
నేడు కేసీఆర్ రాక
వరంగల్‌లీగల్, న్యూస్‌లైన్ : పరకాల శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా ఆత్మకురు పోలీస్‌స్టే షన్ లో నమోదైన కేసు విచారణ నిమిత్తం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు సోమవారం వరంగల్ కోర్టుకు హాజరుకానున్నారు. 2012 మే 20న ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివిధ వర్గాలు, కులాలు, మతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నయాని, ఎన్నికల నిబంధనావళిని ఉల్లఘించారనే అభియోగాల తో ఎన్నికల రిటర్నింగ్ అధికారి విద్యాసాగర్‌రావు ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ప్రాథమిక విచార ణ నిమిత్తం నేడు మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి పి.శ్రీదేవి ఎదుట హజరుకానున్నారు. కేసీఆర్ తరఫున న్యాయవాదిగా గుడిమల్ల రవికుమార్ వాదించనున్నారు. హెదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.00 గంటలకు మడికొండకు చేరుకోనున్న కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అనంతరం హన్మకొండలోని టీఆర్‌ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంని తర్వాత కోర్టుకు హాజరవుతారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు.