
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ కాలేజీలో ఓ చిన్నారితో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిని శుభ్రం చేయించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కాలేజీ గదిని శుభ్రం చేస్తున్న చిన్నారి దృశ్యాలు తన హృదయాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ తండ్రి తన పనిని కూతురి చేత చేయించడం కూడా చట్టరిత్యా నేరమే అవుతుందన్నారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్స్ ప్రేక్షక పాత్ర వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించారు. కళాశాల యాజమాన్యంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment