bhuvanagiri court
-
వాళ్లసలు రైతులే కాదు.. యాదాద్రి పోలీసుల వివరణ!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు బేడీలు వేసి మరీ భువనగిరి సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చిన ఉదంతంపై రాజకీయంగానూ విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో యాదాద్రి భువనగిరి పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. అసలు వాళ్లు రైతులే కాదంటూ ప్రకటించారు డీసీపీ రాజేష్ చంద్ర. అరెస్ట్ అయినవాళ్లలో రైతులు ఎవరూ లేరు. ఆ నలుగురూ జమ్మాపూర్‌లోని ఓ కంపెనీలో కార్మికులుగా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసం 20 గుంటల భూమి కొనుగోలు చేశారు. ఇంతకుముందు వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు మాపై దాడి చేసి వాహనం ధ్వంసం చేశారు. అంతేకాదు గతంలో కలెక్టరేట్‌లోకి వెళ్లి లోపల నిప్పు పెట్టారు. మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడి కాన్వాయ్ పై దాడి చేసినందుకు అరెస్టు చేశాం. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ఎస్కార్ట్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ల ప్రవర్తన సరిగా లేకనే ముందస్తు జాగ్రత్త కోసం బేడీలు వేయాల్సి వచ్చిందని డీసీపీ వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తులో ఉన్న పోలీస్ ఇంచార్జ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారాయన. అయితే.. ఇది సబబేనా? ఈ పరిణామంపై సాక్షి టీవీతో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మాట్లాడారు. కొండంత తీసుకొని గోరంత నష్టపరిహారం ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరే ఎకరం, ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతుల భూములు పూర్తిస్థాయిలో కోల్పోవాల్సి వస్తోంది. బడా నాయకుల భూములను కాపాడుకోవడం కోసమే అలైన్మెంట్ మార్చారు. మోటకొండూరు నుంచి ఉన్నటువంటి అలైన్మెంట్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది?. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వం సంకెళ్లు ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పాలి?.. అని నిలదీశారు. అధికారులకు, నాయకులకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు వినిపించుకున్న ఫలితం లేకుండా పోయిందని, రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, రైతులమైన తమపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు వాళ్లు. ఒక రాజకీయంగానూ ఈ పరిణామంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రౌడీల మాదిరి బేడీలు వేస్తారా? రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద రైతులంటే కేసీఆర్ కు అంత చులకనెందుకు?. నిర్వాసితులైన రైతులకు న్యాయం చేయాల్సింది పోయి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?. ఆ రైతులు చేసిన తప్పేంది?. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తే జైల్లో వేస్తారా?. కేసీఆర్ సర్కార్ కు పోయే కాలం దగ్గర పడింది. ప్రజాకోర్టులో కేసీఆర్‌కు శిక్ష తప్పదు అని బండి సంజయ్ విమర్శించారు. బాధితుల తరపున కాంగ్రెస్ పోరాడుతుంది ఇక భువనగిరి కోర్టు పరిణామంపై కాంగ్రెస్ సీనియర్, మాజీ ఎంపీ వీహెచ్ స్పందించారు. ‘‘భువనగిరి RRR భూ నిర్వాసితులు ఆరుగురు పై కేసులు పెట్టారు. గతంలో మిర్చి రైతులకి సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌ది. ఇప్పుడు RRR నిర్వాసితులకు సంకెళ్లు వేశారు. రియల్టర్లు దగ్గర డబ్బులు తీసుకొని భువనగిరి రైతులకి అన్యాయం చేస్తున్నారు. రైతుల దగ్గర Ak 47 గన్స్ ఉన్నాయా చెప్పండి?. అన్నం పెట్టె రైతులకి సంకేళ్లు వేస్తారా? వారి నాన్ బెయిల్ కేసులు పెడతారా?. అన్నం పెట్టే రైతులకి సంకేళ్లు వేసే ఏకైక ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం. రియల్టర్ల తో బిఆర్ఎస్ నేతలు కుమ్మక్కై కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు . భువనగిరి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని వీహెచ్ ప్రకటించారు. ఇదీ చదవండి: అసలు ఆ మీటింగ్‌ల వెనుక ఎవరున్నారు? -
నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఐదేళ్ల కిందటి నాటి అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది భువనగిరి కోర్టు. ఐదు సంవత్సరాల కిందట.. 2017 మే నెలలో నరేష్ హత్యకు(పరువు హత్య?) గురి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ తాజాగా ఈ కేసును కొట్టేశారు జడ్జి బాల భాస్కర్. దీంతో సత్తిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక తీర్పుపై నరేశ్ తండ్రి వెంకటయ్య అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని, న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, తన పాతికేళ్ల కొడుకును కోల్పోయానంటూ ఆవేదనగా మాట్లాడారాయన. కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ ఘోరంగా హత్యకు గురయ్యాడు. అది స్వాతి తండ్రి పనేనన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా జరిగింది. ఆపై స్వాతి కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రేమకథ విషాదాంతమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ కాలేజీ రోజుల్లో.. లింగరాజుపల్లికి చెందిన స్వాతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు కావడంతో స్వాతి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో ముంబైలో ఉంటున్న నరేష్ తన తల్లిదండ్రుల వద్దకు స్వాతిని తీసుకెళ్లి కులాంతర వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి.. భువనగిరికి రావాలని, ఇక్కడ వివాహం జరిపిస్తానని ప్రేమతో కూతురిని నమ్మించాడు శ్రీనివాసరెడ్డి. అలా వచ్చిన స్వాతి-నరేశ్‌లు వేరయ్యారు. నరేష్ ఏమయ్యాడో.. ఆ తర్వాత జాడ లేకుండా పోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కోర్టు జూన్ 1 కల్లా నరేష్ ఎక్కడున్నా కోర్టులో హాజరుపరచమని పోలీసులను ఆదేశించింది. కాగా నరేష్ హతమార్చినట్టు పోలీసు ఇంటరాగేషన్‌లో స్వాతి తండ్రి అంగీకరించాడు. బంధువు సాయంతో నరేశ్‌ను స్వాతికి చెందిన పొలంలోనే చంపి, దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడని తేలడంతో వాళ్లు గుండెలు పలిగేలా రోదించారు. ఆపై మే 16వ తేదీన నరేశ్ ప్రేయసి స్వాతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె మృతి కేసులోనూ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వీళ్లే చేశారనేందుకు సాక్ష్యాలేవి? నరేశ్ హత్య కేసులో నిందితులుగా స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి ఏ1గా,ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డి ఏ2గా ఉన్నారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నేరం అంగీకరించారు కూడా. అయితే.. కేసు విషయమై న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్,డిఫెన్స్ తుది వాదనలు ఈనెల 9న పూర్తి కావడంతో బుధవారం కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ కేసులో 2018 జులై 31న కేసు అభియోగపత్రాలు పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు.23 మంది సాక్షుల విచారణతోపాటు భౌతిక ఆధారాలు,ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులే హత్య చేశారనేందుకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటిస్తూ భువనరిగి కోర్టు తీర్పును వెలువరించింది. పోలీసుల దర్యాప్తులో.. 2017 మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్‌లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్‌తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్‌ను తగులబెట్టిన శ్రీనివాస్‌రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది. అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగింది కూడా. -
బాలికపై లైంగికదాడి
ఆత్మకూరు(ఎం): బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. ఆత్మకూరు(ఎం)కు చెందిన దేవాసాని జంపన్న (20) కొంతకాలంగా ప్రేమపేరుతో అదే గ్రామానికి చెందిన ఓ బాలిక వెంటపడుతూ, మాయమాటలు చెప్పి చివరకు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో బాధితురాలి తల్లి ఈ నెల 27వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు దేవసాని జంపన్నను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం భువనగిరి కోర్టులో హాజరు పరచారు. అక్కడి నుంచి నల్లగొండ జైలుకు తరలించినట్లు రామన్నపేట సీఐ ఏవీ రంగా విలేకరులకు తెలిపారు. -
భువనగిరి కోర్టుకు నయీం భార్య, సోదరి
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, సోదరి భువనగిరి కోర్టులో హాజరయ్యారు. నయూ కేసుకు సంబంధించి వారిని పోలీసులు ఈ రోజు భువనగిరి కోర్టుకు హాజరు పర్చారు. పీటీ వారెంట్‌పై ప్రత్యేక వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. -
నయీం కేసులో మరో సంచలనం!
-
నయీం కేసులో మరో సంచలనం!
నయీముద్దీన్ కేసులో సరికొత్త సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చాలామంది పోలీసులతో పాటు.. కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు కూడా బయటపడ్డాయి. నయీం బినామీలను విచారించినప్పుడు.. వాళ్లు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు ముఖ్యనేతల పేర్లు ఇప్పుడు వచ్చాయి. టీఆర్ఎస్ నాయకుడు, శాసనమండలి వైస్‌చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు ఇందులో ప్రముఖంగా ఉంది. గంగసాని రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. మధుకర్ రెడ్డి వాంగ్మూలంలో మరో టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు కొందరు నాయకులు తమకు సంబంధం లేదని.. ఎలాంటి ఆరోపణలనైనా ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పుడు నేరుగా మండలి వైస్‌చైర్మన్ పేరే బయటకు రావడంతో ఆయన రాజీనామా చేస్తారా.. లేక ప్రజల ముందుకు వచ్చి తన వివరణ తెలియజేస్తారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి బినామీలలో పలువురిని పోలీసులు అరెస్టుచేశారు. వాళ్లను విచారించినప్పుడు పలువురు నాయకులు, పోలీసుల పేర్లు తెలిశాయన్న ప్రచారం జరిగినా, అవేవీ బయటకు మాత్రం రాలేదు. అయితే.. సీపీఐ నాయకుడు నారాయణ ఈ అంశంపై కోర్టులో కేసు దాఖలు చేయడంతో.. మూడు వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భువనగిరి కోర్టులో సిట్ తన నివేదికను సమర్పించింది. అందులో.. తాము విచారించిన వారి వాంగ్మూలాల్లో ఎవరెవరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించింది. వెలగపూడి శివరాంప్రసాద్ వాంగ్మూలంలో డీఎస్పీ మద్దిలేటి శ్రీనివాసరావు పేరు, యూసుఫ్‌ఖాన్ వాంగ్మూలంలో డీఎస్పీ మస్తాన్‌వలీ పేరు ఉన్నాయి. అలాగే లక్ష్మారెడ్డి ఇచ్చిన స్టేట్మెంటులో సీఐ వెంకట్‌రెడ్డి పేరు ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లే కాకుండా ఇంకా చాలామంది పోలీసులు, నాయకుల పేర్లు ఈ కేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి 156 కేసులు నమోదు చేసి వంద మందికి పైగా అరెస్టు చేశారు. ఇప్పుడు తాజా వాంగ్మూలాలతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13 మంది పోలీసు అధికారుల సర్వీసు రివాల్వర్లను కూడా సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో వందలకోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు, వందల ఎకరాల భూముల వివాదాలు ఉండటంతో.. దీనిపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్లు కూడా వస్తుండటంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేసు ఆలస్యం అయ్యేకొద్దీ బాధితులకు అన్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే అవకాశం లేదని అనడంతో మళ్లీ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇప్పుడు కొత్తగా బయటపడిన పేర్లు ఉన్నవారికి ఎప్పుడు నోటీసులు జారీచేస్తారు, ఎప్పుడు అరెస్టులు జరుగుతాయనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
నయీమ్ కేసులో ఇద్దరి అరెస్ట్
వలిగొండ/భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అరెస్టయిన వారిలో వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, దాశిరెడ్డిగూడానికి చెందిన జూకంటి భిక్షపతి అలియాస్ బుచ్చయ్యలు ఉన్నారు. పలు కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నయీమ్ ప్రధాన అనుచరులను మంగళవారం భువనగిరి కోర్టులో హాజరు పరిచారు. వరంగల్ జైలులో ఉన్న పాశం శ్రీను, సందెల సుధాకర్, భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌యాదవ్, కౌన్సిలర్ ఎండీ నాసర్, వారి అనుచరులు బచ్చు నాగరాజు, కత్తుల జంగయ్య, పులిరాజుతోపాటు మరో 5 మందిని కోర్టులో హాజరు పరిచారు.