
షర్మిలకు ఘనస్వాగతం : పోలీసుల ఓవరాక్షన్
నెల్లూరు: వైఎస్ఆర్ సిపి జనపథంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు చేరుకున్న వైఎస్ షర్మిలకు ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి, పార్టీ ఆత్మకూరు సమన్వయకర్త గౌతంరెడ్డి, నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మున్సిపల్, జిల్లా పరిషత్, మండలపరిత్ ఎన్నికల సందర్భంగా. షర్మిల జిల్లాలో ప్రచారభేరి మ్రోగించారు. ఆమె వస్తున్న సందర్భంగా జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఆమె జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారు. ఆత్మకూరుతోపాటు వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూ రు, నెల్లూరు, కావలి నియోజకవర్గాల్లో జరిగే రోడ్‌షోలలో ఆమె పాల్గొంటారు. పలు బహిరంగ సభలలో షర్మిల ప్రసంగిస్తారు.
షర్మిల సభల వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆమె ప్రసంగించనున్న ప్రాంతంలో మైకులను పోలీసులు తొలగించారు. సభకు అనుమతి ఉన్నా ఎలా తొలిగిస్తారని మేకపాటి రాజమోహన రెడ్డి, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.