Atmakuru
-
అసలు ఈ కియా కారు కథేంటి..
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఓ ఖరీదైన కారు ఏడాదిగా మూలన పడి వాడకానికి పనికి రాకుండా పోతోంది. కారును సీజ్ చేసిన అధికారితో పాటు మరో ముగ్గురు కూడా బదిలీ అయి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. అయినా కారు కథ కంచికి చేరడం లేదు.దిక్కుమొక్కు లేక..ఏడాది కిందట ఆత్మకూరు మండలం నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జంబులమ్మ ఆలయం వద్ద తెలుపు రంగు కియా కారు మూడు రోజులుగా ఉండడంతో అనుమానం కలిగిన స్థానికులు అప్పటి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా కారుకు నంబర్ ప్లేట్ లేదు, విండో షీల్డ్స్ పగులగొట్టి ఉన్నాయి. ఛాసిస్ నంబరు ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. కారు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కాగా యజమాని కర్ణాటక వ్యక్తిగా తేలింది. పోలీసులు అతనికి ఫోన్ చేసి కారును తీసుకెళ్లమని చెప్పగా ఇంతవరకు రాలేదు.అసలు ఈ కియా కారు కథేంటి..ఏడాది కిందట జాతీయ రహదారి – 44లో కారులో వెళుతున్న వ్యక్తులను కొందరు దుండగులు అటకాయించి బలవంతంగా అదే కారులో తీసుకెళ్లిపోయారు. ఓ చోట వారిని దింపేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగులు తీసుకెళ్లిన కారు ఆత్మకూరు ప్రాతంలో దొరికింది. అప్పటినుంచి స్థానిక పోలీస్ స్టేషన్లోనే మగ్గుతోంది.కారు హైజాక్ వెనుక హవాలా ముఠా?పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కేసుపై ఎవరైనా అడిగితే.. డోన్‌లో కిడ్నాప్ కేసు నమోదై ఉన్నందున వారికి హ్యాండోవర్ చేయాల్సి ఉందని, అయితే వారు పట్టించుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. -
సెగలు.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. -
ఆత్మకూరులో గడప గడపకు మన ప్రభుత్వం
-
ఇదేంటి బాబూ.. నమ్మిన నేతలకే కూల్‌గా వెన్నుపోటు.. అసలేం జరుగుతోంది?
ఆత్మకూరు: తన పాత విద్యను చంద్రబాబు మరోసారి ఆత్మకూరు నియోజకవర్గ నేతలపై ప్రయోగిస్తున్నారు. నమ్మిన నేతలకే కూల్‌గా వెన్నుపోటు పొడుస్తున్నారు. పార్టీని అంటి పెట్టుకొని ఉన్న ఆ ముగ్గుర్నీ కాదని.. పార్టీ ఫిరాయించి వచ్చిన వ్యక్తికి పగ్గాలు అప్పగించబోతున్నారు. ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హాట్ టాపిక్ గా మారింది. ఆత్మకూరు టీడీపీలో ఏం జరుగుతుంది? నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీని నాయకత్వ సమస్య వెంటాడుతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బొల్లినేని కృష్ణయ్య, గుటూరు కన్నబాబు టీడీపీ పొలిటికల్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. బొల్లినేని కృష్ణయ్య గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో కొమ్మి లక్ష్మయ్య నాయుడు, గుటూరు కన్నబాబు స్థానికంగా టీడీపీలో పనిచేస్తున్నారు. అయితే టీడీపీకి క్షేత్రస్థాయిలో ప్రజాదరణ అసలు లేదనే విషయం అందరికీ అర్థమవుతోంది. విషయం గ్రహించిన మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీంతో టీడీపీ శ్రేణులు డైలమాలో పడ్డారు. ఇంచార్జీ లేకపోవడం.. నేతలు పార్టీ వీడుతుండటంతో వారి క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. పార్టీ కుప్పకూలిపోవడంతో ఆత్మకూరు నియోజకవర్గానికి నాలుగేళ్లుగా ఇంచార్జీనే నియమించలేకపోయారు. బొల్లినేని కృష్ణయ్య లేకపోయినా..కొమ్మి లక్ష్మయ్య, కన్నబాబు పార్టీ జెండాను మోస్తున్నప్పటికీ వారి నాయకత్వం మీద చంద్రబాబుకు గురి కుదరడంలేదట. పైగా వీళ్లిద్దరూ సొంత సామాజికవర్గమే కనుక ఎక్కడికీ పోయే అవకాశం లేదని.. వారిని అసలు పట్టించుకోవడంలేదని సమాచారం. చంద్రబాబు తీరుపై కమ్మ సామాజిక వర్గం నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందనే చర్చ ఆత్మకూరులో జరుగుతోంది. మరోవైపు లోకేష్ పాదయాత్రకు సంఘీబావ ర్యాలీలో వర్గ విభేదాలు బయటికొచ్చాయి. ఇదీ చదవండి:కోడెలకు అన్యాయం చేస్తున్నారు నియోజకవర్గంలో పార్టీని అంటి పెట్టుకుని ఉన్న కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కన్నబాబు, బొల్లినేని కృష్ణయ్యలను కాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనం రామనారాయణ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఆత్మకూరులో జరుగుతుంది. ఇప్పటికే అనంకి లైన్ క్లియర్ అయిందనే టాక్ నడుస్తోంది. ఆనం కూడా తన పాత పరిచయాలను కలుపుకునేందుకు నియోజకవర్గాన్ని చుట్టబెట్టేస్తున్నారు. శుభ కార్యాలకు వెళ్తూ అందరికీ టచ్‌లో ఉండమని ఆనం రామనారాయణరెడ్డి తన అనుచరులకు చెబుతున్నారట. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డికి ఇంచార్జీ పదవి, టిక్కెట్ ఇచ్చేందుకే చంద్రబాబు వేచి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే గుటూరు కన్నబాబు వర్గం పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆత్మకూరులో పాత తరం నేతలకు, ఆశావహులకు ఆనం రామనారాయణ భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి:ఏపీలో కులాల పోరు కాదు, వర్గ పోరాటమే! -
నమ్మిన నేతలకే వెన్నుపోటు..
-
ఆత్మకూరులో వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ
-
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌పై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య గొడవలు ప్రేరేపించేలా మాట్లాడారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
TDP Main Office Dispute: బకాయిలు ఎగ్గొట్టి.. పార్టీ భవనం కట్టి!
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఆత్మకూరు గ్రామ పరిధిలోని టీడీపీ ప్రధాన కార్యాలయ భవనంపై మరో వివాదం రేగింది. ఇప్పటికే దీన్ని వాగు పోరంబోకు స్థలంలో నిర్మించడంపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగా తాజాగా తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ భవనాన్ని నిర్మించిన తమకు రూ.కోట్ల బకాయిలను ఇంతవరకు చెల్లించలేదంటూ హైదరాబాద్‌కు చెందిన ప్రెకా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఈ పనులను అప్పగించిన ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్, టీడీపీ కార్యాలయం నుంచి స్పందన లేకపోవడంతో వివాద పరిష్కారానికి మధ్యవర్తిగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పాములపర్తి స్వరూప్రెడ్డిని నియమించింది. మధ్యవర్తి ఫీజును చట్ట ప్రకారం ఇరుపక్షాలు సమానంగా భరించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొల్లంపల్లి విజయసేన్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెకా సొల్యూషన్స్ దాఖలు చేసిన కేసు వివరాలు... రూ.8.21 కోట్ల బకాయిలపై వివాదం... టీడీపీ కార్యాలయ భవనాన్ని ప్రీకాస్ట్ పద్ధతిలో నిర్మించేందుకు విశాఖకు చెందిన ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన ప్రెకా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2018లో ఒప్పందం కుదిరింది. ప్రీకాస్ట్ సామగ్రితోపాటు ఇతర మెటీరియల్ సరఫరా కూడా ఆ ఒప్పందంలో భాగం. ప్రెకా సొల్యూషన్స్ మొత్తం రూ.21.01 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. 2019 డిసెంబర్లో రూ.8.21 కోట్లకు ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్‌కు ప్రీఫైనల్ బిల్లు సమర్పించింది. నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు టీడీపీ నియమించుకున్న జెనిసిస్ కన్సల్టెన్సీ సైతం దీన్ని ఆమోదించింది. అయితే తమకు ఇవ్వాల్సిన రూ.8.21 కోట్లను చెల్లించకపోవడంతో ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్‌కు ప్రెకా సొల్యూషన్స్ లేఖ రాసింది. బకాయిలు చెల్లించాలని కోరింది. టీడీపీతోనే తేల్చుకోవాలన్న ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ బకాయిలు చెల్లించేందుకు నిరాకరించిన ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఆ మొత్తాన్ని నేరుగా టీడీపీ నుంచే తీసుకోవాలని స్పష్టం చేసింది. 2019 చెల్లింపులన్నీ తమ ప్రమేయం లేకుండా నేరుగా పార్టీనే చేసినందున టీడీపీ నుంచే తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ బకాయిల గురించి టీడీపీ అగ్రనేత వద్ద ప్రస్తావించగా.. ఇందులో తమను జోక్యం చేసుకోవద్దని, నేరుగా చెల్లింపులు చేస్తామని చెప్పినట్లు ఎస్ఎస్ఆర్ పేర్కొంది. బకాయిల విషయంలో ప్రెకా–ఎస్ఆర్ఆర్ కంపెనీల మధ్య పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ప్రెకా 2020లో ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ నిబంధనల కింద ఎస్ఆర్ఆర్ కంపెనీకి డిమాండ్ నోటీసు పంపింది. బేషరతుగా తమకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని కోరింది.అయితే వాటితో తమకు సంబంధం లేదని, నేరుగా టీడీపీ కార్యాలయంతోనే తేల్చుకోవాలని ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తెగేసి చెప్పింది. దీంతో ఒప్పంద నిబంధనల ప్రకారం మధ్యవర్తిత్వానికి ప్రెకా సిద్ధమైంది. ఈ మేరకు ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్‌కు నోటీసు పంపింది. వివాద పరిష్కారానికి సహకరించడంతో పాటు మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్‌లో ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్, టీడీపీని పార్టీలుగా ఉండాలని కోరింది. మధ్యవర్తులుగా ఏపీ, తెలంగాణకు చెందిన ఎవరైనా నలుగురు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లు సూచించాలని, అందులో నుంచి ఒకరిని ఎంచుకుంటామని తెలిపింది. స్పందన లేకపోవడంతో... దీనికి స్పందించిన ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్.. మధ్యవర్తి నియామకంపై తెలుగుదేశం పార్టీతో చర్చించి చెబుతామని, ఇందుకు కొంత గడువునివ్వాలని ప్రెకా సొల్యూషన్స్‌ను కోరింది. గడువు పూర్తయినా ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రెకా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి మధ్యవర్తిత్వ దరఖాస్తు దాఖలు చేసింది. వివాద పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలని కోర్టును కోరింది. ఈ దరఖాస్తుపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్‌కు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తరువాత పలుమార్లు ఈ కేసు విచారణకు వచ్చినా ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో న్యాయమూర్తి మధ్యవర్తిత్వానికి ప్రెకా సొల్యూషన్స్ దాఖలు చేసిన దరఖాస్తును అనుమతించారు. ఇరు పక్షాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించి చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ స్వరూప్రెడ్డిని మధ్యవర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎస్పీ, ఆప్‌కు ఎదురుదెబ్బ! ఆజంఖాన్ అడ్డాలో వికసించిన కమలం..
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్ అడ్డాలో కమలం వికసించింది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ ఇచ్చింది. ఎస్పీ సిట్టింగ్ స్థానమైన రాంపూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యామ్ లోధి జయకేతనం ఎగురవేశారు. 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. రాంపూర్ లోక్‌సభ స్థానం ఇప్పటివరకు ఆజంఖాన్ కంచుకోటగా ఉంది. ఇక ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆజంగఢ్ లోక్‌సభ స్థానంలోనూ కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ 8,679 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆప్‌కు ఎదురుదెబ్బ పంజాబ్‌లో అధికార ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్‌సభ స్థానంలో శిరోమణి అకాలీదళ్ నేత సిమ్రన్ జీత్ మాన్ విజయం సాధించారు. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆప్ నేత దినేశ్ పాఠక్ 55 శాతానికి పైగా ఓట్లు దక్కించుకుని విజయఢంకా మోగించారు. కాగా.. రాజ్యసభ ఎంపీగా గెలుపొందిన రాఘవ్ చద్దా.. రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి. చదవండి👉పంజాబ్‌లో ఆప్‌కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు! నాలుగింటిలో మూడు బీజేపీవే ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. టౌన్ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన అగర్తలాలో కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్ గెలుపొందారు. ► ఝార్ఖండ్‌లోని మందార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ గెలుపొందారు. ► ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. చదవండి👉మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు మోదీ, యోగి కృతజ్ఞతలు తాజా ఫలితాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. బీజేపీకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆజంగఢ్, రాంపుర్ ఫలితాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. The by-poll wins in Azamgarh and Rampur are historic. It indicates wide-scale acceptance and support for the double engine Governments at the Centre and in UP. Grateful to the people for their support. I appreciate the efforts of our Party Karyakartas. @BJP4UP — Narendra Modi (@narendramodi) June 26, 2022 ఎస్పీకి కంచుకోటలైన రాంపూర్, ఆజంగఢ్‌లో కాషాయ జెండా రెపరెపలాడటంతో పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్
నెల్లూరు (బారకాసు): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చెప్పారు. అభ్యర్థి ఎవరనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. గురువారం నెల్లూరులో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేయబోతున్నాం తప్ప మరే పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమన్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు బీజేపీ అధినాయకులతో మాట్లాడామని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు సమాయత్తం కావాలి: సోము వీర్రాజు ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. గురువారం నెల్లూరులో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ చేస్తోన్న పరిపాలన, ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న సహాయ, సహకారాలను ప్రజలకు తెలియజేయాలని నేతలకు సూచించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణక్రాకకు చెందిన బిజవేముల రవీంధ్రనాథ్‌రెడ్డి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ తదితరులు పాల్గొన్నారు. -
మైనర్ వివాహాన్ని ఆపిన ‘దిశ’
ఆత్మకూరు: ఇష్టం లేకుండా చిన్న వయస్సులోనే వివాహ ప్రయత్నాలు చేస్తుండడంతో ఓ బాలిక దిశ యాప్‌కు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ వివాహ ప్రయత్నాన్ని 10 నిమిషాల్లోనే నిలిపేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శనివారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఎస్ఐ శివశంకర్‌రావు కథనం మేరకు.. ఆత్మకూరు మండలం అశ్వినీపురం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. వద్దని ఇంట్లో వారిని వేడుకున్నా ససేమిరా అంటూ దూరపు బంధువుతో వివాహం నిశ్చయించారు. దీంతో బాలిక తన స్నేహితుల ద్వారా దిశ యాప్‌ను ఆశ్రయించింది. మంగళగిరి కార్యాలయం నుంచి ఆత్మకూరు పోలీసులకు సమాచారం చేరింది. 10 నిమిషాల్లోనే పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బాలికను గుర్తించి వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు వివాహం చేయడం నేరమని, ఇలాంటివి మళ్లీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి చేత వివాహం చేయబోమని హామీ పత్రం రాయించుకున్నారు. సమయానికి దిశ యాప్ బ్రహ్మాస్త్రంలా పనిచేసిందని గ్రామస్తులు కొనియాడారు. ఇలాంటి యాప్‌ను ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆత్మకూరులో నిషేధాజ్ఞలు
ఆత్మకూరు/కర్నూలు కల్చరల్: కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తహసీల్దార్ ప్రకాశ్‌బాబు ప్రకటించారు. ఓ స్థలంలో చేపట్టిన నిర్మాణం విషయమై శనివారం రెండువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. చాలా దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నంద్యాల టర్నింగ్, కొత్తపేట, మెయిన్‌బజార్, కప్పలకుంట్ల, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కర్నూలు–గుంటూరు రహదారి వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ఎక్కడకు తరలించారో చెప్పడం లేదు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆత్మకూరులోనే మకాం వేసి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. హోంమంత్రి స్పందించరేం ఆత్మకూరు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఎందుకు స్పందించలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్‌లను ఖండించారు. నిషేధిత సంస్థ పీఎఫ్ఐ అమాయకులను పావులుగా ఉపయోగించుకుని దాడులకు తెగబడుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారని, ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదన్నారు. దాడిలో గాయపడ్డ ఆయనకు మెరుగైన వైద్యం అందించి, మీడియాకు చూపాలని డిమాండ్ చేశారు. బాధితులపై అక్రమ కేసులు పెడితే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. ఆత్మకూరు ఘటన వ్యూహాత్మకంగా కుట్ర కోణంలో జరిగిందన్నారు. పాశవిక దాడిపై ఉగ్రవాద కోణంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. -
30 ఏళ్లుగా మోసం.. రూ. 50 కోట్లతో రాత్రికి రాత్రే పరార్
మంగళగిరి: చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో సుమారు రూ. 50కోట్లతో ఓ వ్యాపారి రాత్రికి రాత్రే తన కుటుంబంతో సహా పరారయ్యాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు శివకృష్ణ, శ్రీనివాస్ ఆత్మకూరు పంచాయతీ కార్యాలయం పక్కన పెద్ద భవంతిలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించేవారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు మంగళగిరి, తాడేపల్లికి చెందిన పలువురు వెంకటేశ్వరరావు వద్ద చిట్టీలు వేయడం, వడ్డీలకు డబ్బులు ఇచ్చి తీసుకునేవారు. ఈ క్రమంలో 30 ఏళ్లుగా వందలాది మంది వెంకటేశ్వరరావును నమ్మి కోట్లాది రూపాయలు ఇచ్చారు. వడ్డీలు నెలనెలా చెల్లించేవారు. చిట్టీలు సైతం రూ.20వేల నుంచి రూ.10లక్షల వరకు నిర్వహించే వారు. అయితే కొంతకాలంగా వడ్డీ చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో తమ డబ్బులను వెంటనే చెల్లించాలని వెంకటేశ్వరరావు కుటుంబంపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వెంకటేశ్వరరావు కుటుంబం సెల్ఫోన్లు అన్నీ స్విచ్చాఫ్ చేసుకుని ఇంటికి తాళం వేసి ఉడాయించారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించి.. ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు సుమారు రూ. 50 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉన్నట్లు బాధితులు పేర్కొన్నారు. -
బతుకమ్మల పైనుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు?.. మండిపడ్డ వీహెచ్
సాక్షి, వరంగల్: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రంగు రంగు పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను కొలిచే ఈ పండగకు తెలంగాణ యావత్తూ పూలవనంలా మారిపోయింది. అలాంటి బతుకమ్మ పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మహిళలంతా బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆడుతుండగా వాటిపైనుంచి ఎమ్మెల్యే కారు పోనిచ్చారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మాట్లాడుతున్న ఏఐసీసీ మెంబర్ హన్మంతరావు మహిళలు బతుకమ్మ ఆడుతుండగా తన వాహనంతో తొక్కించి మహిళలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవమానపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్య తీసుకోవాలని ఏఐసీసీ మెంబర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుకుంటుండగా బతుకమ్మలపై నుంచి తన వాహనాన్ని తీసుకెళ్లిన ధర్మారెడ్డి.. మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. గతంలో ఎస్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. ఆత్మకూరు సర్పంచ్ రాజు బీసీ కావడం వల్లే ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడన్నారు. చదవండి: గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌పై టీఎస్ హైకోర్టు కీలక తీర్పు సలేం జరిగింది ఆత్మకూరు పోచమ్మ సెంటర్ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. అదే సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు చెప్పారు. దీంతో బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనిచ్చారని స్థానికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చదవండి: పెద్దమనసు చాటుకున్న కేటీఆర్ -
భర్త పైశాచికం.. భార్య ఉరేసుకుంటుండగా వీడియో చిత్రీకరణ
ఆత్మకూరు: కుటుంబ కలహాల కారణంగా భార్య ఉరి వేసుకుంటుండగా భర్త వీడియో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొంది.. ఆమె మృతికి కారణమైన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండమ్మను ఆత్మకూరు పట్టణం దళిత కాలనీకి చెందిన మొద్దు పెంచలయ్యకు ఇచ్చి వివాహం చేశారు. పెంచలయ్య ఓ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొండమ్మ ఆత్మకూరు పట్టణంలోని మెప్మాలో రిసోర్స్‌పర్సన్‌గా పనిచేస్తున్నది. వీరికి ఇద్దరు మగపిల్లలు. 10 సంవత్సరాల వయస్సున్న రెండో కుమారుడు తరుణ్ గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. కొండమ్మపై భర్త పెంచలయ్య అనుమానం పెంచుకుని నిత్యం వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వారిద్దరూ గొడవపడ్డారు. ఈ సందర్భంగా పెంచలయ్య ‘నువ్వు చస్తేనే సమస్యలు తీరుతాయి’ అని అన్నాడు. దీంతో కొండమ్మ విరక్తి చెంది ఉరేసుకునేందుకు సిద్ధమయ్యింది. ఫ్యాన్‌కు చీర తగిలించి ఉరేసుకుంటూ ఉండగా ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరిస్తూ ‘ఉరేసుకో.. నేను ఆపను’ అంటూ ఆ కసాయి భర్త పైశాచిక ఆనందం పొందాడు. ఉరి బాగా బిగుసుకుపోవడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో పెంచలయ్య అక్కడినుంచిపరారయ్యాడు. గమనించిన సమీపంలోని స్థానికులు చూసి కొండమ్మను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందింది. వీడియో వైరల్ కావడంతో మెప్మా సిబ్బంది, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. తల్లి మృతి చెందడంతో తండ్రి దగ్గర లేకపోవడంతో చిన్నారులైన ధనుష్, తరుణ్ ఆస్పత్రి వద్ద దిగాలుగా కూర్చుని ఉండడం పలువురికి కంటనీరు తెప్పించింది. నిందితుడి అరెస్టు.. భార్య కొండమ్మ ఆత్మహత్య చేసుకుంటుండగా వీడియో చిత్రీకరించి పైశాచికానందం పొందిన మొద్దు పెంచలయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం రాత్రి ఆత్మకూరు డీఎస్పీ వెల్లడించారు. గురువారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. -
‘సెక్షన్ 107, 145 కింద ఎఫ్‌ఐఆర్‌లా? ’
సాక్షి, అమరావతి: అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న ముందస్తు సమాచారం ఉన్నప్పుడు అనుమానిత వ్యక్తులు నిర్ణీత కాలానికి బాండ్ సమర్పించాలంటూ బైండోవర్ చేసే అధికారం సీఆర్పీసీ సెక్షన్ 107 కింద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్)కే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. బైండోవర్ కేసుల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్పీసీ 145 కింద భూమి, నీరు సంబంధిత వివాదాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న కారణంతో ఆయా వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తహసీల్దార్‌కు మాత్రమే సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఉందని పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్లు 107, 145 కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా క్షేత్రస్థాయిలో పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అన్నీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఈమేరకు తగిన మార్గదర్శకాలతో సూచనలు చేయాలని స్పష్టం చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గత వారం తీర్పు వెలువరించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీసులు తనపై సీఆర్పీసీ సెక్షన్ 107 కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ బండి పరశురాముడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఆ ఘటన హృదయాన్ని కలచివేసింది : డీజీపీ
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ కాలేజీలో ఓ చిన్నారితో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిని శుభ్రం చేయించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కాలేజీ గదిని శుభ్రం చేస్తున్న చిన్నారి దృశ్యాలు తన హృదయాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ తండ్రి తన పనిని కూతురి చేత చేయించడం కూడా చట్టరిత్యా నేరమే అవుతుందన్నారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్స్ ప్రేక్షక పాత్ర వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించారు. కళాశాల యాజమాన్యంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. -
బాలికపై లైంగికదాడి
ఆత్మకూరు(ఎం): బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. ఆత్మకూరు(ఎం)కు చెందిన దేవాసాని జంపన్న (20) కొంతకాలంగా ప్రేమపేరుతో అదే గ్రామానికి చెందిన ఓ బాలిక వెంటపడుతూ, మాయమాటలు చెప్పి చివరకు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో బాధితురాలి తల్లి ఈ నెల 27వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు దేవసాని జంపన్నను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం భువనగిరి కోర్టులో హాజరు పరచారు. అక్కడి నుంచి నల్లగొండ జైలుకు తరలించినట్లు రామన్నపేట సీఐ ఏవీ రంగా విలేకరులకు తెలిపారు. -
హాస్టల్లో 78 మంది పిల్లలు?.. అక్కడ ఒక్కరుంటే ఒట్టు
ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. జిల్లా వ్యాప్తంగా దాడులను ముమ్మరం చేశారు. ఈక్రమంలో బీసీ బాలుర హాస్టల్లో తనిఖీలు చేయగా విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి, ఆత్మకూరు(నెల్లూరు): చేజర్ల మండలంలోని మాముడూరు బీసీ బాలుర వసతిగృహంలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్ శాంతో ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారుల కథనం మేరకు.. ఉదయం 6:30 గంటలకే వారు గ్రామంలోని హాస్టల్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వార్డెన్ సురేష్‌బాబు అందుబాటులో లేరు. బుచ్చి మండలం అన్నారెడ్డిపాళెం హాస్టల్లో కూడా ఆయన డెప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడ విచారించారు. అయితే వార్డెన్ అక్కడ లేరని తెలుసుకున్నారు. కాగా హాస్టల్లో పరిశీలించగా ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేరు. అయితే హాజరుపట్టికలో మాత్రం 78 మంది ఉన్నట్లుగా నమోదై ఉంది. బియ్యం మాత్రమే ఉంది అధికారులు స్టోర్ రూమ్‌లో వస్తువులు పరిశీలించగా కేవలం బియ్యం మాత్రమే ఉంది. ఏసీబీ తనిఖీలు ప్రారంభమైన తర్వాత గ్రామస్తుల సమాచారం తెలుసుకున్న సుమారు 20 మంది విద్యార్థులు హాస్టల్‌కు చేరుకున్నారు. వారిని అధికారులు విచారించగా హాస్టల్లో నీరు, మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో ఇళ్లకు వెళుతున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు మరుగుదొడ్లు పరిశీలించారు. అవి దుర్భరంగా ఉండగా, తలుపులు సైతం లేవు. అనంతరం ఏఎస్డబ్ల్యూఓ బి.శ్రీదేవిని హాస్టల్‌కు పిలిపించి ఆమె ద్వారా హాస్టల్ స్థితిగతుల గురించి వివరాలు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ శాంతో వివరించారు. హాస్టల్ గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని, శానిటేషన్ లేదని, కొన్ని గదులను పాత సామాన్లతో నింపి నిరుపయోగంగా ఉంచారని గుర్తించినట్లు ఆయన తెలిపారు. హాస్టల్లో స్థానిక విద్యార్థులతోపాటు నడిగడ్డ అగ్రహారం, బిల్లుపాడు గ్రామాలకు చెందినవారు ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదై ఉన్నారు. వాస్తవానికి ఆ గ్రామాల విద్యార్థులు రాత్రి వేళల్లో ఉండటంలేదని తెలుసుకున్నారు. సమగ్ర నివేదికను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ బి.రమేష్‌బాబు, సిబ్బంది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నివేదిక ఇచ్చాం ఏఎస్డబ్ల్యూఓ బి.శ్రీదేవి మాట్లాడుతూ తాను గత నెల 26 తేదీన హాస్టల్‌ను తనిఖీ చేసినట్లు చెప్పారు. సౌకర్యాలు, విద్యార్థుల హాజరు గురించి నమోదు చేసుకున్నట్లు చెప్పారు. వసతులు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు చెప్పుకొచ్చారు. -
భర్తపై తప్పుడు కేసు పెట్టిన భార్యకు..
సాక్షి, ఆత్మకూరు(కర్నూలు): భర్తపై తప్పుడు కేసు పెట్టిన ఓ భార్యకు రూ.3 వేల జరిమానా విధిస్తూ ఆత్మకూరు జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తన భర్త శ్రీనివాసులు రెండో విహహం చేసుకుని, ఆమె ద్వారా పిల్లలు కన్నారంటూ ఆత్మకూరు పట్టణానికి చెందిన మంగళి గౌరిదేవి 2014లో కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. ఐదేళ్ల అనంతరం తన వద్ద సరైన ఆధారాలు లేవని చెప్పడంతో ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ఫకృద్దీన్ గురువారం కేసును కొట్టివేశారు. సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారమైన కేసును కోర్టు ముందుకు తెచ్చి, కోర్టు సమయాన్ని, ప్రతివాదుల సమయాన్ని వృథా చేసినందుకు మంగళి గౌరిదేవి రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించలేకపోతే 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. -
నల్లమలలో ప్రాచీన గణపతులు
సాక్షి, కర్నూలు : విఘ్నాలను భగ్నం చేసే వినాయకుడు.. తొలి మానవుడి ఆనవాళ్లున్న నల్లమలలో అక్కడక్కడా కనిపిస్తు తన ప్రాచీనత్వాన్ని, ఆదిదేవుడన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు. ఎవరు ఎందుకు అక్కడ ఉంచారో చరిత్ర కందని ఈ వినాయక విగ్రహాలు వివిధ ఆకృతులతో కనిపిస్తు భక్తజనానికి పారవశ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇసుక రాతిపై ఏకదంతుడు ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెర్వు సమీపంలో నల్లమల అడవుల్లో ఉన్న వరదరాజస్వామి ప్రాజెక్ట్ సమీపంలో ఒక చెట్టు కింద ఈ వినాయక విగ్రహం ఉంది. ఇసుక రాతిని వినాయకుడిగా ఎవరో ప్రాచీన శిల్పకారుడు ఈ విగ్రహాన్ని చెక్కినట్లు అర్థమవుతుంది. విగ్రహంపై ఎలాంటి ఆభరణాలు చెక్కి ఉండక పోవడం గమనిస్తే ఇది లోహ యుగానికి ముందుదా అన్న అనుమానమూ కలుగక మానదు. తలపై ఉన్న కిరీటం కూడా ఆకు దొన్నెనో, కర్రతో చేసిందా అన్నట్లుగా ఉంటుందే కాని లోహ కిరీటంగా కనిపించదు. అష్టభుజ వినాయకుడు.. నాగలూటి వీరభధ్రాలయం సమీపంలో శ్రీశైలం మెట్ల మార్గం వద్ద ఎనిమిది చేతులతో నల్లటి గ్రానైట్ శిలతో ఈ అష్టభుజ వినాయకుడి విగ్రహం ఆకట్టుకుంది. అష్ట కరములతో వివిధ ఆయుధాలను ధరించి ఉన్నాడు. ఎడమ వైపున కుమార స్వామి విగ్రహం కూడా ఉంటుంది. నాగలూటి వీరబధ్రాలయం విజయనగర పాలకులు నిర్మించారని స్థల చరిత్ర చెబుతుంది. దీంతో 14వ శతాబ్దానికి చెందినది తెలుస్తుంది. ఇది చదవండి : రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య సిద్ధాపురం వినాయకుడు సిద్ధాపురంలో ఒక వేప చెట్టు కింద ఈ విగ్రహం కనిపిస్తోంది. సమీపంలోని ముర్తుజావలి దర్గా సమీపంలో వెయ్యేళ్లకు పూర్వం మహా పట్టణం ఉండేది. ఇక్కడ పలు ఆలయాల శిథిలాలు ఉన్నాయి. కోట గోడల రాళ్లను సిద్ధాపురం చెరువు రివిట్ మెంట్‌కు వాడారు. ఆ సందర్భంలో శిథిల పట్టణం నుంచి వినాయక విగ్రహం సిద్ధాపురం గ్రామానికి చేరింది. గుమ్మిత వినాయకుడు ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి రేంజ్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గుప్త మల్లికార్జున (గుమ్మితం) ఆలయ ఆవరణలో ఈ ప్రాచీన వినాయక విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారని స్థల పురాణం తెలుపుతోంది. ఇసుక రాతితో చెక్కిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇది చదవండి : వినాయకుని విశిష్ట ఆలయాలు -
‘కల్యాణలక్ష్మి’కి మళ్లీ బ్రేక్!
సాక్షి, ఆత్మకూర్ (ఎస్) : పేద, మధ్యతరగతి ఇళ్లలో ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదని.. వారి పెళ్లి ఖర్చులకు ఆర్థికసాయం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి మళ్లీ బ్రేక్ పడింది. ఈ పథకాన్ని మొదట్లో ఎస్సీ, ఎస్టీల కోసమే ప్రవేశపెట్టి రూ.51 వేలు ఇవ్వగా.. తదనంతరం అన్ని వర్గాల్లోని పేదలకు వర్తింజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే ఆర్థికసాయాన్ని ప్రభుత్వం రూ.లక్షకు పెంచింది. అయితే ఏడాదిగా వివిధ కారణాలతో కల్యాణలక్ష్మి చెక్కులు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 463 దరఖాస్తులకు 325మందికి చెక్కుల మంజూరు.. కల్యాణలక్ష్మి పథకానికి మండల వ్యాప్తంగా 2018 ఆర్థిక సంవత్సరం నుంచి నేటివరకు 463మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఈబీసీలు 250మంది, ఎస్టీలు 90, ఎస్సీలు 110, ముస్లింలు 13మంది తమ దరఖాస్తులను మండల అధికారులకు సమర్పించారు. వీటిల్లో ఇప్పటివరకు కేవలం 325మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తూ నిధులను మంజూరు చేసింది. మిగిలిన 138 దరఖాస్తులు వివిధ దశల్లో అధికారుల పరిశీలనలో ఉన్నాయి. నిధులు మంజూరైన 325 లబ్ధిదారుల్లోనూ అతికొద్ది మందికే చెక్కులను అందగా.. మిగతా వారికి మంజూరైన నిధులు ట్రైజరీ కార్యాలయాల్లోనే ఉన్నాయి. అమలులోకి ఎంపీ ఎన్నికల కోడ్ .. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడంతో కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పరిశీలనలు పూర్తయి.. నిధులు విడుదలయ్యే సమయానికి ఎన్నికల కోడ్ రావడం.. మూడు నెలలపాటు ఎన్నికల వాతావారణమే ఉండడంతో భారీగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండి పంపిణీ ఆలస్యమైంది. దీనికి తోడుగా ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చి కల్యాణలక్ష్మికి మళ్లీకి బ్రేక్‌లు పడినట్లయింది. దీంతో ఏడాదిగా అప్పులు చేసి పెళ్లి చేసిన కుటుంబాలు కల్యాణలక్ష్మి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నాయి. -
చెప్పుల పంచాయతీ.. వ్యక్తి హత్య
సాక్షి, ఆత్మకూరు రూరల్: తన చెప్పులు కనబడకపోవడానికి చిన్నాన్నే కారణమని భావించిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అతడిపై దాడికి దిగాడు. తనను తాను రక్షించుకునే క్రమంలో చిన్నాన్న ఆ వ్యక్తిని నరికి చంపాడు. పోలీసుల వివరాల మేరకు..ఆత్మకూరు మండలం అమలాపురం చెంచుగూడేనికి చెందిన దాసరి మూగెన్న (26) ఇటీవల కొత్త చెప్పులు కొన్నాడు. తన చిన్నాన్న అయిన మూగెన్న ఇంటివద్దకు శుక్రవారం రాత్రి ఏదోపనిపై వెళ్లి తిరిగి వచ్చిన తరువాత తన చెప్పులు లేక పోవడాన్ని గుర్తించాడు. వాటిని చిన్నాన్నే కాజేశాడన్న నిర్ణయానికి వచ్చి ఆయనతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఏకంగా విల్లంబులుతో దాడి చేశాడు. ఈక్రమంలో ఓ బాణం చిన్నాన్న చేతిగుండా దూసుకుపోయింది. దీంతో అతడు ప్రాణభయంతో తన ఇంట్లోకి దూరి తలుపులు వేసుకుని గడియ పెట్టుకున్నాడు. అయినా మూగెన్న ఆగకుండా తలుపుపై గొడ్డలితో దాడి చేయడంతో తలుపు గడియ ఊడిపోయింది. దీంతో మూగెన్న గదిలో ఉన్న చిన్నాన్నపై గొడ్డలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అది గమనించిన చిన్నాన్న కుమారుడైన మూగెన్న అడ్డువెళ్లాడు. అతడిపై దాడి చేయడంతో కడుపులో నుంచి పేగులు బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. ఇంతలో మూగెన్న నుంచి చిన్నాన్న గొడ్డలి గుంజుకుని అతడిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రరక్తస్రావం కావడంతో దాసరి మూగెన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన కుమారుడిని ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆత్మకూరు సీఐ బత్తల క్రిష్ణయ్య, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తమ సిబ్బందితో ఘటనస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ నిర్వహించారు. నిందితుడు మూగెన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. శనివారం డీఎస్పీ మాధవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
‘అనంత’ను హరితవనంగా మారుస్తాం
- ‘వనం- మనం’లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఆత్మకూరు (రాప్తాడు) : పెద్ద ఎత్తున మొక్కలు నాటి ‘అనంత’ను హరితవనంగా మారుస్తామని రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పంపనూరు వద్ద ఏర్పాటు చేసిన సిటీ పార్కు వద్ద ‘వనం– మనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి , కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యేలు హనుమంతరాయ చౌదరి, పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తీ ఒక మొక్క అయినా నాటి, వాటి సంరక్షణ చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల విద్యార్థులు ఉన్నారని ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలన్నారు. అనంతరం సిటీ పార్కు వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు చంద్రశేఖర్, శ్రీధర్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ ఆదినారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు కుళ్లాయప్ప పాల్గొన్నారు. -
‘పోలీసులే ఈ ఘోరానికి కారకులు’
-
‘పోలీసులే ఈ ఘోరానికి కారకులు’
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన అంబోజు నరేశ్, స్వాతి చావుకు భువనగిరి పోలీసులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని అన్నారు. నరేశ్ అదృశ్యంపై ఫిర్యాదుపై చాలా రోజుల వరకు పోలీసులు స్పందించలేదని అతడి కుటుంబ సభ్యులు వాపోయారు. భువనగిరి డీసీపీ యాదగిరి ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆరోపించారు. మేజర్ల పెళ్లి వియషంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించారు. పెళ్లైన వారానికే ఎందుకు స్వాతి-నరేశ్‌ను ముంబై నుంచి ఎందుకు రప్పించారని నిలదీశారు. మళ్లీ రెండోసారి వీరిని ఆత్మకూరు రప్పించడంలో పోలీసుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మకూరు, రామన్నపేట, భువనగిరి పోలీసుల తీరుపై నరేశ్ బంధువులు మండిపడ్డారు. భువనగిరి పోలీసులపై చర్యల్లేవా, ఈ దారుణానికి భువనగిరి పోలీసులు బాధ్యులు కారా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, పోలీసుల వ్యవహారశైలిపై వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సంబంధిత కథనం: హత్య చేసి.. ఆపై కాల్చేసి.. -
ఆత్మకూరులో మట్టి దొంగలు
-
గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
ఆత్మకూరురూరల్ : గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆత్మకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.మురళీకష్ణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురుకుల పాఠశాలల విద్యాలయాల సంస్థ సెక్రటరీ నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. గత నెల 24వ తేదీన గురుకుల పాఠశాలలో చదువుతున్న కోటకు చెందిన ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాలకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలుత ఐటీడీఏ పీఓ కమలకుమారి, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ, ఎస్ఐ ఎం.పూర్ణచంద్రరావు విచారణ నిర్వహించారు. గురుకుల పాఠశాలల విద్యాలయాల సంస్థ డిప్యూటీ కార్యదర్శి విచారణ నిర్వహించారు. ఈ నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ కె.మురళీకష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు పంపారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను అతని ఇంటి తలుపులకు అంటించారు. నాలుగేళ్లుగా ఆ ప్రిన్సిపల్ గురుకుల పాఠశాలలో పని చేస్తున్నాడు. -
రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ తరలింపును అడ్డుకున్న స్థానికులు ఆత్మకూరురూరల్ : పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని గోడౌన్ అధికారులు, డీలర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు కుమ్మక్కై అక్రమంగా తరలిస్తుండగా, స్థానికులు అడ్డుకుని అధికారులకు పట్టించారు. ఈ సంఘటన బుధవారం ఆత్మకూరులో జరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు డీసీఎం మినీలారీలో 18వ నంబరు రేషన్ దుకాణానికి 105 బస్తాల బియ్యం సరఫరా చేస్తూ రసీదుతో సహా పంపారు. అయితే ఈ వాహనం 18వ నంబరు రేషన్ దుకాణం వరకు వచ్చినా, అక్కడ సరుకు దించకుండా సమీపంలోని రైస్‌మిల్లు వద్దకు వెళ్తుండగా పసిగట్టిన స్థానికులు అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. దీంతో లారీడ్రైవర్ పరారయ్యాడు. స్థానిక ఇన్చార్జి తహసీల్దారు సారంగపాణి, వీఆర్ఓలు కేశవమూర్తి, మురళి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంతో సహా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 5,250 కేజీల బియ్యం (105 బస్తాలు) రేషన్ బియ్యమేనని అధికారులు ధ్రువీకరించారు. అయితే రసీదు మేరకు 18వ నంబరు రేషన్ డీలర్ దుకాణంలో లేరు. విచారించగా ఆయన చెన్నైకు వెళ్లారని అధికారులు తెలుసుకుని ఫోన్లో సంప్రదించారు. తనకు 45 బస్తాల బియ్యం రావాల్సి ఉందని, తాను ఊర్లో లేనందున మరో రోజు పంపాలని కోరినట్లు ఆయన వివరించారు. తహసీల్దారు సిబ్బందితో కలిసి రేషన్ దుకాణంలో స్టాక్‌ను పరిశీలించారు. పట్టుబడిన లారీ, బియ్యం సహా ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. అక్కడ గోదాముల్లో స్టాకును పరిశీలించారు. ఈ మేరకు 6ఏ కేసు నమోదు చేసినట్లు తహసీల్దారు సారంగపాణి తెలిపారు. -
ఆత్మకూరులో కాదు పరకాలలో రెఫరెండం పెడదాం
ప్రజల చిరకాల వాంఛ సీఎంను ఎమ్మెల్యే ఒప్పించాలి l శాంతియుత మార్గంలో ప్రజాపోరాటం కొనసాగిస్తాం l నిరవధిక దీక్ష విరమణలో ఇనుగాల వెంకట్రామ్రెడ్డి పరకాల : పరకాలను రెవిన్యూ డివిజ¯ŒS ఏర్పాటు ప్రజల చిరకాల వాంఛ అని కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇ¯ŒSచార్జి ఇనుగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. రెవిన్యూ డివిజ¯ŒS కోసం మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న ఇనుగాల వెంకట్రామ్రెడ్డి సోమవారం విరమించారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన దీక్ష ముగింపు కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలనుద్ధేశించి వెంకట్రామ్రెడ్డి మాట్లాడారు. పరకాలను కొత్తగా రెవిన్యూ డివిజ¯ŒSగా కోరడం లేదని పాత దానినే పునరుద్ధరించమని కోరుతున్నామన్నారు. ఆత్మకూరులో ప్రజాదర్భార్ కాకుండా పరకాలలో రెఫరెండం పెడితే ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో తేలిపోతుందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తుంటే ప్రజల కోరికను ఎమ్మెల్యే ధర్మారెడ్డి చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు. తొర్రూర్, హుస్నాబాద్‌లను ప్రజలు అడగక ముందే ఎమ్మెల్యేలు చెప్పడంతో రెవిన్యూ డివిజన్లుగా ప్రకటించారన్నారు. పరకాలలో మాత్రం ప్రజలు అడుగుతున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. డివిజ¯ŒS కోసం ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ను ఒప్పించాలని ఆయన కోరారు. రెవిన్యూ డివి జ¯ŒS రాకపోతే పరకాల ఉనికికే ప్రమాదం ఏర్పడబోతుందన్నారు. డివిజ¯ŒS సాధన కోసం ఇక నుంచి అన్నివర్గాల ప్రజలను కలుపుకుని గాంధీమార్గంలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు. దీక్షకు సహరించిన అన్ని వర్గాల ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ధర్మారెడ్డి ఎజెండా అ«ర్ధం కావడం లేదు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎజెండా ఏమిటో అర్ధం కావడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి అన్నారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అనంతరం డాక్టర్ విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి గెలుపు కోసం తాను నియోజకవర్గంలో ప్రచారం చేశానన్నారు. కాంట్రాక్ట్ పనుల నుంచి బయటకు వచ్చి ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బండి సారంగపాణి, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మ¯ŒS గోల్కోండ సదానందం, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కష్ణారావు, పీఏసీఎస్ చైర్మ¯ŒS కట్కూరి దేవేందర్‌రెడ్డి, చెన్నోజు బిక్షపతి, మడికొండ శ్రీను, కొయ్యడ శ్రీనివాస్, ఆత్మకూరు జడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, రమేష్, బీజేపీ నాయకులు ఆర్పీ జయంత్‌లాల్, గోపినాథ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. – డాక్టర్ విజయచందర్‌రెడ్డి -
ఆత్మకూరులో తమ్ముళ్ల అలక ...!
నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నియోజకవర్గంలో ఆనం వర్గీయులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ నియామకంపై ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు మోసిన గూటూరు కన్నబాబు అలిగి మొబైల్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఆయనకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించబోతున్నారని జూన్ 3 వతేదీ ‘ఆనం కుటుంబానికి ఆత్మకూరు, నెల్లూరు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. వైఎస్సార్ సీపీ బలాన్ని తట్టుకోలేక.. ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిని ఎదుర్కోవడం కన్నబాబు వల్ల కాదని పార్టీ అధిష్టానం చాలాకాలం కిందటే ఒక అభిప్రాయానికి వచ్చింది. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలం తగ్గించక పోతే రాబోయే ఎన్నికల్లో కూడా ఈ సీటు కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకుని వచ్చి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఆయనకు టీడీపీ తీర్థం ఇచ్చారు. ఆయన రాకను కన్నబాబు తీవ్రం గా వ్యతిరేకించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిం ది. అయితే పరిస్థితులన్నీ సర్దుబాటు చేశాకే రామనారాయణరెడ్డిని అధికారికంగా రంగంలోకి దించాలని పార్టీ అధిష్టానవర్గం భావించింది. కన్నబాబుతో పార్టీ పెద్దలు అనేక సార్లు చర్చించినా రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పని చేయడానికి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆనం, కన్నబాబు వర్గాల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరలేదు. తనకు అధికారి కంగా బాధ్యతలు ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి వెళ్లబోనని రామనారాయణరెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక పార్టీ ని బలపరచుకోవడం మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో ఇటీవల సీఎం ఈ విషయం గురించి చర్చించారు. ఆనంకు అధికారికంగా బాధ్యతలు అప్పగిస్తూ వారం రోజుల ముందే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. మంగళవారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి కన్నబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నందువల్ల తర్వాత ఉత్తర్వులు ఇద్దామని రవిచంద్ర సూచించారు. మంగళవారం కన్నబాబు పుట్టిన రోజు వేడుకలు ముగియడంతో బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రామనారాయణరెడ్డిని ఇన్‌చార్‌్జగా నియమించారనే సమాచారం తెలియడంతో బుధవారం ఉదయం నుంచి కన్నబాబు, ఆయన ముఖ్య అనుచరులు సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. మరోవైపు రామనారాయణరెడ్డి మద్దతుదారులు ఆత్మకూరు నియోజకవర్గంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కన్నబాబుకు పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఉన్న పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు జిల్లా పార్టీ నాయకత్వం ఆయన్ను బుజ్జగించే పనిలో పడింది. నెల్లూరులో ఇటీవల నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో తాము కన్నబాబు మాట వినాలా? ఆనం రామనారాయణరెడ్డి మాట వినాలా? అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్ధా రాఘవరావును అడిగామని, ఆయన కన్నబాబు మాటే వినాలని చెప్పారని గూటూరు మద్దతు దారులు చెబుతున్నారు. ఇప్పుడు రామనారాయణరెడ్డిని తమ నియోజకవర్గ బాధ్యుడిగా నియమిస్తే ఆయనతో ఎలా కలిసి పనిచేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసిబస్సులో ఈవ్‌టీజింగ్
-
'న్యూఢిల్లీ' ఫలితాలు తారుమారైనా...
నెల్లూరు: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు... వాటిపై ఆందోళన అనవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలిపారు. ఓ వేళ ఆ అసెంబ్లీ ఫలితాలు తారుమారైన కేంద్ర ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆత్మకూరు - నెల్లూరు నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేశారు. -
ఆనం బ్రదర్స్ గాలి ఎటు పోయిందో?
నెల్లూరు జిల్లాను తమ కంచుకోటగా భావించి.. ఇన్నాళ్లూ ఏకఛత్రాధిపత్యంగా జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం సోదరులు ఎన్నడూ లేనట్లుగా ఏకంగా ఈసారి పోటీకే దూరం అవుతున్నారు. సోదరులిద్దరిలో అన్న ఆనం వివేకానందరెడ్డి ముందుగానే తాను ఎన్నికల బరిలోకి దిగకుండా.. తన పెద్ద కొడుకు ఆనం చెంచుసుబ్బారెడ్డి (ఏసీ సుబ్బారెడ్డి)ని నెల్లూరు సిటీ స్థానం నుంచి బరిలోకి దింపారు. ఇప్పుడు అన్నగారి బాటలోనే తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు అసెంబ్లీ స్ధానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన రామనారాయణ రెడ్డి, ఇప్పుడు దాన్ని విరమించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని, విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ఈసారి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న భావనతోనే ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకొనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. వాస్తవానికి ఇదే ఉద్దేశంతో ఆయన ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల విషయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా ఆనం సోదరుల వెంట ఉన్న ప్రధాన నాయకులు చాలామంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీవైపు వెళ్లారు. దాంతో అనుచరులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగడం ఆత్మహత్యాసదృశం అవుతుందని, అందుకే నామినేషన్ ఉపసంహరించుకోవాలని రామనారాయణరెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఈసారి ఆయన పోటీ చేయకపోతే.. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు కూడా ఎవరూ ఉండేట్లు లేరు. డమ్మీలుగా నామినేషన్లు దాఖలు చేసినవాళ్లు కూడా ఉపసంహరించుకున్నారని, అందువల్ల రామనారాయణరెడ్డి బరిలో ఉండాల్సిందేనని కాంగ్రెస్ పెద్దలు ఆయనకు నచ్చజెబుతున్నట్లు సమాచారం. -
షర్మిలకు ఘనస్వాగతం : పోలీసుల ఓవరాక్షన్
నెల్లూరు: వైఎస్ఆర్ సిపి జనపథంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు చేరుకున్న వైఎస్ షర్మిలకు ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి, పార్టీ ఆత్మకూరు సమన్వయకర్త గౌతంరెడ్డి, నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మున్సిపల్, జిల్లా పరిషత్, మండలపరిత్ ఎన్నికల సందర్భంగా. షర్మిల జిల్లాలో ప్రచారభేరి మ్రోగించారు. ఆమె వస్తున్న సందర్భంగా జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఆమె జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారు. ఆత్మకూరుతోపాటు వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూ రు, నెల్లూరు, కావలి నియోజకవర్గాల్లో జరిగే రోడ్‌షోలలో ఆమె పాల్గొంటారు. పలు బహిరంగ సభలలో షర్మిల ప్రసంగిస్తారు. షర్మిల సభల వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆమె ప్రసంగించనున్న ప్రాంతంలో మైకులను పోలీసులు తొలగించారు. సభకు అనుమతి ఉన్నా ఎలా తొలిగిస్తారని మేకపాటి రాజమోహన రెడ్డి, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
నేడు కేసీఆర్ రాక
వరంగల్‌లీగల్, న్యూస్‌లైన్ : పరకాల శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా ఆత్మకురు పోలీస్‌స్టే షన్ లో నమోదైన కేసు విచారణ నిమిత్తం టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు సోమవారం వరంగల్ కోర్టుకు హాజరుకానున్నారు. 2012 మే 20న ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివిధ వర్గాలు, కులాలు, మతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నయాని, ఎన్నికల నిబంధనావళిని ఉల్లఘించారనే అభియోగాల తో ఎన్నికల రిటర్నింగ్ అధికారి విద్యాసాగర్‌రావు ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ప్రాథమిక విచార ణ నిమిత్తం నేడు మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి పి.శ్రీదేవి ఎదుట హజరుకానున్నారు. కేసీఆర్ తరఫున న్యాయవాదిగా గుడిమల్ల రవికుమార్ వాదించనున్నారు. హెదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.00 గంటలకు మడికొండకు చేరుకోనున్న కేసీఆర్‌కు టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం హన్మకొండలోని టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంని తర్వాత కోర్టుకు హాజరవుతారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు.