సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం శాసనసభలో ప్రకటన చేశారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. భాషా ప్రేమికులందరినీ మహాసభలకు ఆహ్వానిస్తామని కేసీఆర్ వెల్లడించారు.
అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ నిధులపై కేసీఆర్ వివరణ ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నిధులు పక్కదారి పట్టలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ సంక్షేమంపై సవివరంగా చర్చిద్దామని, అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా వాయిదా వేయాలని అన్నారు. సభలో చర్చిస్తేనే ఎస్సీల సంక్షేమానికి ఎవరేం చేశారో తెలుస్తుందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల సంక్షేమమే తమ థ్యేయమని కేసీఆర్ తెలిపారు. అలాగే ఎస్సీ నిధుల ఖర్చులో అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే.. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టాయని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment