
ఆత్మకూరు(ఎం): బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. ఆత్మకూరు(ఎం)కు చెందిన దేవాసాని జంపన్న (20) కొంతకాలంగా ప్రేమపేరుతో అదే గ్రామానికి చెందిన ఓ బాలిక వెంటపడుతూ, మాయమాటలు చెప్పి చివరకు లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో బాధితురాలి తల్లి ఈ నెల 27వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు దేవసాని జంపన్నను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం భువనగిరి కోర్టులో హాజరు పరచారు. అక్కడి నుంచి నల్లగొండ జైలుకు తరలించినట్లు రామన్నపేట సీఐ ఏవీ రంగా విలేకరులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment