నయీముద్దీన్ కేసులో సరికొత్త సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చాలామంది పోలీసులతో పాటు.. కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు కూడా బయటపడ్డాయి. నయీం బినామీలను విచారించినప్పుడు.. వాళ్లు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు ముఖ్యనేతల పేర్లు ఇప్పుడు వచ్చాయి. టీఆర్ఎస్ నాయకుడు, శాసనమండలి వైస్‌చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు ఇందులో ప్రముఖంగా ఉంది. గంగసాని రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. మధుకర్ రెడ్డి వాంగ్మూలంలో మరో టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది.