తువులు కూడా చోరీకి గురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటే శరణ్యమని భావించిన ప్రభుత్వం.. చర్యలకు ఉపక్రమించింది. గతేడాది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు ప్రభుత్వ కళాశాలల్లో కెమెరాలు బిగించారు. ఒకటి నిజామాబాద్ జిల్లాలోకాగా.. మరొకటి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో మార్పు రావడంతో.. ప్రతి కళాశాలలో ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. జూన్ రెండో వరకు అన్ని కళాశాలల్లో కెమెరాలు అందుబాటులోకి వస్తాయని రంగారెడ్డి జిల్లా ఆర్ఐఓ -2 హన్మంత్ రెడ్డి తెలిపారు. బయోమెట్రిక్ విధానంలో హాజరు.. కళాశాలల్లో ఇప్పటి వరకు విద్యార్థుల హాజరును రికార్డుల్లో రోజువారీగా నమోదు చేసేవారు. ఇకపై ఇటువంటి పరిస్థితి కనిపించదు. రికార్డులతో పని లేకుండా వేలి ముద్ర ల (బయోమెట్రిక్) ద్వారా తీసుకోనున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో కళాశాలకు గరిష్టంగా రెండు బయోమెట్రిక్ డి వైస్‌లు ప్రభుత్వం నుంచి అందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులతోపాటు లెక్చరర్లు కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు శాతం పెంచడంతోపాటు.. లెక్చరర్ల రాకపోకల సమయాలను తెలుసుకునేందుకు ఈ చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. జూన్ ఒకటో తేదీ నాటికి బయోమెట్రిక్ మిషన్లను కళాశాలల్లో అందుబాటులోకి రానున్నాయి. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్!
ఒక్కో కాలేజీకి 4 సీసీ కెమెరాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు, లెక్చరర్ల హాజరు శాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు ఇంటర్మీడియెట్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఓ ప్రైవేటు కంపెనీని ఎంపిక చేసింది. దీంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక్కో కాలేజీలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని ప్రవేశ ద్వారం/వరండాలో, స్టాఫ్ రూమ్‌లో, ప్రిన్సిపల్ రూమ్‌లో, ప్రవేశ ద్వారం వెనుక భాగంలో ఏర్పాటు చేసుకోవాలని ఇంటర్మీయెట్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్ ఇటీవల మెమో జారీ చేశారు. కాగా స్టాఫ్‌రూమ్‌లో సీసీ కెమెరాలు ఎందుకని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని 52 కాలేజీల్లో విద్యుత్తు సరఫరానే లేకుండా, 220 కాలేజీల్లో కంప్యూటర్లు లేకుండా సీసీ కెమెరాలు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. -
జూనియర్ కళాశాలలో ఆర్జేడీ తనిఖీలు
చేవెళ్ల (రంగారెడ్డి) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ బోర్డు రీజినల్ జాయింట్ డైరెక్టర్ మల్హర్రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య, కోర్సుల వివరాలను ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మల్హర్రావు విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలని, ప్రభుత్వ కళాశాలల్లోనే తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపాలని పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాపవుట్స్‌ను తగ్గించి, సంఖ్యను పెంచడానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. -
కళాశాలలో వసతులు లేవని రాస్తారోకో
లక్సెట్టిపేట్ (ఆదిలాబాద్) : కళాశాలలో కనీస వసతులు కూడా కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీసం మరుగుదొడ్లు కూడా లేవంటూ మంగళవారం విద్యార్థినీవిద్యార్థులు మంచిర్యాల-ఆదిలాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సుమారు అరగంటపాటు చేపట్టిన ఆందోళనతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా పోలీసులు విద్యార్థులను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు. -
బయో..అయోమయం
బయోమెట్రిక్ ఆధారంగా ఉపకారవేతనాలు కాలేజీల్లో అందుబాటులో లేని మిషన్లు సిటీబ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాల భయం పట్టుకుంది. ప్రభుత్వ విధానాల వల్ల స్కాలర్షిప్లు అందుతాయో లేదోనని ఆందోళన మొదలైంది. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బయోమెట్రిక్ ఆధారంగా ఉపకార వేతనాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా గతేడాదే అమలు చేయాలని సూచించినప్పటికీ.. చివరి దశలో వాయిదా వేశారు. ఇటీవల అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని సర్కారు సూచించింది. అయితే ప్రైవేటు కాలేజీలను పక్కనబెడితే.. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారుతోంది. బయోమెట్రిక్ మిషన్లను ఎవరు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తమ కళాశాలల్లో బయోమెట్రిక్ మిషన్ లేకపోవడంతో సాంఘిక సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు సూచిస్తున్నారు. వాస్తవంగా సాంఘిక సంక్షేమ కార్యాలయాల్లోనూ మిషన్లు అందుబాటులో ఉండవు. ఆయా కళాశాలలే తమ డబ్బుతో వాటిని సమకూర్చు కోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక విద్యార్థులు సాంఘిక సంక్షేమ కార్యాలయాలకు తిరిగి వేసారిపోతున్నారు. కొరవడిన స్పష్టత.. ఒక్కో బయోమెట్రిక్ మిషన్ కొనుగోలు చేయాలంటే రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు అవసరం. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా? లేక కళాశాలలే కొనుగోలు చేసుకోవాలా? అందుకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి? తదితర అంశాలపై స్పష్టత కొరవడింది. ఏదో ఒకటి చెప్పకముందే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయమనడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. జంట జిల్లాల్లో 44 ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. వాటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 16 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులంతా అయోమయంలో చిక్కకున్నారు. మరోపక్క ప్రభుత్వ కళాశాలలను బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయించాలన్న డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. -
సర్కారు కాలేజీలపై ఆన్లైన్ నిఘా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. కార్పొరేట్ కాలేజీల తాకిడిని తట్టుకొనేందుకు వీలుగా ప్రభుత్వం సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్, ఆన్లైన్ విధానాలను అమలుపర్చేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారులు కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు. జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు సహా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాలను అమలు చేయనున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఇప్పటికే కొన్ని కాలేజీల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండడంతో గతేడాది పనిచేసిన కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకులు అందరినీ తిరిగి కొనసాగించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అధికారుల సమాచారం మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు నాలుగు వేల అధ్యాపకుల పోస్టులు అవసరముంది. రెండేళ్లక్రితమే ఈ నియామకాలు చేపట్టాలని అధికారులు భావించినా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వమూ నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తాత్కాలిక సిబ్బందిని కొనసాగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యమైన సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోతే రిటైరైన వారిని నియమించుకోవాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు. మరోపక్క కాలేజీల్లో బోధన ప్రక్రియ మెరుగుపర్చేందుకు విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ (హాజరు నమోదు యంత్రాలు) పద్ధతిని అమలుచేయనున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ తెలిపారు. మార్కుల సమాచారానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో అవగాహన స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు తరచూ పరీక్షలు నిర్వహించేలా కొత్త ప్రణాళికను రూపొందించారు. పరీక్షలకు ప్రశ్నపత్రాన్ని బోర్డు నుంచే రూపొందింపచేసి అన్ని కాలేజీలకు ఆన్లైన్లో పంపిస్తారు. దాన్ని కాపీలు తీసి విద్యార్థులతో పరీక్షలు రాయిం చాలి. ఆ పరీక్షల్లో వచ్చిన మార్కుల సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో తిరిగి ఆన్లైన్ ద్వారానే బోర్డుకు పంపాలి. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకూ సంక్షిప్త సమాచారం ద్వారా మార్కులు తెలియజేస్తారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలతోపాటు నోట్ పుస్తకాలు ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయిస్తున్న సంగతి తెలిసిందే. 12 లక్షల పాఠ్యపుస్తకాలకు గాను ఆరు లక్షల పుస్తకాల పంపిణీ పూర్తయ్యిందని, మరో ఆరు లక్షల పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని బోర్డు కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలనూ ఉచితంగానే అందించనున్నామన్నారు. నల్లగొండ జిల్లాలోని మేథ ట్రస్టు వీటిని అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. -
సర్కారీ ఇంటర్ ఉచితం
-
సర్కారీ ఇంటర్ ఉచితం
* ఫీజుల రద్దు, పుస్తకాలతో బోర్డుపై ఏటా రూ. 16 కోట్ల భారం * ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్య పూర్తిగా ఉచితం కానుంది. ప్రభుత్వ కళాశాలలో చేరే విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజుల పేరుతో ఏటా వసూలు చేస్తున్న (ఒక్కొక్కరి నుంచి రూ. 533 నుంచి 893) కనీస మొత్తాన్ని కూడా తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ఉచిత విద్యను అందించాలని ఇంటర్మీడియెట్ బోర్డు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ప్రతి విద్యార్థికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. బుధవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో సమావేశం అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠ్యపుస్తకాలు కూడా కొనుక్కోలేని విద్యార్థులు ఉన్నందున, ప్రిన్సిపాళ్ల ద్వారా జూలై నెలాఖరులోగా ఉచితంగా అందించాలని నిర్ణయించామన్నారు. విద్యార్థి తన ఐడీ కార్డు ద్వారా పుస్తకాలను పొందవచ్చన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విలేకరులు కడియం దృష్టికి తీసుకెళ్లగా.. ‘ముందుగా నా ఇంటిని పటిష్టం చేస్తా. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అభివృద్ధి చేస్తా. నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు చేపడతాం. అసలు ప్రైవేటు కాలేజీలకు వెళ్లకుండా చేయాలన్నదే నా మొదటి ప్రాధాన్యం. వాటి నియంత్రణ తరువాత అంశం’ అని వివరించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1.15 లక్షల మంది విద్యార్థులున్నారు. ఈసారి ఈ సంఖ్య 1.30 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. వారంతా ఈసారి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సైన్స్ విద్యార్థుల నుంచి ఏటా రూ. 893, ఆర్ట్స్ విద్యార్థుల నుంచి రూ.533 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇలా 1.30 లక్షల మంది విద్యార్థులు చెల్లించాల్సిన దాదాపు రూ. 9 కోట్లు ఇంటర్ బోర్డే ఇకపై భరిస్తుంది. అలాగే పాఠ్యపుస్తకాలకు అయ్యే రూ.7 కోట్లను కూడా బోర్డే భరించనుంది. అని కడియం వివరించారు. అన్ని కాలేజీలకు పక్కా భవనాలు, మౌలిక సదుపాలు కల్పిస్తామని చెప్పారు. క్రమబద్ధీకరణ తరువాత పోస్టుల భర్తీ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తరువాత మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని కడియం శ్రీహరి తెలిపారు. ప్రభుత్వం భర్తీ చేయనున్న 25 వేల పోస్టుల్లో లెక్చరర్ పోస్టులు ఉండేలా చూస్తున్నామన్నారు. కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌కు శిక్షణ ఇస్తామని ఆయన వివరించారు. 2 రోజుల్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఫలితాల వెల్లడికి సంబంధించిన పనులను పూర్తి కావ చ్చాయని వెల్లడించారు. కాగా అఫిలియేషన్లపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా.. తప్పు చేసిన వారు భయపడతారని, తప్పు చేయనపుడు ఎందుకు భయమని పేర్కొన్నారు. దీనిపై తామేమీ చేసేది లేదని చెప్పారు. -
రాష్ట్రంలో జిల్లాకు మూడవ స్థానం
- ఇంటర్ ద్వితీయలో మెరుగైన ఫలితాలు - బాలికలదే హవా - కాకతీయ’కు బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ - ప్రభుత్వ కళాశాలల్లోనూ పెరిగిన ఉత్తీర్ణత నిజామాబాద్ అర్బన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చటారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. బాలుర కంటే బాలికలే పైచేరుుగా నిలిచారు. ఈ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 23,970 మంది పరీక్షలకు హాజ రు కాగా, 13,742 మంది (57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 53 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. బాలురు 15,598కి గాను 5,855 మంది (50 శాతం), బాలిక లు 12,732 మందికి గాను 7,887 మంది (64 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఈ ఏడా ది ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ కళాశాలల్లో గత ఏడా ది 59.69 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 68.20 శాతానికి పెరగడం విశేషం. అరుుతే ఎయిడెడ్ కళాశాలల్లో మాత్రం గత ఏడాది కంటే మూడు శాతం ఉత్తీర్ణత తగ్గింది. గత సంవత్సరం 18 శాతం కాగా, ఈ ఏడాది 15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యూరు. వోకేషనల్ ఫలితాల్లో ప్రస్తుతం 73.02 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, గత ఏడాది 52 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 5719 మంది విద్యార్థులు ప్రైవేట్‌గా పరీక్షలు రాయగా, 1787 మంది(31 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కాకతీయకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్... జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన బి.సుష్మ బైపీసీ విభాగంలో 991/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ కళాశాల విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 31 మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఇందులో 10లోపు నా లుగు ర్యాంకులు, 15లోపు తొమ్మిది ర్యాంకులు సాధించడం గమనార్హం. ఇదే కళాశాలకు చెందిన వైష్ణవి పవార్ ఎంపీసీ విభాగంలో 987/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు, జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. కృష్ణతేజ్ ఎంపీసీలో 985/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. బోధన్‌లోని విజయసాయి కళాశాలకు చెందిన సుష్మిత ఎంపీసీ విభాగంలో 985/1000 మార్కులు, ఇదే కళాశాలకు చెందిన సోనియఖన్నా బైపీసీలో 982/1000 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలకు చెందిన జి.అనుజ 984/1000 ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు, కె.అనూష 981/1000, ఎం.రాధిక లీల-981/1000, సౌబియ మెహిన-981/1000 రాష్ట్రస్థాయి 11వ ర్యాంకులు సాధిం చారు. కె.ప్రియాంక-980/1000 రాష్ట్ర స్థాయి 12వ ర్యాంకు, పవన్‌కళ్యాణ్ 979/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి 13వ ర్యాంకు, ఎ.సంతోష్ 979/1000 బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి 13వ ర్యాంకు సాధించారు. పి.సాయివంశీ 978/1000 రాష్ట్ర స్థాయి 14వ ర్యాంకు, వి.సాహితీ -978/1000 , కె.సింధు 978/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి 14వ ర్యాంకు సాధించారు. కామారెడ్డికి చెందిన సందీపని జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి కె.చలన ఎంపీసీ విభాగంలో 982/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. అలా గే బోధన్‌లోని ఉషోదయ జూనియర్ కళాశాలకు చెందిన సాయివినయ్ ఎంపీసీ విభాగంలో 968/1000, రవళి 968/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఎంఈసీలో కామారెడ్డి సందీపని జూనియర్ కళాశాలకు చెం దిన కె.నిహారిక 965/1000 మార్కులు సాధించింది. సిఈసీలో సాగరిక 945/ 1000 మార్కులు సాధించింది. ఎంఈసీ విభాగంలో నిర్మలహృదయ్ జూనియ ర్ కళాశాలకు చెందిన బిష అగర్వాల్ 970/1000 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇదే కళాశాలకు చెందిన ఈష ఆగర్వాల్ ఎంఈసీలో 968/1000 మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. -
సౌకర్యాలు లేకున్నా.. సత్తా చాటారు
ఫలితాల్లో జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిన జఫర్‌గఢ్ {పభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీలో 905 మార్కులు సాధించిన కళాశాల విద్యార్థి బాలాజీ నూరు శాతం ఫలితాలు సాధించిన వెలుగు గురుకుల పాఠశాల జఫర్‌గఢ్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి స్థాయిలో వసతులు లేనప్పటికీ ఆధ్యాపకుల అంకిత భావం, విద్యార్థుల పట్టుదలతో ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చారుు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు సమస్యలతో సతమతమవుతూనే మరోవైపు ఏ ఏటికాయేడు ఫలితాల శాతం పెరుగుతూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో 81 మంది విద్యార్థు లు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యూరు. కళాశాల ఎంపీసీ విద్యార్థిని వీరబత్తిని బాలాజీ 905 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచా డు. బైపీసీలో రాధిక 850 మార్కులు సాధించ గా, సీఈసీలో ఆకుల అపర్ణ 795 మార్కులు సాధించారు. వెలుగు గురుకుల కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత మండలంలోని ప్రభుత్వ వెలుగు గురుకుల కళాశాల విద్యార్థులు కూడా ఇంటర్ సెకండియర్‌లో తమ ప్రతిభ చాటారు. కళాశాలలో మొత్తం 73 మంది విద్యార్థులకు గాను 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో జి.రమ 908 మార్కులు సాధించగా, ఎంపీసీలో పి.కళ్యాణి 873 మార్కులు సాధించారు. ఈ కళాశాలలో కూడా ప్రతి ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతూ వస్తోంది. జఫర్‌గఢ్ ప్రభుత్వ మోడల్ కళాశాల నుంచి 45 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో 882 మార్కులు రాగా, బీపీసీ, సీఈసీ విభాగాల్లో 890 మార్కులు సాధించారు. గతంలో ఎన్నడూలేని విధంగా జూనియర్ కళాశాలతోపాటువెలుగు గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ సెకండియర్‌లో ప్రతిభను చాటి ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధిం చడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తరగతులతోనే అత్యుత్తమ ఫలితాలు : దయాకర్‌రెడ్డి, జీజేసీ ప్రిన్సిపాల్ ఈ యేడు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. వీటి ఫలితంగానే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాస్ కావడమేగాక ఎక్కువ మార్కులు సాధించారు. పరీక్ష ఫలితాల్లో మా కళాశాల జిల్లాలోనే ద్వితీయ స్థానం రావడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఎక్కువ మార్కులు రోజువారి తరగతులతోపాటు అధ్యాపకులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వీటి ఫలితంగానే ఎంపీసీ విభాగంలో నాకు 905 మార్కులు వచ్చాయి. కళాశాలలో అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో బాగుంది. - బాలాజీ, ఎంపీసీ(905) వసతులు లేకున్నా విద్య బోధన బాగుంది కళాశాలలో పూర్తి స్థాయి వసతులు లేకున్నా అధ్యాపకుల విద్యా బోధన ఎంతో బాగుంది. వారి వల్లనే నేను ఎక్కువ మార్కులు సాధించా. - అపర్ణ సీఈసీ(795) -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
కూకట్పల్లి (హైదరాబాద్): ఇంటర్ చదువుతున్న ఓ బాలిక చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...భాగ్ అమీర్ ప్రాంత వాసి అయిన షాగోలు దివ్య (17) స్థానికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం దివ్య ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. అయితే, రాత్రి అయినా తిరిగి రాకపోయే సరికి సోమవారం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక అదృశ్యం అయినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
అధ్యాపకుడు.. ప్రేమ పేరుతో వంచించాడు
* భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం * మూడేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించడమే కారణం * నడుముకు తీవ్ర గాయాలు.. విజయవాడ తరలింపు * జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టలో ఘటన ఏలూరు (వన్‌టౌన్) : పేదరికంలో మగ్గిపోతున్న తమ కుటుంబాన్ని బాగా చదివి ఆదుకోవాలనుకున్న ఆ యువతి ఆశయాలను కామాంధుడైన అధ్యాపకుడు కాల రాశాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువతి చివరకు నడుం విరగ్గొట్టుకుని ఆసుపత్రి పాలైంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టకు చెందిన నాగేశ్వరరావు, నాగమణి కుమార్తె బాదిన బేబీషాలిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరింది. అదే కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్న తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురానికి చెందిన ఎన్.కిషోర్ బేబిషాలినితో ప్రేమలో పడ్డారు. మూడేళ్లుగా ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇంటర్ అనంతరం షాలినిని డిగ్రీ చేయనివ్వకుండా టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరాలని పట్టుబట్టాడు. బిఫార్మసీ ఫ్రీసీటు వచ్చినా వద్దని వారించాడు. ఈ క్రమంలో షాలినీ, ఆమె కుటుంబ సభ్యులు అతని వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే తనకు రూ.ఐదు లక్షలు కట్నం కావాలని కిషోర్ తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి గురువారం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స చేసిన వైద్యులు యువతి నడుం విరిగిందని మెరుగైన చికిత్స అందించాలని వారికి సూచించారు. దీంతో శుక్రవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి నేతల అండదండలు గురువారం రాత్రి పదిగంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదు. రాత్రి ఆస్పత్రిలో బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేయాల్సిన జంగారెడ్డిగూడెం పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. నిందితుడు కిషోర్‌కు కొందరు అధికార పార్టీ నేతలు అండగా నిలిచి కేసు లేకుండా చేసేందుకు విఫలయత్నం చేసినట్టు తెలిసింది. విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు హడావుడిగా ఏలూరు చేరుకుని అప్పటికప్పుడు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అతనితోనే పెళ్లి చేయాలి ‘కిషోర్‌ను ఏమీ చేయవద్దని, అతనితో తనకు పెళ్లి చేయాలి’ అని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాలినీ శుక్రవారం విలేకరుల వద్ద వాపోయింది. యువతి తల్లిదండ్రులు కూడా తాము పేదోళ్ళం బాబు మా కూతురికి అతనితో పెళ్లి జరిగితే చాలయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షాలినీకి ఇంకా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు సూచించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు తరలించారు. -
పిటీ కాలేజీలు
ఆ కాలేజీల దరఖాస్తుఫారాలు కావాలంటే కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టాల్సిందే. రోజులతరబడి కాళ్లరిగేలా కళాశాలల చుట్టూ తిరగాల్సిందే. అడ్మిషన్ల సంగతి సరేసరి! అత్యంత ప్రతిభ చూపినవారికే అక్కడ సీటు. హైదరాబాద్ నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు.. పెద్ద పెద్ద భవనాలు.. విశాలమైన ఆవరణ.. పచ్చని చెట్లు..! ఇదంతా.. ఏదైనా కార్పొరేట్ కళాశాల గురించి అనుకుంటున్నారా? కాదు సుమా! ఇదీ నగరంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఘనత. అవే ఆలియా, మహబూబియా, సిటీ కాలేజీలు. తరగతి గదులు కిటకిటలాడేవి. విద్యాసంవత్సరమంతా కళకళలాడేవి. ఆటపాటలతో అలరించేవి. వాటిల్లో తమ పిల్లలను చదివించడం తల్లిదండ్రులకో డ్రీమ్. అవి నగరానికే తలమానికం. అక్కడి విద్యే ప్రమాణికం. - సాక్షి, సిటీబ్యూరో ఆలియా, మహబూబియా, సిటీ కాలేజీల్లో తగ్గిన అడ్మిషన్లు ఆలియాలో గతంలో అడ్మిషన్లు వెయ్యికిపై మాటే.. నేడు 141 మంది చేరిక.. ఆలియాలో 35 పోస్టులకుగాను ముగ్గురే రెగ్యులర్ అధ్యాపకులు గతమెంతో ఘనమైనది. వర్తమానం మాత్రం దానికి పూర్తి భిన్నం. ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి. ఆగస్టు సమీపిస్తున్నా పూర్తిస్థాయిలో అడ్మిషన్లు భర్తీ కాని పరిస్థితి. దరఖాస్తు ఫారాలు కట్టలుకట్టలుగా అలాగే ఉండిపోయాయి. ఇంకా విద్యార్థులు రాకపోతారా.. అని సిబ్బంది ఎదురుచూపులు. సరిపడా లేని అధ్యాపకులు. భర్తీ కాని పోస్టులు.. ఇదీ గత పదేళ్లుగా ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలల దుస్థితి. చారిత్రక నేపథ్యం కలిగిన విద్యాలయాల్లో దుర్భర పరిస్థితులు నెలకొనడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఎంతోమంది ప్రముఖులు ఈ కళాశాలల్లో చదువుకున్నవారే. గత పాలకుల నిర్లక్ష్యంతోపాటు పుష్కర కాలంగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న వ్యాపార దృక్పథమే ఈ దుస్థితికి ప్రధాన కారణాలు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వమైనా ఈ కాలేజీలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేవిధంగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఆలియా.. మహబూబియా.. నిజాం నవాబుల కుటుంబ సభ్యుల విద్యాభ్యాసం కోసం 1910లో ఈ భవనాలను నిర్మించారు. ఆలియా స్కూల్లో అబ్బాయిలకు, మహబూబియా స్కూల్లో అమ్మాయిలకు చదువు చెప్పేవారు. ఆప్పట్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన సాగేది. నిజాంల పాలన అనంతరం అన్నివర్గాల వారికి ఈ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం కలిగింది. 1974-75నుంచి పాఠశాల నుంచి జూనియర్ కళాశాలలను ప్రభుత్వం వేరు చేసింది. 2000 సంవత్సరం వరకు ఒక్కో కళాశాలలో విద్యార్థుల సంఖ్య వెయ్యికి పైమాటే. ఫస్టియర్ ఇంటర్లో అడ్మిషన్ కోసం ఒక్కో కళాశాల్లో 580సీట్లకు గాను ఐదారువేలకు పైగా దరఖాస్తులు వచ్చేవి. పోలీసు బందోబస్తు నడుమ నెలరోజులపాటు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగేది. ప్రస్తుతం ఆలియా జూనియర్ కళాశాల్లో ఫస్టియర్ అడ్మిషన్లు 141కి పడిపోగా, మహబూబియా కళాశాలల్లో కేవలం 101 మందే చేరారు. ఆలియాలో 35 మంది అధ్యాపకుల్లో రెగ్యులర్ అధ్యాపకులు ముగ్గురే. మహబూబియాలో 40 పోస్టులకుగాను పనిచేస్తున్నది నలుగురే. ఇక నాన్‌టీచింగ్ సిబ్బంది సంగతి సరేసరి. సిటీ కాలేజీలోనూ ఇదే పరిస్థితి.. 1929 లో సిటీ కాలేజీ నిజాం హయాంలో ఏర్పాటైంది. మదర్సా ఫౌకానియా(8-12వరకు) పేరిట బాలురకు హయ్యర్ సెకండరీ విద్యను అందించేవారు. 1963 తర్వాత కళాశాలను అప్‌గ్రేడ్ చేస్తూ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఉదయం డిగ్రీ, మధ్యాహ్నం నుంచి జూనియర్ కళాశాలలు షిఫ్టు పద్ధతిన నడుస్తున్నాయి. 1975 నుంచి ఇంటర్ విద్య వేరైంది. జూనియర్ కళాశాల కోసం నిర్మించిన భవనంలో డిగ్రీ కళాశాల నడిపిస్తున్న అధికారులు తగిన వసతులను కల్పించడంలేదు. ఫలితంగా ఇంటర్ కోర్సులకు డిమాండ్ తగ్గిపోయింది. సుమారు 600 మందికి అవకాశం ఉన్నా.. ఈ ఏడాది ఫస్టియర్ అడ్మిషన్ల సంఖ్య 300 లోపే ఉండడం గమనార్హం. ఆ కళాశాలల దుస్థితికి కారణాలు.. * 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన ఈ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణ నీయంగా పడిపోవడానికి కార్పొరేట్ సంస్థల ప్రవేశమే ప్రధాన కారణం. * టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాసిన వెంటనే కార్పొరేట్ జూనియర్ కళాశాలలు వెంటబడి మార్చిలోనే అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం నిబంధనల ప్రకారం జూన్ మొదటి వారంలోనే అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. * పుష్కర కాలంగా రెగ్యులర్ అధ్యాపకుల నియామకం లేదు. ఇటీవల రిక్రూట్ మెంట్ జరిపినా కాలేజీకి ఒకరిద్దరు అధ్యాపకులు మాత్రమే వచ్చారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కాంట్రాక్టు అధ్యాపకులతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. * పభుత్వపరంగా నియామకాల్లేకపోవడం ప్రైవేటు సంస్థలకు కలిసొచ్చింది. వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామంటూ విద్యార్థులకు గాలం వేశాయి. * చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో జవాబుదారీతనం కొరవడింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌విద్య అగమ్యగోచరంగా తయారైంది. * మహబూబియా, ఆలియా, సిటీ క ళాశాలల్లో చదువుకునేందుకు నగరంతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. అవి ఆగిపోవడంతో విద్యార్థులు రావడం లేదు. * శిథిలావస్థకు చేరిన కళాశాల భవనాలకు మరమ్మతులు చేసేందుకు ఇంటర్ బోర్డు ముందుకు వచ్చినా.. చారిత్రక, వారసత్వ కట్టడాలంటూ పురావస్తు శాఖ ససేమిరా అంటోంది. రిపేర్లు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరిన తరగతి గదులు నిరుపయోగంగా ఉన్నాయి. * తెలుగు మాధ్యమంలో విద్యార్థులు చేరడంలేదు. ఆంగ్లమాధ్యమంలో అడ్మిషన్లు అరకొరగా ఉన్నాయి. -
సమస్యల సుడిగుండంలో ఇంటర్ విద్య
మంచిర్యాల సిటీ : జిల్లాలో ఇంటర్ విద్య సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేయడానికి 1990 సంవత్సరానికి ముందు ప్రభుత్వం 46 కళాశాలలు మంజూరు చేసింది. మొదటి విడతగా మంజూరైన 15 కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచి 2009 వరకు దశలవారీగా 30 కళాశాలలు మంజూరయ్యాయి. వీటిలోని 13 కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే తరగతులు నిర్వహించడం గమనార్హం. 14 ఏళ్లుగా అరకొర సౌకర్యాలతో 30 కళాశాలలు నెట్టుకొస్తున్నాయి. వీటిలో 15 కళాశాలలకు నిధులు మంజూరై పనులు పునాదులకే పరిమితమయ్యాయి. కొన్ని కళాశాలల్లో వసతులు లేకపోవడం, పోస్టులు భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులే బోధించడం, పక్కా భవనాలు లేకపోవడంతో విద్యార్థులు చేరడం లేదు. జిల్లాలోని రె బ్బెన, కౌటాల కళాశాలల్లోనే 300కు పైగా అడ్మిషన్లు అవుతున్నాయి. మిగతా కళాశాలలు 100 నుంచి 150అడ్మిషన్లకు పరిమితమవుతున్నాయి. ఒక్కో కళాశాలకు ఖర్చు ఏడాదికి రూ.2.50 కోట్లు ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఏడాదికి వే తనాలు, ఇతరత్రా అవసరాలకు కలిపి రూ.2.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జిల్లాలోని 46 కళాశాలలకు ఏడాదికి రూ.115 కోట్ల ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో ఒక ఇంటర్ మీడియట్ విద్యార్థికి ఏడాదికి సగటున రూ.33 వేలు ఖర్చు చేస్తున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంత ఖర్చు చేసినా ఇంటర్ విద్య సుడిగుండంలో చిక్కుకొని ఉండటం శోచనీయం. పక్కా భవనాలు.. ఆదిలాబాద్(బాలురు), ఆదిలాబాద్(బాలిక లు), ముథోల్, ఉట్నూర్, మంచిర్యాల, భైంసా, నిర్మల్(బాలురు), నిర్మల్(బాలికలు), కాగ జ్నగర్, చెన్నూర్, బెల్లంపల్లి(బాలురు), బోథ్, ఖానాపూర్, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. భవనాలు లేనివి.. కుభీర్, సారంగాపూర్, దిలావార్పూర్, సిర్పూర్(టి), లోకేశ్వరం, కాసిపేట, బెల్లంపల్లి(బాలిక లు), జన్నారం, దండేపల్లి, తలమడుగు, రెబ్బె న, దహెగాం, ఇచ్చోడ కళాశాలలకు భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. కౌటాల కళాశాల అటవీ శాఖ భవనంలో కొనసాగుతోంది. తానూర్ మం డలానికి ఈ విద్యాసంవత్సరం మంజూరైంది. తరగతులు ఎక్కడ నిర్వహించాలో అధికారలకే తెలియాలి. పాక్షికంగా ఉన్నవి.. కెరమెరి, మందమర్రి, బెజ్జూరు, తిర్యాణి, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, మామడ, తాంసి, బేల, నూర్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, వాంకిడి, జైపూర్ కళాశాలలకు భవనాలు పాక్షికంగా తయారు కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కడెం కళాశాల భవనం కూడా పాక్షికంగా తయారైంది. ఈ కళాశాలో మూడు గదులే పూర్తి కావడంతో ప్రథమ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. ద్వితీయ సంవత్సరం తరగతులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణాలు ఆలస్యం భవన నిర్మాణాలకు అధికారుల సహకారం, కాం ట్రాక్టర్లు మందుకు రాకపోవడం, నిధుల మం జూరులో ఆలస్యం, వచ్చిన నిధులకు వెంటనే ప నులు ప్రారంభించక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఆసిఫాబాద్, రె బ్బెన, మామడ, కౌటాల మండలాల కళాశాలల కు రూ.65లక్షలు మంజూరైనప్పటికీ పనులు ప్రా రంభం కాలేదు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఒ ప్పందం పక్కాగా లేకపోవడంతో పనులు ఆల స్యం అవుతున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సిర్పూర్(టి) కళాశాలకు ఏడాదిన్నరకు అధికారులు స్థలం మంజూరు చేశారంటే ఇంటర్ విద్యపై జిల్లా ఉన్నతాధికారులకు ఉన్న పట్టింపుకు తార్కాణం. సిబ్బంది లేక ఇబ్బంది ప్రతి ప్రభుత్వ కళాశాలకు సరిపడేంత అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బందిలో ముగ్గురు అ టెండర్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఒక జూని యర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు అవసరం. జిల్లాలోని చాలా కళాశాలలకు బోధనేతర సిబ్బంది లేరు. 80 శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం మంజూరైన తానూర్ కళాశాలకు కనీసం ప్రిన్సిపాల్ పోస్టును కూడా అధికారులు మంజూరు చేయలేదంటే అధికారుల చిత్తశుద్ధి ఇంటర్ విద్యపై ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యార్థులు.. బోధన రుసుం.. ప్రతి ప్రభుత్వ కళాశాలలో హెచ్ఈసీ, సీఈసీ, ఎంపీసీ, బైపీసీ నాలుగు గ్రూపులు ఉన్నాయి. ప్ర తి గ్రూపునకు 55 సీట్ల చొప్పున 45 కళాశాలల్లో నాలుగు గ్రూపులకు కలిపి ఒక సంవత్సరం కో ర్సుకు 9,900సీట్లు ఉంటాయి. వీటిలో ప్రథమ సంవత్సరంలో ఆర్ట్స్గ్రూప్లో 3,000, సైన్స్గ్రూ ప్లో 1,500మంది విద్యార్థులు చేరుతున్నారు. ప్రథమ సంవత్సరంలో అనుత్తీర్ణులు కావడంతో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య 3,500 చేరుకుంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం లో 7వేల మంది విద్యార్థులకు సగటున రూ. 400చొప్పున రూ.32లక్షలు చెల్లించడం విశేషం. ప్రైవేటు విద్యార్థులు.. బోధన రుసుము.. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 40 వేల మంది చదువుతున్నారు. ఆర్ట్స్‌లో 24 వేలు, సైన్స్‌లో 16 వేల మంది వి ద్యార్థులు ఉన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు రూ. 1,600, సైన్స్ విద్యార్థులకు రూ.1,980 చొప్పున ఒక్కొక్కరికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్ట్స్ విద్యార్థులకు రూ.3.84 కోట్లు, సైన్స్ విద్యార్థులకు రూ.3.16 కోట్లు చెల్లిస్తోంది. జిల్లాలో ప్రైవేటు విద్యార్థులకు ఏడాదికి రూ.7 కోట్లు ప్రభుత్వం చెల్లించడం విశేషం. కొసమెరుపు.. జిల్లాకు ఒక ఆర్ఐవో ఉంటారు. ఆర్ఐవో కేవ లం పరీక్షల నిర్వహణ, ప్రైవేటు కళాశాలల పర్యవేక్షణ, అనుమతి వరకే పనిచేస్తారు. ప్రభుత్వ కళాశాలల పర్యవేక్షణ చేయాల్సింది డీవీఈవో. ఇతను కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రభు త్వ కళాశాలలను పర్యవేక్షణ చేయాలి. డీవీఈవో కు ఇటీవలనే తెలంగాణ ఆర్జేడీగా అదనపు బా ద్యతలు అప్పగించారు. తెలంగాణలోని 385 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రెండు జిల్లాల అధికారిగా తన పనితీరులో న్యాయం చేయని అధికారి తెలంగాణలోని 385కళాశాలలకు ఏమేరకు తన పనితీరును చూపిస్తారో రాష్ట్ర ఉన్నతాధికారులకే తెలియాలి. -
స్పీకర్‌నైనా.. మీ మిత్రుడినే
►స్పీకర్‌గా నా మొదటి జీతం కళాశాలకు ఇస్తా ►పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో శాసనసభాపతి ► సిరికొండ మధుసూదనాచారి పరకాల : తాను స్పీకర్‌నైనా మీ మిత్రుడినేనంటూ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పట్టణంలోని ఎంఎన్‌రావు గార్డెన్లో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆహ్వాన కమిటీ కన్వీనర్ ఎర్ర సంపత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జన్మనిచ్చిన గడ్డకు, ఈ గాలికి, తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, రాజకీయంగా జన్మనిచ్చిన ఎన్టీ రామారావుకు వందనాలు తెలుపుతున్నానన్నారు. 14ఏళ్లుగా తన సహచరుడిగా భావించి కన్నీళ్లను, కష్టాలను పంచుకుని అత్యున్నత పదవి అప్పగించిన కేసీఆర్‌కు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సమైక్యవాద విధానాల వల్లే.. సమైక్యవాద పాలకుల విధానాలతోనే తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని స్పీకర్ అన్నారు. 800 ఏళ్ల క్రితమే కాకతీయులు, రెడ్డి రాజులు ఇక్కడ రామప్ప, లక్నవరం, ఎల్గూరు రంగంపేట, ధర్మసాగర్ వంటి ప్రాజెక్టులు నిర్మించారన్నారు. సమైక్య పాలకులు ఆర్డీస్ ప్రాజెక్టు నీటిని తరలించుకుపోయి పాల మూరు ప్రజలను కూలీలుగా మార్చారని విమర్శించారు. కసి, పట్టుదలతో వచ్చిన ఉద్యమమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందన్నారు. ఒకానొక సందర్భంలో ఉద్యమ పార్టీని మింగేసే కుట్ర జరిగినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి ముందే ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులపై పూర్తి స్థాయిలో విశ్లేషించడం వల్లే ఇంతటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రపంచ విత్తన కర్మాగారంగా వర్థిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి జీతం కళాశాలకే.. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి నాటి గుర్తులను జ్ఞాపకం చేయడం గొప్ప విషయమని స్పీకర్ సిరికొండ కొనియాడారు. విద్యాశాఖమంత్రితో మాట్లాడి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్పీకర్‌గా తన మొదటి జీతం రాగానే కళాశాల అభివృద్ధికి అందిస్తానని ప్రకటించారు. అనంతరం కళాశాల పూర్వవిద్యార్థులు చారిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు తమకు చదువునేర్పిన గురువులు దగ్గు మనోహర్‌రావు, మొగిలయ్య, బండి కొమురయ్యలను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, డాక్టర్ సంతోష్‌కుమార్, అప్పాల సుధాకర్, కాళీప్రసాద్, ఎర్ర నాగేం దర్, లక్ష్మీనారాయణ, వల్లంపట్ల నాగేశ్వర్రావు, కృష్ణమాచార్య, కృష్ణమూర్తి, ఎంపీపీ సులోచన, రాజమహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. తరగతి గదుల్లో కలియ తిరుగుతూ.. నాకింకా గుర్తుంది. ఇదే గదిలో మా ప్రిన్సిపాల్ అనుముల కృష్ణమూర్తి సార్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డా.. అంటూ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా శనివారం తాను చదువుకున్న కళాశాలను స్పీకర్ సందర్శించారు. వందలాదిమంది విద్యార్థులు, పూర్వవిద్యార్థులు పూలవర్షం కురిపిస్తుండగా కళాశాలలోకి అడుగుపెట్టారు. విద్యాలయ పాఠశాల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం కళాశాల గదులను పరిశీలించారు. తాను చదువుకున్న తరగతి గదిలోకి వె ళ్తూ ఇదే మా తరగతి గది అంటూ అందరికీ చూపించారు. గదిలోకి వెళ్లి బ్లాక్‌బోర్డుపై ‘మెన్ మే కం అండ్ మెన్ మే గో, బట్ ఐ కెనాట్ గో ఫర్ ఎవర్’.. ఇక్కడకు ఎందరో వచ్చి పోతుంటారు.. కానీ నేనెక్కడికీ వెళ్లను.. అని రాశారు. తర్వాత అన్ని గదులను పరిశీలిస్తూ.. స్నేహితులకు వివరిస్తూ తిరిగారు. రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికీ నమస్కరించారు. -
ఇంటర్లో... జిల్లా విద్యార్థుల జయకేతనం
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇంటర్ ద్వితీయసంవత్సరం ఫలితాలలో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ విభాగంలో ప్రథమస్థానంతో సహా మొదటి ఐదుస్థానాల్లో ప్రతిభచాటారు. బైపీసీ విభాగంలో ఇద్దరు ప్రథమస్థానం, హెచ్ఈసీలో ఒకరు ప్రథమస్థానం సాధించి జిల్లా ఖ్యాతిని నలుదిశల చాటారు. కాగా, ఇంటర్ ఫలితాలలో జిల్లా 64శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా బాలికలే హవా కొనసాగించారు. బాలికలు 66శాతం, బాలురు 61శాతం ఉత్తీర్ణత పొందారు. గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 2 శాతం పెరిగింది. జిల్లా మొత్తం మీద 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 182 ప్రైవేట్ కళాశాలల నుంచి 24,208 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా 15,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 12,426 మందికి 8,237 మంది (66శాతం), బాలురు 11,782 మందికి 7,155 మంది (61శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత పదేళ్లుగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో బాలికలే ముందునిలవడం విశేషం. ఒకేషనల్‌కోర్సులకు సంబంధించి 60శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం 43శాతం ఉత్తీర్ణత ఉండగా ఇప్పుడు 13శాతం పెరిగింది. ఓకేషనల్‌లో మొత్తం 4,736మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 2850 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో బాలురు 49శాతం మంది ఉత్తీర్ణత సాధించగా... 69శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు ప్రతిభ చాటారు. వారం రోజుల్లో కళాశాలల ద్వారా విద్యార్థులు మార్కుల జాబితాలను పొందవచ్చునని ఆర్ఐవో ఆడ్రోస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల ఫలితాలు గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. గత సంవత్సరం 57.6 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ఈ సంవత్సరం 63.03 శాతం సాధించాయి. జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 3,873 మంది చదువుతుండగా 2,441 మంది ఉత్తీర్ణులయ్యారు. బూర్గంపాడు ప్రభుత్వజూనియర్ కళాశాల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభచాటారు. అదేవిధంగా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల 98.21శాతం, కూనవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల 95.56శాతం, వీఆర్‌పురం ప్రభుత్వ జూనియర్ కళాశాల 95శాతం, బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల 93.15 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 19 ప్రభుత్వ ఓకేషనల్ జూనియర్ కళాశాలల్లో 1098 మందికి 856 మంది (77.96శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
ఫలితాల్లో ‘ప్రభుత్వ’ జోరు
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా సగటు 53 శాతం ఉండగా.. ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత 62.64 శాతంగా నమోదైంది. గతేడాది ప్రభు త్వ కళాశాలల్లో 59.69 శాతమే ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో అత్యధికంగా మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 94 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ కళాశాలలో 164 మంది పరీక్షలు రాయగా 160 మంది పాసయ్యారు. అత్యల్పంగా నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర)లో 12 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. ఈ కళాశాలలో 238 మంది విద్యార్థులకుగాను 30 మందే పాసయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లోనూ బాలికలే జోరు కొనసాగించారు. జిల్లావ్యాప్తంగా 4,904 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా 3,072 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 2,269 మంది పరీక్షలు రాయ గా 1,266 మంది ఉత్తీర్ణులయ్యారు. 55.80 శాతంగా ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలికల్లో 2,635 మంది పరీక్షలు రాయగా 1,806 మంది పాసయ్యారు. 68.54 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ కళాశాల్లో 18 శాతం జిల్లాలో ఎయిడెడ్ కళాశాలలు మూడున్నాయి. 220 మంది పరీక్షలు రాయగా 39 మంది పాసయ్యారు. 18 శాతమే ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇందులో బాలురలో 137 మందికి 18 మంది విద్యార్థులు, బాలికల్లో 83 మందికిగాను 21 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 13.14 శాతం, బాలికల్లో 25.30 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. నగరంలోని సీఎస్ఐ జూనియర్ కళాశాలలో 99 మంది విద్యార్థులుండగా నలుగురు విద్యార్థులే పాసయ్యారు. ఆదర్శ హిందీ విద్యాలయంలో 64 మందికిగాను 20 మంది విద్యార్థులు, కామారెడ్డిలోని జీవీఎస్ జూనియర్ కళాశాలలో 57 మందికిగాను 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
బాలికల కాలేజీలో ఉన్మాది వీరంగం
ఎమ్మిగనూరురూరల్, న్యూస్‌లైన్ :స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం ఉదయం ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. అధ్యాపకులపై తిట్ల దండకం అందుకున్నాడు. అతన్ని చూసి విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు. నందవరానికి చెందిన శాంతమ్మ కుమారుడు నరసింహులు ఆటో తోలుతూ కుటుంబానికి ఆధారంగా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా ఇతనికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చూపించారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్న ఇతడు పది రోజులుగా వేసుకోకపోవడంతో పరిస్థితి తీవ్రమైంది. ఈ క్రమంలో వారం క్రితం ఆటోను ఆదోనికి తీసుకెళ్లిన ఇతడు అక్కడ యాక్సిడెంట్ చేశాడు. తర్వాత బండి మానుకుని ఎటుపడితే అటు తిరుగుతున్నాడు. సోమవారం బాలికల జూనియర్ కాలేజీలోకి ప్రవేశించాడు. తరగతి గదిలో లెక్చరర్‌పై తిట్లు మొదలెట్టాడు. ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులను కూడా నోటికి వచ్చినట్లు తిడుతుండడంతో అందరూ కలిసి గదిలో పెట్టి తాళం వేశారు. వారి సమాచారం మేరకు కానిస్టేబుల్ రఘు, హోంగార్డులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించాడు. అయితే స్థానికుల సహకారంతో పోలీసులు అతనికి దేహశుద్ధి చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రబాబునాయుడు తెలిపారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం..
కల్లూరు, న్యూస్‌లైన్: 35 సంవత్సరాల క్రితం కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్న వారంతా ఒక్క చోట కలుసుకున్న అరుదైన సంఘటనకు ఆదివారం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికైంది. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1977-79 సంవత్సరం చదువుకున్న వారంతా 35 సంవత్సరాల తర్వాత కుటుంబ సమేతంగా ఒక్కదగ్గర కలిసి గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ సరదాగా గడిపారు. ఐఏఎస్ కేడర్ నుంచి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నతస్థాయిలో ఉన్న ప్రముఖులు వారి హోదాలను మరచిపోయి ఆనందంగా గడిపారు. వీరందరిని ఒక దగ్గరకు చేర్చేందుకు కల్లూరు పట్టణానికి చెందిన దోసపాటి భాస్కర్‌రావు, ఎస్కే ఇస్మాయిల్, కే. వెంకటాచార్యులు, వలసాల పురుషోత్తమ్, గుర్నాధరావు, సుగుణాకర్‌రావులు రెండు నెలలకు పైగా శ్రమించారు. అందరి ఫోన్ నంబర్లు సేకరించి సమ్మేళనం ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది వరకు ఇక్కడికి హాజరయ్యారు. అనంతరం అప్పట్లో విద్యాబోధన చేసి గురువులు భాస్కర్‌రావు, శేషగిరిరావు, జగదీష్, చంద్ర నియోగి, ఎల్‌వీఎస్‌జీ ప్రసాదరావు, మోహన్‌రావు, వి సుబ్బారావు, రామచంద్రరావు, రఘుపతిరెడ్డి,వెంకటేశ్వర్లు, కృష్ణారావులను వీరంతా కలిసి ఘనంగా సన్మానించారు. అంకిత భావంతో బోధించేవారు అప్పట్లో గురువులు మాకు ఎంతో అంకితభావంతో బోధించేవారు. వారి మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో ఈ స్థాయికి చేరుకున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పటి స్నేహితులను, గురువులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. - ఎమ్వీ రావ్, ఐఏఎస్, ఎన్ఎఫ్డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎన్ఐఆర్డీ డెరైక్టర్ జనరల్ జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం.. అప్పటి స్నేహితులను వారి కుటుంబ సభ్యులతో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కలిసిన మేము అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. స్నేహ బంధాన్ని మించినది మరొకటి ఉండదు. - ఎస్కే జానిమియా, క్రీసెంట్ డ్రగ్స్ అధినేత శ్రమించి వివరాలు సేకరించాం; స్నేహితులందరిని ఒక దగ్గర చేర్చడానికి రెండు నెలలు శ్రమించి వివరాలు సేకరించాం. అందరికి కలిసిన తర్వాత ఆ శ్రమంతా మర్చిపోయాం. ఎప్పటికీ ఈ సంతోషాన్ని మరచిపోలేం. ఇలాంటి కలయికలు తరచూ నిర్వహిస్తే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. - దోసపాటి భాస్కర్‌రావు, బిజినెస్ మ్యాన్, కల్లూరు -
జూనియర్ కళాశాలల్లో అటకెక్కిన ప్రయోగాలు
సాక్షి, అనంతపురం : గుడిబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో 63 మంది, సెకండియర్‌లో 44 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలలో ప్రయోగశాల (ల్యాబ్) లేదు. దీంతో సెకండియర్ విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. రామగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ బైపీసీ ఫస్టియర్‌లో 15 మంది, సెకండియర్‌లో 16, ఎంపీసీ ఫస్టియర్‌లో 15, సెకండియర్‌లో 19 మంది చదువుతున్నారు. వీరు ప్రయోగాల కోసం ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రెండు కళాశాలల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే ఉండడంతో సైన్స్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే సీబీఎస్ఈ తరహాలో ఇంటర్లో ప్రవేశపెట్టిన కొత్త సిలబస్‌తో సైన్స్ విద్యార్థులు భయపడుతున్నారు. దీనికితోడు కొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు కరువవడం, ఉన్నచోట కూడా అరకొర పరికరాలు, రసాయనాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రయోగశాలల అభివృద్ధి, నిర్వహణకు రెండేళ్లుగా నిధులు విడుదల కాలేదు. మారిన సిలబస్‌కు అనుగుణంగా నూతన పరికరాలు లేకపోవడంతో అధ్యాపకులు సైతం చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (రెండు వొకేషనల్ కళాశాలలతో కలుపుకుని) ఉన్నాయి. వీటిలో ఫస్టియర్ విద్యార్థులు (అన్ని గ్రూపులు కలుపుకుని) 10,333, సెకండియర్ 11,124 మంది ఉన్నారు. ఫస్టియర్, సెకండియర్ కలుపుకుని సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) గ్రూపుల విద్యార్థులు 4,876 మంది చదువుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. రెండున్నర నెలలు మాత్రమే గడువు ఉండడంతో ఇప్పుడు అన్ని కళాశాలల్లోనూ విద్యార్థులతో ప్రయోగాలు చేయించాల్సి ఉంది. గుత్తి, ముదిగుబ్బ, రొద్దం, రామగిరి, గుడిబండ కళాశాలల్లో అసలు ప్రయోగశాలలే లేవు. మిగిలిన చోట్ల ఉన్నా.. పరికరాలు, రసాయనాల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 39 కళాశాలలకు గానూ (రెండు వొకేషనల్ మినహాయించి) 17 కళాశాలలకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు కమిషన్ నిధులు మంజూరు చేసింది. చిలమత్తూరు, గుంతకల్లు, కదిరి (బాలురు), హిందూపురం (బాలికలు), కళ్యాణదుర్గం, కుందుర్పి, మడకశిర, పామిడి, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ (బాలురు) కళాశాలలకు రూ.2 లక్షల చొప్పున, తాడిమర్రిలో రూ.1.81 లక్షలు, అమరాపురం, కంబదూరు, కణేకల్లు, లేపాక్షి, ఉరవకొండ (బాలికలు) కళాశాలలకు రూ.1.25 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. అయితే.. ట్రెజరీలలో ఇంకా బిల్లులు పాస్ కాలేదు. దీనివల్ల పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఇబ్బందిగా మారింది. ఇక మిగిలిన కళాశాలలకు నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనిపించని నూతన పరికరాలు ‘నీట్’ పరీక్ష తెరపైకి రావడంతో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌ను సీబీఎస్ఈ స్థాయిలో మార్పు చేశారు. మారిన సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగశాలల్లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా రసాయనశాస్త్రం సిలబస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డిగ్రీ స్థాయిలోనూ లేని, అధ్యాపకులు సైతం నేర్చుకోవాల్సిన స్థాయిలో ప్రయోగాలు వచ్చి చేరాయి. దీంతో నూతన పరికరాల అవసరం ఏర్పడింది. క్రొమొటోగ్రఫీ, కొలాయిడల్ వంటి ద్రావణాల తయారీకి పదార్థాలు, సామగ్రిని కొత్తగా కొనాల్సి వుంది. విద్యార్థుల రెగ్యులర్ ప్రాక్టికల్స్ వల్ల రసాయనాలు అయిపోతుంటాయి. వీటిని ఏటా కొనాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్క రసాయశాస్త్ర ప్రయోగశాలకే రూ.20 వేలకు పైగా ఖర్చు వస్తుంది. బ్యారెట్లు, పిపెట్స్, పరీక్ష నాళికలు.. ఇలా గాజు వస్తువులు పగిలిపోతుంటాయి. వాటినీ కొనకతప్పదు. భౌతిక శాస్త్రం విషయానికొస్తే... సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగాలూ మారాయి. ట్రాన్సిస్టర్, స్ప్రింగ్ బలస్థిరాంకం.. ఇలా కొత్త పరికరాలను కొనాల్సి ఉంది. బాటనీ, జువాలజీ ల్యాబుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. నిధులు మంజూరైన కళాశాలలకు బిల్లులు పాస్ చేయడానికి ట్రెజరీల్లో కొర్రీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంజూరు కానీ వాటిలో విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తం వెచ్చించి పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసుకోవాలంటూ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి ఆదేశాలందాయి. అయితే ఆ నిధులు ఏమాత్రం సరిపోవు. మారిన సిలబస్‌కు అనుగుణంగా నూతన పరికరాలు, రసాయనాలు కొనాలంటే ఒక్కో కళాశాలకు రూ.50 -60 వేల వరకు అవసరం అవుతోంది. -
రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన
చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆది వారం మధ్యాహ్నం 1 గంటకు అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి 2.30 గంటలకు వి.కోటకు చేరుకుంటారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.50 గంటలకు హెలిప్యాడ్ చేరుకుంటారు. 5 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.30 గంటలకు కలికిరి చేరుకుంటారు. తర్వాత 5.40 గంటలకు పీలేరు ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 6.10 గంటలకు స్వగ్రామం నగిరిపల్లెకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా రాయచోటికి చేరుకుంటారు. అక్కడ రచ్చబండ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని భోజన విరామానంతరం 2.30 గంటలకు రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌కు బయలుదేరుతారు. -
సమైక్య రాష్ట్ర పరిరక్షణ ఉద్యమం నేటికి 50 రోజులు పూర్తి
సాక్షి, రాజమండ్రి : సమైక్య రాష్ట్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి బుధవారం నాటికి 50 రోజులు పూర్తవుతోంది. అయినా ఎక్కడా ఉద్యమ సెగ తగ్గలేదు. జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేశారు. రాజమండ్రిలో ఇంటర్ బోర్డు పరిధిలోని అధ్యాపకులు గూడ్సు గేటు సెంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. సమ్మెలోకి మంగళవారం ప్రభుత్వ ఎయిడెడ్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు చేరినట్టు ఆ వర్గాలు ప్రకటించాయి. యూటీఎఫ్ నగర శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మెయిన్‌రోడ్డులో ప్రదర్శన చేశారు. మోరంపూడిలో యూటీఎఫ్ దీక్షలను ఎంపీడీఓ ఎస్. సుభాషిణి ప్రారంభించారు. మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి నోట్లో పాల పీకలతో నిరసన తెలిపారు. కాకినాడలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరంలో కె.గంగవరం మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ప్రదర్శనలు చేశారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై విద్యార్థులకు టీచర్లు పాఠాలు చెప్పారు. మామిడికుదురులో 216 జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు రోడ్డుపై డప్పులు వాయించారు. ఏలేశ్వరంలో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. రాష్ట్రాన్ని విభజించ వద్దంటూ రాసిన కార్డులను సోనియాగాంధీకి పోస్టు చేశారు. ముందుగా బాలాజీ చౌక్ వద్ద కార్డులు ప్రదర్శిస్తూ రాస్తారోకో చేశారు. మండపేట కలువపువ్వు సెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. రావులపాలెంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులతో ర్యాలీ చేసి కళా వెంకటరావు సెంటర్లో బస్సుల హారం నిర్వహించారు. విద్యార్థుల సమైక్య రాగం విద్యార్థులు ఉద్యమానికి కొత్త రూపు తెస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇన్నీసుపేటలో మానవహారంగా ఏర్పడ్డారు. కాకినాడ అచ్చంపేట సెంటర్లో ఏయూ క్యాంపస్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. సర్పవరం పోలీస్‌స్టేషన్ ఎదురుగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భారతమాత వేషాలు వేసి రాష్ట్రం విడిపోకూడదనే సందేశాలు ఇస్తూ నృత్య ప్రదర్శనలు చేశారు. కాకినాడ - యానాం రోడ్డులో తూరంగి వద్ద ఎంఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కోనసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కోనసీమలో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. రామచంద్రపురంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల బంద్ రాజమండ్రిలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు బంద్ పాటించాయి. డాక్టర్లు, సిబ్బంది మెయిన్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు బంద్ చేసి, డాక్టర్లు, సిబ్బంది ప్రదర్శన చేశారు. అమలాపురంలో కూడా నర్సింగ్ హోంలు మూసివేశారు. కొత్తపేట పాత బస్టాండు సెంటర్లో ప్రైవేట్ వైద్యులు రోడ్డుపై సేవలు అందించారు. ఏలేశ్వరంలో వైద్య సిబ్బంది భారతదేశ పటం ఆకారంలో నిలబడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో సమైక్య సెగలు కాకినాడ మెయిన్‌రోడ్డులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. మహిళలు కూడా నిరసన గళం వినిపించారు. 300 అడుగుల జాతీయజెండాను ప్రదర్శించారు. ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద పిఠాపురం, రాజమండ్రి, అమలాపురం ప్రాజెక్టుల పరిధిలోని సిబ్బంది దీక్షలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్లు నగరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జేఏసీ దీక్షల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు మెడలో ఆంధ్రప్రదేశ్ పటాలు వేసుకుని నిరసన తెలిపారు. జోర్గాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ వద్ద గిటార్లు వాయిస్తూ ప్రదర్శన చేపట్టారు. రమణయ్యపేటలో వాణిజ్య పన్నుల కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్లు తుడిచి, రాస్తారోకో నిర్వహించారు. కోనసీమలో.. అమలాపురంలో ఆర్టీసీ కార్మికులు, వైద్యులు ర్యాలీ నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్లో కొనసాగుతున్న 46వ రోజు రిలే దీక్షల్లో తెలగ, బలిజ కాపు కులాల సంఘం డివిజన్ అధ్యక్షుడు కలువకొలను తాతాజీ ఆధ్వర్యంలో 220 మంది రిలే దీక్షలు చేపట్టారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి హైస్కూల్ గ్రౌండ్లో మండలంలోని ప్రభుత్వ శాఖల జేఏసీ అధికారులు సభ నిర్వహించారు. ఉద్యమం ఉద్ధృతికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఓడలరేవు ఓఎన్జీసీ ప్లాంటు వద్ద వాహనాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తాగునీటి ట్యాంకర్లను మాత్రమే అనుమతించారు. ముమ్మిడివరంలో రైతులు రాస్తారోకో చేశారు. ముమ్మిడివరం నుంచి మురమళ్ల వరకూ ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వరరావు ఉభయ గోదావరి జిల్లాల్లో చేపట్ట తలపెట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం రాజోలు చేరుకుంది. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై మానవహారంగా ఏర్పడ్డారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో రాష్ట్ర విభజనపై ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓటింగ్ నిర్వహించారు. సమైక్య సింహగర్జన జగ్గంపేటలో మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో సుమారు అయిదు వేల మందితో సమైక్య సింహగర్జన నిర్వహించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ చేశారు. 500 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు. ద్రాక్షారామలో జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో పాస్టర్స్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. సమైక్య గణపతి ప్రసాదం పంపిణీ రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద ఏర్పాటు చేసిన సమైక్య గణపతి నవరాత్రి ఉత్సవాల వద్ద ఉంచిన 7200 కిలోల లడ్డూను భక్తులకు సమైక్యాంధ్ర నినాదాలతో పంపిణీ చేశారు. ఏపీఎన్జీవోలు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. ఎన్జీవో హోం నుంచి పుష్కరాల రేవు, మెయిన్‌రోడ్డు మీదుగా ర్యాలీ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద వంటావార్పు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 49వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కడియంలో ఏపీఎన్జీవోలు మోటారు బైక్ ర్యాలీ చేసి వేమగిరి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మంత్రుల సోనియా భజన పెద్దాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య వాదులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రుల మాస్క్‌లు ధరించి తహసీల్దారు కార్యాలయం వద్ద రోడ్ షో నిర్వహించారు. వాయిద్య పరికరాలతో భజన చేసి మంత్రులు సోనియా భజన చేస్తున్నారంటూ విమర్శించారు. సామర్లకోటలో ఫొటో స్టూడియోల నిర్వాహకులు బైక్ ర్యాలీ చేసి జేఏసీ శిబిరంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద, గొల్ల అప్పారావు సెంటర్లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో రోడ్డుపై ఇస్త్రీ చేస్తూ నిరసన తెలిపారు. -
ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తా
సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతంగా పని చేసి స్వచ్ఛమైన పాలన అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఆయన ఆదివారం సింధనూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. గతంలో పాలన సాగించిన పార్టీల దుష్పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు తమను ఆశీర్వదించారన్నారు. అందువల్ల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఇప్పటికే 60 శాతం నిధులను హైదరాబాద్-కర్ణాటక ప్రాంత అభివృద్ధికి కేటాయించామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక రూపాయికే కిలో బియ్యం అందించే అన్నభాగ్య పథకాన్ని ప్రకటించానన్నారు. వెనుకబడిన, మైనార్టీ వర్గాల రుణాల మాఫీ చేశామన్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమన్నారు. అన్నభాగ్య పథకం జారీపై ఎన్నో రకాల ఆటంకాలు ఎదురైనా పథకం అమలుకే కట్టుబడ్డామన్నారు. తక్కువ ధరకు బియ్యం పంపిణీ చేసినంత మాత్రాన ఎవరూ సోమరులు కారన్నారు. పిడికెడు అన్నానికి కూడా నోచుకోలేని అభాగ్యులు ఎందరో ఉన్నారన్నారు. అలాంటి వారి కడుపు నింపేందుకు ఈ పథకం ఎంతో సహాయకారి కానుందన్నారు. పాడి రైతులకు సహాయధనం, విద్యార్థులకు అపౌష్టికత నివారణకు క్షీరభాగ్య పథకం అమలు చేశామన్నారు. రైతుల శ్రేయస్సు కోసం రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందించే పథకం జారీ చేశామన్నారు. ఈ పథకం వల్ల తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించలేని దుస్థితి ఎదుర్కొంటున్న రైతుల జీవితాలు బాగుపడతాయన్నారు. మహిళలకు పలు రకాల సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాకి ఓటర్లు స్వస్తి పలికారన్నారు. ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సామాజిక న్యాయం లభించని, అణచివేతకు గురైన వర్గాల రక్షణకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. హైదరాబాద్-కర్ణాటక వాసుల చిరకాల వాంఛ కూడా నెరవేరిందని, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఇది తోడ్పడనుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప, శివరాజ్ తంగడిగి, ఎంపీ శివరామగౌడ, ఎమ్మెల్యేలు హంపనగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్, వెంకటేష్ నాయక్, హంపయ్య నాయక్, రాఘవేంద్ర హిట్నాళ, బీఎం నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ బయ్యాపుర, జెడ్పీ అధ్యక్షురాలు లలితమ్మ, ఉపాధ్యక్షుడు శరణప్ప, డీసీసీ అధ్యక్షుడు ఎ.వసంతకుమార్, బసవరాజ్ ఇటగి తదితరులు పాల్గొన్నారు.